9, ఫిబ్రవరి 2012, గురువారం

సమస్యాపూరణం - 617 (పూజ సేయ సిరులు)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది -

పూజ సేయ సిరులు పూజ్యము లగు.

25 కామెంట్‌లు:

  1. పరగ మైల విధులు పాటించకే పూని
    మనసు నందు శుద్ది మంచి బుద్ధి
    లేక మొక్కు బడికి శ్రీ కరుడౌ శంభు
    పూజ సేయ సిరులు పూజ్యము లగు.

    రిప్లయితొలగించండి
  2. నాకు ఫోన్ చేసి మాట్లాడే మిత్రులకు మనవి....
    ఇకనుండి నాతో మాట్లాడాలనుకునే మిత్రులు దయచేసి మా ల్యాండ్ ఫోను నెంబర్ కు ఫోన్ చేయండి. నం. 0870 2423773. నిన్న రాత్రే నా సెల్ పోన్ ను పోగొట్టుకున్నాను. అసలే కొత్తది, కొని నెలకూడా కాలేదు. ఎంత ప్రయత్నించినా దొరకలేదు.

    రిప్లయితొలగించండి
  3. అయ్యో.. నంబర్ డీ యాక్టివేట్ చేస్తే మంచిది గురువు గారు.

    రిప్లయితొలగించండి
  4. శంకరార్యా! మీ సెల్ ఫోన్ పోయి నందుకు విచారించుచున్నాను. మందాకిని గారు చెప్పినట్లు డీ యాక్టివేట్ చేస్తే మంచిది.

    రిప్లయితొలగించండి
  5. ఆ నంబర్ కు ఎన్ని సార్లు ఫోన్ చేసినా ‘స్విచ్డ్ ఆఫ్’ అని వస్తోంది. పదిగంటలకు టెలీఫోన్ భవన్ వెళ్ళి డీ యాక్టివేట్ చేయిస్తాను.

    రిప్లయితొలగించండి
  6. శ్రీగురుభ్యోనమ:

    కపట సామి యొకడు కనకము సృష్టింతు
    ననుచు పలికె ప్రజలు నమ్మునట్లు
    ధనము సొమ్ము లతని దగ్గర జేర్చిరి
    పూజ సేయ, సిరులు పూజ్యము లగు

    రిప్లయితొలగించండి
  7. వృద్ది నొందు నయ్య ! వృషభ వాహను
    పూజ సేయ సిరులు , పూజ్యము లగు
    భక్తి లేమి జేయు బహు పూజ లన్నియు
    శివుని పూజ సేయ శ్రీలు నొసగు .

    రిప్లయితొలగించండి
  8. అయ్యా! సుబ్బారావు గారూ!
    మీ పద్యములో భావము బాగుగ నున్నది. 1వ పాదములో గణములు సరిపోవుట లేదు. ఇలా సవరించుదాము:
    "వృద్ధి నొందునయ్య వృషభాధివాహను"

    రిప్లయితొలగించండి
  9. దర్శనమ్మునకును తత్త్వబోధలకును
    ధ్యానశిక్షణకును జ్ఞానమునకు
    పైస వలెను నేటి స్వాముల కెన్నగ
    పూజ సేయ సిరులు పూజ్యము లగు

    రిప్లయితొలగించండి
  10. సంధ్య వేళ నిద్ర సతత మాగ్రహమును
    జూద మద్యపాన చోర జార
    వ్యసనములవి తెలియవా నీవలక్ష్మికి
    పూజ సేయ సిరులు పూజ్యము లగు

    రిప్లయితొలగించండి
  11. శుభము గలుగ బోదు సుఖములు పూజ్యము
    బుధులు మెచ్చ బోరు విధులు మరువ
    చిత్త శుద్ధి లేక శివకేశవుల నీవు
    పూజ సేయ సిరులు పూజ్యములగు.

    రిప్లయితొలగించండి
  12. గురువు గారికి నమస్కారములు
    -------
    స్వామి పూజ సేయ సంతకు పోవంగ
    కానవచ్చెనంత కనకపు వెల,
    ఫలముల వెల జూసి బరుగుబెట్టి యనెను,
    పూజసేయ సిరులు పూజ్యములగు|

    రిప్లయితొలగించండి
  13. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    _____________________________________________
    పూని కించుక మనసున - లేని నాడు
    బూది నెంతయొ యొడలంత - పూసుకొనిన
    పూల గుత్తుల, దండల - ప్రోగు జేసి
    పూజ సేయ సిరులు - పూజ్యము లగు !
    _____________________________________________
    గద+ ఆ పురి = గదా పురి

    రిప్లయితొలగించండి
  14. నేమాని వారికి నమస్కారములు .
    మీసవరణ బాగున్నది. కృతజ్ఞ తలు
    సవరింతును .

    రిప్లయితొలగించండి
  15. వృద్ది నొందు నయ్య ! వృషభాధి వాహను
    పూజ సేయ సిరులు , పూజ్యము లగు
    భక్తి లేమి జేయు బహు పూజ లన్నియు
    శివుని పూజ సేయ శ్రీలు నొసగు .

    రిప్లయితొలగించండి
  16. 01అ )
    _____________________________________________

    పూజ సేయ , బుద్ధి = పురహరు పై నిల్ప
    పుణ్య ఫలము లొదవు - పుడమి పైన !
    భువిని భూరి పైన - బుద్ధి నిలుపలేని
    పూజ సేయ సిరులు - పూజ్యము లగు !
    _____________________________________________

    రిప్లయితొలగించండి
  17. భక్తి కలుగు పూజ భర్గుని మెప్పించు
    రక్తి యున్న వాని రాగమతి శయిల్లు
    వినయ మున్న జనుల వేలుపు కృపయుండు
    పూజ సేయు సిరులు పూజ్యము లగు .

    రిప్లయితొలగించండి
  18. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘కపట సామి’ అనే కంటే ‘కపటి సామి’ అంటే బాగుంటుంది.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    చమత్కారభరితంగా చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    పూరణ బాగుంది కానీ ... పప్పులో కాలువేసారు. ఇచ్చింది ఆటవెలది. మీరు తేటగీతిని ఆశ్రయించారు. మీకోసం సమస్య పాదాన్ని మారుస్తున్నాను ‘పూజ సేయంగ సిరులన్నిపూజ్యములగు’
    ఓహ్! తర్వాత మార్చారు కదా! బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    బాగుంది. అభినందనలు.
    రెండవపాదంలో గణదోషం. ‘రాగ మతిశయిల్లు’ను ‘రాగ మెసగు’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  19. ఓ తండ్రి:

    పొమ్ము, యెచటొ యుద్యోగమ్ము పొందుమింక
    లెమ్ము,కాదన్నచెలియనెపమ్మువిడుము
    పాత జ్ఞాపకమ్ములనామెపటములకును
    పూజ సేయ సిరులు - పూజ్యములగు !

    రిప్లయితొలగించండి
  20. పొమ్ము,భుక్తికైనఁబొందుముద్యోగమ్ము
    లెమ్ము,వలదనినచెలియనెపమ్ము
    విడుము,తనపటముకువేడుచు నిరతమ్ము
    పూజ సేయ సిరులు - పూజ్యములగు !
    -----------------------------------

    రిప్లయితొలగించండి
  21. ధన్య వాదములు తమ్ముడూ ! నేనూ మర్చి పోయి తేట గీతి అనుకున్నాను [ రెండవ పాదం . ] ఎక్కడో తేడా ఉమ్దనుకున్నాను గాననీ ప్చ్ ! గుర్తు రాలేదు. అలవాటేగా ?

    రిప్లయితొలగించండి
  22. ‘ఊకదంపుడు’ రామకృష్ణ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    ‘పటముకు’ అన్నారు ‘పటమునకు’ అనాలనుకుంటా. అక్కడ ‘పటమును’ అంటే సరి!

    రిప్లయితొలగించండి