16, ఫిబ్రవరి 2012, గురువారం

సమస్యాపూరణం - 623 (కోడినిఁ దినువాఁడె మేటి)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది -

కోడినిఁ దినువాఁడె మేటి గుణవంతుఁ డగున్.

44 కామెంట్‌లు:

  1. సరదాగా...

    వేడిగ చేడియ జేయగ
    'మూడీ' గా ప్రేమ మీర ముచ్చట దీరన్
    మాడిన నెట్లున్నను ప
    కోడినిఁ దినువాఁడె మేటి గుణవంతుఁ డగున్.

    రిప్లయితొలగించండి
  2. మోడము ఆకాశమ్మున
    జాడలు చూపించె వర్షసంభావననే
    వేడిగ రుచికరమయిన ప
    కోడినిఁ దినువాఁడె మేటి గుణవంతుఁ డగున్.

    మోడము = మబ్బులు

    రిప్లయితొలగించండి
  3. సరదాగా ...........

    చేడియ చెప్పిన వినడే
    వాడేగెను జలధి దాటి వడిగా ననుచున్
    నేడీ ప్రసాదము ధను-
    ష్కోడినిఁ దినువాఁడె మేటి గుణవంతుఁ డగున్.

    రిప్లయితొలగించండి
  4. చిన్న సవరణ తో..

    వేడిగ చేడియ జేయగ
    'మూడీ' గా ప్రేమ మీర ముచ్చట దీరన్
    'మాడిన గీడిన' నుల్లి ప
    కోడినిఁ దినువాఁడె మేటి గుణవంతుఁ డగున్.

    రిప్లయితొలగించండి
  5. వేడుకగా వర్ష మందున
    ఆడినచో నింటి కేగి హా హా యనుచున్ !
    వేడిగ జింజరు మిర్చీప
    కోడినిఁదిను వాఁడెమేటి గుణవంతుఁ డగున్ !

    రిప్లయితొలగించండి
  6. శ్రీగురుభ్యోనమ:

    ఏడవకయ్యా బాపడ
    నేడీ కుస్తీలు పట్ట నీవలనగునా
    తాడో పేడో తేల్చగ
    కోడినిఁ దినువాఁడె మేటి గుణవంతుఁ డగున్

    రిప్లయితొలగించండి
  7. డి.నిరంజన్ కుమార్గురువారం, ఫిబ్రవరి 16, 2012 9:02:00 AM

    కోడితినిన చికెనుగునియ
    తోడయి యారోగ్యముచెడి తుదకు జ్వరముల్
    పీడించు కనుకది వీడి ప
    కోడిని తినువాడె మేటి గుణవంతుడగున్

    రిప్లయితొలగించండి
  8. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    తిలాపాపం తలా పిడికెడు :

    01)
    _____________________________________________

    కోడిని జంపిన పాపము
    కోడిని దినువారి కెల్ల - కోరక వచ్చున్ !
    కోడికి బదులుగ వేడి, ప
    కోడినిఁ దినువాఁడె మేటి - గుణవంతుఁ డగున్ !
    _____________________________________________

    రిప్లయితొలగించండి
  9. వీడడు కౄరత్వంబును
    కోడిని తినువాడె, మేటి గుణవంతుడగున్
    పోడిమి గలదినముల నా
    రూఢిగ దానములజేయ లోగిలియందున్.

    పోడిమి ( సంపద )యొక్క అత్యుత్తమ వినియోగము దానమే కదా, అదీనూ గుప్తదానమే (లోగిళ్ళలో.... ఎవరూ చూడకుండా ). అటువంటివాడె గుణవతుండని నా అభిప్రాయము.

    రిప్లయితొలగించండి
  10. ప్రమాదంలో మరణించిన కోడిని :

    02)
    _____________________________________________

    కోడిని బెంచగ , వీధిని
    కోడిని విడనాడి నపుడు - కొండొక తరుణం !
    కోడికి యాపద గలిగిన
    కోడిని దినువాడు మేటి - గుణవంతుడగున్ !
    _____________________________________________

    రిప్లయితొలగించండి
  11. కోడి జనుల మేల్కొలుపును
    వేడుకగును కోడికూత వినుటకు సఖుడా!
    నేడీ యెర్రని చక్కెర
    కోడిని దినువాడె మేటి గుణవంతుడగున్

    రిప్లయితొలగించండి
  12. అయ్యా! శ్రీ సంపత్కుమార శాస్త్రి గారూ!
    మీ పద్యములో కౄరత్వము అని వాడేరు. క్రూరత్వము అనండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  13. నేమాని పండితార్యా పంచదార చిలకలా తీయగా ఉంది మీ పూరణ.

    రిప్లయితొలగించండి
  14. కోడిని కొనలేని నాడు , వేడుక దీరని , వాడికి
    వేడి వేడి ఉల్లి పకోడీయే కోడి మరి :

    03)
    _____________________________________________

    కూడును దినగా కూరకు
    కోడిని కొనలేని నాడు - కుందక నగుచూ
    కూడిన , వేడిగ , యుల్లి, ప !
    కోడిని దినువాడు మేటి - గుణవంతుడగున్ !
    _____________________________________________

    రిప్లయితొలగించండి
  15. అయ్యా! మిస్సన్న గారూ! మీ స్పందనకు అభినందనలు. మీ పద్యము బాగుగనే యున్నది. తమిళులు ధనుష్కోటి ని ధనుష్కోడి అంటారు. మీరు కూడా ఆ సంప్రదాయమును పాటించేరు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  16. మిస్సన్న మహాశయా ! అది పంచదార చిలుక కాదు !
    చక్కెర కోడి ! తియ్యగా ఉండదామరి !!!

    రిప్లయితొలగించండి
  17. కోడిని , వేడిగ నుల్లి ప
    కోడిని దినువాడె మేటి ? 'గుణవంతు' డిలన్
    కూడు దొరక కల్లాడెడి
    పీడితులకు గంజి పోసి ప్రియమొనరించున్

    రిప్లయితొలగించండి
  18. 04)
    _____________________________________________

    కోడిని జంపగ వలెనా
    కోడిని దినవలె నటన్న - కోరిక దీరన్ ?
    కూడిన, రంగుల , చక్కెర
    కోడిని దినువాడు మేటి - గుణవంతుడగున్ !
    _____________________________________________

    రిప్లయితొలగించండి
  19. కోడిని కోయన వేడి ప
    కోడిని పెట్టన యన విని కోయకు గొంతున్
    కోడిని వీడు మనుచును ప
    కోడినిఁ దినువాఁడె మేటి గుణవంతుఁ డగున్.

    రిప్లయితొలగించండి
  20. వీడుమయా యీ మూఢుడు
    కోడిని దినువాడె, మేటి గుణవంతుడగు
    న్నేడే నా మాటను విని
    గాడిన బడి కోడినిప్డు గాపాడినచో!

    రిప్లయితొలగించండి
  21. అయ్యా కోడినే గాదు , దేన్ని చంపి తిన్నా పాపమే !

    05)
    _____________________________________________

    కోడిని ,లేడిని ,దూడను
    కూడిన వాడగు శరముల - కూడదు చంపన్ !
    కూడును పాపము ! మూగవి !
    కోడిని దినువాడు మేటి - గుణవంతుడగున్ ???
    _____________________________________________

    రిప్లయితొలగించండి
  22. వసంత కిశోరు గారు,

    <<<అయ్యా కోడినే గాదు , దేన్ని చంపి తిన్నా పాపమే !


    చంప కుండ తింటే మరీ 'జీవ హింస' అవుతుందేమో నండీ !!

    జిలేబి.

    రిప్లయితొలగించండి
  23. వాడిగ చురుకుగ నుండును
    కోడిని దినువా డె , మేటి గుణ వంతు డగున్
    కోడికి బదులుగ మేకను
    వేడింగా దిన్న యెడల విజ్ఞత తోడన్

    రిప్లయితొలగించండి
  24. వాడిగ చురుకుగ నుండును
    కోడిని దినువా డె , మేటి గుణ వంతు డగున్
    కోడికి బదులుగ మేకను
    వేడింగా దిన్న యెడల విజ్ఞుడు నౌనున్

    రిప్లయితొలగించండి
  25. నేడింత హెచ్చు వెలయగు
    కోడిని దిననేల దాని గూర్మిని గనుచున్
    వేడుక 'కోటా 'యట్టుల
    కోడిని దినువాడె మేటి గుణవంతు డగున్ !
    -------------------

    రిప్లయితొలగించండి
  26. పై పద్యం 'అహ నా పెళ్ళంట 'చిత్రంలో కోట శ్రీనివాసరావుగారు నటించిన దృశ్యం ని గుర్తు పెట్టుకొని వ్రాసింది.

    రిప్లయితొలగించండి
  27. నిజానికి నేటి సమస్యను ఇంకో కోణం లో ఆలోచిస్తే అందులో సమస్యేమీ లేదు . ఒక కాలం లో కవులూ అవధానులలో అందరూ శాకాహారులుగా ఉండే కాలం లో ' కోడిని తినటమా శివ శివా ' అని ముక్కున వేలేసుకునే కాలానికి సంబంధించిన సమస్య ఇది . కోడికి పకోడికి ఉన్న నామ సామ్యాన్ని ఆధారంగా చేసుకోడమే తప్ప ఇందులో పెద్ద సమస్య ఏం లేదు . ఇంకా మాట్లాడితే , మాంసాహారులైన వారిలోనూ ఎందరో మహానుభావులూ , మహాకవులూ ఉన్న నేటికాలానికి ఏమంతగా వర్తించదు కూడా .

    సమస్య ను అలాగే , అంటే కోడిని పకోడి చేసి తీరాలా ? కోడి గానే ఉంచితే ఏం తప్పు అనే ప్రశ్న రాక మానదు , ముఖ్యంగా మాంసాహార కవులకూ , అవధానులకూ. నిజమే కదా ! పకోడి తినేవాళ్లందరూ ఎలాగైతే గుణవంతులు కాలేరో , కోడిని తినేవాళ్లందరూ గుణవంతులు కాకుండానూ పోరు . స్వతహాగా ఒక వైపు కోడిని తింటూనే కేవలం కవిత్వం కోసం , కోడిని పకోడిగా మార్చడానికి ఏ మాంసాహార కవి అంతరాత్మా అంగీకరించదు . ' గోంగూరను దినెడివాడె కోవిదవరుడౌ ' అని అంటే ఒక శాకాహారి ఎంత స్వభావసిద్ధంగా భావిస్తాడో , ' కోడిని దినువాడె ' లో ఒక మాంసాహారీ అంతే సహజసిద్ధంగా భావిస్తాడు . ఇది ఒకవైపు -

    మరి మాంసాహారం తప్పా ఒప్పా అనే శాస్త్ర విచికిత్స అవసరం లేదు కాని , ఇప్పుడున్న మేకలూ , గొర్రెల సంతతిని అవన్నీ సహజ మరణం చెందేదాకా , అలాగే వృద్ధి చెందిస్తే చివరికి మానవునికే శాకపాకం దొరకదనేది మాల్థూస్ సిద్ధాంతం చదివిన ఎకాలజిస్టులకు తెలిసే విషయం - జీవుల పాపపుణ్య పరిపాకాన్ని బట్టి పుట్టవలసిందే , గిట్టవలసిందే - 'యుక్తతమ జీవుల మనుగడ , బలహీన జీవులు అంతరించిపోవడం ' అనేది డార్విన్ పరిణామ సిద్ధాంతము కూడా ! కొన్ని విషయాలంతే !

    కోడిని దినును సినారే ;
    కోడిని దిను మేడసాని ; కోడిని దినుబో
    చూడగ సీ వీ సుబ్బన ;
    కోడినిఁ దినువాఁడె మేటి గుణవంతుఁ డగున్.

    సినారె మొదలైన మేటికవుల గురించి మరో పార్శ్వం లో పూరణ .

    రిప్లయితొలగించండి
  28. డా. విష్ణు నందన్ చక్కగా చెప్పారు. కాని వారి పద్యం ప్రకారం సినారే వగైరా కోడిని తినువాడే మేటి గుణవంతుడంటే యేదో సామెత చెప్పినట్టుగా ఉంది. డాక్టరుగారి పధ్ధతిప్రకారమే కోడిని తిననివాళ్ళలోనూ మహానుభావు లుంటారుగా మరి. వారి పద్యం చివరపాదం న్యాయంగా "కోడినిఁ దిని గూడ మేటి గుణవంతుఁ డగున్" అని ఉండాలి. అప్పుడు కోడిని తినువారికి తినని వారికీ కూడా సమానన్యాయం చేసిన వారవుతారు.

    రిప్లయితొలగించండి
  29. డాక్టరుగారు చెప్పినట్లు కోడిని పకోడీగా మార్చటమనే చప్పిడిపూరణమేనా అయతే సమస్య యేముందని అనిపించటం న్యాయమే. కాని యథాతథంగ సమస్యను పూరిస్తే యేదో ఒకరకం కోడిని తినేవాడే గుణవంతుడన్న అర్థం వస్తున్నది గదా. ఇది ముందే మనవి చేసినట్లు భావ్యంగా ఉండదు. కాబట్టి, వేరే రకంగా పూరించగలమా అన్నది నాకు అనిపించిన అసలు సమస్య.

    రిప్లయితొలగించండి
  30. అది నా భావన కాదు . ఒక ఫక్తు మాంసాహార కవి భావన ! అతనికి కోడిని తినే వాడే గుణవంతుడు ! అదంతే !!! అతని భావాన్ని మనం ప్రశ్నించలేం !!!

    రిప్లయితొలగించండి
  31. చర్చ బాగుంది.
    నా చిన్నతనంలో మా ఊళ్ళో తెన్నేటి విశ్వనాధం గారని ఒక గొప్ప వ్యక్తి ఉండేవారు. వారి ఇంట్లో ప్రతి నిత్యమూ సాహితీ సభలు జరిగేవి. ఎందరో మహానుభావులు, జంద్యాల పాపయ్య శాస్త్రి గారూ, దివాకర్ల వేంకటావధాని గారూ, అనంత పంతుల రామలింగయ్యగారూ వంటి ఉద్ధండులు పాల్గొనేవారు ఆ సభలలో. నేను అప్పుడు చాలా చిన్నవాడిని, బహుశా ఏడో ఎనిమిదో ఏళ్ళ వయసు ఉండవచ్చు. మా తాతగారితో పాటూ నేను కూడా ఆ సభకు వెళ్ళేవాడిని (అక్కడ దొరికే అరటి పండు మీద ఆశతో) అప్పుడు ఒక సారి నేను విన్న సమస్య ఇది

    కోడి తిన్నిన బ్రాహ్మణుండి కోరిక తీరెన్

    దానిని కూడా పకోడి తినిన అనే పూరించడం జరిగింది.

    అలాగే
    తలమేపెను పక్షి వేగ తన పిల్లలకున్ అనే సమస్యను

    మిడుతల మేపెను పక్షి అని పూరించడం కూడా జరిగింది.

    డాక్టరు గారు చెప్పినట్టు వీటికి అలా తప్ప మరోలా పూరణ కనపడలేదు మరి.

    రిప్లయితొలగించండి
  32. మిత్రులారా!
    ఈనాటి సమస్యను గురించి చర్చను చూస్తున్నాను. సమస్యను ఏదో కాలక్షేపము కొరకు అని చాల తేలికగా తీసుకొనుటే ఉత్తమము కాని చాల ఎక్కువ వివరములలోనికి పోనక్కరలేదు అని నా ఉద్దేశము. అనుదినము నొక సమస్యను ఎంపిక జేయుటే ఒక సమస్య. అందుచేత ఏదో సరదాగ వీలయినట్లు పూరించి ఊరుకొంటే ఉత్తమము. ప్రతిదినము ఒక సమస్య ఇచ్చుట అనే విధానమును కూడా మార్పు చేస్తే ఎలా ఉంటుంది? ప్రయత్నించండి మిగతా అనేక ప్రక్రియలు ఉన్నవి కదా. స్వస్తి

    రిప్లయితొలగించండి
  33. నేనిది చర్చ అని భావించడం లేదు . వాదము అనీ అనుకోవడం లేదు . నిజానికి ఈ సమస్యకు 'పకోడి ' అని మాత్రమే పూర్తి చేయవలసి వస్తుందనీ అనలేదు. నిష్కర్షగా నా అభిప్రాయం వెల్లడించడమే అభిమతం . వచ్చిన చిక్కల్లా , ' కోడిని తినడం ' సమస్య కావడమే ! అదేదో సర్వసాధారణ విషయమనుకుంటే సమస్యే లేదు . ఇదే సమస్య ఒక మాంసాహారికిస్తే ఎలా పూరిస్తాడనేదే నేను చెప్పిన విషయం ! కోడిని తినడం ఖచ్చితం గా పరిహరించాలనే ధోరణిలో పూరణలను గమనించడమే ఇక్కడ విచిత్రం , కొండొకచో మాంసాహారులను నిందించే ధోరణి అంతకన్నా విచిత్రం . (ఎందుకు నిందించకూడదో పైన వివరించాను ) ఇదే సమస్య మాంసాహారి యైన పైన నేను చెప్పిన అవధానులకు ఇచ్చి చూడండి , అదెంత సామాన్యాంశమో వారే చెబుతారు !

    రిప్లయితొలగించండి
  34. డాక్టరు గారూ! మీ అభిప్ర్రాయము నిజమే.అందులకే 'పాజిటివ్' గా కూడా వ్రాద్దామని ప్రయత్నించాను.

    వాడికి బలమని డాక్టరు
    కోడిని మరి గ్రుడ్లు కొంత క్రొవ్వును పెంచన్
    వీడక తినమని చెప్పగ
    కోడినిఁ దినువాఁడె మేటి గుణవంతుఁ డగున్.

    రిప్లయితొలగించండి
  35. ఈరోజు మా బావగారి పెద్దకర్మకు వెళ్ళి ఇంతకు ముందే వచ్చాను. ఇప్పుడే సమస్యపై జరిగిన చర్చ చూసాను. విలువైన అభిప్రాయాలను తెలిపిన అందరికీ ధన్యవాదాలు.
    నిజానికి ఈరోజు ఉదయం నేనివ్వబోయిన సమస్య సుబ్బారావు గారు పంపిన ‘మూషికములఁ దిన్న యెడల మోక్షము వచ్చున్’ అనేది. కాని తీరా ‘పోస్టును ప్రచురించు’ దగ్గర క్లిక్ చేయబోతూ ఇందులోని ‘ష’కార ప్రాస ఔత్సాహిక మిత్రులకు ఇబ్బంది కలిగిస్తుందేమోనని భావించి, దాని స్ఫూర్తితోనే పై సమస్యను అప్పటికప్పుడు సిద్ధం చేసాను. యుక్తాయుక్తాల గురించి ఆలోచించలేదు. ఊరికి వెళ్ళవలసి ఉంది. సమయం లేదు.
    రోజు కొక సమస్య ఇవ్వాలని నేను పెట్టుకున్న నియమం వల్ల అప్పుడప్పుడు చప్పనివో, వివాదాస్పదమైనవో, (దేవుళ్ళపై) కొందరి మనస్సులు నొచ్చుకొనేవో, అసంగతమైనవో దొర్లిపోతూ వుంటాయి. పెద్దమనసుతో వాటిని మన్నించండి.
    ఏదో ‘సరదాగా’ అని భావించాలని మనవి.
    అలసిపోయాను. రేపు ఉదయం మీ మీ పూరణలపై స్పందిస్తాను.
    ‘తెలుగు పద్యకవిత్వమ్ము వెలుఁగుఁ గాక!’

    రిప్లయితొలగించండి
  36. జోడెద్దులనున్ రేలన్
    బాడినిడెడుగోచయమును ప్రామియె తగకా
    పాడగ దాచియె పిల్లల
    కోడినిఁ, దినువాఁడె మేటి గుణవంతుఁ డగున్.

    రిప్లయితొలగించండి
  37. మేక డోనాల్డు చికను బర్గరు రుచిచూడ,
    పిజ్జా హట్టు ప్రీతి తోడ పిలువ
    ఓయ్ అని కెం'టూకీ 'ఫ్రైడు
    కోడినిఁ, దినువాఁడె మేటి గుణవంతుఁ డగున్!!

    చీర్స్
    కళేబరం!

    రిప్లయితొలగించండి
  38. కోడి,పకోడీ మీద మంచి సరదాయైన చర్చ జరిగింది. అందరికీ అభినందనలు.

    కోడిని తినువా డిట్లను
    కోడినిఁ దినువాఁడె మేటి గుణవంతుఁడు ప-
    క్కోడిని తినువా డనును ప-
    కోడినిఁ దినువాఁడె మేటి గుణవంతుఁ డగున్!!

    రిప్లయితొలగించండి
  39. కోడిని, తినడమా ,మానడమా,మంసాహారమా ,శాకాహారమా అనే ప్రశ్నే లేకుండా,పకోడి అనే పదమే వాడకుండా,హాస్యస్ఫోరకంగా నేను చేసిన పూరణ గురించి కూడా బ్లాగు మిత్రుల వ్యాఖ్యలు కోరుతున్నాను.-కమనీయం

    రిప్లయితొలగించండి
  40. కమనీయంగారు ! కోడిని కోయకుండా ' కోట' గట్టి చూపి ఉత్తుత్తి ' కోడిని ' తినిపించిన మీ పూరణ విలక్షణము గా నున్నది.

    రిప్లయితొలగించండి
  41. లేడులు కుక్కలు పందులు
    వేడిగ కప్పలు మిడుతలు వేచిన పాముల్
    వాడుకయౌ చైనా లో
    కోడినిఁ దినువాఁడె మేటి గుణవంతుఁ డగున్

    రిప్లయితొలగించండి
  42. వాడుక లేకయె పోటిని
    తాడును పేడును గనకయె త్రాగుచు రమ్మున్
    వేడుక మీరగ పచ్చిది
    కోడినిఁ దినువాఁడె మేటి గుణవంతుఁ డగున్

    రిప్లయితొలగించండి
  43. "కుందేలును కోడి గుటుక్కున మింగెన్" సమస్యకు పూరణ కుదురునా ?

    రిప్లయితొలగించండి