12, ఫిబ్రవరి 2012, ఆదివారం

సమస్యాపూరణం - 620 (జనకుని జంపి దాశరథి)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది -

జనకుని జంపి దాశరథి జానకిఁ దెచ్చెను శౌర్యమూర్తియై.

29 కామెంట్‌లు:

  1. తన సతి, తమ్ముతోడ పిన తల్లియె తండ్రిని కోరి నంతనే
    వనముల కేగి యచ్చట నివాసము జేయుచు నుండ మాయతో
    జనకజ నెత్తుకెళ్ళిన దశానను దైనటు వంటి ఇంద్రజిత్
    జనకుని జంపి దాశరథి జానకిఁ దెచ్చెను శౌర్యమూర్తియై.

    రిప్లయితొలగించండి
  2. చిన్న సవరణ తో...

    తన సతి, తమ్ముతోడ పిన తల్లియె తండ్రిని కోరి నంతనే
    వనముల కేగి యచ్చట నివాసము జేయుచు నుండ మాయతో
    జనకజ లంక జేర్చిన దశానను డైనటు వంటి ఇంద్రజిత్
    జనకుని జంపి దాశరథి జానకిఁ దెచ్చెను శౌర్యమూర్తియై.

    రిప్లయితొలగించండి
  3. కవిమిత్రులారా,
    ‘ఆంధ్రామృతం’ బ్లాగులో శ్రీ చింతా రామకృష్ణారావు గారు అవధాన ప్రక్రియను గురించి విలువైన సమాచారం ఇచ్చారు. అందరూ చదవవలసిందిగా మనవి.
    దాని లింకు ...
    http://andhraamrutham.blogspot.in/2012/02/blog-post_11.html

    రిప్లయితొలగించండి
  4. వనచరు లంత వార్నిధికి వంతెన కట్టిరి లంక కేగి యా
    ఘనుడగు రావణాసురుని కన్నుల ముందరె సోకుమూకలన్
    దునిమిరి దుష్టు దుండగుని తుచ్ఛుని యా పరకాంతచింతనా
    జనకుని జంపి దాశరథి జానకిఁ దెచ్చెను శౌర్యమూర్తియై.

    రిప్లయితొలగించండి
  5. శ్రీగురుభ్యోనమ:

    వినయవివేక భూషణుడు వీరుడు శూరుడు శత్రుభీకరుం
    డనిలకుమార వాహనుడు నాకసవీధిన లంక జేరి యా
    దినకరు దివ్యమంత్రమున తేజము గల్గగ మేఘనాథునిన్
    జనకుని జంపి, దాశరథి జానకిఁ దెచ్చెను శౌర్యమూర్తియై.

    రిప్లయితొలగించండి
  6. ఇనకుల మందు బుట్టి యొకటే శర మొక్కటె మాట తీరు రా
    ముని దను సత్య శౌర్యములు పూనియు సీతను లోక పావనిన్
    ఘనముగ బెండ్లి యాడియును కష్టము దప్పెన ? పూని యింద్రజిత్
    జనకుని జంపి దాశరధి జానకి దెచ్చెను శౌర్య మూర్తియై

    రిప్లయితొలగించండి
  7. తనయుని ధర్మమిద్ది యని ధాత్రిని చాటిన రామచంద్రుడే
    జనకుని వంశమందునిల జాతగ బుట్టిన సీత భర్తగా
    ఘనతను పోరుసల్పి దశకంఠుని, నింద్రుని గెల్చు వానికే
    జనకుని, జంపి దాశరథి జానకిఁ దెచ్చెను శౌర్యమూర్తియై.

    రిప్లయితొలగించండి
  8. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    ________________________________________________

    జనులకు మేలు సేయ,ఘన - జజ్జర గాళ్ళను చంపె నాతడే !
    జనపద మందు జానకిని - జాజర జేసిన కూటవృత్తునిన్
    జన భయ కారకున్,జగతి - జాడ్యమునౌ,పరదార కామనా
    జనకుని జంపి, దాశరథి - జానకి దెచ్చెను శౌర్య మూర్తియై !
    ________________________________________________

    రిప్లయితొలగించండి
  9. 02)
    ________________________________________________

    జన శ్రుత ధూర్త రావణుడు ! - ఙ్ఞాన విహీనుడు ! చావు కోసమే
    జనకుని కూతునిన్ , పరమ - సాధ్విని , సీతను మ్రుచ్చిలించుటన్
    జనహిత మప్రియున్ , మిగుల - జాణడు నౌ , పర కాంత మోహనా
    జనకుని జంపి, దాశరథి - జానకి దెచ్చెను శౌర్య మూర్తియై !
    ________________________________________________
    జన శ్రుత/జనులకు
    జాణడు = విలాసవంతుడు

    రిప్లయితొలగించండి
  10. 03)
    ________________________________________________

    జనకుడు మేఘనాథునకు ! - జహ్నము లెన్నియొ జేసె నాతడే !
    జనులకు వేదనాకరుడు ! - జాతికి నాశము దెచ్చు వాడదే !
    జననము నొందె నీ భువిని - జన్మల కర్మము ! జంబుమాలికిన్
    జనకుని జంపి, దాశరథి - జానకి దెచ్చెను శౌర్య మూర్తియై !
    ________________________________________________
    జనకుడు = తండ్రి( ప్రభువు)

    రిప్లయితొలగించండి
  11. 03)

  12. ఈ సరికే రెండు అష్టావధాన కార్యక్రమాలు జయప్రదంగా ముగిసి ఉంటాయి.

    రిప్లయితొలగించండి
  13. 04)
    ________________________________________________

    జనహిత మాత్రుడే యగుచు - జాతికి మేలును గూర్చు కోసమే
    జనమదె జంకుచున్ గనెడి - జజ్జర గాడగు రావణాసురున్
    జని యగు,జానకీ హరణు; - జాణగు నాతని,రాక్షసాధమా
    జనకుని జంపి, దాశరథి - జానకి దెచ్చెను శౌర్య మూర్తియై !
    ________________________________________________
    జాణ = వ్యభిచారి
    జని = ఆఁడుది = పెండ్లాము

    రిప్లయితొలగించండి
  14. 03అ)
    ________________________________________________

    జనకుడు మేఘనాథునకు ! - జన్నము లెన్నియొ జేసె నాతడే !
    జనులకు వేదనాకరుడు ! - జాతికి నాశము దెచ్చు వాడదే !
    జననము నొందె నీ భువిని - జన్మల కర్మము ! జంబుమాలికిన్
    జనకుని జంపి, దాశరథి - జానకి దెచ్చెను శౌర్య మూర్తియై !
    ________________________________________________
    జనకుడు = తండ్రి( ప్రభువు)

    రిప్లయితొలగించండి
  15. మందాకినిగారూ ! హైదరాబాదు లోనేగా మీరుండేది ?
    మరి అష్టావధానానికి వెళ్ళలేదా ?

    రిప్లయితొలగించండి
  16. భలేవారండీ, నేను అక్కడ ఉంటానని ఎప్పుడు చెప్పాను? ఉంటే ఈ వ్యాఖ్య ఎందుకు పెడతాను? అష్టావధానం వివరాలతో వ్యాఖ్య పెట్టేదాన్నేమో.

    రిప్లయితొలగించండి
  17. భలేవారండీ, నేను అక్కడ ఉంటానని ఎప్పుడు చెప్పాను? ఉంటే ఈ వ్యాఖ్య ఎందుకు పెడతాను? అష్టావధానం వివరాలతో వ్యాఖ్య పెట్టేదాన్నేమో.

    రిప్లయితొలగించండి
  18. ఔను ! భారతదేశం కదూ మీ రుండేది !
    నేను హైదరాబాదనుకున్నా !

    రిప్లయితొలగించండి
  19. విశాఖపట్టణం అవధానానికి నేను వెళ్ళేను.
    చిరంజీవి రాంభట్ల పార్వతీశ్వర శర్మ అద్భుతంగా
    గంటన్నర లోపే అవధానాన్ని పూర్తీ చేసి కవి పండితుల
    మన్ననల నందుకొన్నాడు.

    రాంభట్లను నేనెంచితి
    డింభకుడని కాదతండు డెందము తానా
    రంభించినదే దోచెను
    పుంభావ సరస్వతి యన మోదము గూర్చెన్

    రిప్లయితొలగించండి
  20. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    చక్కని ధారతో సాఫీగా సాగింది మీ పూరణ. చాలా బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ వృత్తం పరులుగు పెట్టింది. చక్కని నడక. పూరణ బాగుంది. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మనోహరంగా ఉంది మీ వృత్త రచన. చక్కని పూరణ. అభినందనలు.
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    హృద్యమైన వృత్తం. పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    మందాకిని గారూ,
    చక్కని నడకతో సాగింది మీ వృత్తం. చక్కని పూరణ. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ నాలుగు పూరణలూ వృత్తరచనలో మీ ప్రావీణ్యాన్ని తెలియజేస్తున్నాయి. చక్కని పూరణలు. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    అదృష్టవంతులు!
    ఆ అవధాన విశేషాలను కూడా వివరిస్తే బాగుండేది.

    రిప్లయితొలగించండి
  21. ధనసు నువంచి రాజుల మదంబు నడంచి పరాక్ర మంబునన్
    జనకు నికూతు రైనజ లజాక్షి నిసీత నువీడ కుండగన్
    వనము లయందు గ్రమ్మరు చువార ధిదాటి జయించి నింద్రజిత్
    జనకు నిజంపి దాశర ధిజాన కిదెచ్చె నుశౌర్య మూర్తియై
    ------------------------------------------------------------------------
    క్షమిం చాలి .చాలా తప్పులు ఉంటాయి . ఊరికే ఒక ప్రయత్నం.

    రిప్లయితొలగించండి
  22. రాజేశ్వరి అక్కయ్యా,
    ఎట్లా క్షమించను? ఇంత చక్కని ధారతో వృత్తాన్ని వ్రాసి సవరించడానికి నాకు అవకాశం ఇవ్వలేదు కదా! :-)
    చాలా బాగుంది. అభినందనలు.
    కాకుంటే మీరు పద్యాన్ని గణాలవారీగా కాకుండా పదాల వారీగ టైపు చేయవలసింది. అలాగే ‘ధనుసును’ ను ‘ధనువును’ అంటే బాగుంటుంది. మీ పద్యాన్ని ఇలా టైపు చేయవలసింది.

    ధనవును వంచి రాజుల మదంబు నడంచి పరాక్రమంబునన్
    జనకునికూతురైన జలజాక్షిని సీతను వీడకుండగన్
    వనములయందు గ్రమ్మరుచు వారధి దాటి జయించి నింద్రజిత్
    జనకుని జంపి దాశరధి జానకి దెచ్చెను శౌర్యమూర్తియై.

    రిప్లయితొలగించండి
  23. ధన్య వాదములు తమ్ముడూ !
    కొత్తకదా ! అందుకని " గణాలు తెలియడం కోసం అలా టైప్ " చేస్తున్నాను. ఇకనుంచి కలిపి వ్రాస్తాను సరేనా ? మరీ మరీ ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  24. అక్కాయ్ ! అద్భుతం ! చాలా చక్కగా నున్నది !
    గురువుగారి కింక పనేముంది ?

    రిప్లయితొలగించండి
  25. ధన్య వాదములు కిషోర్ గారూ ! మీ అందరి ప్రోత్సాహము , గురువు గారి సహనము , నాచేత వ్రాయిస్తున్నాయి. మీ అందరికీ కృతజ్ఞతలు

    రిప్లయితొలగించండి
  26. గణగణ మ్రోగు గంటలను గండరు గండులు చూచుచుండగా
    వణకగ కాళ్ళు చేతులును భారత దేశపు రాజధానినిన్
    రణమున రామలీలనట రంగుల పూసిన మేఘనాదునిన్
    జనకుని జంపి దాశరథి జానకిఁ దెచ్చెను శౌర్యమూర్తియై :)

    రిప్లయితొలగించండి