రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘కనురాపు తగిలి’...? ‘కనుదృష్టి తగిలి’ అని మీ భావమా? ***** వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘తీర్చుననుచు’ అనండి.
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
అక్కయ్యా, ‘కనురాపు’ ఎక్కడా వినలేదు, నిన్న ఆంధ్రభారతి, తెలుగు నిఘంటువుల్లో వెదికాను. దొరకలేదు. అందుకే సందేహించాను. చివరికి మాండలిక పదకోశంలోను లేదు. చాగంటివారు ఎక్కడినుండి స్వీకరించారో?
రిప్లయితొలగించండిపచ్చని చేలను గాంచిన
మెచ్చగ కనురాపు తగిలి మేయగ కంచే
వచ్చెడి ఫలసా యమునకు
నచ్చును నీదిష్టి పిడత నమ్మగ రైతున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
‘కనురాపు తగిలి’...? ‘కనుదృష్టి తగిలి’ అని మీ భావమా?
*****
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘తీర్చుననుచు’ అనండి.
పచ్చ దనము తోడ వర్ధిల్లు చేలకే
రిప్లయితొలగించండిపరుల దిష్టి తగులు పక్షి జేరు
కంటి దోష మైన ఖగపు యాగడమైన
బొమ్మ తీర్చు ననుచు నమ్ము రైతు
నరుని దృష్టి తగిలి నాశమౌ నని మరి
రిప్లయితొలగించండిపక్షి జాతినుండి పైరుఁగావ
పెట్టు చుంద్రు కొన్ని మట్టికుండలచట
తెల్ల బొట్లు బెట్టి తీరుగాను
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపచ్చని పొలముల జూసియు
రిప్లయితొలగించండిముచ్చటపడి పక్షి పశువులు ముదమున మేయన్
వచ్చు నటంచును పొలమున
నచ్చపు కడవలు పెట్టిరి యవి భీతిల్లన్.
రిప్లయితొలగించండిపక్షు లెల్ల వాలి పంట నష్టమగును,
రంగు కుండ లుంచి హంగుఁ జేయ
కావలుండి రనుచు కాలూనవనిరైతు
నమ్మకమ్మునుంచు వమ్ము గాదె?
పొలము నందుంచి కుండలు పులుమ రంగు
బొమ్మలౌను గాని మనుజుఁ బోలు నెట్లు?
భుక్తి కై వాలు పక్షులు మోస పోక
కొలువు దీరవె తినివైచి కుండ పైన?
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
పచ్చని పైరు కావలిగ బంట్లుగ నుంచగ దిష్టి కుండలే
రిప్లయితొలగించండికచ్చిత మైనదక్షత|” సకాలమునందున జేరు పిట్టలే
వచ్చిన”-?చూచి వెళ్లుగద|పంటకురక్షణనమ్మకంబవే|
నచ్చిన రైతు సూత్రమిది నాటికి నేటికి మేటిపోటిగా|
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిబుగ్గనుంచిన బొట్టు-సిగ్గుకొంతయుబెంచి
రిప్లయితొలగించండి-----మగని కాకర్షణే మలచినట్లు|
పచ్చని చేలలో పంటకుకావలై
-----దిష్టి కుండలుంచ?దీవెనట్లు
కాకులు,పిట్టలు కర్షక నష్టము
------తగ్గించగలిగిన తత్వమిదియె|
నేటికి గమనించు- నాటియుపద్దతుల్
------శాస్ర్తీయమేజూడ సర్వులకును|
అన్న చందాన రైతన్న నెన్నుకొన్న
సులభ మార్గము కుండలనిలుపుటన్న
దిష్టి బొమ్మలు రైతుకు దిగుబ డుంచు|
కుండలుంచగ మేలైన కుర్పుగాద|
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘ఆకర్షణ+ఏ’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘ఆకర్షణ మలచినట్లు’ అనండి. ‘కావలి+ఐ’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘పంటకావలి వలె’ అనండి. ‘నాటి పద్ధతు లెల్ల’ అనండి. ‘దిగుబడి+ఉంచు’ అన్నపుడూ యడాగమం వస్తుంది. ‘దిగుబడి నిడు’ అనండి.
నమస్కారములు
రిప్లయితొలగించండి" కనురాపు " అంటే దృష్టి దోషము అని శ్రీ చాగంటివారు ప్రవచనములలొ అనడం విని వ్రాయ వచ్చుననుకొని వ్రసాను అంతె నాకు తెలిసింది
అక్కయ్యా,
రిప్లయితొలగించండి‘కనురాపు’ ఎక్కడా వినలేదు, నిన్న ఆంధ్రభారతి, తెలుగు నిఘంటువుల్లో వెదికాను. దొరకలేదు. అందుకే సందేహించాను. చివరికి మాండలిక పదకోశంలోను లేదు. చాగంటివారు ఎక్కడినుండి స్వీకరించారో?