6, ఫిబ్రవరి 2012, సోమవారం

చమత్కార పద్యాలు - 189


ప్రహేళిక
గోగజవాహన భోజనభక్ష్యో
ద్భూతప మిత్ర సపత్నజ శత్రోః |
వాహనవైరి కృతాసనతుష్టా
మామిహ పాతు జగత్త్రయజుష్టా ||
అర్థాలు
గోగ = నందిపై పయనించే శివుని వలన
= పుట్టిన కుమారస్వామి యొక్క
వాహన = వాహనమైన నెమలికి
భోజన = ఆహారమైన సర్పానికి
భక్ష్య = ఆహారమైన వాయువు వలన
ఉద్భూత = పుట్టిన హనుమంతుని
= అధిపతి ఐన సుగ్రీవునికి
మిత్ర = మిత్రుడైన శ్రీరామునికి
సపత్న = శత్రువైన రావణుని వలన
= పుట్టిన ఇంద్రజిత్తు యొక్క
శత్రోః = విరోధి యైన ఇంద్రుని యొక్క
వాహన = వాహనమైన ఏనుగుకు
వైరి = శత్రువైన సింహంపై
కృత = ఏర్పరచుకొన్న
ఆసన = ఆసనంపై కూర్చుని
తుష్టా = సంతోషించేది
జగత్త్రయ = ముల్లోకాలచేత
జుష్టా = సేవింపబడేది అయిన దుర్గాదేవి
ఇహ = లోకంలో
మాం = నన్ను
పాతు = పాలించుగాక!

(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారిప్రహేళికలుగ్రంథం నుండి)

4 కామెంట్‌లు:

  1. గురువు గారు,
    బాగుంది. సపత్న అంటే శత్రువా? అయితే సపత్ని వాచ్యార్థంగా కూడా శత్రువేనా? :)
    (అర్థం శత్రువు కాకపోయినా ....నిజానికి సపత్ని శత్రువే కదా!)

    రిప్లయితొలగించండి
  2. మందాకిని గారూ,
    సపత్ని అంటే సవతి. సపత్నుడు అంటే శత్రువు.
    అయినా ‘సపత్నుడు’కు స్త్రీలింగ పదం ‘సపత్ని’యే కదా!

    రిప్లయితొలగించండి
  3. అదేనండి,
    సపత్ని అంటే సవతి కాబట్టేనండీ అడిగాను. :)

    రిప్లయితొలగించండి