కవిమిత్రులారా, ఈరోజు ‘డా. ఆచార్య ఫణీంద్ర’ గారు తమ బ్లాగులో ‘పద్యకవిత్వం - కొన్ని సందేహాలు’ శీర్షికన అమూల్యమైన సమాచారం ఇచ్చారు. దానిని అందరూ చచవవలసిందిగా మనవి. దాని లింకు .... http://dracharyaphaneendra.wordpress.com/2012/02/04/%E0%B0%AA%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5%E0%B0%82-%E0%B0%95%E0%B1%8A%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%B8%E0%B0%82%E0%B0%A6%E0%B1%87/
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * నిరంజన్ కుమార్ గారూ, మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు. * మందాకిని గారూ, పర్వదినాన 144 సెక్షనా? ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు. * లక్కాకుల వెంకట రాజారావు గారూ, మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు. ‘చేరిరి యచటి’ కంటే ‘గుమిగూడి రచటి’ అంటే బాగుంటుందేమో? * శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ, ఆనందబాష్పాలు రాల్చారన్న మీ పూరణ బాగుంది. అభినందనలు. * పండిత నేమాని వారూ, నిషేధ మున్నప్పుడు పండుగ వస్తే ఏడుపే కద! చక్కని భావం. మంచి పూరణ. అభినందనలు. * శ్రీపతి శాస్త్రి గారూ, ఆదివారం రోజున పండుగ వచ్చి విచారించిన అనుభవం నాకూ ఉంది. మంచి భావన. చక్కని పూరణ. అభినందనలు.
డా. ఆచార్య ఫణీంద్ర గారూ, ఇందుకో నేను కష్టపడుతున్నది, పరిష్కరిస్తున్నది ఏదీ లేదు. సమస్యను తయారు చేయడం తేలికే. పూరణలు చేస్తున్న కవిమిత్రులదే కష్టమంతా. మీ అందరి సహకారంతోనే నిరాటంకంగా బ్లాగు పురోగమిస్తున్నది. ధన్యవాదాలు. * జిలేబీ గారూ, మంచి భావాన్ని అందించారు. అభినందనలు. మీ భావాన్ని ఛందోబద్ధం చేసిన గోలి హనుమచ్ఛాస్త్రి గారి పద్యం చూడండి. * మిస్సన్న గారూ, మీ పూరణ కరుణరసాత్మకంగా ఉంది. చక్కని పూరణ. అభినందనలు. * సుబ్బారావు గారూ, నిజమే! ఒక్కొక్కసారి చావు కొందరికి విషాదాన్ని కల్గిస్తే, మరికొందరికి పండగే అవుతుంది. ప్రశస్తమైన పూరణ. అభినందనలు. * ఊకదంపుడు గారూ, రేఫసంయుకాక్షరం వల్ల ముందున్న అక్షరం గురువు కావచ్చు, కాకపోవచ్చు. ఫరవాలేదు. ఒప్పే! ఇక మీ పూరణ బాగుంది. అభినందనలు. కాని ‘పీడించెడి + అవినీతి’ అన్నప్పుడు యడాగమం వస్తుంది కదా! * రాజేశ్వరి అక్కయ్యా, ఒకరోజు నిర్దోషంగా, మరోరోజు దోషయుక్తంగా వ్రాయాలని నియమం ఏమైనా పెట్టుకున్నారా? ఈనాటి రెండు పూరణలూ నిర్దోషంగా ఉన్నాయి. చక్కగా ఉన్నాయి. ‘ధన్యవాదాలు!’ * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, జిలేబీ గారి భావానికి చక్కని పద్యరూపం ఇచ్చారు. ధన్యవాదాలు. * చంద్రశేఖర్ గారూ, ఆ ఐడియా జిలేబీ గారిది. మీ పూరణకేం? ప్రశస్తంగా ఉంది. అందుకోండి అభినందనలు! కందంలో మీ పూరణ (పాదాన్ని కొద్దిగా మార్చినా) అందంగా ఒదిగింది. * అజ్ఞాత గారూ, ధన్యవాదాలు.
అల్లుడూ , కూతురూ ధరలు మండే పండుగ రోజుల్లో వస్తే మిగిలేది యేడుపేగా :
01) _____________________________ పంచదారకు కరువాయె - పాలు ప్రియము పండుగని కూతురల్లుడు - వసతి జేర పిండి వంటలు తీరుగా - వండు టెట్లు ? పర్వదినమని యేడ్చిరి - సర్వజనులు ! ____________________________ ప్రియము = అధిక ధర వసతి = ఇల్లు
ధరను పెరుగగ నన్నింట ధరలు జూడ
రిప్లయితొలగించండితార లంటగ మింటికి దారి లేక
పాయసంబును తిన గల్గు భాగ్య మపుడె
పర్వదినమని యేడ్చిరి సర్వజనులు.
దుష్టుఁ డొక్కఁడు పరులను దోచువాఁడు
రిప్లయితొలగించండిబలిమితో నెన్నికలలోన గెలిచినపుడు
వేడుకలఁ జేయఁగాఁ గని రౌడిజనుల
పర్వదినమని యేడ్చిరి సర్వజనులు.
ధరలు జూడగ మింటికి దారి గట్టె
రిప్లయితొలగించండిచేతిలోపల లేదాయె చిల్లి గవ్వ
కుండలోపల సరుకులు నిండుకొనెను
పర్వదినమని యేడ్చిరి సర్వజనులు
గౌరి ముద్దుల తనయుని గారవించి
రిప్లయితొలగించండిమోదకమ్ముల తోడను పూజ జరిగె.
దేవ కార్యము నలుగురి దృష్టి తగిలి
నగరమందున జగడము నాడు జరిగె.
"కలిసి కట్టుగ నలుగురు కానరాదు"
నియమమొక్కటి వచ్చెను నిశ్చయముగ.
జనుల కలుపగ జాలక "సామి, యేమి
పర్వదినమని" యేడ్చిరి సర్వజనులు.
కవిమిత్రులారా,
రిప్లయితొలగించండిఈరోజు ‘డా. ఆచార్య ఫణీంద్ర’ గారు తమ బ్లాగులో ‘పద్యకవిత్వం - కొన్ని సందేహాలు’ శీర్షికన అమూల్యమైన సమాచారం ఇచ్చారు. దానిని అందరూ చచవవలసిందిగా మనవి.
దాని లింకు ....
http://dracharyaphaneendra.wordpress.com/2012/02/04/%E0%B0%AA%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5%E0%B0%82-%E0%B0%95%E0%B1%8A%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%B8%E0%B0%82%E0%B0%A6%E0%B1%87/
జనులు చేరిరి యచటి పూజాస్థలమున
రిప్లయితొలగించండిపర్వదినమని , యేడ్చిరి సర్వజనులు
బాంబు పేలంగ మరణించి బంధుజనులు
సంఘవిద్రోహ శక్తుల చర్యవల్ల
రక్కసులనేసి రాముడు రాజుకాగ
రిప్లయితొలగించండిముదము మితిమీరి కన్నీరు ముసురుకొనగ
పట్టరానట్టి యానంద పరవసాన
పర్వదినమని యేడ్చిరి సర్వజనులు
చండ క్రూరుడౌ రాక్షస జాతి నేత
రిప్లయితొలగించండిపాలనమున కష్టమ్ముల పాలబడుచు
పర్వములు చేయరాదౌట బాధపడుచు
పర్వదినమని యేడ్చిరి సర్వ జనులు
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిపనుల తొందర తగ్గగ పరవశమున
ఆదివారము సెలవైన హాయి గొలపు
కొలువు లేనట్టి యీ యొక్క సెలవు నాడె
పర్వదినమని యేడ్చిరి సర్వజనులు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
*
నిరంజన్ కుమార్ గారూ,
మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
*
మందాకిని గారూ,
పర్వదినాన 144 సెక్షనా? ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
*
లక్కాకుల వెంకట రాజారావు గారూ,
మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
‘చేరిరి యచటి’ కంటే ‘గుమిగూడి రచటి’ అంటే బాగుంటుందేమో?
*
శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
ఆనందబాష్పాలు రాల్చారన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
నిషేధ మున్నప్పుడు పండుగ వస్తే ఏడుపే కద! చక్కని భావం. మంచి పూరణ. అభినందనలు.
*
శ్రీపతి శాస్త్రి గారూ,
ఆదివారం రోజున పండుగ వచ్చి విచారించిన అనుభవం నాకూ ఉంది. మంచి భావన. చక్కని పూరణ. అభినందనలు.
గురువు గారు,
రిప్లయితొలగించండిధన్యవాదాలు. వినాయక చవితి రోజు భాగ్యనగరంలో ఇలాంటివి జరుగుతుంటాయనే ఉద్దేశ్యంతో వ్రాశానండి.
గురువుగారూ ధన్యవాదములు. 610,612 సమస్యలను పరిశీలించి అభినందించినందులకు చాలా సంతోషముగా ఉన్నది. Thank U Sir.
రిప్లయితొలగించండిశంకరయ్య గారు ! మీరు 610 సమస్యను పరిష్కరించారా ? ... Just a joke!
రిప్లయితొలగించండిభాగవతారిణి ఆది పర్వమును ముగించె
రిప్లయితొలగించండిరాబోవునది కలకంటి కన్నీరు ను
పోబోవు మానినీ మానంబౌ సభా
పర్వ దినమని ఏడ్చిరి సర్వజనులు
జిలేబి.
నేటి కేడాది యయ్యెను నింగికేగి
రిప్లయితొలగించండియింటి పెద్దయ్య వేదన లింక లేదు
పిండములఁ జేసి పూజించఁ బెట్టి కుశలు
పర్వ దినమని యేడ్చిరి సర్వజనులు.
పరమ సంతస మొం దెను వైరి గణము
రిప్లయితొలగించండిపర్వ దినమని , యేడ్చిరి సర్వ జనులు
రాజ శేఖరు మరణంబు రగిలి మనసు
పెద్ద వారల యెడబాటు ప్రీతి యగునె?
ఒక్కసచివుని చెఱనుంచి, యూరటనిడ
రిప్లయితొలగించండివేరొక ప్రగడకున్ 'కోర్టు' వింత గాను,
ప్రజల పీడించెడవినీతి పాలకులకు
పర్వ దినమని యేడ్చిరి సర్వజనులు.
["ప్రజల పీడించెడవినీతి ప్రభుతకిద్ది" అంటే గణభంగమా గురువుగారూ?]
విశ్వ మంతను పాలించు నీశ్వరునకు
రిప్లయితొలగించండివత్సర మ్మున కొకసారి యుత్స వమ్ము
స్పర్ధ లేకుండ జరుపుట వ్యర్ధ మనుచు
పర్వ దినమని యేడ్చిరి సర్వ జనులు !
------------------------------------------------
స్పర్ధ = పోటీ .
--------------------------------------------
కరువు దినములు వచ్చెను బరువు గాను
క్రొత్త పరికిణి పాపకు కొనెద మన్న
ధరలు నింగిని తాకుట తగునె యిటుల
పర్వ దినమని యేడ్చిరి సర్వ జనులు
మాస్టారు గారూ ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిజిలేబి గారి ఊహ చాల చక్కగానున్నది.
వారి ఊహకు నా పద్య రూపం.
భారతమ్మును భాగవ తారు మొదట
నాది పర్వము జెప్పెను నాడు, నేడు
విన సభా పర్వ మది వల్వ విలువ లూడ్చు
పర్వ దినమని యేడ్చిరి సర్వజనులు.
శ్రీహనుమచ్చాస్త్రిగారూ, నా ఔడియా కొట్టేశారు, తప్పలేదు. ఇంకోపూరణ వేసేదాకా, ప్రస్తుతానికి:
రిప్లయితొలగించండిభారత కథనుధృతరీతిఁ భోరున నడ
పించు బుర్రకథకుఁ డాలపించ నేడు
కులపితామహుఁ డనినేలకొరుగు భీష్మ
పర్వదినమని యేడ్చిరి సర్వజనులు.
ఆచార్య ఫణీంద్రగారు నమస్తే.
రిప్లయితొలగించండిమీరు ఎక్కడికో వెళ్ళనేల? స్వస్థానంలో ఉన్నచో 610 సమస్యకు 60 పరిష్కారములున్నవికదా.( Just a joke. Take it easy.)
సమస్య పాదంలో సూక్షమైన మార్పుతో:
రిప్లయితొలగించండిపర్వది నంబని యేడ్చిరి
సర్వజనులు కాలమహిమ సంబరములకీ
ఉర్విన తావే లేదన
పూర్వభరత వైభవంబు పూర్తిగ మాసెన్
డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
రిప్లయితొలగించండిఇందుకో నేను కష్టపడుతున్నది, పరిష్కరిస్తున్నది ఏదీ లేదు. సమస్యను తయారు చేయడం తేలికే. పూరణలు చేస్తున్న కవిమిత్రులదే కష్టమంతా. మీ అందరి సహకారంతోనే నిరాటంకంగా బ్లాగు పురోగమిస్తున్నది. ధన్యవాదాలు.
*
జిలేబీ గారూ,
మంచి భావాన్ని అందించారు. అభినందనలు.
మీ భావాన్ని ఛందోబద్ధం చేసిన గోలి హనుమచ్ఛాస్త్రి గారి పద్యం చూడండి.
*
మిస్సన్న గారూ,
మీ పూరణ కరుణరసాత్మకంగా ఉంది. చక్కని పూరణ. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
నిజమే! ఒక్కొక్కసారి చావు కొందరికి విషాదాన్ని కల్గిస్తే, మరికొందరికి పండగే అవుతుంది. ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
*
ఊకదంపుడు గారూ,
రేఫసంయుకాక్షరం వల్ల ముందున్న అక్షరం గురువు కావచ్చు, కాకపోవచ్చు. ఫరవాలేదు. ఒప్పే!
ఇక మీ పూరణ బాగుంది. అభినందనలు.
కాని ‘పీడించెడి + అవినీతి’ అన్నప్పుడు యడాగమం వస్తుంది కదా!
*
రాజేశ్వరి అక్కయ్యా,
ఒకరోజు నిర్దోషంగా, మరోరోజు దోషయుక్తంగా వ్రాయాలని నియమం ఏమైనా పెట్టుకున్నారా?
ఈనాటి రెండు పూరణలూ నిర్దోషంగా ఉన్నాయి. చక్కగా ఉన్నాయి. ‘ధన్యవాదాలు!’
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
జిలేబీ గారి భావానికి చక్కని పద్యరూపం ఇచ్చారు. ధన్యవాదాలు.
*
చంద్రశేఖర్ గారూ,
ఆ ఐడియా జిలేబీ గారిది.
మీ పూరణకేం? ప్రశస్తంగా ఉంది. అందుకోండి అభినందనలు!
కందంలో మీ పూరణ (పాదాన్ని కొద్దిగా మార్చినా) అందంగా ఒదిగింది.
*
అజ్ఞాత గారూ,
ధన్యవాదాలు.
ధన్య వాదములు గురువు గారు ! నియమమా ఇం కేమ మన్నానా ? ఒకో రోజూ బు~ఱ్ఱా .......సరిగా .....పని ....చేయ .....దన్న ...మా.....ట .!
రిప్లయితొలగించండిఅదన్న ....మాట.......అసలు .....సంగతి
గురువు గారు,
రిప్లయితొలగించండిఆచార్యులవారు అన్నది ఒకానొక వివాదాస్పదమైన జీవో 610 గురించేమో....
శంకరయ్య గారు!
రిప్లయితొలగించండినేనన్నది మీ పూరణ గురించి కాదు.
చనువుగా మీతో జోక్ చేసింది జి.వో. 610 గురించి.
అప్రస్తుత ప్రసంగమయితే క్షమించండి
మందాకిని గారూ,
రిప్లయితొలగించండిడా. ఆచార్య ఫణీంద్ర గారూ,
నిజమే సుమా! నాకు దాని గురించి ఆలోచనే రాలేదు. ‘Just a joke' అన్న మాటను చూసినా నాకు తట్టలేదు. ఎంత మందమతిని?!
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అల్లుడూ , కూతురూ ధరలు మండే పండుగ రోజుల్లో వస్తే మిగిలేది యేడుపేగా :
01)
_____________________________
పంచదారకు కరువాయె - పాలు ప్రియము
పండుగని కూతురల్లుడు - వసతి జేర
పిండి వంటలు తీరుగా - వండు టెట్లు ?
పర్వదినమని యేడ్చిరి - సర్వజనులు !
____________________________
ప్రియము = అధిక ధర
వసతి = ఇల్లు
శ్రీ గోలీ వారి హృద్య పద్యమునకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిజిలేబి.