కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది -
కలుషములఁ బాపు గంగయే గరళమయ్యె.
ఈ సమస్యను సూచించిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.
ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది -
కలుషములఁ బాపు గంగయే గరళమయ్యె.
ఈ సమస్యను సూచించిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.
విషపు నాగులు నగలాయె, పెద్ద చిచ్చు
రిప్లయితొలగించండిదలప కన్నాయె నెత్తి పోతలగ మారె
కలుషములఁ బాపు గంగయే, గరళమయ్యె
పండు నేరేడు వోలెను పరమ శివుకు.
గరళ కంఠుని శిరమందు కదము త్రొక్కు
రిప్లయితొలగించండికలియు గంబున సొగసులు కలయ జూసి
కలత చెందిన గంగమ్మ చెలగి పోయి
కలుషములఁ బాపు గంగయే గరళ మయ్యె !
అయ్యా! హనుమఛ్ఛాస్త్రి గారూ!
రిప్లయితొలగించండిమీ పద్యము 4వ పాదములో పరమశివుకు అనే పదమును మార్చాలి. ఆ పాదమును ఇలా మార్చుదాము:
"పండు నేరేడు వలె సతీ వల్లభునకు"
సవరణ సూచించిన శ్రీ నేమాని వారికి ధన్య వాదములు. సవరణ తో...
రిప్లయితొలగించండివిషపు నాగులు నగలాయె, పెద్ద చిచ్చు
దలప కన్నాయె నెత్తి పోతలగ మారె
కలుషములఁ బాపు గంగయే, గరళమయ్యె
పండు నేరేడు వలె సతీ వల్లభునకు.
అక్కటాలోకమందెన్ని చిక్కులొక్కొ
రిప్లయితొలగించండితలప జీవికి ప్రాణంబు నిలుపుకొనగ
జంతు మానవ వ్యర్థ దుస్సంగమమున
కలుషములఁ బాపు గంగయే గరళమయ్యె.
"పండిత" తాతగారికి అనవరత వినయ మండిత మనుమని నమస్కారాలు.!
రిప్లయితొలగించండిఅకట పాశ్చాత్య పద్ధతు లధికమయ్యె
రిప్లయితొలగించండిమాతృ భాషయు సంస్కృతి మైల వడియె
కొత్త మోజులో నూగు నున్మత్త మతికి
కలుషములు బాపు గంగయే గరళమయ్యె
గంగను గైకొని రీసైకల్ చేయవయ్యా
రిప్లయితొలగించండిపార్వతీశా, మా తప్పిదముల కావుమయ్యా
మా పరిశ్రమల కాలుష్యం తో
కలుషముల బాపు గంగయే గరళ మయ్యే
జిలేబి.
జిలేబీ గారు... ఇది గేయమా? పద్యమా? నాకు ఏ చందస్సుకు చిక్కడం లేదు. అందుకే సంశయం..! ధన్యవాదములు
రిప్లయితొలగించండినాయనా! పార్వతీశ్వర శర్మా!
రిప్లయితొలగించండిశ్రీమతి జిలేబి గారిని ప్రశ్నించేవు. ఆమెకు పద్యములలో ఆసక్తి ఉన్నది గాని ఇంకా పద్య విద్య పట్టుబడలేదు. ఆమె భావములను మన బ్లాగు మిత్రులే పద్యరూపములోకి మారుస్తూ ఉంటారు. ఆమె త్వరలో చిన్న చిన్న పద్యములను వ్రాయ మొదలు పెట్టెదరు అని ఆశించుదాము.. స్వస్తి.
శాప వశమున పృథ్విలో జన్మ గలుగ
రిప్లయితొలగించండినల్ల వసువుల యాయువు లపుడె దీఱె
సొంత తల్లికి గరుణయు సుంత లేక
కలుషములు బాపు గంగయే గరళ మయ్యె
గంగ – తలమీద , గరళమ్ము – గళము నందు
రిప్లయితొలగించండినిల్పె భక్తులు శివుని ధ్యానించి నంత
సగము తనువైన గౌరికి సవతి యగుచు
కలుషములు బాపు గంగయే గరళమయ్యె
శర్మ గారూ ! జిలేబీ గారు జిలేబీ చంధస్సులో జిలేబీ లల్లుతారు. అవి ఒక రూపమునకు పరిమిత మవవు. రుచికరముగా ఉంటాయి. కావాలంటే మీరు వాటిని ఒక మూసలో అమర్చ వచ్చు.
రిప్లయితొలగించండిజలములు నిర్మలమై భువి
రిప్లయితొలగించండిపలువుర పాపము కడుగుచు పావనులనుగా
నిల నిలిపిన పాపమ్మో?-
కలుషములను బాపు గంగ గరళంబయ్యెన్.
విష్ణు పాదోద్భవమ్మను విభవమంది
రిప్లయితొలగించండిదేవ దానవ మానవ జీవ తతుల
కలుషములఁ బాపు గంగయే గరళమయ్యె
పాపచయముల పాలిట పావనాంగి.
ఈనాటి సమస్యకు పూరణలు భావ వైవిధ్యముతో నలరారుచున్నవి. పూరణలు పంపుచున్న మిత్రులు శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారికి, సోదరి శ్రీమతి నేదునూరి రాజేశ్వరి గారికి, మనుమడు అష్టావధాని చి. రాంభట్లకి, తమ్ముడు చి. డా. నరసింహమూర్తికి, శ్రీ రాజారావు గారికి, శ్రీమతి మందాకిని గారికి మరియు ఎంతో ఉత్సాహము చూపుచున్న శ్రీమతి జిలేబి గారికి, అందరికీ పేరు పేరునా శుభాభినందనలు. స్వస్తి.
రిప్లయితొలగించండినరసింహ మూర్తి గారూ..! మీ వివరణకు ధన్యవాదములు.. చాలరోజుల తర్వాత మీ వచోవీచికాశీతలత్వం అనుభవైక వేద్యం అయింది. పునః పునః ధన్యావదములు
రిప్లయితొలగించండితాతగారి వివరణం కూడా ఇప్పుడే చూశాను. త్వరలోనే జిలేబిగారు కూడా పద్యగృహప్రవేశం చేసి చందస్సౌధంలో అలరారుతారని ఆశిస్తున్నాను.
రిప్లయితొలగించండిఇక...అందరి పూరణలూ అలరిస్తున్నాయి.
డా|| నరసింహమూర్తి గారి పూరణ రమ్యంగా ఉంది.వసువుల శాపవృత్తాంతం వివరించారు. స్వస్తి
నాడు గరళమ్ము ద్రావితి నంచు నీశ !
రిప్లయితొలగించండిగొప్ప జెప్పకు , నేడు నీ కూర్మి సఖియ
కలుషములు బాపు గంగ యే గరళమయ్యె ,
పావనము జేయ రావయ్య జీవనమ్ము
రాంభట్ల వారు,
రిప్లయితొలగించండిమొదట్లో తాత పాదులు ఇలాగే నన్ను ప్రోత్సహించి చూసారు ఈ జిలేబీ బుర్ర కి ఛందస్సు అందుతుందేమో నని. ఊ హూ. ఈ మట్టి బుర్రకి అది అందలే! వారు ప్రయత్నం విరమించేశారు జిలేబీ తంటా పడ లేక !
ధన్యవాదాలు మీ ప్రోత్సాహానికి !
చీర్స్
జిలేబి.
కలుషములన్ని బాపునది గంగ; విషమ్మన దోషమంటదా?
రిప్లయితొలగించండిగలగల మంచు పారుచును కల్మిని పెంచుచు జీవనమ్ములో
నలసట లేక దేశమున కాకలి తీర్చుచు నున్న తీరునన్,
జలములు జీవజంతువుల సంపదలేనని, కాచుచుండుమా.
మూర్తి మిత్రుని పూరణ ముచ్చటాయె
రిప్లయితొలగించండికాని నేనొప్ప నాగంగ గరళ మనిన
కన్న బిడ్దల నీటిలో కలుపునపుడు
తల్లి హృదయమ్ము తానెంతొ తల్లడిల్లు.
శాప వశమున పృథ్విలో జన్మ గలుగ
నల్ల వసువుల శాపమ్ము లపుడె దీర
గర్భ శోకమ్ము కడుపును కాల్చు చుండ
గంగ పాల్జేసె బిడ్దల కన్న తల్లి.
జిలేబి గారూ...
రిప్లయితొలగించండికాదు పద్యమ్ము వ్రాయుటే ఘనత - కవికి
భావ పటిమయే ప్రతిభకు పట్టు గొమ్మ
శ్రీ జిలేబికి కారాదు చేవ లేని
ఛందముల చట్రముల్ భావ బంధనములు
నవనవోన్మేష శాలిని నచ్చ దిచట
ప్రజలు మాటాడు భాష చేపట్ట రిచట
పదము వ్యాకరణపు కత్తి పాటుకు తెగి
భావమును కోలు పోవు – ఈ పాట్లు వలదు
శ్రీమతి జిలేబి గారి భావమునకు నా పద్య రూపం...
రిప్లయితొలగించండికలుష హరుడను నేనంచు గరళ కంఠ
వట్టి గొప్పలు చెప్పకు వసుధ యందు
కలుషములు బాపు గంగయే గరళమయ్యె
పావనమ్ముగ చేయుమో పార్వతీశ.
కలియుగమ్మునందు,విషసంకలితమైన
రిప్లయితొలగించండిమురికి నీరును ,వ్యర్య్హమ్ములొరసి జలము
లందు గలియుచు నుండంగ ,నమర తటిని
కలుషముల బాపు గంగయే గరళమాయె .
-----------------------
"చేవలేని చట్రమంచు" ఛీత్కరించి ఛందమున్
రిప్లయితొలగించండిభావమొక్కటే ప్రమాణ బద్ధమంచునెంచుచో
ధీవిశాలురైన పాండితీవిరాజమాన రాట్!
"రావువర్యు"లేలవ్రాసె లక్షణ ప్రయుక్తతన్!?!
శ్రీ రాంభట్ల పార్వతీశ శర్మ గారూ ధన్యవాదములు. మీరు దినదిన ప్రవర్ధమానులై కవిలోకములో విరాజిల్లాలనే మా అందఱి ఆకాంక్ష. మీ రా బాటలో నున్నారన్నది ప్రస్ఫుటము.
రిప్లయితొలగించండినా పూరణకు మిత్రుల నుండి స్పందన వస్తుందని నాకు తెలుసు. అన్నగారి బాధ్యతను మిస్సన్న గారు గైకొన్నారు. మిత్రమా !ధన్యవాదములు. గంగమ్మను పల్లెత్తు మాట పడనీయరు గదా ! సరే కొద్దిగా మారుస్తాను.
శాప వశమున పృథ్విలో జన్మ గలుగ
నల్ల వసువుల యాయువు లపుడె దీఱె
తల్లడిల్లుచు గంగలో తల్లి దింప
కలుషములు బాపు గంగయే గరళ మయ్యె.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
ప్రస్తుతం గంగానది పరిస్థితి :
01)
_____________________________________________
కమలనాభుని పాదాల - కలిగి కదలి
ఖతల మందున విహరించు - కలుష హారి
కలుష జన్ముల , కలియుగ - కాల మహిమ
కడలి గర్భాన చివరకు - కలియు వరకు
కలుషములఁ బాపు గంగయే - గరళ మయ్యె !
_____________________________________________
కలుగు = పుట్టు
ఖతలము = ఆకాశము
నా రెండవ పద్యములో దోషమంటదా కన్నా దోషమౌనురా ఉచితంగా ఉంటుందేమో అని నా భావన.
రిప్లయితొలగించండిమిస్సన్న గారు, మూర్తిగారు చేసిన పూరణల్లో చర్చ ఆసక్తి దాయకంగా ఉన్నది.
కన్నవారల నీటిలో గంగ విడుట
కన్న హృదయపు వేదన గంగ దగుట
కఠిన మా నీ మనమని లోకమ్ములనుట
ఘనుడగు విధాత లిఖితము కనగ నెల్ల.
విధి విధానమ్ము సకలమ్ము వేల్పు కైన
రిప్లయితొలగించండితల్లి కైనను తనుగన్న తనయు కైన
ననుచు వచియించి గంగమ్మ ననునయించు
మీకు మందాకినీ! గంగ శ్రీల నిడుత.
మిస్సన్న గారు,
రిప్లయితొలగించండిధన్యురాలను.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిచక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
జిలేబీ గారి భావానికి అందమైన పద్యరూపం ఇచ్చారు. ధన్యవాదాలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
కాకుంటే మూడవ పాదంలో "గంగమ్మ" అన్నది పునరుక్తి అవుతున్నది.
*
"అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
కలుషితమౌతున్న గంగపట్ల ఆవేదన నిండిన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
ఉత్తమమైన పూరణ నందించారు. ధన్యవాదాలు.
*
జిలేబీ గారూ,
మంచి భావాన్ని అందించారు. అభినందనలు.
మీ భావాన్ని గోలి వారు, లక్కాకుల వారు ఛందోబద్ధం చేసారు. అదృష్టవంతులు!
*
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
వసువుల ప్రస్తావనతో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
లక్కాకుల వెంకట రాజారావు గారూ,
సవతిని గరళంగా భావించడం చక్కని భావన. చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
మీ రెండవ పూరణ కూడా బాగుంది.
*
మందాకిని గారూ,
కందంలో మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
గంగా ప్రాశస్త్యాన్ని వివరించిన మీ వృత్తం మనోహరంగా ఉంది. ధన్యవాదాలు.
*
మిస్సన్న గారూ,
చక్కని పూరణ. అభినందనలు.
మూర్తి మిత్రుని సంబోధించిన మీ పద్యాలకు ధన్యవాదాలు. మీ సూచనను పాటించి వారు సవరణ చేసారు. గమనించారు కదా!
*
కమనీయం గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
వసంత కిశోర్ గారూ,
బాగుంది మీ పూరణ అభినందనలు.
సవరించిన పద్యం:
రిప్లయితొలగించండివిధి విధానమ్ము సకలమ్ము వేల్పు కైన
తల్లి కైనను తనుగన్న తనయు కైన
ననుచు వచియించి గంగమ్మ ననునయించి
చెప్పు మందాకినికి గంగ శ్రీల నిడుత.
గురువుగారు,
రిప్లయితొలగించండిధన్యురాలను.
నిజానికి గంగ సప్త వసువులను గంగలో ముంచి వారికి శాప విమోచన మొనరించుట నూతిలో పడిన శిశువులను బయటకు తీయడముతో సమానము. గంగ లేకుండా ప్రాణికోటి లేదు. మన శరీరములో 50 శాతము జలమే ! మనమెంత కాలుష్యము చేసినా ' జలచక్రముతో ' ( వర్షము - నదులు - అంబుధి - మేఘము - వర్షము ) నీరు సదా శుధ్ధి పొందుతునే ఉంటుంది. మరో విషయమేమిటంటే యీ భూగోళములొ ఉండే జల పరిమాణము ఎల్ల వేళల స్థిరము. దానికి మార్పు లేదు. అలాగే మన మీ దినము పీల్చిన గాలినే యిదివరలో మన పూర్వులు ( రాముడు కృష్ణుడు నన్నయ తిక్కన )కూడా పీల్చి వదిలేరు. శాస్త్ర విజ్ఞానానికి సనాతన ధర్మ ప్రబోధాలకు అవినాభావ సంబంధము గోచరిస్తుంది. యంత్ర విజ్ఞానులు శ్రీ వసంత కిశోర్ గారు యీ విషయాలు యింకా బాగా చెప్పగలరు.
రిప్లయితొలగించండిశ్రీ లక్కకుల వారు, గోలీవారు,
రిప్లయితొలగించండినమో నమః! ధన్యవాదాలు ఆ హృద్య పద్య చందారవిందములకు!
జిలేబి.
ప్రాణ హానిని జేయును వడిని మునుగ
రిప్లయితొలగించండికలుషముల బాపు గంగయే , గరళ మయ్యె
మత్తుమందును గలిపిన బర్రి పాలు
పాలు త్రాగెడు పిల్లల పాట్లు గనుము