3, ఫిబ్రవరి 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 611 (జలము పోయఁగ నగ్ని)

కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది
జలము పోయఁగ నగ్ని జ్వాజ్వల్యమయ్యె.

34 కామెంట్‌లు:

  1. శాంతి, ఎదురింట నుండు సౌజన్య మధ్య
    పచ్చగడ్డిని వేసిన భగ్గుమనును
    ముగ్గు వేయగ నొక్కరు మూతి ముడిచి
    జలము పోయఁగ నగ్ని జ్వాజ్వల్యమయ్యె.

    రిప్లయితొలగించండి
  2. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారి పద్యములో చక్కని భావము ప్రస్ఫుటముగా నున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    ____________________________

    జలజ జకుటంబు గొట్టుచే - జలజ యన్న
    జలజ యన్నకు నాపెకు - జగడ మాయె !
    జలజ యన్నను లేపగా - జల్ల నైన
    జలము పోయఁగ నగ్ని జ్వా - జ్వల్యమయ్యె!
    ____________________________
    జకుటము = కుక్క

    రిప్లయితొలగించండి
  4. జ్యోతిగారూ వ్యాఖ్య పెట్టాక క్రింద చెత్తబుట్ట కనపడుతోంది.
    డస్ట్ బిన్ జిందాబాద్.

    రిప్లయితొలగించండి
  5. ఎడమ వైపు కొన్ని పాత వ్యాఖ్యలు కనుపించి కొంత సందిగ్ధతకు తావిస్తున్నాయి. ఉదాహరణకు ' మిత్రులారా మా అబ్బాయి కంప్యూటర్ ను హైదరాబాదు తీసుకొని వెళ్ళుతున్నాడు........... ' వంటివి. అలాగే కిశోర్ మహోదయులన్నట్లు వెనుక తెర తెలుపు కాకుండా మరొక సాత్వికమైన రంగు అయితే బాగుంటుంది. కళ్ళకు శ్రమ లేకుండా ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  6. అది రసాయనశాల యందాంలమిళిత
    మగు రసాయనమందొక్క అర్భకుండు
    చోద్య మేమగునో యిదే చూచెదనని
    జలము పోయగ నగ్ని జ్వాజ్వల్యమయ్యె

    రిప్లయితొలగించండి
  7. గేహమందున ఘటములో ఘృతమను నొక
    జలము పోయగ నగ్ని జ్వాజ్వల్యమయ్యె.
    దేవుని కడను వెలిగించి దీపమొకటి
    మౌనముగ చేసితి జపంబు మదిని నేను.

    రిప్లయితొలగించండి
  8. శ్రీ నేమాని వారికి, మిస్సన్న గారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  9. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మశుక్రవారం, ఫిబ్రవరి 03, 2012 9:36:00 AM

    ఖాండవమునెల్ల భుజియించు కాంక్షతోడ
    హుతవహుడు తా ద్రౌపదీ పతిని వేడ
    దాత కౌంతేయుడవ్వాని చేతిలోన
    జలము పోయంగనగ్ని జ్వాజ్వల్యమయ్యె

    రిప్లయితొలగించండి
  10. వాయుదేవుడు తనపుత్రు వరుసజేరి
    మిత్రు డగ్నిదేవునికూత మీయ, నల్ల
    ద్రావు లవిసి లంకాపురి దహనవేళ
    జలము పోయఁగ నగ్ని జ్వాజ్వల్యమయ్యె

    రిప్లయితొలగించండి
  11. జలపాతం క్రింద టర్బైను నమర్చి , దానిని డైనమోలకు కలిపితే
    విద్యుచ్ఛక్తి పుడుతుంది ! దానినే జల విద్యుత్తంటారు !
    అదీ విషయం :

    02)
    ____________________________

    జలము పడినంత టర్బైను - జరుగు నపుడు
    జాతి డైనమో లకుదాన్ని - జత గలిపిన
    జలము పోయఁగ నగ్ని జ్వా - జ్వల్యమయ్యె!
    జగతి యందతి చిత్రముల్ - జరుగు కనగ !
    ____________________________
    అగ్ని = విద్యుచ్ఛక్తి
    టర్బైను = నీటినితోడుటకు రైతులుపయోగించే చక్రము వంటి భారీ యంత్రము
    డైనమో = సైకిలు లైటు వెలుగుటకుపయోగ పడేది !

    రిప్లయితొలగించండి
  12. జ్యోతిగారూ ! చాలా చక్కగానున్నది శంకరాభరణం !

    శతథా , సహస్త్రథా ధన్యవాదములు !

    కాకపోతే ఇంకొక చిన్నపని !
    తాజా వ్యాఖ్యలు క్రిందికీ
    BlogArchieve పైకీ మారిస్తే
    తాజావ్యాఖ్యలు యెక్కువ కనబడుటకు వీలవుతుంది !
    BlogArchieve కు Expand buttons గలవు గనుక యిబ్బందుండదు !

    రిప్లయితొలగించండి
  13. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మిత్రుల ప్రశంస లందుకొన్న మీ పూరణ నిజంగానే ఉత్కృష్టంగ ఉంది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    జలజ, జలజ అన్నయ్యల జగడాన్ని గురించిన మీ పూరణ చాలా బాగుంది.
    జలవిద్యుత్ప్రాజెక్టు ప్రస్తావనతో మీ రెండవ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    చక్కని ఊహతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    మందాకిని గారూ,
    జలమంటే ద్రవపదార్థమనే భావంతో పూరించారు. బాగుంది. చక్కని పూరణ. అభినందనలు.
    *
    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    ఖాండవదహన ఘట్టాన్ని ప్రస్తావించిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మశుక్రవారం, ఫిబ్రవరి 03, 2012 1:30:00 PM

    వసంత కిశోర్ గారూ

    టర్బైనును "తర్బనము" అంటే ఎలా ఉంటుందంటారూ??

    రిప్లయితొలగించండి
  15. గురువు గారు,
    ధన్యవాదాలు.
    కొద్దిగా సందేహంతోనే వ్రాశాను. తర్వాత నిఘంటువులో చూసినపుడు జలమునకు ఏదేని ద్రవము అని ఉన్నది.
    మొదటి పాదము ఈ విధంగా మారిస్తే సరిగా ఉంటుందనుకుంటున్నాను.
    గేహమందు ఘటమునున్న ఘృతమనునొక

    రిప్లయితొలగించండి
  16. అన్ని మంటలు నీటితో నార్పరాదు
    నీరు దోహదకారి కొన్నిటికి యనుచు
    మరచి పెట్రోలు మంటపై నురక లెత్త
    జలము పోయఁగ నగ్ని జ్వాజ్వల్యమయ్యె.

    రిప్లయితొలగించండి
  17. నా అభిప్రాయం ఒకటి వ్రాస్తున్నాను. దీని అర్ధం యెవరినీ అధిక్షేపించటం కాదు.

    మాటలకు మూడు రకాలగా అర్ధం ఉంటుంది.యోగము, రూఢము మరియి యోగరూడము అని.

    యోగము అనగా ఆ పదానికి సహజంగా ధాతువు వల్లనో, సమాసంలోని పదాల కూర్పు వల్లనో లేదా భాషా సంబంధమైన తదితర కారణాల వలననో సహజంగా యేర్పడే అర్ధం.

    యోగరూడము అనగా ఒక మాటకు ఒకటి కంటే యెక్కువ అర్ధాలు ఉంటే వాటిలో వాడుకలో ప్రసిధ్ధమైన అర్ధము(లు). ఉదాహరణకు జలజము అంటే అందరూ పద్మము (అనగా తామరపువ్వు) అని అర్ధం చెబుతారు. అది యౌగికార్ధాలలో రూఢమైనది. కాని కలువ కూడా. అదటుంచి, జలజము అంటే 'నీటిలో పుట్టినది' అనే వ్యత్పత్తిని అనుసరించి 'జలగ' కూడా కావచ్చును. కాని అలా వాడము కదా.

    రూఢము అంటే ఒక మాటకు ప్రసిధ్ధిలోకి వచ్చిన అర్ధం. ఒక్కొకసారి ఇది యౌగికమైన అర్ధానికి దూరంగానో విరుధ్ధంగానో యేమీ సంబంధంలేనిదానిగానో కూడా ఉండవచ్చును. ఉదాహరణకు కైంకర్యము అనే మాటకు 'కిం కరోతి కింకరః' అన్న వ్యుత్పత్తిని బట్టి గాక తద్విరుధ్ధంగా 'దొంగతనము' అనే అర్ధం రూఢమైనది.

    అయితే కొన్నిసార్లు ఒకే మాటకు అనేక అర్ధాలు వాడుకలోకి రావచ్చు. ఒకోసారి వాటి అర్ధాలు పరస్పరవ్యతిరేకంగా కూడా ఉండవచ్చును. 'శ్రీ' అనే పదానికి అనేక అర్ధాలున్నాయి 'సంపద', 'మోక్షము' వంటి అర్ధాలతో పాటు, 'విషం' అనే అర్ధంకూడా ఉంది! శ్రీకంఠుడు అంటే కంఠగతమైన శ్రీ (విషం) కలవాడు - శివుడు.

    అయితే ఇటువంటి సందర్భాలు అరుదు.
    కాబట్టి నిఘంటుగతమైన అప్రసిధ్ధార్ధాలు వాడటం పఠనాసౌకర్యానికి భంగకరం అని నా భావన. తప్పనిసరియైతే వాడవచ్చునుగాని పరిహరించగలిగితే బాగుంటుది.

    రిప్లయితొలగించండి
  18. యాగ మందున సమిధల నాగ కుండ
    హొమ మందున వేయుచు హోత యతడు
    ఘృతము గానెంచి చేకొని మితము మీరి
    జలము పోయఁగ నగ్ని జ్వాజ్వ్ల్య ల్య మయ్యె
    -----------------------------------------------
    పొయ్యి పైనున్న భాండము పొగలు గ్రక్కు
    మరుగు నూనెను గాంచుట మరచి పోయి
    నీటి చేతిని విదలించె నేరు గాను
    జలము పోయఁగ నగ్ని జ్వాజ్వ్యల్య మయ్యె !

    రిప్లయితొలగించండి
  19. శ్యామలీయం గారు,
    నా పూరణ విషయంలో కొంత అసంతృప్తి గానే ఉన్నాను. అప్రసిద్ధమైన అర్థాలు (విరుద్ధార్థము ఇచ్చే పక్షంలో) చూసి వాడాలన్న విషయంలో పూర్తి జాగ్రత్త వహించటమే నాకూ నచ్చుతుంది.

    మరో పూరణ

    చేత నున్నట్టి నా కంచు చెంబు జారి
    నేతి యందున పడినది నీరు కొంత,
    వెలుగు తగ్గిన వత్తులు వెలుగ, నేతి
    జలము పోయంగనగ్ని జ్వాజ్వల్యమయ్యె.

    రిప్లయితొలగించండి
  20. శ్రీ శ్యామల రావు గారు వివిధ అర్థములను గురించి విపులముగా వ్రాసేరు. చాలా సంతోషము - వారికి నా అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. శ్యామలీయం గారు,
    నా పూరణ విషయంలో కొంత అసంతృప్తి గానే ఉన్నాను. అప్రసిద్ధమైన అర్థాలు (విరుద్ధార్థము ఇచ్చే పక్షంలో) చూసి వాడాలన్న విషయంలో పూర్తి జాగ్రత్త వహించటమే నాకూ నచ్చుతుంది.

    మరో పూరణ

    చేత నున్నట్టి నా కంచు చెంబు జారి
    నేతి యందున పడినది నీరు కొంత,
    వెలుగు తగ్గిన వత్తులు వెలుగ, నేతి
    జలము పోయంగనగ్ని జ్వాజ్వల్యమయ్యె.

    నా వ్యాఖ్య ప్రచురింప బడి మళ్ళీ యిప్పుడెందుకో కనిపించటం లేదు.
    అందుకే మళ్ళీ ప్రకటిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  22. వినత కదృవ పందెము వెఱగు పఱచ
    తెల్ల యశ్వము తోకను నల్ల దనుచు
    రగిలి మండుచు నసూయ పొగలు సెగల
    జలము పోయఁగ నగ్ని జ్వాజ్వల్య మయ్యె

    రిప్లయితొలగించండి
  23. ఉంటి నేకాదశి యనగ నుపవసమ్ము
    గంట పదునెండు కొట్టెను కాలె కడుపు
    జలము నిర్దోష మని ద్రావ జఠర మెగసె
    జలము పోయంగనగ్ని జాజ్వల్యమయ్యె.

    రిప్లయితొలగించండి
  24. జ్వాజ్వల్యము అన్నది సరియైనదా జాజ్వల్యము అన్న పదం
    సరియైనదా అన్న సందేహం నన్ను పీడిస్తోంది.

    రిప్లయితొలగించండి
  25. ‘శ్యామలీయం’ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘నిఘంటుగతమైన అప్రసిధ్ధార్ధాలు వాడటం పఠనాసౌకర్యానికి భంగకరం’ అనడం బాగుంది. ఇవి కేవలం శ్లేషకావ్యాలకే పరిమితం. అందరికీ ఉపయోగపడే చక్కని విషయం చెప్పారు. ధన్యవాదాలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    ఇక మీ మూడవ పూరణ అద్భుతంగా ఉంది. కాకుంటే ‘కద్రువ’ను ‘కదృవ’ అన్నారు.
    *
    మందాకిని గారూ,
    మీ ‘మరో పూరణ’ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ జఠరాగ్ని పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    ‘జ్వాజ్వల్య’ శబ్దార్థం విషయంలో ఇప్పుడు సందేహిస్తున్నాను. తెలుసుకోవాలి.

    రిప్లయితొలగించండి
  26. మస్టారు గారు, నాకు పద్యం రాయటం రాదు, కాని భావం వ్రాస్తున్నాను, మీరు పద్యం గా పూరించండి...

    "అందమైన తన భార్య స్నానం చెసిన కురుల పై నుండి పడిన నీటి వల్ల తనలొ నగ్ని జ్వాజ్వల్యమయ్యె"

    రిప్లయితొలగించండి
  27. రామకృష్ణ గారూ,
    మనోహరమైన భావాన్ని అందించారు. ధన్యవాదాలు. మీ భావానికి నా పద్యరూపం ....
    ఆమె సౌందర్యరాశి, వయ్యార మొలుక
    నపుడె యభ్యంగ మొనరించె, యామె కురుల
    నుండి పతిపైన నీటి బిందువులు పడెను,
    జలము పోయఁగ నగ్ని జ్వాజ్వల్యమయ్యె.

    రిప్లయితొలగించండి
  28. నా భావానికి పద్యం చాల అందంగా వ్రాసారు మస్టారు గారు, ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  29. రామకృష్ణ గారి భావానికి నేనిచ్చిన పద్యరూపంలో ‘ఒనరించె యామె’ అని యడాగమం చేయడం తప్పు.
    ‘ఒనరించె నామె’ అనడం ఒప్పు!
    హమ్మయ్య! ఎవరూ పట్టుకోకముందే తప్పు సవరించుకున్నాను. సెహబాష్! శంకరయ్యా!

    రిప్లయితొలగించండి
  30. రామకృష్ణ గారు,

    సుందరీ! నీకు సాటిగ సొగసు గలదె?
    కురులు ఝాడించ బోకమ్మ, కోపమునను!
    ఝల్లుమనియెను నా ఒళ్ళు జల్లు తగిలి,
    జలము పోయఁగ నగ్ని జ్వాజ్వల్యమయ్యె.

    రిప్లయితొలగించండి
  31. మందాకిని గారూ,
    రామకృష్ణ గారి భావానికి నేను వ్రాసినదాని కంటే మీ పద్యం అన్ని విధాల బాగుంది. సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి