కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది
గణ యతి ప్రాసలే లేని కైత మేలు.
కవిమిత్రులారా,
ఏం జరిగిందో అర్థం కావడం లేదు. ‘వ్యాఖ్యను పోస్ట్ చేయండి’ అనే సూచన కూడా మాయమయింది. అది ఉంటేనే మీరు మీ వ్యాఖ్యలను పంపగలరు. ప్రస్తుతానికి మీ పూరణలను, వ్యాఖ్యలను క్రింది చిరునామాకు మెయిల్ చేయండి.
shankarkandi@gmail.com
గన్నవరపు నరసింహ మూర్తి గారి పూరణలు ...
రసము లూరుచు జెప్పెడి రమ్య కవిత
మనము నాహ్లాద పరచెడి మల్లె మొగ్గ
సరస లాలిత్య సంపద కొఱత గంటె
గణ యతి ప్రాసలే లేని కైత మేలు !
భావ విభవమె ప్రాణము పద్యములకు
గణము యతి ప్రాస లొప్పును గమనమునకు
ప్రాణమే లేని మరబొమ్మ పలుకు కంటె
గణ యతి ప్రాసలే లేని కైత మేలు !
వసంత కిశోర్ గారి పూరణ ...
గణ యతి ప్రాసలే లేని - కైత, మేలు
గద్య మగుగాని , జగతిని - కైత గాదు !
గణ యతిప్రాస లెగ మేలు - కైత కెపుడు
గణ గణ మని చదువుకొన - గలుగుటకును !
లక్కాకుల వెంకట రాజారావు గారి పూరణ ...
ఘనము పద్యమునకు గణ యతి ప్రాసలే,
లేని కైత-మేలు లేని కైత,
వచన కవిత యనగ వర్ధిల్లు చున్నది
దేని గొప్పదనము దానిది మరి !
గోలి హనుమచ్ఛాస్త్రి గారి పూరణ ...
పద్య మన్నది వ్రాయంగ భయ మననెడి
ద్రాక్ష పండైన నమలగ దవడ లేని
చంటి వారికి పాల సీసాల వంటి
గణ యతి ప్రాసలే లేని కైత మేలు.
సంపత్ కుమార్ శాస్త్రి గారి పూరణ ...
బుధులు మెచ్చనలంకారభూషితమగు
ప్రౌఢమత్తేభ శార్దూల స్రగ్ధరలును,
సర్వజనసమ్మతమునొంద నుర్వియందు
గణయతిప్రాసలే లేని కైత - మేలు.
పండిత నేమాని వారి పూరణ ....
గణ యతి ప్రాసలే లేని కైత మేలు
వ్యాకరణ మేదియును లేని భాష మేలు
నీతి సంస్కృతియు లేని జాతి మేలు
మేలు మేలను టేలనో చాలు చాలు
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
01)
___________________________________
గణ యతి ప్రాసలే లేని - కైత; మేలు
గద్య మగుగాని , జగతిని - కైత గాదు !
గణ యతిప్రాస లెగ మేలు - కైత కెపుడు
గణ గణ మని చదువుకొన - గలుగుటకును !
___________________________________
Internet Explorer లో ప్రయత్నించండి. పోస్టుకు క్రిందనే డబ్బా కనిపిస్తుంది.
రిప్లయితొలగించండిరవిగారూ ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిIE లో కూడా కనుపించకున్నది !
పద్యరచనలు గావించు పటిమ గలిగి
రిప్లయితొలగించండిభావవల్లరి మదిలోన పరిమళించు
కవుల కెపుడును కొత్త వ్యాకరణ గతుల
గణ యతి ప్రాసలే లేని కైత మేలు .
కొత్తపుంతలంటూ కనిపెట్టిన కొన్ని రకాల ఛందోరీతుల గురించి......
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండికవిత లల్లగ మదినెంచి కలము బట్టి
రిప్లయితొలగించండియతులు ప్రాసలు వలదంచు మతులు బోవ
వచన కవితలు వ్రాయచ్చు భాసు రముగ
గణ యతి ప్రాసలే లేని కైత మేలు.
కవుల మదిలోని భావాలు కలత పడగ
రిప్లయితొలగించండిచంద మేలేని పద్యమున కంద మేది
యతులు ప్రాసలు లేకున్న మతులు బోవు
గణ యతి ప్రాసలే లేని కైత మేలు
చక్కనైన భావములతో,సరసమైన
రిప్లయితొలగించండికవిత రంజింప జేయును గద్యమైన
కష్టపడి ఛందమును గూర్చు కవితకన్న
గణయతిప్రాసలే లేని కైత మేలు.
------------
గుణ విహీన మైనట్టి సద్గణములున్న
రిప్లయితొలగించండియతులతోనొప్పు కవితల నల్లనేల?
సుగుణ సద్బోధ కలిగిన శోభలొలుకు
గణ యతి ప్రాసలే లేని కైత మేలు.
ఈ రోజంతా బ్లాగు సెట్టింగులు కుదరక కొద్దిగా అలజడికి గురయ్యాను. చివరికి ‘బ్లాగు గురువు’ జ్యోతి గారి శరణు జొచ్చాను. వారు శ్రమ తీసికొని బ్లాగులోని లోపాలను సవరించారు. ఇక ఇబ్బంది ఉండక పోవచ్చు. వారికి ధన్యవాదాలు.
రిప్లయితొలగించండినేటి పూరణలు పంపిన
గణములందు గురు లఘు భంగమ్ము గాగ,
రిప్లయితొలగించండిప్రాస చెల్లక, యతి దప్పి పద్యమల్లు
కవి కుమార! నీకు ’వచన కవిత’ యనెడి
గణ యతి ప్రాసలే లేని కైత మేలు!
వ్యర్థమశ్లీలపదయుక్తమర్థహీన
రిప్లయితొలగించండివిరస భావ దోషములకు వెల్లచెట్టు
బరువు కావ్యమేల? పరగ భావమైన
గణయతిప్రాసలే లేని కైత మేలు.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలూ ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.
*
వసంత కిశోర్ గారూ,
సమస్యపాదంతోనే మొదలై వైవిధ్యంగా ఉన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
లక్కాకుల వెంకట రాజారావు గారూ,
ఆటవెలదిలో మీ పూరణ భావబంధురమై ఆటలాడింది. మంచి పూరణ. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
చక్కని పూరణ. అభినందనలు.
‘అని + అనెడి’ అన్నప్పుడు సంధి లేదు. అక్కడ ‘భయ మనియెడి’ అందాం.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
పదాడంబరంతో మీ పద్యం సుందరంగా ఉంది. అభినందనలు.
కాని సమస్యకు అన్వయం లేదేమో నిని సందేహం!
*
పండిత నేమాని వారూ,
ఏవేవి చాలించాలో చక్కగా వివరిస్తూ ఉత్తమమైన పూరణ చెప్పారు. అభినందనలు.
*
మందాకిని గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మీ రెండు పూరణలూ ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.
మొదటి పూరణలో ‘వ్రాయచ్చు’ను ‘వ్రాయనౌ’ అనీ, రెండవ పూరణలో ‘పద్యమున కంద మేది (గణదోషం)’ అన్నదానిని ‘పద్యాల కంద మేది’ అనీ నా సవరణలు.
*
కమనీయం గారూ,
నిజమే! గద్యం కూడా ‘కైత’యే కదా! దానికి గణయతిప్రాసలతో పని యేమి? మంచి పూరణ. అభినందనలు.
*
చింతా రామకృష్ణారావు గారూ,
గుణప్రాధాన్యతను తెలిపిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
గణయతిప్రాసలతో కుస్తీ పట్టలేని కవికుమారులకు మీ సలహా రూపమైన పూరణ ఉత్కృష్టంగా ఉంది. అభినందనలు.
*
అజ్ఞాత గారూ,
గణయతిప్రాసాదోషాల కన్నా మించిన దోషాలను పరిహరించాలన్న మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
జ్యోతి గారు బ్లాగు సెట్టింగులను సవరించడంతో పాటు ‘నిఘంటువుల’ లింకులను కూడా జతచేసారు. ఇక మనం అర్థాలకోసం ఎక్కడికో వెళ్ళి ఇబ్బంది పడవలసిన పని లేదు. ఇందుకు మనమంతా జ్యోతి గారికి ధన్యవాదాలు తెలుగుపుకుందాం.
రిప్లయితొలగించండిరాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీరొక వ్యాఖ్యను తొలగించినట్లు కనిపిస్తోంది. అదెలా సాధ్యమైంది? చెత్తబుట్ట ఐకాన్ కనిపించడం లేదు కదా!
కొలువు దీరి యున్న సభల, గొప్ప గొప్ప
రిప్లయితొలగించండిపండితోత్తములగు వారి బాట బట్టు
గణయతి ప్రాసలే ! లేని కైత మేలు
విధమున నొదుగు పామరు పెదవులందు.
కొలువు దీరి యున్న సభల, గొప్ప గొప్ప
తొలగించండిపండితోత్తములగు వారి బాట బట్టు
గణయతి ప్రాసలే ! లేని కైత - మేలు
విధమున నొదుగు పామరు పెదవులందు.
మందాకిని గారూ,
తొలగించండిపామర రంజకమైన కైత గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
ఓ నిర్మాత:
రిప్లయితొలగించండివనితరో!వస్త్రమంతేల? వాన మేలు
నాయకా! నర్తనమ్మేల? నడక మేలు
కవివరా!చందనమ్మేల గాడిదలకు?
గణయతి ప్రాసలే లేని కైత - మేలు.
ఊకదంపుడు గారూ,
తొలగించండికవిగా ఓ సినీనిర్మాత దగ్గర భంగపడ్డ అనుభవం నాకుంది. నేను వ్రాసిచ్చిన పాటను అసలు నా పాటే కాదన్నంతగా మార్చారు. యతులు, అంత్యప్రాసలు మాయం!
చక్కని పూరణ. అభినందనలు.
కాదేది టపా కనర్హం
రిప్లయితొలగించండిజిలేబీ కథ మాటలకి
ఇక తను కవితలు రాసి తలచె
గణ యతి ప్రాసలె లేని కైత - మేలు !!
జిలేబి
కాదేది టపా కనర్హం
రిప్లయితొలగించండిజిలేబీ కథ మాటలకి
ఇక తను కవితలు రాసి తలచె
గణ యతి ప్రాసలె లేని కైత - మేలు !!
అమ్మా జిలేబీ గారూ,
తొలగించండి(మీ కొన్ని టపాలను చూసి మీరు స్త్రీ అయివుంటారని ఊహించాను. అవునా?)
మీ మట్టుకు మీకు ఛందోనియమాలు అవసరం లేదనుకుంటారు. బాగుంది. మీ భావాన్ని ఛందోబద్ధం చేయాల్సిన శ్రమ తప్పించారు.
శంకరయ్య గారు,
తొలగించండిఈ మారు మీరిచ్చిన సమస్య చూస్తే నాకోసమనే కొంత సుళువు గా ఇచ్చి నట్టు అనిపించింది నాకు !! ఇక ఛందో బద్ధం మాటంటారా, చందం ఉంది, అబద్దం లేదు !!
చీర్స్
జిలేబి.
స్త్రీకి భూషణ మెన్నగ శీల మండ్రు
రిప్లయితొలగించండిఛంద మెన్నగ కవితల కంద మండ్రు
దోచి యెదల చదువ విన దోషమున్న
గణయతిప్రాసలే లేని కైత మేలు.
శహభాష్ జ్యోతీ! యిట్లే
రిప్లయితొలగించండిఅహరహమును బ్లాగులందు నానందముగా
రహియించుము సవరించుము
విహరించుము బ్లాగులందు వేడుక మీరన్.
మిస్సన్న గారూ,
తొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.
జ్యోతి గారిని ప్రశంసిస్తూ వ్రాసిన పద్యం చాలా బాగుంది. ధన్యవాదాలు.
తమ్ముడూ ! నేను వ్రాసినప్పుడు " వ్యాఖ్యను తొలగించు " అని క్రింద వచ్చింది . అది చూసి అసలు ఊరికే " టెస్ట్ చేద్దామని క్లిక్ చేసాను " తొలగింప బడింది. మళ్ళీ ఇప్పుడు లేదు . అంటే బహుశా , మనం రాసిన వేంటనే వస్తుందేమో ! మళ్ళీ టెస్ట్ చేయాలి అంతే
రిప్లయితొలగించండిఅవును రాసిన వేంటనే " తొలగించు అని వస్తుంది " అప్పుడే తొలగించాలి
రిప్లయితొలగించండిఅక్కయ్యా,
తొలగించండిధన్యవాదాలు.
గురువుగారు,
రిప్లయితొలగించండిభావవ్యక్తీకరణ స్పష్ఠము చేయనందులకు క్షమించాలి.
పండితులకు ప్రౌఢ ( యతి ప్రాసల ) కవితవము - మేలు ( మెచ్చుతారు ), సామాన్యకవిత్వము సర్వజనులకు మేలు అని నాభావము.
గణము ప్రాసలు గలయట్టి కావ్యములను
రిప్లయితొలగించండిచదువు రానట్టి పెద్దలు సదువ లేరు
వ్రాయ బలుకని చదువని వారి కొఱకు
గణ యతి ప్రాసలే లేని కైత మేలు .