కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది -
మిన్ను విఱిగి మీఁదఁ బడిన మిన్నకుండె.
ఈ సమస్యను సూచించిన వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.
ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది -
మిన్ను విఱిగి మీఁదఁ బడిన మిన్నకుండె.
ఈ సమస్యను సూచించిన వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిపన్నులను పెంచుచుండెను ప్రభుత చూడ
భారములు మ్రోయ తప్పదు ప్రజల నేడు
అధిక భారముల్ మ్రోసిన యనుభవమున
మిన్ను విఱిగి మీఁదఁ బడిన మిన్నకుండె.
మిన్ను విఱిగి మీద పడిననూ ....అన్న అర్థం ఇవ్వాలంటే పడిన శబ్దం సరిపోతుందా, పడియు / పడిననూ అనే ఉండాలేమో.
రిప్లయితొలగించండిఉత్సాహ:
రిప్లయితొలగించండివెన్నుడేగుదెంచ నొక్కవిప్ర వామనాకృతిన్
సన్నయముగ పాదపూజ సలిపి బలి యొసంగె తా
నన్న రీతి మూడు పదములగు స్థలమ్మునున్ ధృతిన్
మిన్ను విరిగి మీద పడిన మిన్నకుండె సన్మతిన్
మిన్ను విఱిగి బడిన నేమి మిన్నకుండు సరిగ్గా ఉంటుందేమో నని నా అభిప్రాయము.
రిప్లయితొలగించండిలోకహితవు గోరి క్రతువులు సలిపించు
పెద్దమనసున్న మనుజుడు పృథ్వి యందు
బెదరి పోక స్థిరత నిల్చు; భీతి మఱిచి
మిన్ను విఱిగి మీఁదఁ బడిన మిన్నకుండె./మిన్ను విఱిగి బడిన నేమి మిన్నకుండు.
కుంభ వృష్టి విడువకను కుఱిసె నయ్యొ
రిప్లయితొలగించండికాచుచుందును మిమ్ముల కదిలి రండు
గొల్లలార యనుచు నిల్చె గోపకుడిగ.
మిన్ను విఱిగి మీఁదఁ బడిన మిన్నకుండె.
మిన్ను విరిగి మీద బడిన , మిన్న కుండె
రిప్లయితొలగించండిడు మనుజులు , జీవితము లోన తమకు గల్గు
నెన్ని యాటంకముల నైన నిబ్బరముగ
నిల్చి యెదిరించి గెలువంగ నేర్తు రవని
ఇంటి లోకప్పు నమరించె మింటి వోలె
రిప్లయితొలగించండినట్టు వదులై పడెను క్రింద నడిమి యట్ట
అట్ట యగుట చేత నెవరికి హాని లేదు
మిన్ను విఱిగి మీఁదఁ బడిన మిన్నకుండె!!
మిత్రులారా!
రిప్లయితొలగించండిఈ నాటి సమస్య ఒకింత క్లిష్టముగానె యున్నది. వచ్చిన నలుగురి పూరణలు మంచి భావములతోనే అలరారుచున్నవి. శ్రీ శ్రీపతి శాస్త్రి గారికి, శ్రీమతి మందాకిని గారికి, శ్రీ రాజారావు గారికి శ్రి జిగురు సత్యనరాయణ గారికి ప్రత్యేకమైన అభినందనలు. స్వస్తి.
క్లిష్టత లేదని నాకనిపించింది.
రిప్లయితొలగించండిక్లిష్టత ఉంటేనే ఛాలెంజింగ్ గా ఉంటుంది కదా!
చిన్నవాడైన ప్రహ్లాదు చీదరించి
తండ్రి దండించె నన్నివిధముల నాడు
భక్తి పూనిక విడువక, పాపడైన
మిన్ను విఱిగి మీఁదఁ బడిన మిన్నకుండె!!
తనను చంపవచ్చిన యట్టి దానవులను
బాలుడైన కృష్ణుడు దానె పట్టి చంపి,
పిల్లవాండ్రయందు కలిసె పిల్లడగుచు
మిన్ను విఱిగి మీద బడిన మిన్నకుండె.
రాజ్యమేలుమన్నపుడును, రాజ్యమిపుడు
లేదు నీకని పంపిన లీల జరుగు
వేళ లను మిన్నకుండెను వీరుడతడు
మిన్నువిఱిగి మీద బడిన మిన్నకుండె.
(రాముడు)
నింగి నగములు భీతిగ క్రుంగె గాన
రిప్లయితొలగించండికష్ట నష్టము లందున కడలి వోలె
భరత ఖండపు నెలతలు భాగ్య మతులు
మిన్ను విఱిగి మీఁదఁబడిన మిన్న కుండె !
ఎన్నొ విధముల ప్రహ్లాదు ఉసురు తీయ
రిప్లయితొలగించండితండ్రి దలపగ పగ నేమి దలప లేదు
హరిని దలచిన తనకేమి హాని యనుచు
మిన్ను విఱిగి మీఁదఁ బడిన మిన్నకుండె.
పొరుగు దేశము వారలు పొంచి యుండి
రిప్లయితొలగించండివీలుగొనియాక్రమింపగ వేదభువిని
పరక మొలవని చోటని పలికి పొల్లు
మిన్ను విఱిగి మీఁదఁ బడిన మిన్నకుండె.
ఇంకా నా నెట్ సమస్య తీరలేదు. అందువల్ల వెంటవెంట ప్రతిస్పందించలేక పోతున్నాను. మిత్రులు మన్నించాలి.
రిప్లయితొలగించండి*
శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
మందాకిని గారూ,
`మీద పడిన" అంటే `మీద పడితే' అనే అర్థమే. మీద పడిననూ అనే అర్థం రావాలంటే `పైఁ బడినను" అనవలసి ఉంటుంది.
మీ ఐదు పూరణలూ చక్కగా ఉన్నాయి. అభినందనలు. వసంత కిశోర్ గారి బాట పట్టారు!
*
అవునూ.... ఈ మధ్య వసంత కిశోర్ గారి జాడ లేదు? వారి ఆరోగ్యం ఎలా ఉందో? మిత్రులెవరైనా వారిని సంప్రదించండి. వారి ఫోన్ నంబర్ లేదు. మెయిల్స్ చూచే అలవాటు లేదన్నారు.
*
పండిత నేమాని వారూ,
ఈ సమస్యను ఉత్సాహ చ్ఛందంలో ఎవరో ఒకరు తప్పక పూరిస్తారని ఊహించాను. ఎవరూ పూరించకుంటే ఆ పని నేనే చేద్దామనుకున్నా. నాకు శ్రమ తగ్గించారు.
మనోహరమైన పూరణ మీది. ధన్యవాదాలు.
*
లక్కాకుల వెంకట రాజారావు గారూ,
చక్కని నీతిపద్యంలా ఉంది మీ పూరణ. చాలా బాగుంది. అభినందనలు.
*
జిగురు సత్యనారాయణ గారూ,
చమత్కారంగా పూరణ చేయటంలో మీకు మెరే సాటి. బాగుంది. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
స్త్రీల సహన శీలాన్ని చక్కగా వివరించారు మీ పూరణలో. బాగుంది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
ప్రహ్లాదుని ప్రస్తావనతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
*
ఊకదంపుడు గారూ,
చైనా ఆక్రమిచిన భూభాగాన్ని గురించి మన నాయకులు చేసిన వ్యాఖ్యను ప్రస్తావిస్తూ చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిత్రుల పూరణ లద్భుతము. జడభరతుడు నాకు గుర్తుకి వచ్చాడు.
రిప్లయితొలగించండివృషల పతి యాన గైకొని భృత్యు లంత
భరతుఁ గొనిపోయి కాళికి బలి యొసంగ
ఖడ్గ మెత్తగ నాతండు కదలడె యట
మిన్ను విఱిగి మీదఁ బడిన మిన్న కుండె.
హనుమఛ్ఛాస్త్రి గారూ ! మీ పద్యము చాలా బాగుంది. మొదటి పాదములో యతి ?
రిప్లయితొలగించండిశంకరార్యా ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమూర్తి గారూ ! కొంగ్రొత్త పూరణ బాగుంది.
ధన్యవాదములు.నా పూరణ సవరణ తో...
చాల విధముల ప్రహ్లాదు చంపు టకును
తండ్రి దలపగ పగ నేమి దలప లేదు
హరిని దలచిన తనకేమి హాని యనుచు
మిన్ను విఱిగి మీఁదఁ బడిన మిన్నకుండె.