కవిమిత్రులకు గమనిక... భాస్కర రామిరెడ్డి గారు ‘సూర్యరాయాంధ్ర నిఘంటువు’ను ‘తెలుగు నిఘంటువు’ పేర మళ్ళీ లైవ్ చేశారు. గతకొంతకాలంగా సాంకేతికకారణాలవల్ల అది తెరుచుకొనడం లేదు. ఇప్పుడు మిత్రులు బ్లాగులో కుడివైపున ఉన్న ‘తెలుగు నిఘంటువు’ లింకును క్లిక్ చేసి ఆ నిఘంటువును చూడవచ్చు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. ‘మనసారా’ కాకుండా వైవిద్యంగా పూరించే ప్రయత్నంలో ‘సారా(మొత్తము)’ అన్నారు. బాగుంది. కాకుంటే అది అన్యదేశ్యపదం! సమస్యాపూరణలో ఆమేదయోగ్యమే లెండి! ***** గుండు మధుసూదన్ గారూ, మీ రెండు పూరణలు వైవిద్యంగా ఉండి అలరించాయి. అభినందనలు. మొదటి పూరణలో ‘సంహారముకై’ అన్నారు. ‘సంహారమునకై’ అని ఉండాలనుకుంటాను వ్యాకరణరీత్యా. అక్కడ ‘సం|హారమునకు...’ అంటే సరిపోతుంది కదా! రెండవపూరణ మొదటిపాదంలో గణదోషం. ‘కోరుమయా బీజాక్షర’ అని ఉండాలనుకుంటాను. ‘రా’ గొనె నన్నారు. నీళ్ళుకాని, సోడాకాని కలుపని మద్యాన్ని కూడా ‘రా’ అనే అంటారు సుమా! (సరదాకి).
గుండు మధుసూదన్ గారూ, సవరించిన మీ పూరణలు బాగున్నవి. సంతోషం! ***** వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ, ‘రలయో రభేదః’ అని ర-ల ప్రాసను కొందరు లాక్షణికులు చెప్పారనుకోండి. కాని సాధ్యమైనంతవరకు దానిని ప్రయోగించకుంటేనే మంచిది. ***** డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘గరళం|బున్ రాగా...’ అన్నప్పుడు ప్రాస తప్పింది. ‘గరళం| బే రాగా...’ అనండి.
నాగరాజు రవీందర్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** మిస్సన్న గారూ, మీ రెండు పూరణలు వైవిధ్యంగా ఉండి అలరించాయి. అభినందనలు. రెండవపూరణలో ‘చూసారా’ అని వ్యావహారికాన్ని ప్రయోగించినా సమస్యాపూరణలో చమత్కారంకోసం స్వీకరిద్దాం!
ధీరుఁడు త్రిలోక పూజ్యుఁడు
రిప్లయితొలగించండికారుణ్యాంబుధి యశేష గణముల పతియై
కోరి హలాహలమును మన
సారా గొనె శివుఁడు లోక సంరక్షణకై.
పారా వారము చిలుకగ
రిప్లయితొలగించండిఔరా యేతెంచె నంట హాలా హలమే
నారాయణి పలుకున మన
సారా గొనె శివుడు లోకసం రక్షణకై
క్షీరాబ్ధి నుండి పుట్టిన
రిప్లయితొలగించండియారమయే యాదివిష్ణు యంకము జేరన్
హాలాహలమున్ దనమన
సారాగొనె శివుడు లోక సంరక్షణకై
క్షీరాబ్ధి నుండి పుట్టిన
తొలగించండియారమయే యాదివిష్ణు యంకము జేరన్
ఘోరహలాహలమున్ మన
సారాగొనె శివుడు లోక సంరక్షణకై
ఈరోజు అందరూ ‘మనసారా’ పూరణలు చేసేట్టు ఉన్నారు!
రిప్లయితొలగించండి*****
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవపాదంలో ప్రాస తప్పింది. ‘ఘోర హలాహలమున్ మన|సారా...’ అనండి.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. (ఈమధ్యకాలంలో మీనుండి వచ్చిన అత్యుత్తమమైన పూరణ ఇది!) అభినందనలు.
గురువు గారికీ నమస్కారములు ర ల లకు భేదం లేదనే ఉద్దేశ్యంలొ ప్రాస ల ను ఉపయో గించానండి
తొలగించండికవిమిత్రులకు గమనిక...
రిప్లయితొలగించండిభాస్కర రామిరెడ్డి గారు ‘సూర్యరాయాంధ్ర నిఘంటువు’ను ‘తెలుగు నిఘంటువు’ పేర మళ్ళీ లైవ్ చేశారు. గతకొంతకాలంగా సాంకేతికకారణాలవల్ల అది తెరుచుకొనడం లేదు. ఇప్పుడు మిత్రులు బ్లాగులో కుడివైపున ఉన్న ‘తెలుగు నిఘంటువు’ లింకును క్లిక్ చేసి ఆ నిఘంటువును చూడవచ్చు.
రిప్లయితొలగించండిచేరుచు జిలుకగ సంద్రము
మీరుచును హలాహలమట మీదకు రాగా
ఘోరము నాపగ తన మన
సారా గొనె శివుడు లోకసంరక్షణకై.
రిప్లయితొలగించండిమాస్టరు గారూ ! ఈ రోజు అందరూ ' మన ' సారా నే అందుకుంటున్నారు...వేరొక ' సారా ' అందటం లేదు...
మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...
రిప్లయితొలగించండిపోరునఁ ద్రిపురాసుర సం
హారముకై విశ్వకర్మ హర్షోత్సుకుఁడై
తేరు గుణి శిఖుల నిడ, మన
సారా గొనె శివుఁడు లోక సంరక్షణకై!!
సారా యనగా మొత్తము
రిప్లయితొలగించండిపారావారమ్ము జిలుక వచ్చిన విషమున్
చేరుచు నింత మిగల్చక
"సారా" గొనె శివుడు లోకసంరక్షణకై.
నా రెండవ పూరణము:
రిప్లయితొలగించండి(త్రిపురాసురసంహారమున నుపయుక్తమగు బీజాక్షరమ్ముం గొనుమని విశ్వకర్మ యనఁగా శివుఁడు "రం" బీజాక్షరమును స్వీకరించిన సందర్భము)
కోరుమయ బీజాక్షర
మేరీతిని యుక్తము మఱి హితకరమనఁగన్
గోరి మనః కర్మణ వచ
సా "రా" గొనె శివుఁడు లోక సంరక్షణకై!
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘మనసారా’ కాకుండా వైవిద్యంగా పూరించే ప్రయత్నంలో ‘సారా(మొత్తము)’ అన్నారు. బాగుంది. కాకుంటే అది అన్యదేశ్యపదం! సమస్యాపూరణలో ఆమేదయోగ్యమే లెండి!
*****
గుండు మధుసూదన్ గారూ,
మీ రెండు పూరణలు వైవిద్యంగా ఉండి అలరించాయి. అభినందనలు.
మొదటి పూరణలో ‘సంహారముకై’ అన్నారు. ‘సంహారమునకై’ అని ఉండాలనుకుంటాను వ్యాకరణరీత్యా. అక్కడ ‘సం|హారమునకు...’ అంటే సరిపోతుంది కదా!
రెండవపూరణ మొదటిపాదంలో గణదోషం. ‘కోరుమయా బీజాక్షర’ అని ఉండాలనుకుంటాను.
‘రా’ గొనె నన్నారు. నీళ్ళుకాని, సోడాకాని కలుపని మద్యాన్ని కూడా ‘రా’ అనే అంటారు సుమా! (సరదాకి).
వారాశిని చిలుకంగనె
రిప్లయితొలగించండిఘోరంబుగ బుట్టు బ్రహ్మ ఘోషము గనుచున్
తీరుగ నాసాంతము మన
సారా గొనె శివుడు లోకసంరక్షణకై!!!
ఘోరవిషమ్మును తా మన
రిప్లయితొలగించండిసారా గొనె శివుడులోక సంరక్షణకై
ధారుణి గల ప్రజలందరు,
శౌరిదివౌకసులు మెచ్చ చండీ నాథున్
శైలజ గారూ,
రిప్లయితొలగించండి‘బ్రహ్మఘోష’మనే విశేష పదప్రయోగంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు శంకరయ్యగారూ! సెల్ ఫోనులో టైపుచేయుటచేఁ గలిగెడి యగచాట్లివి! డిక్షనరీ యాప్షనుండుటవలన నేను టైపుచేసిన దొకటి, ప్రకటమైనదొకటి యుండుట..నేనుం జూచుకొనకయే ప్రచురించుట...ప్రమాదపతితములు. క్షంతవ్యుఁడను.
రిప్లయితొలగించండిమొదటి పూరణమున:మొదట "సంహారమునకు" ననుకొనినను, సమస్య పాదాంతమున గల "సంరక్షణకై" పద ప్రభావమున "సంహారముకై" యని టైపు చేసితిని. దోషముం గమనింపనైతిని.
రెండవ పూరణమున: నిశ్చయముగ టైపాటు దోషమే దొరలినది.
తమరుం జూపిన దోషములను నేనిట్లు సవరించుచుంటిని. పరిశీలింపఁగలరు.
(1)
పోరునఁ ద్రిపురాసుర సం
హారమునకు విశ్వకర్మ హర్షోత్సుకుఁడై
తేరు గుణి శిఖుల నిడ, మన
సారా గొనె శివుఁడు లోక సంరక్షణకై!!
(2)
"కోరుమయా బీజాక్షర
మేరీతిని యుక్తము మఱి హితకర" మనఁగన్
గోరి మనః కర్మణ వచ
సా "రా" గొనె శివుఁడు లోక సంరక్షణకై!
కం:కూర్మంబయ్యెను శ్రీహరి
రిప్లయితొలగించండిపారావారము జిలుకగ పడతియు గరళం
బున్ రాగా విషమును మన
సారా గొనె శివుడు లోక సంరక్షణకై
శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ
రిప్లయితొలగించండిపారావారము త్రవ్వుచు
ఘోరమ్మగు గరళ మరసి గొనెదరెవరనన్
రా రా! యని బిలచుచు మన
సారా గొనె శివుడు లోకసంరక్షణకై.
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిసవరించిన మీ పూరణలు బాగున్నవి. సంతోషం!
*****
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
‘రలయో రభేదః’ అని ర-ల ప్రాసను కొందరు లాక్షణికులు చెప్పారనుకోండి. కాని సాధ్యమైనంతవరకు దానిని ప్రయోగించకుంటేనే మంచిది.
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘గరళం|బున్ రాగా...’ అన్నప్పుడు ప్రాస తప్పింది. ‘గరళం| బే రాగా...’ అనండి.
భాగవతుల కృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్షీరాబ్ధి మథనమున తొలి
రిప్లయితొలగించండిదారుణవిష ముద్భవించె ద్వంస మొనర్చన్
దీరు౦డై గరళము మన
సారా గొనె శివుడు లోక సంరక్షణకై
నారదుడనె పరమేష్ఠీ!
రిప్లయితొలగించండినేరవె హాలాహలమ్ము నిప్పై కాల్చన్
నేరేడు పండు గతి తెలు-
సా? రా! గొనె శివుడు లోక సమ్రక్షణకై.
********
నారాయణుడనె నో సుర-
లారా భయమేలను గరళమనిన నాతో
రారే లీలగ నటు చూ-
సారా! గొనె శివుడు లోక సంరక్షణకై.
నాగరాజు రవీందర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
మిస్సన్న గారూ,
మీ రెండు పూరణలు వైవిధ్యంగా ఉండి అలరించాయి. అభినందనలు.
రెండవపూరణలో ‘చూసారా’ అని వ్యావహారికాన్ని ప్రయోగించినా సమస్యాపూరణలో చమత్కారంకోసం స్వీకరిద్దాం!
Dhanyavaadaalu guruvugaaroo.
రిప్లయితొలగించండిఘోరత పోఫల ముగభ
రిప్లయితొలగించండిగీరథు వెనుకన్ సురధుని కెరలుచు నురకన్
తోరంబుగ నామెను శిర
సారా గొనె శివుడు లోక సంరక్షణకై
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కోరితపము జేయగ?ఆ
రిప్లయితొలగించండికోరికదీర్చంగనెంచి-కోమలి మనసున్
జేరియు|పార్వతి నేమన
సారాగొనె|శివుడు లోక సంరక్షణకై|
పారావారము బుట్టియు
రిప్లయితొలగించండిభారముగా లోకములను పరిమార్చ,విసం
బే,రయము దాని తా మన
సారా గొనె శివుడు లోక సంరక్షణకై
చేరియు శంభుని గుడికిని
వారిని లింగము పయినను,పడగా పోయన్
నీరము నభిషేకము మన
సారా గొనె శివుడు లోక సంరక్షణకై
మారుని గాల్చియు పార్వతి
నా,రూపు గనిన శివుడపుడందెను సతిగా
వారా సురలు పొగడ మన
సారా గొనె శివుడు లోక సంరక్షణకై
భూరిగ తపమును జేసిన
వారల కెల్లర వరముల భారీనిచ్చున్
కోరిక తీర్చుచు తామన
సారా గొనె శివుడు లోక సంరక్షణకై
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.
చివరిపూరణలో ‘భారిగ నిచ్చున్’ అనండి.
నమస్కారములు
రిప్లయితొలగించండిగురువులకు ధన్య వాదములు
ధారుణికెంతటి భాగ్యమొ!
రిప్లయితొలగించండితారా పథమంటెడు రజతాచల సీమన్,
భారత హిమశిఖరాగ్ర వ
సారా గొనె శివుడు లోక సంరక్షణకై!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.
కాని... ‘శిఖరాగ్ర వసారా’ అని సమాసం చేయడమే దోషం. ‘భారత హిమశిఖరంపు వ|సారా...’ అందామా?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురుదేవులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిసవరించిన పద్యం :
ధారుణి కెంతటి భాగ్యమొ!
తారా పథమంటెడు రజతాచల సీమన్,
భారత హిమశిఖరంపు వ
సారాఁ గొనె శివుడు లోక సంరక్షణకై!
జులై 15, 2015 10:29 [PM]
తీరుగ హలహల మిప్పుడు
రిప్లయితొలగించండిసారాగా మారి పోవ సంబరముంగన్
తేరా నారద! యనుచున్
సారా గొనె శివుడు లోకసంరక్షణకై :)
తొలగించండినారా వారి ఉభయమయ!
హేరాళమ్ముగ జిలేబు లేరాలముగన్
వారుణి ! నారద తే! మన
సారా గొనె శివుడు లోకసంరక్షణకై !
జిలేబి
రిప్లయితొలగించండిధారాళమ్ముగ సంద్రము
నా రాక్షసులు సురులు మధనమ్మట జేయన్
పారిన గరళమ్మును మన
సారా గొనె శివుడు లోకసంరక్షణకై!
జిలేబి
ఔరా! సాగర మందున
రిప్లయితొలగించండిసారా వెడలంగ మెండు చంకలు కొడుచున్
నోరును పూరా విప్పుచు
సారా గొనె శివుడు లోకసంరక్షణకై:)
సాగరము = hussain sagar
శివుడు = 😊