11, ఫిబ్రవరి 2012, శనివారం

సమస్యాపూరణం - 619 (కపట యతులఁ గనిన)

కవిమిత్రులారా,


ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది -

కపట యతులఁ గనినఁ గలుఁగు ముదము.

(కవి మిత్రులెవరైనా సర్వలఘు పద్యాన్ని వ్రాసే ప్రయత్నం చేస్తారా?)

ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

19 కామెంట్‌లు:

 1. మిత్రులార!
  సర్వలఘు సీసమునకు ఈ క్రింది లక్షణములు బాగుండును:
  సీస పాదములలో ప్రతి పాదములో 5 మాత్రల గణములను ఇంద్రగణములకు బదులుగా వాడవలెను. క్రింది తేటగీతిలో గాని ఆటవెలదిలో గాని మామూలుగా 4 లఘువుల ఇంద్రగణములను వాడవచ్చును. సూర్యగణములను మామూలుగా వాడుకొనవచ్చును. నేను నా రామాయణములో వ్రాసిన సర్వలఘు సీసమును ఆలాగుననే వ్రాసేను.

  రిప్లయితొలగించండి
 2. మగసిరి దొరయనుచు,మరువక తలచుచు,
  సతతము తనకొఱకు జపము సలుపు
  ముదిత కరము గెలువ- ముదమున నగుపడు
  కపట యతులఁ గనినఁ గలుఁగు ముదము.

  సుభద్ర కొఱకు అర్జునుడు వచ్చుట గాంచి కృష్ణుని భార్యలు సుభద్రతో పరిహాసాలాడుట.

  రిప్లయితొలగించండి
 3. మన్నించాలి. 'సర్వ లఘు' నియమాన్ని పాటించ లేదు. ఈ విషయం తోనే ప్రయత్నిస్తాను.

  యంత్ర నయనములనె యెచటనో చొప్పించి
  గుట్టు ' చిత్రముగను ' రట్టు జేసి
  నిజము చూప బూను నిజ జర్నలిస్ట్లకు
  కపట యతులఁ గనినఁ గలుఁగు ముదము.

  రిప్లయితొలగించండి
 4. శ్రీపతిశాస్త్రిశనివారం, ఫిబ్రవరి 11, 2012 8:54:00 AM

  శ్రీగురుభ్యోనమ:

  జపము తపము జేసి జయము గూర్చెడివారు
  స్వార్థమెరుగనట్టి సాదు జనులు
  విశ్వ శాంతి గోరు విజ్ఞులైనట్టి ని
  ష్కపట యతులఁ గనినఁ గలుఁగు ముదము.

  రిప్లయితొలగించండి
 5. విరిసి మధువు లొలుకు విరి తెలుగు నుడులు
  పొదిగి కవుల యెదలు సుధలు గురియ
  పొసగ కవిత లమరె బుధజన సవరిత
  కపట యతుల – గనిన గలుగు ముదము

  రిప్లయితొలగించండి
 6. చీ దరించు కొందు జిటపట లాడుదు
  గపట యతుల గనిన , గలుగు ముదము
  మంచి నడవ డికయు మంచి బుద్ది గలుగు
  ననవ రతము సాధు యతుల జూడ .

  రిప్లయితొలగించండి
 7. శ్రీ రాజారావు గారూ మీరు మా ఊరి వాస్తవ్యులని తెలిసి (మీ ప్రొఫైల్ ద్వారా) చాలా సంతోషం కలిగినది.మీరు అమెరికాలో ఉండేవారేమో అనుకున్నాను.

  రిప్లయితొలగించండి
 8. రాజారావుగారి పూరణ హృద్యంగా ఉంది.

  అరయు కనులు తెఱచి యటునిటు నడుమను
  తపము సలుపు పగిది తలను నిలుపు
  మనసు వెదకు నెపుడు ధనమునె నగవగు
  కపట యతుల గనిన, గలుగు ముదము

  రిప్లయితొలగించండి
 9. ఇహము, పరము లనిన నెఱుగని మనుజుల
  ధనము బడయు నధమతముల, ఖలుల,
  కపట యతులఁ గనినఁ గలుఁగు ముదము
  ద; మురళిధరుడ! వరదకరమిడుము.

  ముదముద =సంకోచము.
  అధమతములు = అధములలో అధములు
  ఖలులు = మోసగాండ్రు
  వరదకరము = వరదహస్తము= అభయహస్తము

  రిప్లయితొలగించండి
 10. ఇహము, పరము లనిన నెఱుగని మనుజుల
  ధనము బడయు నధమతముల, ఖలుల,
  కపట యతులఁ గనినఁ గలుఁగు ముదము
  ద; మురళిధరుడ! వరదకరమిడుము.

  ముదముద =సంకోచము.
  అధమతములు = అధములలో అధములు
  ఖలులు = మోసగాండ్రు
  వరదకరము = వరదహస్తము= అభయహస్తము

  రిప్లయితొలగించండి
 11. ఈనాటి సమస్యతో సంబంధము లేకున్నా ఒక సర్వ లఘు సీసమును శివ స్తోత్రముగా ఈ ఉదయము వ్రాసేను - తిలకించండి:

  నిను దలతు పరమశివ! నిఖిల జగదధిప! భవ!
  గిరితనయ హృదయమున పరగు వరద!
  నిను గొలుతు భవహరణ! నిగమచయ వినుత! హర!
  ధనదముఖహిత భజిత వనజ చరణ!
  నిను దెలుతు సకల సురనికర విపదపహరణ!
  వృషభవరగమన! శుభ విజయ వరద!
  నిను నెడద నిలుపుదును నిరతమును సుఖ జలధి
  నలరుదును భుజగధర ! అమిత విభవ!
  సకల కళలకు నధిపతి! సరస హృదయ!
  హిమగిరి నిలయ! పశుపతి! శమన శమన!
  భువన శుభకర! స్మరహర! పురచయహర!
  ప్రమథగణనుత! హరిహిత! భవభయహర!

  నేమాని రామజోగి సన్యాసి రావు

  రిప్లయితొలగించండి
 12. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  మందాకినిగారి స్ఫూర్తితో :

  "శ్రీకృష్ణార్జునయుద్ధం " సినిమాలో
  శ్రీకృష్ణుడు ఆనతిస్తే , కపట యతి వలె వచ్చిన బావను
  అర్జునుడి గురించి అడుగుతుంది సుభద్ర !

  "అర్జునుడా ! నాకు పరమ మిత్రుడు ! శరీరాలు వేరుగాని మా ప్రాణమొక్కటే !
  ఈ క్షణమే అతణ్ణిక్కడికి రప్పించ గలను ! కనులు మూసుకో " మని
  యతివేషం తొలగించి " యిడుగో చూడు ! " మన్న బావను చూసి
  సంభ్రమాశ్చర్య యైన మరదలిని తొలుత చూపులతోనూ ,
  ఆపై కరములతోనూ బిగియార కౌగిలించిన
  కపట యతిని గని ముదము నొందని ముదిత , ఉండబోదు గదా !


  01)
  _____________________________________________

  కమల నయను డనుప - కపట మునిగ నదె
  కలికి గొనుట కరిగె - కపిరథుడట !
  కనుకలిని ,కరముల - కవుగిలి నదిమెడు
  కపట యతుల గనిన - గలుగు ముదము !
  _____________________________________________
  కమల నయనుడు = శ్రీకృష్ణుడు
  అనుపు = ఆఙ్ఞాపించు
  కలికి = స్త్రీ(సుభధ్ర)
  కొను = స్వీకరించు , చేపట్టు
  కపిరథుడు = అర్జునుడు
  కనుకలి = చూపు
  కవుగిలి = కౌగిలి
  యతుల = యతీంద్రులను ( గౌ.వా)

  రిప్లయితొలగించండి
 13. అయ్యా ! నేమాని వారూ ! ధన్యవాదములు !
  ఈ 5 మాత్రల సూత్రమేమిటో అడుగుదామనుకుంటూ యుండగానే
  మీ సీస పద్యం ప్రకటించారు ! చాలా బావుంది !
  ఇందులో ఇంద్ర గణాలకు బదులు చంద్ర గణమైన "నలల" నుపయోగించారు !
  అలా ఉపయోగించవచ్చా ?
  ఇంకా యీ చంద్రగణములు యెక్కడెక్కడ ఉపయోగించ వచ్చును ?
  దయచేసి వివరించండి !

  నావద్దనున్న పొత్తములో " అక్కరలలో " ఉపయోగిస్తారని యున్నది !
  అక్కరలు 5 రకములు అందు ముఖ్యమైనది మధ్యాక్కర అంటూ
  ఆ పొత్తములో దాని నొక్కదాని గురించే వ్రాయబడినది !
  అందులో చంద్ర గణములు వాడబడలేదు !

  రిప్లయితొలగించండి
 14. నేమానివారి స్ఫూర్తితో :

  పై కథే !
  చెప్పడానికి ఆటవెలది సరిపోక సీసం నాశ్రయించాను !


  01)
  _____________________________________________


  కలకలము మది గుదుప - కపిరథుని కలవరము
  కనికరము గొని వినిన - కమల నయను

  డదిగదిగొ ,కపటముని - వయి యచట పొసగ మన
  కపిరథుడు , కవిల గొని - కపట యతిగ

  కనుకొనల , కనుగొనెను - కపటముగ కలికి నట
  తడబడుచు, నొడబడగ - తనువు మనసు !

  కలికి యట యడిగెనట - కపిరథుని విషయమును
  కులుకుచును కపట ముని - పలికె నిటుల !

  కపిరథు కను గొనగ -కలికి , కలవరము
  వలదు ! కపిరథుడను - పడతి గనుము !
  కపట యతిని గనిన - కలికి కులికె !
  కపట యతుల గనిన - గలుగు ముదము !
  _____________________________________________
  పొసగు = చరించు
  ఒడబడు = సంతోషించు

  రిప్లయితొలగించండి
 15. నేమానివారి స్ఫూర్తితో :

  పై కథే !
  చెప్పడానికి ఆటవెలది సరిపోక సీసం నాశ్రయించాను !


  01అ)
  _____________________________________________


  కలకలము మది గుదుప - కపిరథుని కలవరము
  కనికరము గొని వినిన - కమల నయను

  డదిగదిగొ ,కపటముని - వయి యచట పొసగ మన
  కపిరథుడు , కవిల గొని - కపట యతిగ

  కనుకొనల , కనుగొనెను - కపటముగ కలికి నట
  తడబడుచు, నొడబడగ - తనువు మనసు !

  కలికి యట యడిగెనట - కపిరథుని విషయమును
  కులుకుచును కపట ముని - పలికె నిటుల !

  కపిరథు కను గొనగ -కలికి , కలవరము
  వలదు ! కపిరథుడను - పడతి గనుము !
  కపట యతిని గనిన - కలికట కులికెను !---(గనుక )
  కపట యతుల గనిన - గలుగు ముదము !
  _____________________________________________
  పొసగు = చరించు
  ఒడబడు = సంతోషించు

  రిప్లయితొలగించండి
 16. మిత్రులారా,
  ఈనాటి సమస్య సర్వ లఘువుగా ఉండడం వల్ల సర్వలఘు పద్యం వ్రాయడానికి ఉత్సాహం ఉన్నవాళ్ళను ప్రయత్నించమన్నానే కాని కచ్చితంగా వ్రాయాలని చెప్పలేదు. గమనించ ప్రార్థన. మామూలుగానే పూరించవచ్చు.

  రిప్లయితొలగించండి
 17. పండిత నేమాని వారూ,
  సర్వలఘు సీసపద్యం లక్షణాన్ని చెప్పి, మనోహరమైన లక్ష్యాన్ని కూడా ఇచ్చినందుకు ధన్యవాదాలు.
  *
  మందాకిని గారూ,
  సర్వలఘువులుగా మీ రెండు పూరణలూ అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మంచి విషయాన్ని ఎంచుకున్నారు. మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  శ్రీపతి శాస్త్రి గారూ,
  ‘నిష్కపట’ యోగులను ఆశ్రయించిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  *
  లక్కాకుల వెంకట రాజారావు గారూ,
  మీ సర్వలఘు పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  కాని ‘సవరిత’ శబ్ద సాధుత్వం గురించే అనుమానం.
  *
  సుబ్బారావు గారూ,
  చక్కని విరుపుతో మంచి పూరణ నిచ్చారు. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  సర్వలఘువుగా మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
  *
  వసంత కిశోర్ గారూ,
  అర్జునుని గౌరవవాచకంగా కపటయతులను చేసిన మీ చాతుర్యం ప్రశంశనీయం. మీ సర్వలఘు పద్యం మనోహరం. అభినందనలు.
  అభివ్యక్తీకరంచడానికి మాకు నాలుగు పాదాల భావాల కరువు. మీకేమో పన్నెండు పాదాలుకూడా సరిపోవనుకుంటా! ఆహా! ఏమి భావనాపటిమ! ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 18. అయ్యా! శ్రీ వసంత కిషోర్ గారూ! నమస్తే.
  సర్వ లఘు సీసములో పూర్వ కవులు ఇంద్రగణముల స్థానములో నలల గణములే ఉపయోగించేరు. దాని వలననే పద్యమునకు అందమైన నడక వస్తుంది. వివిధములైన సర్వ లఘు సీసములను ఎక్కడో ఒక పుస్తకములో చూచేను గాని నాకు జ్ఞాపకము లేదు. ఇంద్ర గణములను ఎక్కడెక్కడ ఉపయోగిస్తారో అనేది ఆంధ్రామృతము అనే బ్లాగులో ఒకమారు వివరించేరు. దేశీయ చందస్సులో (రగడలు మొదలైన వానిలో) చంద్రగణములను వాడుతారు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 19. శంకరార్యా ! ధన్యవాదములు !
  నేమానివారూ ! ధన్యవాదములు !

  రిప్లయితొలగించండి