19, ఫిబ్రవరి 2012, ఆదివారం

సమస్యాపూరణం - 625 (వ్యాకరణ మెఱుంగనట్టి)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది -

వ్యాకరణ మెఱుంగనట్టివారె కవివరుల్.

27 కామెంట్‌లు:

  1. కాకర బీకర కవితలు
    వ్యాకరణము సుంతరాక వ్రాయుదు నేనే
    శ్రీకరముగ గురు ముఖతః
    వ్యాకరణ మెఱుంగ, నట్టివారె కవివరుల్.

    రిప్లయితొలగించండి
  2. పోకిరితన మెసగగ నౌ
    రా! కూతల కూసెదే? సులక్షణమయమౌ
    నా కవితను తప్పందువె?
    వ్యాకరణ మెరుంగ నట్టి వారె? కవివరుల్

    రిప్లయితొలగించండి
  3. లోకోత్తర భావమ్ముల
    సాకార మొనర్చునట్టి సద్భాషాభూ
    షాకారులు; యెటు లందును?
    వ్యాకరణ మెఱుంగనట్టివారె కవివరుల్.

    రిప్లయితొలగించండి
  4. ఏ కావ్యము తెలుసు కొనక
    కాకమ్మ కధలు గిలికి కవితా నంచున్ !
    నా కలమున కెదురేదని
    వ్యాకరణ మెఱుంగ నట్టి వారె కవివరుల్ !

    రిప్లయితొలగించండి
  5. శ్రీకరము మార్పు భాషకు
    వ్యాకరణము కూడ మారు వాడుక వలనన్
    లోకము మెచ్చును మారిన
    వ్యాకరణ మెఱుంగ , నట్టి వారె కవివరుల్

    రిప్లయితొలగించండి
  6. యీ కలియుగమందున డ
    బ్బేకాదా ముఖ్యపాత్ర, యదియిచ్చుచు ప
    ట్టా కొని పదవిని పొందరె?
    వ్యాకరణమెరుంగనట్టి వారె కవివరుల్.

    రిప్లయితొలగించండి
  7. నిన్న హైదరాబాదు వెళ్ళి గన్నవరపు నరసింహ మూర్తి గారిని వారి బావగారు అభిరాం గారి ఇంట్లో కలుకుకున్నాను. వారితో చాలా సేపు ఆత్మీయసంభాషణ జరిగింది. మనస్సుకు ఎంతో ఊరట లభించింది. వారి ఆదరాభిమానాలు మరువలేనివి.
    తిరిగి వస్తుండగా ‘ఊకదంపుడు’ రామకృష్ణ గారు దారిలో పలుకరించారు. చాలా సంతోషం కలిగింది. వారితో ఎక్కువ సమయం గడపలేకపోయాను.

    రిప్లయితొలగించండి
  8. వ్యాజస్తుతి భావముతో:
    ఏకవి చెప్పిన నేమట
    నాకవి నచ్చవు గణములు నప్పగ పోనౌ
    భీకర పదజాలముతో
    వ్యాకరణ మెఱుంగనట్టివారె కవివరుల్.

    రిప్లయితొలగించండి
  9. వ్యాకరణమె మూలము భా
    షాకల్ప మహీజమునకు సారమగునదే
    శ్రీకరమగు కవనమునకు
    వ్యాకరణ మెరుంగనట్టి వారె? కవివరుల్

    రిప్లయితొలగించండి
  10. శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారి పద్యము 2వ పాదములో యతి మైత్రి లేదు. ఒకపరి చూచి సరిజేయండి.

    రిప్లయితొలగించండి
  11. ఋషియె దూర్వాసుడాతడు యింతి పైన
    నాగ్రహమ్మును చూపించె, నతడు కాడు
    శాంతచిత్తుఁడు; కుపితుఁడై శాపమొసఁగె
    పతిని మనమందు తలచెడి పత్నినకట!

    వ్యాకులపడనేలా? నే
    వ్యాకరణ మెఱుంగనట్టివారె కవివరుల్
    మాకుననియెదరు కొందరు,
    లోకమ్మున నిట్టివారలు ననేకులయా!

    రెండు రోజుల్నించి నెట్ కు అందుబాటులో లేనందు వల్ల రెండు పూరణలూ ఒకేసారి ప్రచురిస్తున్నందుకు మన్నించగలరు

    రిప్లయితొలగించండి
  12. శ్రీ నేమాని గారూ,

    ధన్యవాదములు. తొందరలో పదము అటునిటులైనది.

    యీ కలియుగమందున డ
    బ్బేకాదా ముఖ్యపాత్ర, యిచ్చుచునది ప
    ట్టా కొని పదవిని పొందరె?
    వ్యాకరణమెరుంగనట్టి వారె కవివరుల్.

    రిప్లయితొలగించండి
  13. కావ్యములు వ్రాయు చుండిరి
    వ్యాకరణ మెరుం గ నట్టి వారె , కవి వరుల్
    లోకము మెప్పును బొందను
    శ్రీ కరముగ రచన లెన్నొచేయుదు రిలలోన్ .

    రిప్లయితొలగించండి
  14. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    _____________________________________________

    వాకాటు లేల మీకిటు?
    వాకున దీర్ఘపు సమాస - వాక్యము గనినన్
    వాకలు దిరిగెడి వారికి
    "వ్యాకరణ మెఱుంగనట్టి - వారె కవివరుల్ "!
    _____________________________________________
    వాకాటు = వాగ్వాదము
    వాకు = భాష
    వాకలు = వంకరలు

    రిప్లయితొలగించండి
  15. వ్యాకరణ మేమి యుండును
    ప్రాకటముగ జానపదుల పాటలలోన-
    న్నాకట్టు కొనవె మనముల
    వ్యాకరణమెరుంగనట్టి వారె కవివరుల్.

    రిప్లయితొలగించండి
  16. మందాకినిగారూ, "లోకమ్మున నిట్టివారలు ననేకులయా!" సరికాదు. "...వారలనేకులయా" సరి, కానీ యతి సరిపోదు. కాబట్టి ఒకసారిచూసుకోండి.

    రిప్లయితొలగించండి
  17. అయ్యా శ్రీ సుబ్బారావు గారూ!
    మీ పద్యమును కావ్యములు అనే పదముతో మొదలు పెట్టేరు. ప్రాసను గమనించలేదు. సరిజేయండి.

    రిప్లయితొలగించండి
  18. అజ్ఞాత గారు,
    స్పందనకు ధన్యవాదాలు.
    వారలు+అనేకులు అని నేననలేదు. వారలును+అనేకులు అన్నాను. అలాంటి వారూ ఉన్నారు సుమా అని చెప్పటానికి.
    కాదంటారా, సరిచేయటానికి ప్రయత్నిస్తాను.

    వ్యాకులపడనేలా? నే
    వ్యాకరణ మెఱుంగనట్టివారె కవివరుల్
    మాకుననియెదరు కొందరు,
    లోకమ్మున నిట్టివారలును పెక్కురయా

    రిప్లయితొలగించండి
  19. కొకిల గళముల వలె
    నాకము నందుండు దేవ నాదస్వరముల్ !
    ఈ కోవిదుల నెటు లందుము ?
    వ్యాకరణ మెఱుంగ నట్టి వారె కవివరుల్ !

    రిప్లయితొలగించండి
  20. సోదరు లందరినీ కలిసిన అదృష్ట వంతులు. వింటేనే ఎంతో ఆనందంగా ఉంది . ఇక కలిసి వారితో గడిపిన క్షణాలు ఎంత మధుర మైనవో ?

    రిప్లయితొలగించండి
  21. శివానందలహరి

    మిత్రులారా! మనలో ఎక్కువమందికి శివానందలహరి గురించి తెలుసును అనుకొనుచున్నాను. అయినను దానిని గురించి కొన్ని విషయములను వ్రాయుచున్నాను. శ్రీమదాది శంకరాచార్యులు వారు రచించిన పెక్కు స్తోత్రములలో శివానందలహరి ఒకటి. ఇందులో 100 శ్లోకములు కలవు. అందు మొదటి 27 శ్లోకములును శిఖరిణీ వృత్తములు. తరువాత ఎక్కువగా శార్దూలములు, ఇతర వృత్తములు వివిధములైన ఛందములలో నుండును. భక్తి జ్ఞాన యోగముల సమ్మేళనములై నవరసభరితములైనవే ఇందులోని శ్లోకములు. శ్లేష కూడిన రూపక అలంకారములు శబ్దాలంకారములు కూడ ఇందు కలవు. ఇందలి కొన్ని కొన్ని శ్లోకములను నేను స్వేఛ్ఛానువాదము చేయుచున్నాను. మంచి మంచి వర్ణనలతో నిండిన ఈ స్తోత్రములను అందరూ బాగుగా అధ్యయనము చేయవచ్చును. శివరాత్రి సందర్భముగా ఈ స్తోత్రములను పారాయణ చేయుట వలన మంచి ఫలితముండును. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  22. శివానందలహరి గురించి బాగుగా స్పందించిన మన మిత్రులందరికీ పేరు పేరునా శుభాభినందనలు. సమస్త సన్మంగళాని భవంతు. తన్మే మనశ్శివ సంకల్పమస్తు. స్వస్తి.

    మిత్రులారా! రేపు శివరాత్రి సందర్భముగా పార్వతీ కళ్యాణము ఇతివృత్తముగా కొన్ని పద్యములను వ్రాయడానికి ప్రయత్నము చేద్దాము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  23. శ్లోకములు వ్రాయు చుండిరి
    వ్యాకరణ మెరుం గ నట్టి వారె , కవి వరుల్
    లోకము మెప్పును బొందను
    శ్రీ కరముగ రచన లెన్నొచేయుదు రిలలోన్ .

    రిప్లయితొలగించండి
  24. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ఆత్మాశ్రయంగా మీ పూరణ చాలా బాగుంది. అభినంద్నలు.
    *
    పండిత నేమాని వారూ,
    ఈ నాటి మీ పూర్ణ వైవిధ్యంగా ఉంది. చాలా బగుంది. అభినందనలు.
    మీ రెండవ పూరణ అద్భుతంగా ఉంది. ధయవాదాలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    కాకుంటే తమ్మునికి పని చెప్పాలి కదా దయతో సవరణలకు అవకాశం ఇచ్చారు. ఇవిగో నా సవరణలు.....
    (1)
    ఏ కావ్యము తెలుసు కొనక
    కాకమ్మ కధ(లను) గిలికి కవి(త యటం)చున్ !
    నా కలమున కెదురేద(ను)
    వ్యాకరణ మెఱుంగ నట్టి వారె కవివరుల్ (?)
    (2)
    కొకిల (మధుర) గళము వలె
    నాకము నందుండు దేవ నాదస్వరముల్ !
    ఈ కోవిదుల నెటు (లన దగు)
    వ్యాకరణ మెఱుంగ నట్టి వారె కవివరుల్ !
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    మీ పూరణలోని భావం సమర్థనీయం. చక్కని పూరణ. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శస్త్రి గారూ,
    చాలా మంచి పూరణ. అభినందనలు.
    నిజమే! అలాంటి కవి మా ఊళ్ళో ఒకాయన నాకు తెలుసు. ఆయన యం.ఏ. ఎం. ఫిల్. లెక్చరర్. ఎక్కువగా సన్మాన పత్రాలు వ్రాస్తూ ఉంటాడు. ఆయన పద్యాల్లో గణ, యతి, భాషా దోషాలు విపరీతం. ఛందస్సు తెలియని వారికి అవి చాలా గొప్ప పద్యాలు. "ఏమయ్యా! నీ పద్యాల్లో ఛందో వ్యాకరణ దోషాలున్నాయి" అంటే "అవి మీ లాంటి పండితులకోసం వ్రాసినవి కావు. సామాన్యులకోసం" అంటాడు. "అలాంటప్పుదు పద్యా లెందుకు? వచనంలో వ్రాయకూడదా?" అంటే వినడు.
    *
    `మన తెలుగూ చంద్ర శేఖర్ గారూ,
    బగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    మందాకిని గారూ,
    అభిజ్ఞాన శాకుంతలాన్ని ప్రస్తావించిన మీ పూరణ చాలా బాగుంది.
    నేటి సమస్యకు మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    వాకట్టుతో ఆకట్టుకొన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. మాకేల నీమ మంచును
    కాకవులు,కుకవులు నేడు కవితల నల్లన్
    ఈ కాలమునన్ ఛందో
    వ్యాకరణమెరుగనియట్టి వారె కవివరుల్ !
    -------------

    రిప్లయితొలగించండి
  26. వ్యాకరణము బంధమ్మని
    మీకవి పోతనకు టైము మీరిందోహో!
    మాకవి ప్రజాకవి యనుచు
    వ్యాకరణ మెఱుంగనట్టివారె కవివరుల్

    రిప్లయితొలగించండి
  27. తోకల నాడించుకొనుచు
    షోకుగ శంకరుని జేరి జోకుల నిడుచున్
    వ్యాకుల చిత్తపు ప్రౌఢుల
    వ్యాకరణ మెఱుంగనట్టివారె కవివరుల్ :)

    రిప్లయితొలగించండి