13, ఫిబ్రవరి 2012, సోమవారం

దత్తపది - 18 (ఈగ, దోమ, పేను, నల్లి)

కవిమిత్రులారా,

‘ఈగ, దోమ, పేను, నల్లి’

పై పదాలను ఉపయోగించి

పాలకుల, అధికారుల అవినీతిపై

మీకు నచ్చిన ఛందస్సులో పద్యం వ్రాయండి.

24 కామెంట్‌లు:

 1. చి. రాంభట్ల పార్వతీశ్వర శర్మ చక్కని ప్రజ్ఞను ప్రదర్శిస్తూ చేసిన అష్టావధానము సర్వ జన మనోరంజకమైనది. వివరములను శ్రీ మిస్సన్న గారిని మన బ్లాగులో ప్రచురించమని కోరేను.

  మా రాంభట్ల వధానిశేఖరు డసామాన్యుండు మాన్యుండు త
  ద్ధారా వేగము భావనాపటిమ యుత్సాహమ్ము వాగ్దీప్తులున్
  శ్రీరమ్యమ్ములు సర్వరంజకముగా చేసెన్ వధానంబు నే
  సారోదారమతిన్ బొనర్చుచు ప్రశంసల్ గూర్తు నాశీస్సులన్

  రిప్లయితొలగించండి
 2. వారి నల్లిబిల్లిగ కల్పు బంధ మదియె
  మట్టు బెట్టగ నేదెదో మహిమ లేదు
  ఈ గతవినీతి నెలకొన్న నేమి చెపుదు
  నరుల బ్రతుకున చూపేను నరక మెపుడు

  రిప్లయితొలగించండి
 3. సవరణ తో...

  ఈ గతవినీతి నెలకొన్న నేమి చెపుదు
  అదియె బంధమ్ములల్లగా నల్లిబిల్లి
  మట్టు బెట్టగ నేదెదో మహిమ లేదు
  ఆస్తి పెంచుక చూపేను నాస్తి మనకు.

  రిప్లయితొలగించండి
 4. గోలివారి పూరణ బాగుంది. కాని రెండు ప్రయత్నాలలోనూ 'చూపెను' అన్న పదానికి 'చూపేను' అన్న ప్రయోగం ఉన్నది. దీని సాధుత్వం విచార్యం.

  రిప్లయితొలగించండి
 5. వారి నల్లిబిల్లిగ కల్పు బంధ మదియె
  మట్టు బెట్టగ నేదెదో మహిమ లేదు
  ఈ గతవినీతి నెలకొన్న నేమి చెపుదు
  ఆస్తి పెంచుక చూపేను నాస్తి మనకు.

  రిప్లయితొలగించండి
 6. శ్యామల రావు గారూ! ధన్యవాదములు.మీ సూచన ప్రకారము చిన్న సవరణ.

  వారి నల్లిబిల్లిగ కల్పు బంధ మదియె
  పేనుకున్నది చూడగా పెద్ద గాను
  మట్టు బెట్టగ నేదెదో మహిమ లేదు
  ఈ గతవినీతి నెలకొన్న నేమి చెపుదు.

  రిప్లయితొలగించండి
 7. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  అవినీతి పాలకులు ,అధికారులు :

  01)
  _____________________________________________


  వేగ శవముపై మూగెడి - యీగ వోలె
  పేద రక్తము బీల్చెడి - పేను రీతి
  నల్ల బీల్చెడి నికృష్ట - నల్లి కన్న
  బలము త్రాగెడి దోమల - వలెను వీరు
  నీచ నికృష్ట నిర్దయ - నిర్ణయముల
  బడుగు జీవుల సొమ్మును - పాపమనక
  భయము లేకుండ కాజేసి - బ్రతుకు చుంద్రు !
  భరత దేశాన యధికార్లు - పాలకులును !
  భావి భారత దేశపు - భాగ్య మేమొ?????
  _____________________________________________

  రిప్లయితొలగించండి
 8. కవి మిత్రులారా నిన్న మియాపూర్ లో జరిగిన అవథాన కార్యక్రమాన్ని నేను దర్శించాను .

  కాంచితి చంద్రశేఖరుల కమ్మని యా యవధానమున్ విశే
  షాంచిత ధారణా పటిమ , లద్భుత ముల్ ప్రతిభల్ , కనంగ రో
  మాంచిత మయ్యె , తెల్గులను మాత్రమె యండ్రిది , మేలు మేలు , చే
  యించిన వార్కి చేసిన కవీశునకున్ శుభ ముల్ లభించెడిన్

  ఈగ దోమ పేను లేగెను నల్లితో
  బ్రహ్మకడకు తమను భరత భువిని
  పూని నేత గాగ పట్టింప వలదంచు
  కోరు కొనుట కొరకు కూడి మాడి

  రిప్లయితొలగించండి
 9. నేటి తరము రాజకీయనాయకుల అవినీతి..........

  పేదజనపథకములునింపేను జేబు,
  స్త్రీలపథకమ్మిదో మరల్చాలినిధులు,
  లేని కట్టడములనల్లి కానుకగొనె,
  యీగతిని దోచ జనులకింకేమి మిగులు??

  కానుక = ధనము
  లేని కట్టడములనల్లి = కట్టినట్లుగా జూపి,

  రిప్లయితొలగించండి
 10. పేను ,నల్లుల మాదిరి పీల్చు కొనుచు
  దోమ నటులన రక్తము దోచు కొనుచు
  నిలను శవముపై వాలిన ఈ గ వోలె
  పాలకు లవి నీతి పరులై పంచు కొనిరి
  బడుగు జీవుల ధనములు మానములును

  రిప్లయితొలగించండి
 11. మిత్రులారా! తమ్ముడు చి. డా. గన్నవరపు వరాహ నరసింహ మూర్తి మా ఊరికి వచ్చెను. మా ఇంటికి వచ్చెను. చక్కగా ఉత్సాహముగా సంభాషించుకొనినాము. అష్టావధానము బాగుగా చూచి ఆనందించేము. చి. మూర్తి ముఖ్య అతిథిగా సభకు వన్నె తెచ్చెను. శ్రీ మిస్సన్న గారు కూడా వచ్చేరు. ఆనందము. అష్టావధాన సభ బాగుగా జరిగింది. చి. మూర్తి గారి పద్యమును ఈ క్రింది విధముగా సవరిస్తున్నాను:
  పద్య ధార రుచుల పాయసమ్ముల మించు
  పలుకు జీడిపలుకు వలె మృదులము
  వద్దులన్న చోట సుద్దులుంచె వధాని
  పార్వతీశ్వరుండు ప్రజ్ఞ మెరయ
  నేమాని రామజోగి సన్యాసి రావు

  రిప్లయితొలగించండి
 12. మిత్రులారా చిరంజీవి రాంభట్ల పార్వతీశ్వర శర్మ అష్టావధానం విశేషాలను శ్రీ నేమాని పండితార్యుని, శంకరార్యుని కోరిక మేరకు త్వరలోనే మీ ముందుంచుతాను.

  అన్నట్లు మన గన్నవరపు నరసింహమూర్తి మిత్రులే పై అష్టావధాన సభకు ముఖ్య అతిథి.

  రిప్లయితొలగించండి
 13. శ్రీ రాజారావు గారు చెప్పినట్లు 'విశేషాంచిత ధారణా పటిమతో' అవధానము నిర్వహించిన శ్రీ రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారికి అభినందనలు. హాజరైన వారిలో నున్న కవిమిత్రులు రాజారావు గారు, మూర్తి గారు,మిస్సన్నగారు విశే షములను తెలుపవలసినదిగా కోరుచున్నాను.

  రిప్లయితొలగించండి
 14. మిత్రులారా!
  నిన్న 2 చోట్ల అవధానములు జరిగినవి:
  (1) విశాఖపట్టణములో: అవధాని: చి. రాంభట్ల పార్వతీశ్వర శర్మ
  (2) హైదరాబాదులో : అవధాని డా. కట్టమూరి చంద్రశేఖర్
  విశాఖపట్టణములో జరిగిన అవధానమును గురించి నేను మరియు శ్రీ మిస్సన్న గారు ప్రస్తావించేము.
  హైదరాబాదులో జరిగిన అవధానము గురించి శ్రీ రాజారావు గరు ప్రస్తావించేరు.
  ఒకదాని కొకటిగా ఎవరూ కంగారు పడవద్దు. 2నూ బాగుగనే జరిగాయి.
  స్వస్తి. నేమాని రామజోగి సన్యాసి రావు

  రిప్లయితొలగించండి
 15. ఈనాటి కవిత్వపు టంశమైన దత్తపదిని నింపి పంపిన మిత్రులు --
  (1) శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారికి
  (2) శ్రీ వసంత కిశోర్ గారికి
  (3) శ్రీ లక్కాకుల వెంకట రాజారావు గారికి
  (4) శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారికి
  (5) శ్రీ సుబ్బారావు గారికి
  అందరికీ అభినందనలు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 16. అయ్యలారా! రెండు అవధానాలలోని సమస్యలు ఇక్కడ ప్రచురిస్తే ఔత్సాహికులు పూరించటానికి అవకాశం దొరుకుతుంది. మిగతా వివరాలు ఎలాగూ తరువాత వెలువడుతాయి. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 17. నమస్కారములు
  అవధాన విశేషాలు మనసును అలరిస్తున్నాయి . చూసి నంత ఆనందం గా ఉంది . అందరికీ ధన్య వాదములు.

  రిప్లయితొలగించండి
 18. పేను కొరుకుడు నెత్తికి పెత్త నమ్ము
  దోమ లన్నియు జేరెను తోక ముడిచి
  నల్లులై కుట్టుచు ప్రాణుల నంచి తినెడి
  ప్రభువు లుండిన [ఈ ] నీగతి ప్రజల కెపుడు

  రిప్లయితొలగించండి
 19. పండిత నేమాని వారూ,
  రాంభట్లవారి అవధాన విశేషాలు కొన్ని తెలిసాయి. గన్నవరపు వారు ఆ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారని తెలిసి ఎంతో ఆనందించాను. మిస్సన్న తదితర మిత్రులు ఆ అవధాన కార్యక్రమంలో పాల్గొన్నందుకు అదృష్టవంతులు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  సవరించిన తరువాత మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
  *
  వసంత కిశోర్ గారూ,
  మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  *
  లక్కాకుల వెంకట రాజారావు గారూ,
  మియాపూర్ అవధానాన్ని వీక్షించిన అదృష్టవంతులు. ఆ కార్యక్రమానికి రావాలని ఎంతగానో కోరుకున్నాను, కాని అవకాశం దొరకలేదు.
  మీ పూరణ చమత్కారభరితమై చాలా బాగుంది. అభినందనలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  ‘నింపేను, మరల్చాలి’ అనే రెండు వ్యావహారిక రూపాలను ప్రయోగించినా మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  చక్కని పూరణ. అభినందనలు.
  మూడవ పాదంలో గణదోషం. ‘నల్లులై కుట్టి’ అంటే సరి!

  రిప్లయితొలగించండి
 20. శంకరార్యా ! ధ్యవాదములు !
  మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !

  రిప్లయితొలగించండి
 21. నాయకులీగజ దొంగలు
  మాయకులై దోమటి తనమందున ఘనులై
  పాయక పదవులను, నిధుల
  రోయరు, పేనుచును నల్లి, రుగ్మత పాలై.

  పేనుతూ, అల్లి - పునరుక్తి వచ్చినది. దోమటి = కపటము.

  రిప్లయితొలగించండి
 22. గురువు గారికి ధన్యవాధములు,
  గజేంద్ర మోక్షము లోని మకరము అవినీతిపరులు, గజరాజు మిక్కిలి బలవంతుడు మిగిలిన వారు సామాన్యులు,
  సామాన్యుల కష్టములు ఈ రీతినుండునని
  -------
  మకరి నోట జిక్కి మదగజమే, కావు
  మయ్య ప్రాణ నాథ మమ్ము యనగ
  పేను, దోమ, నల్లి పెనుగులాడగ, యీగ
  కోటి వినతులెల్ల నీటిపాలు|

  రిప్లయితొలగించండి