17, ఫిబ్రవరి 2012, శుక్రవారం

శివానందలహరి - 2

మాగఛ్ఛస్త్వమితస్తతోగిరిశ! భో! మయ్యేవవాసంకురు
స్వామిన్నాదికిరాత! మామకమనఃకాంతారసీమాంతరే
వర్తంతేబహుశోమృగాఃమదజుషోమాత్సర్యమోహాదయః
తాన్హత్వామృగయావినోదరుచితాలాభంచసంప్రాప్యసి


శ్రీ పండిత నేమాని వారి అనువాదం


కలవు మదంతరంగమను కాననమందు మహామదమ్ముతో
బలిసిన కామమోహమన వర్తిలు క్రూరమృగమ్ములో మహా
బల! మృగయావినోద! వడి వానిని ద్రుంచుము నామనమ్ములో
నలరుము నీకు నాకు ముదమావిధి గల్గు నుమామహేశ్వరా!

2 కామెంట్‌లు:

  1. శివానంద లహరిని తెలిగించి ఆనందమున తేలియాడించిన శ్రీ నేమానివారికి నమోవాకములు.

    రిప్లయితొలగించండి
  2. స్పందించుచు నా కవితకు
    వందనములు తెలిపినట్టి పద్యప్రియులా
    నందనిధి గోలివారికి
    నందింతు శుభాశిషముల నాదర రీతిన్

    రిప్లయితొలగించండి