9, ఫిబ్రవరి 2012, గురువారం

చమత్కార (చాటు) పద్యాలు - 192

అకుబేరపురీ విలోకనం నధరాసూనుకరం కదా చ న |
అథ తత్ప్రతిహారహేతవేऽదమయంతీపతిలోచనం స్మర ||
వివరణ
కుబేరపురి అంటే ‘అలక’. అలక శబ్దానికి ముంగురులు అనే అర్థం ఉంది. ‘అకుబేరపురీ విలోకనం’ అంటే వెంట్రుకలు లేని (ముండిత) స్త్రీ యొక్క దర్శనం. ధరాసూనువు (భూపుత్రుడు) అంగారకుడు. అంగారకునికి ‘మంగళ’నామం ఉంది. ‘నధరాసూనుకరం’ అంటే అమంగళకరం. అథ తత్ప్రతిహార హేతవే = అటువంటి అమంగళం తొలగిపోవాలంటే ... దమయంతీపతి అంటే ‘నలుడు’. అదమయంతీపతి అంటే ‘అనలుడు’. ‘అదమయంతీపతి లోచనం’ అంటే అనలుడు లోచనంగా కలవాడు శివుడు అని అర్థం. అట్టి శివుని స్మర = ధ్యానించు.
(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారి ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)

4 కామెంట్‌లు:

  1. దండమయా శివ శంకర
    దండమయా సాంబ నీ కు దండము శంభో
    దండమయా నీలాంబర
    దండమయా గరళ కంట దండము భవుడా!

    రిప్లయితొలగించండి
  2. సుబ్బారావు గారూ,
    ధన్యవాదాలు.
    ‘గరళకంఠ’ టైపాటులో ‘గరళకంట’ అయినట్టుంది.

    రిప్లయితొలగించండి
  3. శంకరార్యా !

    అబ్బో !
    "అ" తగిలిస్తే యెన్ని
    అనర్థాలో ?
    అయ్యా
    ఆ కవి గారెవరో గాని వారికి
    నా
    నమస్సులు !

    రిప్లయితొలగించండి
  4. వసంత కిశోర్ గారూ,
    ఈ చాటుపద్యం మీకు నచ్చినందుకు సంతోషం!
    కవి ఎవరో, ఎప్పుడు వ్రాసారో తెలియదు.

    రిప్లయితొలగించండి