8, ఫిబ్రవరి 2012, బుధవారం

చమత్కార (చాటు) పద్యాలు - 191

రాజన్ కమలపత్రాక్ష
తత్ తే భవతు చాక్షయమ్ |
ఆసాదయతి యద్ రూపం
కరేణుః కరణై ర్వినా ||

సామాన్యార్థం -
కమలపత్రాక్ష = పద్మదళ నేత్రుడవైన
రాజన్ = ఓ రాజా!
కరేణుః = ఆడయేనుగు
కరణైః + వినా = కాళ్ళు, చేతులు మొదలైన అవయవాలు లేని
యత్ + రూపం = ఏ రూపాన్ని
ఆసాదయతి = పొందుతుందో
తత్ = అటువంటి
అక్షయమ్ = నాశనం లేని రూపం
తే = నీకు
భవతు = సంభవించును గాక!

విశేషార్థం
‘కరణైః వినా’ అన్నచోట వ్యాకరణ నియమం ఒకటి ఉంది. ‘కరణైః వినా కరేణుః’ అనగా క, ర, ణకారాలు లేని ‘కరేణుః’ శబ్దం. కరేణుః శబ్దంలోని ఈ మూడు హల్లులు పోగా అ,ఏ,ఉః మాత్రమే మిగులుతాయి. ‘అ + ఏ’ వృద్ధిసంధి వలన ‘ఐ’ అవుతుంది. ‘ఐ + ఉః’ అనేది ‘ఏచోయవాయావః’ సూత్రం వలన ‘ఆయుః’ అవుతుంది. అంటే ‘ఓ రాజా! నీకు అక్షయమైన ఆయువు లభించుగాక!’ అని తాత్పర్యం.

(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారి ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)

5 కామెంట్‌లు:

  1. శంకరయ్య గారూ , రెండవ సంధికార్యం - యణాదేశసంధి అన్నచోట కొంచెం వివరణ అవసరమనిపిస్తోంది. ప్రహేళికలు గ్రంధంలో ' యణాదేశ సంధి ' అనే ఉందా ?!

    రిప్లయితొలగించండి
  2. డా. విష్ణునందన్ గారూ,
    నిజమే. అది నా పొరపాటే! సవరిస్తున్నా.
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. నిజమే శంకరయ్య గారు ! దాన్ని అయవాయావాదేశ సంధి అంటారు .

    రిప్లయితొలగించండి
  4. శంకరార్యా ! చమత్కారం బావుంది !
    కాళ్ళు, చేతులు మొదలైన అవయవాలు లేని యేనుగు రూపం
    మీకు ప్రాప్తించు గాక !

    రిప్లయితొలగించండి
  5. వసంత కిశోరా,
    ధన్యవాదాలు.
    కాని అది ఆడయేనుగు అయితే ఇంకా బాగుండేది. :-)

    రిప్లయితొలగించండి