26, జులై 2015, ఆదివారం

ఆహ్వానం!

ఆహ్వానం!

ఛందశ్శాస్త్ర సంబంధిత ఉపన్యాసము- చర్చ

వక్తలు:
శ్రీ జెజ్జాల కృష్ణమోహనరావు గారు.
శ్రీ జె.కె. మోహన రావు గారు.

ఆహ్వానితులు

గౌ. డా. కోడూరి విష్ణునందన్ గారు, చింతా రామకృష్ణారావుగారు, ఆచార్యఫణీంద్రగారు, కందిశంకరయ్య గారు, 
రవి ఈఎన్వీ గారు, రామకృష్ణగారు, దిలీప్ గారు, శ్రీనివాస్ గారు, 
వి.రమేశ్ బాబు గారు, సర్వేశ్వరరావు గారు, భీమరాజు వేంకటరమణగారు, రఘుకుమార్ గారు, రామ్ ఇటిక్యాల్ గారు, సిహెచ్ ప్రభాకర్ గారు

గౌ. కస్తూరిసుధీమతి గారు, అనంతలక్ష్మిగారు, శ్రీవల్లీ రాధిక గారు, 

జ్యోతి గారు, సమ్మెటవిజయగారు, కృష్ణకుమారి గారు, కృష్ణవేణి గారు


ది. 1.8.2015 (శనివారం), సా. 4-00 గం. నుండి 6-00 గం. వరకు

స్థలం:
తార్నాకా స్ప్రెడింగ్ లైట్స్
పురపాలక గ్రంథాలయ భవనసముదాయము
తార్నాకా మెట్రో రైల్వేస్టేషన్ సమీపంలో,
సికిందరాబాద్.


పద్యప్రేమికు లందరికీ ఆహ్వానం!

10 కామెంట్‌లు:

  1. అద్భుతము. పెద్దలు,గురువులు,మిత్రులు,అందఱికీ శుభాకాంక్షలు !

    రిప్లయితొలగించండి
  2. ఛందో శాస్త్రము గూరిచి
    యందముగా దెలియ జేయ నార్యులు రాగ
    న్నందరి జనములు దమతమ
    డెం దం బులు సంతసించ డే కురి రచట న్

    రిప్లయితొలగించండి
  3. పెద్దలు గురువులు పద్య ప్రియులు అందరికీ శుభా కాంక్షలు

    రిప్లయితొలగించండి
  4. పద్యముల నాటలాడుచు
    హృద్యముగా తెలుగుశోభ నింపుచు నెపుడున్
    పద్యముల నాట బూనెడు
    విద్యావేత్తలకు చేతు వేలనమస్సుల్.

    రిప్లయితొలగించండి
  5. గురువు గారు,
    ఎలా వున్నారు ఇప్పుడు మీరు?
    వీడియో రిచార్డింగ్ షేర్ చేయటానికి వీలవుతుందా?
    ధన్యవాదములు!

    రిప్లయితొలగించండి
  6. పద్యమల్ల గలుగు పటిమను పెంచెడు
    మెచ్చ దగిన కృషియె మిత్రులార!
    ఆధునికుల కదియు అత్యంత మోదంబు
    తప్ప కూడదికను తరలి రండు.

    రిప్లయితొలగించండి
  7. ఛందశ్శాస్త్రము రీతుల గురించి, లోతుల గురించి చక్కటి ఉపన్యాసము జరిగింది. శ్రీ జెజ్జాల కృష్ణమోహనరావు గారు శ్రమకోర్చి వచ్చి ప్రసంగించినందుకు సభికులందరూ చాలా చాలా సంతోషించారు.
    ఆడియో రికార్డ్ జరిగింది. ఒక వారంలోపల ఛందస్సు గ్రూప్ లో అప్లోడ్ చెయ్యడం జరుగుతుంది.
    ముప్ఫై నుంచి నలభై వరకూ ఉన్న సభికుల్లో ఎక్కువభాగం శ్రద్ధగా ప్రసంగం ఆలకించారు. ఇద్దరు ముగ్గురు సందేహాలను అడిగి తీర్చుకున్నారు.
    ప్రసంగంలో భాగమైన గర్భకవిత్వానికి అప్పటికప్పుడు ఉదాహరణగా వక్తకు కృతజ్ఞత చెప్తూ Chinta Rama Krishna Rao గారు ఒక తేటగీతి, కందం ఇమిడి ఉన్న ఉత్పలమాలను ఆశువుగా వ్రాసి చదివి వినిపించారు.
    కార్యక్రమ నిర్వాహకులైన Jyothi Spreadinglight , Ramu itikyal, prithvi, projector ఇచ్చి సహకరించిన Srinivas Udumudi గారికీ, సభను ప్రారంభించిన Kasturi Sudhimati
    పరిచయవాక్యాలు చెప్పిన Dileep Miriyala గారికీ ,
    శ్రద్ధగా పాల్గొన్న సభికులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
    లక్ష్మీదేవి.

    రిప్లయితొలగించండి