8, ఫిబ్రవరి 2012, బుధవారం

ఆహ్వానం

అష్టావధానం

12-02-2012 (ఆదివారం) నాడు

విశాఖపట్టణం
లలితానగరం (అక్కయ్యపాలెం) లోని
శ్రీ లలితాపీఠంలో

సాయంకాలం 6 గంటల నుండి

అవధాని శ్రీ రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారి

అష్టావధానం

ఆసక్తి ఉన్న సాహితీప్రియులకు ఇదే ఆహ్వానం!

11 కామెంట్‌లు:

  1. పూజ్యులు ,పార్వతీ శ్వర శర్మ గారి కి పాదాభి వందనములతో ..
    అవధానము లన్నిట నీ
    యవధానమె గొప్పదండ్రు ఆర్యా! శర్మా !
    అవధానం బొనరింపుము
    అవధానపు జక్రవర్తి ! యాశువు తోడన్ .

    రిప్లయితొలగించండి
  2. గురువు గారు,
    మీ అనుమతితో ఈ సమాచారాన్ని నా బ్లాగులో ప్రచురించి సంతోషపడతాను.
    నెట్ సమస్యల వల్ల ఇన్నిరోజులు స్పందించలేక పోయినందుకు క్షంతవ్యురాలను.
    ఇప్పుడు కొన్ని తెలుగులో కి మార్చారు. సంతోషమండి.
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. అమ్మా! మందాకినీ గారూ! తప్పకుండా మీరు అష్టావధానము గురించి మీ బ్లాగులో ప్రకటించండి. అవధాని చి. శర్మ 23 ఏళ్ళ యువకుడు. తెలుగులో ఎం.ఎ. చేసేడు. మంచి ప్రతిభ గలవాడు. ఇప్పటికే 24 అష్టావధానములు చేసి అందరి మన్ననలు పొందాడు.

    రిప్లయితొలగించండి
  4. సంతోషమండి.
    భాష మీద ఇంతటి అభిమానము, అధికారము గలిగిన శర్మ గారికి పరమేశ్వరుని దయ వలన సకల శుభములు కలుగు గాక.

    రిప్లయితొలగించండి
  5. మందాకిని గారూ,
    సంతోషం!
    ఇలాంటి మంచి పనులకు ఎవరి అనుమతీ అవసరం లేదు.
    *
    సుబ్బారావు గారూ,
    ధన్యవాదాలు.
    చిన్న సవరణ ...
    ‘అండ్రు ఆర్యా’ అన్నచోట అలా విసంధిగా వ్రాయకుండా ‘అందు రార్యా’ అనడం మేలు.

    రిప్లయితొలగించండి
  6. పండిత జనరంజకముగ
    పండిత నేమానివారి పౌత్రుడు వేడ్కన్
    పండించును యవధాన మ
    ఖండమగు యశము గలుగగ కావుము కృష్ణా

    గురువుగారు శ్రీ పార్వతీశ్వర శర్మగారి శుభాకాంక్షలు.

    పైపద్యములో వ్యాకరణదోషాలను దయతో మన్నించ ప్రార్థన.అవధానిగారికి అఖండమగు కీర్తిని పరమాత్ముడు అనుగ్రహించునని నాభావన.

    రిప్లయితొలగించండి
  7. శ్రీ పార్వతీశ్వర శర్మగారికి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  8. శ్రీపతి శాస్త్రి గారూ,
    మీరు చెప్పిన చక్కని పద్యానికి ధన్యవాదాలు.
    అయినా వ్యాకరణదోషాలను నేనెలా మన్నిస్తాను? :-)
    ‘పండిచును + అవధాన’ అన్నచోట యడాగమం రాకూడదు కదా! అక్కడ ‘పండింపగ నవధాన’ అందాం!

    రిప్లయితొలగించండి
  9. గురువుగారు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  10. అవధాన సరస్వతి శ్రీ రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారికి శు భాభి వందనములు.

    రిప్లయితొలగించండి
  11. సుబ్బారావు గారికి, శ్రీపతి శాస్త్రి గారికి, మందాకిని గారికి,రాజేశ్వరి గారికి, శంకరయ్య గారికి...

    పేరుపేరున ధన్యవాదములు.
    కృతజ్ఞతలు

    - "అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ

    రిప్లయితొలగించండి