24, ఫిబ్రవరి 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 629 (వైరి పాదములకు)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది -

వైరి పాదములకు వందనములు.

12 కామెంట్‌లు:

 1. దుష్టవర్తనులను దునుమాడ ప్రభవించు
  శౌరి చరణములకు శరణమందు.
  శిష్ట జనులనెల్ల చెణుకునట్టి యసుర
  వైరి పాదములకు వందనములు.

  రిప్లయితొలగించండి
 2. హరిని దలచుట తప్పగు నసుర వైరి
  పాదములకు వందనములు పాడి గాదు
  కనక కశిపుని సుతుడవై విను కుమార
  యనుచు బిడ్డని రాక్షసు డనున యించె

  రిప్లయితొలగించండి
 3. ఇంచు కేని యొరుల గౌర వించ లేని
  గొప్ప లేలయ్య? చాలు , మీ కూర్ము లేల ?
  కారణము లేక వైరముల్ గోరు - గొప్ప
  వారి - వైరి పాదములకు వందనములు!

  రిప్లయితొలగించండి
 4. భవున,కతిపవిత్రు,కవనీతలారాధ్యు,
  కఖిలలోకపూజ్యు,కాదిదేవు,
  కంతకాంత,కభవు,కంబరీషు,కనంగ
  వైరి,పాదములకు వందనములు.

  రిప్లయితొలగించండి
 5. ( యడ్డి = యడ్యూరప్ప) అడ్డు పడగ సదానంద ఈ విధముగా
  అనవరతము యడ్డి యడ్డు పడగ, యున్న
  మంత్రులెల్ల మునెగె మత్తులోన,
  రాజ్యప్రజలెల్ల రాళ్ళు రువ్వగ మ్రొక్కె
  వైరి పాదములకు వందనములు

  రిప్లయితొలగించండి
 6. 1.
  రణము నందు జిక్కి రసపుత్ర వీరులు
  వైరి పాదములకు వందనములు
  సలుప నిచ్చ లేక సమరాంగణము నందు
  అసువులను విడచిరి ,అమరులైరి.

  -------------
  2.దుష్ట శిక్షణమ్ము ,శిష్ట రక్షణకు నై
  అన్ని యుగములందు నవతరించు
  అఖిల లోక నాథు డమర వంద్యు డసుర
  వైరి పాదములకు వందనములు.
  ----------------

  రిప్లయితొలగించండి
 7. శౌరి సకల భక్త జన మానస విహారి
  సర్వ తాప హారి చక్రధారి
  నిర్జరోపకారి నిఖిల దానవ లోక
  వైరి పాదములకు వందనములు

  రిప్లయితొలగించండి
 8. శ్రీగురుభ్యోనమ:

  దివిన దేవతలకు, భువిలోన ప్రజలకు,
  ముని గణంబులకును ముదము గూర్చు
  ధర్మపరుడు సుగుణ ధాముడు రావణు
  వైరి పాదములకు వందనములు

  పెద్దలు మన్నించాలి. (సరదాగా ఒక పూరణ ఆంగ్లపదాలతో)

  సిష్టమందు జేరి కష్టము కలిగించి
  నచ్చినట్టి ఫైళ్ళ నష్టపరచు
  నట్టి దాని విరుగుడైనట్టి "వైరస్సు
  వైరి"పాదములకు వందనములు

  రిప్లయితొలగించండి
 9. గురువొకరు మొదలిడ గొప్పమనసుతోడ
  పద్య విద్య కొఱకు పాఠశాల
  పెరిగి నేటికిచట గురువులేవురు కొలు
  వైరి, పాదములకు వందనములు!

  రిప్లయితొలగించండి
 10. మందాకిని గారూ,
  మీ `అసురవైరి" పూరణ బాగుంది. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  ప్రహ్లాదుని ప్రస్తావనతో `తేటగీతి"లో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  *
  లక్కాకుల వెంకట రాజారావు గారూ,
  తేటగీతిలో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ `అనంగవైరి" స్తోస్త్ర రూపమైన పూరణ సుందరంగా ఉంది. అభినందనలు.
  *
  వరప్రసాద్ గారూ,
  మీ పూరణలు ఎప్పటికప్పుడు తత్కాల రాజకీయాలను ప్రతిబింబిస్తుంటాయి. బాగుంది మీ పూరణ. అభినందనలు.
  మొదటి పాదంలో `అడ్డుపడగనున్న" అందాం. అక్కడ యడాగమం రాదు.
  మూడవ పాదంలో `రాజ్య ప్రజలెల్ల" అన్నచోట గణదోషం. `రాజ్యమందు జనులు" అందాం.
  *
  కమనీయం గారూ,
  మీ రెండు పూరణలూ వైవిధ్యంగా ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  `నిఖిల దానవలోక వైరి"ని ప్రస్తావించిన మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
  *
  శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ మొదటి పూరణ మనోహరంగా ఉంది.
  సరదాగా చెప్పిన మీ `ఆంటీ వైరస్" పూరణ చమత్కారజనకంగా ఉంది. సంతోషం. అభినందనలు.
  *
  ఊకదంపుడు గారూ,
  ఎప్పుడూ మీ పూరణలు వైవిధ్యంగా ఉంటాయి. అలాగే ఈనాటి `గురువులు కొలువైరి" అన్న పూరణ సర్వశ్రేష్ఠంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. ప్రహ్లాదుని గురువుల వద్ద నేర్చిన చదువును చెప్పమని హిరణ్య కశిపుడు అడిగిన సందర్భం.

  గురువు వద్ద గడిన గొప్ప విద్యను నాకు
  అప్ప జెప్పు మనుచు ననగ తండ్రి
  చెప్ప నెంచి మొదట జేసె నసుర వైరి
  వైరి పాదములకు వందనములు.

  రిప్లయితొలగించండి
 12. శౌరినాశ్రయింప సౌరి భయముదప్పు
  నేరికైన భక్తిపారగులకు
  తన్మయత్వమమర తగజేయుడీ కంస
  వైరి పాదములకు వందనములు.

  రిప్లయితొలగించండి