కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది -
సురభులకుఁ బుట్టుచుండెను ఖరము లకట!
(శ్రీ పండిత నేమాని వారి ఆధ్యాత్మరామాయణంనుండి ఈ పద్యపాదాన్ని సూచించిన
పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు)
ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది -
సురభులకుఁ బుట్టుచుండెను ఖరము లకట!
(శ్రీ పండిత నేమాని వారి ఆధ్యాత్మరామాయణంనుండి ఈ పద్యపాదాన్ని సూచించిన
పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు)
విశ్వ గురువుగనొకనాడు విల్లసిలెను,
రిప్లయితొలగించండిభరతజాతి, దేశమనిన భక్తి గలిగి,
భాషపై మమకారము, పట్టు కలిగి.
సురభులకుఁ బుట్టుచుండెను ఖరము లకట!
నాటి భారతీయుల కన్న నేటి భారతీయులకు సంపద పెరిగింది కానీ, సౌకర్యాలతో సుఖిస్తున్నారు కానీ, స్వంత దేశము, భాషలపైన చిన్నచూపు పెరిగినది.
అందుకే అలనాటి వారు సురభి వలె గౌరవనీయులు, ఈనాటి వారు సంపదలను కలకాలం నిలిచేవని మోస్తూ తిరుగుతున్న ఖరములు.
మన్నించాలి, కొంచెం ఎక్కువే ఆవేశపడినాను.
నాయకులీగజ దొంగలు
రిప్లయితొలగించండిమాయకులై దోమటి తనమందున ఘనులై
పాయక పదవులను, నిధుల
రోయరు, పేనుచును నల్లి, రుగ్మత పాలై.
పేనుతూ, అల్లి పునరుక్తి వచ్చినది. దోమటి = కపటము.
నిన్నటి పూరణల వైపు చూస్తారో లేదో యని ఇక్కడ ప్రచురిస్తున్నాను.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
గాడిదలూ ,పందులూ , స్వేచ్ఛగా సంచరించే భారత దేశ రాజకీయ రంగంలోనేడు :
01)
_____________________________________________
సురభులై నాడు పోరాడి - సుకృత మనగ
సుస్వరాజ్యము దెచ్చిరి - సుజనులపుడు !
సుందరం బైన భారత - నందనమున
సురభులకు బుట్టుచుండెను - ఖరము లకట !
సుగమముగ సంచరించును - సూకరములు
సూకరములు , ఖరములకు - చోటు నేడు
సుతిని భారత , ప్రభుతను - చోద్య మిదియె
సుడుములుగ మారి నందున - సుజనులంత
_____________________________________________
సుడుము = గొఱ్ఱెలమంద
సుతిని = తల్లి
గాడిదలూ ,పందులూ , స్వేచ్ఛగా సంచరించే భారత దేశ రాజకీయ రంగంలో
రిప్లయితొలగించండినేటి నేతలు :
02)
_____________________________________________
సూక్తి ముక్తావళి బలుకు - సుబ్బరముగ
శూన్య హస్తాలు జూపించు - శోకమొదవ !
సుగుణ మే మాత్రమును లేని - సూకరములు(మరియు)
సురభులకు బుట్టుచుండెను - ఖరము లకట !
_____________________________________________
కపిల మహఋషి నీడను కలదు సురభి
రిప్లయితొలగించండివెఱగు బడివిశ్వా మిత్రుడు కోరె నకట
కలియు గమ్మున కలవెన్నొ కదలు వినగ
సురభులకు బుట్టు చుండెను ఖరము లకట
గాడిదలూ ,పందులూ , స్వేచ్ఛగా సంచరించే భారత దేశ రాజకీయ రంగంలో
రిప్లయితొలగించండినేటి నేతలు :
02 అ)
_____________________________________________
సూక్తి ముక్తావళి బలుకు - సుస్వరమున
శూన్య హస్తాలు జూపించు - శోకమొదవ !
సుగుణ మే మాత్రమును లేని - సూకరములు(మరియు)
సురభులకు బుట్టుచుండెను - ఖరము లకట !
_____________________________________________
సాధువుల రూపములో శాంతి గురించి తెల్పిన భరతభూమిలో ఈనాడు నక్సలైట్లు పుట్టినారు అనే భావన............
రిప్లయితొలగించండివిశ్వకల్యాణ వాంచనివ్వేదభూమి
తెల్పి సాధుల రూపాన దీర్చె, నేడు
నక్సలైట్లను పేరిట నలిగినారె,
సురభులకు పుట్టుచుండెను ఖరము లకట.
గాడిదలూ ,పందులూ , స్వేచ్ఛగా సంచరించే భారత దేశ రాజకీయ రంగంలో
రిప్లయితొలగించండినేటి నేతలు :
03)
_____________________________________________
సుంత యైన సిగ్గు ,శరము - శూన్యమవగ
చూఱగొను చుంద్రు జనులదౌ - సొమ్మునంత
శోక మొదవగ భారత - సుజనులకును !
సురభులకు బుట్టు చుండెను - ఖరము లకట !
_____________________________________________
చూఱగొను = దొంగిలించు
గాడిదలూ ,పందులూ , స్వేచ్ఛగా సంచరించే భారత దేశ రాజకీయ రంగంలో
రిప్లయితొలగించండినేటి నేతలు :
04)
_____________________________________________
శుభ్ర భారతావని యందు - సుంత యైన
శుభము గూర్చెడి నాయకుల్ - శూన్య మయ్యె !
శోక జలధిని ముంచెడి - శుంఠలరుగొ !
సురభులకు బుట్టు చుండెను - ఖరము లకట !
_____________________________________________
ఈనాటి క్లోనింగ్ ప్రభావం :
రిప్లయితొలగించండి05)
_____________________________________________
శుక్రవారపు పత్రికన్ - వక్రమైన
వింత వార్తను ప్రచురించ - వింటి నేను
బ్రిటను పరిశోధనాశాల - బెరుగుచున్న
సురభులకు బుట్టు చుండెను - ఖరము లకట !
_____________________________________________
అసహాయ శూరు లొదవిన
రిప్లయితొలగించండిపసగల కురువంశ మందు పాలసు లొదవెన్
దెస లబ్బుర పడ భువిని వి
ను! సురభులకు బుట్టు చుండెను ఖరము లకటా !
మాతృదేశానికి విచ్చేసిన మిత్రులు శ్రీ గన్నవరపు నరసింహ మూర్తి గారికి స్వాగతం .
స్వాగతమయ్య! మాతృభువి వచ్చిన శ్రీ నరసింహమూర్తి ! మీ
యాగమనమ్ము కోరితిమి హైదరబాదుకు వత్తురేనియున్
మాగృహమున్ గనంగ , ఘనమైనవి మిత్రమ! స్నేహ శీలతల్
రాగ శుధాంశు షిక్త మనురాగ మయమ్ములు మిత్ర దర్శనాల్
శ్రీ చంద్రశేఖరము గారి అవధానములోని సమస్య .......
రామా! నాదరి రాకు రాకు మనియెన్ రంభే భయ భ్రాంతయై .
విశ్వామిత్రుడు సురభిని బలవంతముగా కొనిపోవు నప్పుడు
రిప్లయితొలగించండిసైనికులు ,ఆయుధములు , గుఱ్ఱాలు ,యేనుగులూ ,
గాడిదలూ కూడా సురభినుండి ఉద్భవించినవట :
06)
_____________________________________________
సైనికుల,యాయుధములను - శ్రేష్ఠమైన
సృజన జరుపగ సురభియే - సృష్టి యందు
విశ్వ మిత్రుని నెదిరించి - వినుతి కెక్కె !
వసుధ నానాడు వాసిష్ఠు - వాటి యందు
సురభులకు బుట్టు చుండెను - ఖరము లకట !
_____________________________________________
మిత్రులారా!
రిప్లయితొలగించండిసమస్యగానీయబడినా ఈ పాదము మా శ్రీమదధ్యాత్మ రామాయణము, యుద్ధకాండ, పంచమ సర్గలోని 12వ పద్యము లోనిది. ఆ పద్యమును ఇక్కడ వ్రాయుచున్నాను. రావణుని మాతామహుడు రావణునికి హితబోధ చేయుచూ చెప్పిన పద్యమిది. ఆ విపత్సమయములో లంకలోని పలు దుశ్శకునములను, వైపరీత్యములను ఈ పద్యము వివరించుచున్నది:
అతి భయంకరముగ నంబుదంబులు గర్జ
నములతో నురుముచున్నవి నిరతము
అత్యుష్ణమగు రక్త మంబుదంబుల నుండి
కురియుచునుండె నగరమునందు
దేవళంబులలోన దేవతా మూర్తులు
కంపించుచుండె దుఃఖమ్ము నొంది
కాళిక దంష్ట్రలు కన్ పట్టె వికటాట్ట
హాసమ్ము జేయుచు ననవరతము
సురభులకు బుట్టుచుండెను ఖరములకట
పోరుచుండె పిల్లులతోడ మూషికములు
గ్రద్దలను పాములెదిరింప గలుగుచుండె
యముడు పురి నెల్లెడల తిరుగాడుచుండె
(సంస్కృత మూలము నకు సరియైన అనువాదము)
స్వస్తి.
ఏటి కేడాది పొడుగున నీ తలయ్యి
రిప్లయితొలగించండిసురభులకు బుట్టు చుండెను , ఖరము లకట
మోయ లేనంత బరువును మోయు కతన
నలసి నిదురించె నియ్యె డ యాహరించి
శ్రీ చంద్రశేఖరము గారి అవధానములోని సమస్య :-
రిప్లయితొలగించండి01)
"సీతారామ కల్యాణం " సినిమాలో
రావణాసురుడు బలాత్కరించబోగా , రంభ :
________________________________________________
మామా ! కోడలి నౌదునీకు , నిజమున్ - మానంబు ప్రాణంబహో !
ఏమీ ! నీకిది ధర్మమే ? తగునయా - యిష్టానువర్తిన్ జనన్ ?
కామాంధా ! దనుజాధమా ! నిలుమటన్ ! - కైసేతు ! గర్వాంధకా
రామా! నాదరి రాకు రాకు మనియెన్ ! - రంభే భయ భ్రాంతయై !
________________________________________________
ఈ సమస్య "రామా! నాదరి రాకు రాకు మనియెన్ ! - రంభే భయ భ్రాంతయై !" లో సంశయం. "రంభ యే" అనవలసి యున్నది కదా? "రంభే" అనుట సాధువెట్లు?
రిప్లయితొలగించండిభామా! వేశ్యల కేల వావి వరుసల్ పాటింప ? లంకేశుడన్
రిప్లయితొలగించండినీమాటల్ విన నేది దిక్కు? దివిజానీకంబులున్ నిల్తురే
రామా! నాదరి? - రాకు రాకు మనియెన్ రంభే భయ భ్రాంతయై
భూమిన్ వీడుచు - రావణుండును తనన్ మోహించి వెంటాడగన్
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిగంగిగోవుల మందలో గార్ధభములు
కలసి మేయుచునుండగ గాంచినాను
విస్మయంబున కలగంటి వింతగాను
సురభులకుఁ బుట్టుచుండెను ఖరము లకట!
గురువు గారికి ధన్యవాధములు,
రిప్లయితొలగించండి----------
ఖరము పాలు కోట్లుగురియ వరము బొంద
సురలు వేడినారు శివుని, మరులుగొనిన
భవుడు నవ్వి మీకు గలుగు పవిటననగ,
సురభులకు బుట్టు చుండెను ఖరములకట|
సురభులకుఁ బుట్టుచుండెను
రిప్లయితొలగించండిఖరములకట సాంగవేదకర్ముని కేలా
పరదారావాంఛగలిగె
మరణంబిక తప్పదనుము మరి రావణుకున్!
శ్యామలీయంగారూ, మంచి పట్టే పట్టారు. ఈ రోజల్లో తెలుగు సాహితీ సభలలో, చర్చలలో కూడా అలాగే వుంది. తప్పదేమో! లేకపోతే నాలాంటి తెలుగు రానివాడు గణాలు కిట్టించటానికి చేసిన పనై వుంటుంది.
రిప్లయితొలగించండినా మరొక సంశయం యేమిటంటే "రంభే" అన్న పదాన్ని అవధానిగారు గమనించి హెచ్చరించారా లేదా అని.
రిప్లయితొలగించండిభక్తవరులకు నాస్తిక వాదమతులు
రిప్లయితొలగించండిసాధుజనులకు సుజనహింసాపరులును
పుత్రులగుచుండ దుఃఖించి పుడమి బలికె
సురభులకుఁ బుట్టుచుండెను ఖరము లకట!
నీతి మంతులకానాడు మాతృ భూమి
రిప్లయితొలగించండినెలవు నేడేమొ కన నవినీతిపరుల
కాకరము కాలమహిమము గాక యేమి
సురభులకుఁ బుట్టుచుండెను ఖరము లకట!
పట్టింపు లేని వాడిని
రిప్లయితొలగించండిపట్టదు సాధుత్వ చర్చ బాబూ నాకున్
పట్టించుకొనరు 'రంభే '
తట్టినదో లేదొ పండితమ్మన్యులకున్
వన్సు ఆర్ ట్వైసు ఇంగ్లీషు వాడినపుడు
రిప్లయితొలగించండిసాదు శబ్ధాల చర్చలు సాగవేల?
వాడుకైనట్టి భాషలో వ్రాసినపుడె
కాదు సాదువటంచు కదుపుతారు
కాదు సాదువటంచును కదుపుతారు
రిప్లయితొలగించండితెలుగు కవిత్వంలో మ్లేచ్ఛభాష వాడినపుడు ఎలాగూ భ్రష్టుపట్టిందని వదిలేస్తాము లేదా హాస్యస్ఫోరకం అనుకొంటాము. మరీ అవధానాలలో కూడానా!! అంతేలేండి, మాఊరి తెలుగు సాంస్కృతిక సమితి సభ్యులకు వత్తులు పలకవు, అదేమని అనకూడదు. అది అంతే:-)
రిప్లయితొలగించండిఅజ్ఞాతగారూ అలాగంటార. ఐతే ఒకె. తెలుగు పద్యంలో పదములు సాదువులైతేనే బాగుంటుంది
రిప్లయితొలగించండివిలువ లన్నింటికిని జూడ వలువ లూడె
రిప్లయితొలగించండిమంచి నెంచెడు వారికీ మధ్య డబ్బు
సంచు లెంచెడు వారలె వారసులయె
సురభులకుఁ బుట్టుచుండెను ఖరము లకట!
కవిమిత్రులకు శుభాభివందనాలు.
రిప్లయితొలగించండికొన్ని కార్యక్రమాల వల్ల తీరిక లేకుండా తిరుగుతున్నందున మీ పూరణలపై స్పందించలేక పోయాను. ఇప్పటికిప్పుడు అత్యవరసంగా ఊరికి వెళ్ళవలసి ఉంది. మన్నించాలి. సాయంత్రం వరకు వీలైతే మీ పూరణలను చూసి నా అభిప్రాయాలను తెలుపుతాను.
పూరణలు పంపిన
మందాకిని గారికి,
వసంత కిశోర్ గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు,
సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
లక్కాకుల వెంకట రాజారావు గారికి,
సుబ్బారావు గారికి,
శ్రీపతి శాస్త్రి గారికి,
వరప్రసాద్ గారికి,
చంద్రశేఖర్ గారికి,
శ్యామల రావు గారికి,
మిస్సన్న గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి
................... అభినందనలు.
వ్యాఖ్యలు పంపిన
పండిత నేమాని వారికి,
అజ్ఞాత గారికి
................... ధన్యవాదాలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిలేమా ! యేటికి భీతి జెందెదవు నీలేబ్రాయమున్ మెచ్చితిన్
రిప్లయితొలగించండికామోద్రేకము కాదుకాదిది నినున్ కాంక్షించి మోహంబు నన్
భామా ! వీడను నిన్నునేనిక నభంబే క్రుంగి భీతిల్ల గన్
రామా ! నాదరి రాకురాకు మనియెన్ రంభే భయభ్రాంత యై
తేదీ. 12 - 02 - 201 న హైదరాబాదులో కూడా అష్టావధానం జరిగింది. దానిలో యివ్వబడిన సమస్య "రామా! నాదరి రాకు రాకుమనియెన్ రక్షార్తియై రంభయే!"
రిప్లయితొలగించండిసరి సరి. ఇక్కడ కూడా రంభ ప్రత్యక్షమైనది!
అదట్లాగుంచి, "రంభయే" అన్న ప్రయోగం చిత్తగించండి.