8, ఫిబ్రవరి 2012, బుధవారం

సమస్యాపూరణం - 616 (ఆపన్నుల బంధు వయ్యె)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది

ఆపన్నుల బంధు వయ్యె నా రావణుఁడున్.

ఈ సమస్యను పంపిన
పోచిరాజు సుబ్బారావు గారికి
ధన్యవాదాలు.

22 కామెంట్‌లు:

  1. తాపసులను పీడించెను
    భూపుత్రిక నపహరించెఁ బుల్కసుఁడు గదా!
    యే పగిదిఁ జెప్పఁగాఁ దగు
    "నాపన్నుల బంధు వయ్యె నా రావణుఁడున్"

    రిప్లయితొలగించండి
  2. శ్రీపతిశాస్త్రిబుధవారం, ఫిబ్రవరి 08, 2012 8:52:00 AM

    శ్రీగురుభ్యోనమ:

    శ్రీపతియే మన దైవము
    ఆపన్నుల బంధు వయ్యె, నా రావణుఁడున్
    కాపాడుమనచు వేడిన
    కాపాడెడువాడె కాద కరుణామయుడై

    రిప్లయితొలగించండి
  3. తాపసులను పీడి౦చిన
    పాపపలాశులవమాన బాధితురాలౌ
    నాపౌలస్తి యడగఁగా
    నాపన్నుల బంధు వయ్యె నా రావణుఁడున్.

    రిప్లయితొలగించండి
  4. అష్టావధానం - ఆదివారము 12-02-2012 సాయంకాలము గం.6.00 లకు విశాఖపట్టణము లలితానగరము (అక్కయ్యపాలెము) లోని శ్రీ లలితాపీఠములో జరుగును:
    అవధాని: అభ్యుదయ అవధాని, యువతేజము: శ్రీ రాంభట్ల పార్వతీశ్వర శర్మ
    అధ్యక్షులు: డా. వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి (విశ్రాంతాచార్యులు, ఆంధ్ర విశ్వవిద్యాలయము).
    సభకు అందరూ వచ్చి రసాత్మకమైన అవధానమును చూచి సభను జయప్రదము గావించుటలో తమ తమ సహకారమును అందించగలరు.

    ఇట్లు:
    పండిత నేమాని రామజోగి సన్యాసి రావు
    విశాఖపట్టణము
    ఫోను: 0891 - 2565944 / మొ: 94402 33175

    రిప్లయితొలగించండి
  5. ఆపద్బాంధవు డయ్యెను
    నేపొద్దును బిలిచె నేని నేమ ఱుపాటున్
    దాపుం దా రా నీయక
    ఆపన్నుల బంధు వయ్యె నా రావణుడున్

    రిప్లయితొలగించండి
  6. narayanudun టైపు లో y బదులు v పడితే అర్థ మిలా మారిందని నా భావన...

    టైపును జేయగ నేనిటు
    "ఆపన్నుల బంధు వయ్యె నా రాయణుఁడున్"
    'వీ' పడె 'వై' బదులు కనగ
    'ఆపన్నుల బంధు వయ్యె నా రావణుఁడున్'

    రిప్లయితొలగించండి
  7. narayanudun టైపు లో y బదులు v పడితే అర్థ మిలా మారిందని నా భావన...

    టైపును జేయగ నేనిటు
    "నాపన్నుల బంధు వయ్యె నా రాయణుఁడున్"
    'వీ' పడె 'వై' బదులు కనగ
    'నాపన్నుల బంధు వయ్యె నా రావణుఁడున్'

    రిప్లయితొలగించండి
  8. narayanudun టైపు లో y బదులు v పడితే అర్థ మిలా మారిందని నా భావన...

    టైపును నేనిటు జేయగ
    "నాపన్నుల బంధు వయ్యె నా రాయణుఁడున్"
    'వీ' పడె 'వై' బదులు కనగ
    'నాపన్నుల బంధు వయ్యె నా రావణుఁడున్'

    రిప్లయితొలగించండి
  9. సీతమ్మను తెచ్చినా తెచ్చెను గాని
    లంకేశుడు తన సెక్యూరిటీ పెంపొందింప
    పన్నుల హెచ్చింప లంకా జనులు తలచె
    ఆ, పన్నుల బంధు వయ్యె నా రావణుడున్!!


    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి
  10. గోలీ వారి టైపాటు అమోఘం!!!

    నారాయణుడు నా రావణుడు ఒక్క అక్షరం లోనూ అది కూడాను Y and V తేడా తో తెప్పించడం!

    వీటి మధ్య వ్యత్యాసం ఆ V కింద I లాంటి తోక ! ఆ I పరంధాముని తలపున (Y) నించి విడి వాడితే నారాయణుడి సేవకుడు రావణుడు (V) అయ్యాడు !!



    చీర్స్
    జిలేబి.

    జిలేబి.

    రిప్లయితొలగించండి
  11. డి.నిరంజన్ కుమార్బుధవారం, ఫిబ్రవరి 08, 2012 11:52:00 AM

    భూపుత్రిని వెదకుచు లం
    కాపురమును గాల్చినట్టి కపికోపంబు
    న్నాపగ మొరబెట్టుకొనెడు
    ఆపన్నుల బంధువయ్యె నారావణుడున్

    రిప్లయితొలగించండి
  12. గురువు గారికి నమస్కారములు|
    మన్మోహన్ మంచివాడని మద్దతు పలుకగ, పన్నులు పెంచి తప్పక ప్రజలు కట్టవలసిందే అనుటను జూచినప్రజలు ఈ విధముగా చింతించిరి
    -------------
    తాపసికి మద్దతు బలుక
    కప్పము గట్టమని నేడు గూర్చుండెనులే,
    జూపిన దిప్పలు నోర్వక
    యా పన్నుల బంధు వయ్యెనా, రావణుడున్|

    రిప్లయితొలగించండి
  13. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మబుధవారం, ఫిబ్రవరి 08, 2012 1:19:00 PM

    శాపము తీరెనహల్యకు
    శ్రీపతి తా భువినిపుట్ట శ్రీరాముండై
    పాపాత్ముడైననేమీ?
    ఆపన్నుల బంధువాయె నా రావణుడున్

    రిప్లయితొలగించండి
  14. రేపన్నది యోచించక
    పాపమ్ములు జేయు వారు పరి పరి విధముల్ !
    శాపమ్ముల నందు కొనిన
    ఆ పన్నుల బందు వయ్యె నా రావణు డున్ !

    రిప్లయితొలగించండి
  15. శ్రీపతి శాస్త్రి గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    కాకుంటే చిన్న సవరణలతో మీ పద్యం ....
    శ్రీపతియే మన దైవం
    బాపన్నుల బంధు వయ్యె, నా రావణుఁడున్
    కాపాడుమనుచు వేడిన
    కాపాడెడువాడు కాదె కరుణామయుడై
    *
    చంద్రశేఖర్ గారూ,
    ఆపన్నురాలైన శూర్పణకు బంధువు అన్న మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    పద్యం నిర్దోషంగా బాగుంది. కానీ రావణుడు ఎవరికి ఆపద్బాంధవు డయ్యాడో పేర్కొనలేదు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    అత్యద్భుతమైన ఊహ! చాలా బాగుంది. అభినందనలు.
    మొదటి పూరణ చూచి యతిదోషమని వ్యాఖ్యానించబోయాను. తరువాత మీ సవరణలో అఖండయతి వేసారు కదా! ఓ.కే.
    *
    జిలేబీ గారూ,
    భావం బాగుంది. అభినందనలు.
    మనస్సు బాగా లేకపోవడంతో దీనికి పద్యరూపం ఇవ్వలేక పోతున్నాను. మన్నించండి. మిత్రులెవరైనా ప్రయత్నిస్తారేమో చూడాలి.
    *
    నిరంజన్ కుమార్ గారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    షరా మాములే అన్నట్లుగా ఏ సమస్య ఇచ్చినా మీరు రాజకీయ నాయకులను లక్ష్యం చేస్తున్నారు. మంచిది. బాగుంది మీ పూరణ. అభినందనలు.
    కాని రెండవ పాదంలో ప్రాస, యతి తప్పాయి..
    *
    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయా,
    హమ్మయ్య! తమ్ముణ్ణి శ్రమ పెట్టక నిర్దోషంగా చక్కని పూరణ చెప్పారు. అభినందనలతో పాటు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. పాపపు తలపుల వీడుచు
    నాపన్నుల బంధువయ్యె నా, రావణుడున్
    కాపాడబడగ నా యీ
    కోపము వీడెదను, శరణు కోరిన క్షణమే.

    రిప్లయితొలగించండి
  17. కూపములో మండూకము,
    పాపులకధిపతి ,యధర్మపాలకుడగుచున్,
    తాపసుల వైరి గణమున
    నాపన్నుల బంధువయ్యె నా రావణుడున్.

    రిప్లయితొలగించండి
  18. మందాకిని గారూ,
    మీ రెండు పూరణలూ ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    _____________________________________________
    ఈ పృథివిని ప్రతి రాజూ
    ఆపద్బాంధవు డగును గ - దా పురి ప్రజకున్ !
    పాపాత్ముడైన ? లంకకు
    ఆపన్నుల బంధు వయ్యె - నా రావణుఁడున్ !
    _____________________________________________
    గద+ ఆ పురి = గదా పురి

    రిప్లయితొలగించండి
  20. వసంత కిశోర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘రాజూ’అని వ్యావహారిక పదాన్ని ప్రయోగించారు. అక్కడ ‘ప్రతి భూపతి’అంటే సరి!

    రిప్లయితొలగించండి