అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘వారధి+ఇదె’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. అక్కడ ‘వారధ యిదె’ అనండి.
ముని నారదుడు మరి ముల్లోకములను తాఁ గలయ దిరుగు పోస్టుకార్డు లేక పంపె భూసురుని గోపాలుని వద్దకు కమలాక్షి రుక్మిణి కార్డు లేక ధర్మరాజు తలచి దామోదరుని బంపె కౌరవేంద్రు కడకు కార్డు లేక పావురమునె మరి వాడిరి రాజులు కదనరంగములోన కార్డు లేక
నేడు సెల్లుపోనుల ముందు నిలువ లేక వేగవంతమౌ "ఈమేలు" వెడలగొట్ట ఘనతనొందిన కార్డిక గతమునయ్యె అవసరము లేక యుండిన యలసు కాదె!!
సకల జనులు మెచ్చు చరవాణి వచ్చేను
రిప్లయితొలగించండివాయు వేగ మందు వార్త జేర్చ
వడియె లేని బతుకు వాసియే తగ్గగా
తోక లేని పిట్ట దూర మయ్యె.
జాతిపిత గాంధీ యనుచు
రిప్లయితొలగించండిమాతా పితలంత దెలిపె మహిమా న్వితముల్
నాతడు ప్రాణము లొడ్డిన
ధాతగ దేశమున కంత త్యాగి యటంచున్
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
‘వచ్చేను’ను ‘వచ్చెను’ అనండి.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగుంది. కొన్ని సవరణలతో మీ పద్యం...
జాతిపిత గాంధి యనుచును
మాత తెలిపె నతని చరిత మహిమాన్వితమౌ
నాతడు ప్రాణము లొడ్డెను
ఖ్యాతిగ దేశమ్ము కొఱకు త్యాగి యటంచున్.
పోష్టు కార్డు గతమునందు పొందెపేరు
రిప్లయితొలగించండిపల్లెలన్ సమాచారము పంపుకొరకు
సెల్లు ఫోనులు చేతిలో చేరగానె
పోష్టు కార్డుల వాడుక మూలబడియె
తోక లేదు గాని యాకసమునుదాటు
రిప్లయితొలగించండివార్త లెల్ల మోయు వారధిదియె
పేద వారి కెపుడు మోదమ్ము గూర్చెడు
కార్డు కనుల బడక కంచి చేరె!!!
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘వారధి+ఇదె’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. అక్కడ ‘వారధ యిదె’ అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికాకి కావుమనగ కబురు(కార్డు) వచ్చుననుచు
రిప్లయితొలగించండినాడు పెద్దవారు నమ్ము చుండ్రి!
చిటికె చిటికె కొక్క సెల్ మెసేజ్ లేతెంచి
కేక లిడుచు నొక్కె కాకి నోరు!
ముని నారదుడు మరి ముల్లోకములను తాఁ
రిప్లయితొలగించండిగలయ దిరుగు పోస్టుకార్డు లేక
పంపె భూసురుని గోపాలుని వద్దకు
కమలాక్షి రుక్మిణి కార్డు లేక
ధర్మరాజు తలచి దామోదరుని బంపె
కౌరవేంద్రు కడకు కార్డు లేక
పావురమునె మరి వాడిరి రాజులు
కదనరంగములోన కార్డు లేక
నేడు సెల్లుపోనుల ముందు నిలువ లేక
వేగవంతమౌ "ఈమేలు" వెడలగొట్ట
ఘనతనొందిన కార్డిక గతమునయ్యె
అవసరము లేక యుండిన యలసు కాదె!!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగునన్నది. అభినందనలు.
*****
జిగురు సత్యనారాయణ గారూ,
మీ పద్యం చాలా బాగున్నది. అభినందనలు.
మల్లెగంధ మెంత మత్తును గూర్చునో
రిప్లయితొలగించండిచిన్నికార్డు యందు యున్న వార్త
పంచిపెట్ట గలుగు “పద్దతి మార్పుచే
విలువ తక్కువైన?తలచరెవరు|
2.ఉత్తరమందునుత్తమము యూహల లూయల లూపగల్గు|మీ
చిత్తము చింత దీర్చి మనసెంచెడి వారి మనోభి లాషలున్
మొత్తము బంచిపెట్టి|గనుమోయని బంధువు వార్తబంచినా|
క్రొత్త యుగాన కార్డు మనకోర్కెలు దీర్చదు యేలనోగదా
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
ఎర్రని పెట్టెను వేసిన
రిప్లయితొలగించండితుర్రున నడ్రస్ కు జేరు తోకయె లేకన్
జర్రూరు జేరు పిట్టర
వర్రీ ! సెల్ దెబ్బ కిపుడు బ్యాకై పోయెన్.
ఎర్రని పెట్టెను వేసిన
రిప్లయితొలగించండితుర్రున నడ్రస్ కు జేరు తోకయె లేకన్
జర్రూరు పిట్ట కలిగెను
వర్రీ ! సెల్ దెబ్బ కిపుడు బ్యాకై పోయెన్.