20, జులై 2015, సోమవారం

సమస్యా పూరణము - 1736 (మాధవుఁడు సారథి యయె సుయోధనునకు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
మాధవుఁడు సారథి యయె సుయోధనునకు.

23 కామెంట్‌లు:

  1. కోరు కొనెనట పార్థుడు పోరుయందు
    చెంత నిలిచిన తనకదే సంతసమన
    మాధవుడు సారధియయె, సుయోధనునకు
    బలగ మొసగెను పాండవ పక్షపాతి

    రిప్లయితొలగించండి
  2. కౌర వపాండ వులయుద్ధ కాల మందు
    సైన్య మునువీడి కోరగ సవ్య సాచి
    మాధవుఁడు సారధి యయె , సుయోధనునకు
    నధిక దళముల నొసగెను విధము దెలియ

    రిప్లయితొలగించండి
  3. వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘పోరునందు’ అనండి.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మొదటిపాదంలో గణదోషం. ‘కౌరవుల పాండవుల యుద్ధ...’ అనండి.

    రిప్లయితొలగించండి
  4. ధర్మమెరిగించఁ బోవగఁ దగవు లాడ
    రాయబారమున ననిఁ జూచాయఁ దెలిపి
    సకల రణతంత్రములఁ గూర్చి శాస్తిఁ జేయ
    మాధవుడు సారధియయె, సుయోధనునకు

    రిప్లయితొలగించండి
  5. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. కౌరవుల పాండవుల మధ్య పోరునందు
    సవ్య సాచియె కోరగ సంతసముగ
    మాధవుడు సారధి యయె,సుయోధనునకు
    మానికమగు నారాయణి సేన నొసగె!!!

    రిప్లయితొలగించండి
  7. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    మాధవుడు మార్గదర్శకు డైనది సుయోధనునికే :

    01)
    _______________________________

    అవని భారము దించుట - కవతరించి
    పాశుపతమును పొందగా - ఫల్గుణుండు
    యుద్ధమును జేయ బావల - సిద్ధపరచి
    పాండవుల చేత మీ చావు - వాస్తవమని
    పాండు సుతులను పొగడుచూ - పరిహసించి
    రాయబారము, రాజు ని - రాకరించు
    నటుల నెరపిన ధీమతి - యతియు నైన
    మాధవుఁడు సారథి యయె, సు - యోధనునకు !
    _______________________________

    రిప్లయితొలగించండి
  8. శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘పొడడుచూ’ అన్నదాన్ని ‘పొగడుచు’ అనండి.

    రిప్లయితొలగించండి
  9. పార్థు కోరిక మన్నించి వరమునిచ్చి
    మాధవుడు సారథి యయె, సుయోధనునకు
    ప్రభల సైన్యము పదివేలు పంచి యిచ్చె
    నాయుధమ్మును ధరియించ నంచు పల్కి

    రిప్లయితొలగించండి
  10. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  11. తే.గీ:సాయమడగంగ కురుపతి సవ్యసాచి
    శౌరి కడకేగ నరునకు సంతసాన
    మాధవుడు సారథియయె;సుయోధనునకు
    యోధుల పది వేవుర యొసగె నపుడె.

    రిప్లయితొలగించండి

  12. తే.గీ:సాయమడగంగ కురుపతి సవ్యసాచి
    శౌరి కడకేగ నరునకు సంతసాన
    మాధవుడు సారథియయె;సుయోధనునకు
    యోధుల పది వేవుర యొసగె నపుడె.

    రిప్లయితొలగించండి
  13. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  15. భారతాహవమందున ఫల్గునునకు
    మాధవుడు సారధి యయె.సుయోధనునకు
    దురభిమానము హెచ్చ సంగరమునందు చావు కల్గెను వంశ నాశము ఘటించె

    రిప్లయితొలగించండి
  16. సాయమడ్గవ చ్చినవార్కి సరెనటంచు
    నా మహాభారతానిలో నర్జనునకు
    మాధవుఁడు సారథి యయె, సుయోధనునకు
    సర్వసైన్యము నిడగ తా సమ్మతించె

    రిప్లయితొలగించండి
  17. మిత్రులందఱకు నమస్సులతో...

    ముందుగనుఁ జూచితంచు గోవిందుఁ డపుడు
    కోర్కిఁ దీర్పంగఁ జనె! గొంతి కొమరునకును
    మాధవుఁడు సారథియయె! సుయోధనునకు
    యాదవుల సైన్య మొసఁగియు హర్షమందె!!

    రిప్లయితొలగించండి
  18. కదన రంగము నందున కదలగలుగు
    మా”ధవుడు-సారధి యయె-సుయోధనునకు
    యుద్దమందున పద్ధతుల్ శ్రద్ధగాను
    నేర్చెనో చెలి యనిదెల్పె నేర్పుచేత
    2.ప్రతిభ గలిగినయుద్దాన ప్రభువు లాగ
    మాధవుడు సారధి యయె సు యోధునునకు
    ఆ-కురు క్షెత్ర యుద్దాన అర్జునుండు
    గెలుపు బాటను బట్టించి విలువ లుంచ|

    రిప్లయితొలగించండి
  19. పార్ధుడాతడు వేడంగ,బవరమందు
    మాధవుడు సారధియయె,సుయోధనునకు
    కనగ,మర్మంబు తెలియమి,కాంచి ముదము
    సంతసించెను గోపాలు సైన్యమంది

    అర్జునుడు తా సంగ్రామమందు ఘనుడు
    నగు సుయోధను డంచును నాఖ్యనందె
    మా,ధవుడ వీవు కావుము మమ్ముననగ
    మాధవుడు సారధి యయె సుయోధనునకు

    అంద దు:ఖంబు పార్ధుడా యనిని తాను
    గీత బోధను చేసియు కృత్య విధిని
    తెల్పి,యుద్ధ సుయోధుగ తీర్చి,వెలిగె
    మాధవుడు సారధియయె సుయోధనునకు

    పరగు నాతడె యోధుడై బవరమందు
    రాజరాజు సుయోధుగ రమ్య యశము
    పార్ధుడును తా సుయోధుగ సార్ధకుడగు
    మాధవుడు సారధి యయె సుయోధనునకు

    రిప్లయితొలగించండి
  20. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
    క్షమించాలి.... మొదటి పూరణ అర్థం కాలేదు.

    రిప్లయితొలగించండి
  21. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి