18, ఫిబ్రవరి 2012, శనివారం

శివానందలహరి _ 3కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపః

ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే
శివాభ్యా మస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్
భవాభ్యా మానంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం

శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారి అనువాదం.....


సీ.
శశికళా భూషణుల్ సకల కళామయ
తత్త్వవైభవులునై తనరు వారు
ఒకరి తపమ్మున కొకరు ఫలమ్మునై
యాదిదంపతులునై యలరు వారు
ఆశ్రయించి భజించునట్టి భక్తుల బ్రోచి
సముచిత వరము లొసంగు వారు
అమిత శుభాధియోగముల లోకములకు
కలిగించు మంగళకర విభవులు
తే.గీ.
భవులు నభవులు మామక స్వాంతమందు
సంతత సుఖానుభవ విశేషములు గూర్చు
నట్టి పార్వతీశ్వరులను సాదరమున
దలచి నే నాచరింతు వందనశతమ్ము

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి