15, ఫిబ్రవరి 2012, బుధవారం

శ్రీ రాంభట్ల వారి అవధానం - 2

శ్రీ రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారి అష్టావధానం
12-02-2012 వ తేదీ సాయంత్రం
విశాఖపట్నం లలితానగర్ శ్రీ లలితాపీఠంలో
కవి పండిత రంజకంగా జరిగింది.
(రెండవ భాగం)

నాలుగవ అంశం:
నిషిద్ధాక్షరి: హైందవ సంస్కృతీ పరిరక్షణ

అవధాని గారి పద్యం:
గీతా సహభావంబున్
ప్రాతంచున్ వాడికూత పాడియు గాదే
భూతల మందున గాంచిన
నాతత శ్రీ కృష్ణు బోధననుసరణంబే.

అయిదవ అంశం:
న్యస్తాక్షరి - శ్రీమన్నారాయణుని వర్ణన
నిబంధనలు:
1) మొదటి పాదం 9 వ అక్షరం ' కో ' అయి ఉండాలి.
2) రెండవ పాదంలో 14 వ అక్షరం ' ద్భా ' అయి ఉండాలి.
3) మూడవ పాదంలో 14 వ అక్షరం ' oధ ' అయి ఉండాలి.
4) నాల్గవ పాదంలో 14 వ అక్షరం ' క్ష్మీ ' అయి ఉండాలి.
5) మత్తేభ వృత్తం అయి ఉండాలి.

అవధాని గారి పద్యం:
పద సీమన్ తనరారు కోమలికి సత్పక్షంబుగన్ వక్షమున్
పదునౌ తీరున ప్రేమ మీఱగను సద్భావంబు నందుంచి తా-
నదురింతైనను లేక యుండె శుభ బం శ్రేణిగా దెల్పి తా-
మెద నుండుంగద భక్తయూధముల లక్ష్మీ నాథులట్లున్ సదా.

ఆరవ అంశం:
ఆశువు 1 ) అవధాన సభ వర్ణన.


కవులకు నెలవై నట్టిది
నవలా శ్రీ లలిత యిచట నవ్య స్థితిలో
భువి జనులను కాపాడుచు
నవ కవితలు వెలయజేయు నాకం బిదియే.


2 ) విశాఖపట్టణ వర్ణన
వైశాఖేశ్వరు పుణ్యసీమ విలసద్వారాశి దివ్యాభయ
శ్రీ శీర్షంబయి తేజరిల్లు పురమై చిద్రూపిణీ వాసమై
రాశీభూత కళా విరాజిత సుపర్వారామమై సాహితీ
దేశంబయ్యె విశాఖపట్టణము దేదీప్యంబుగా నొప్పుచున్.


ఏడవఅంశం :
ఘంటా నాదం: లెక్క సరిగా సరిపోయింది.


ఎనిమిదవ అంశం:
అప్రస్తుత ప్రసంగం: అవధాని ప్రతి ఆటంకానికీ చిరునవ్వుతో స్పందించారు.


**************** అష్టావధానం సమాప్తం. *****************
అవధాన విశేషాలను పంపించిన ‘మిస్సన్న’ గారికి ధన్యవాదాలు.

5 కామెంట్‌లు:

  1. శ్రీ శంకరయ్య గారు,

    అప్రస్తుత ప్రసంగం వివరాలు తెలియ జేయ గలరు. నవ్వుల పువ్వుల ని వదిలివేస్తే ఎలాగు ?(అది ఒక్కటే అర్థం అయ్యే వాళ్ళం ఇక్కడ ఉన్నాం !) దయ చేసి వాటి వివరాలు కూడా తెలుపగలరు (స్నిప్పెట్స్)

    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి
  2. గురువుగారు
    అవధాన ప్రక్రియను చాలా చక్కగా వివరించారు, మిస్సన్న గారికి మీకు ధన్యవాదములు
    నాలుగవ అంశం నిషిద్ధాక్షరి అర్థంకాలేదు.
    మీ శిశ్యుడు
    వరప్రసాదు

    రిప్లయితొలగించండి
  3. అవధానిగారికి అభినందనలు. చక్కని పద్యములతో అవధాన విశేషములనందిచిన గురువర్యులు శ్రీచింతా రామకృష్ణారావుగారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  4. అవధాని శ్రీ పార్వతీశ్వర శర్మగారికి అభినందనలు. అవధాన విశేషములను అందించిన శ్రీ మిస్సన్నగారికి, శ్రీ శంకరయ్య గారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి