కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది
రావే మానిని! కావవే తరుణి! సంరక్షించు చంద్రాననా!
(‘తెలుగులో సమస్యా పూరణలు’ గ్రంథం నుండి)
ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది
రావే మానిని! కావవే తరుణి! సంరక్షించు చంద్రాననా!
(‘తెలుగులో సమస్యా పూరణలు’ గ్రంథం నుండి)
అయ్య వారి బ్లాగు తెకినీకు మక్కెర వెయ్యంగ
రిప్లయితొలగించండిరావే మానిని! కావవే తరుణి! సంరక్షించు చంద్రాననా
అని వారు బ్లాగ్ గురువు ని నాడంగ,
బ్లాగ్ జ్యోతి సృష్టించె తాజా బ్లాగు టెంప్లేటు భామని !
చీర్స్
జిలేబి.
ఈ వేళాయెను, బిడ్డ నీ కొరకు నైయేడ్చేను లీలామణీ!
రిప్లయితొలగించండినీవే కార్యము నందు మగ్నవయితే? నేనేమి చేయందగున్?
పూవౌ, కోమలియౌ, స్మితాననను పోపొమ్మంచు నేడ్పించకే!
రావే మానిని! కావవే తరుణి! సంరక్షించు చంద్రాననా!
మగ్నవయితే = మగ్నవయితివే?
తావొక్కింతయు లేదు వ్యాఖ్య లిడగా తైతక్కలై హంగులున్
రిప్లయితొలగించండితావుల్ దప్పెను మాసె నన్ని కళలున్ తాడాయె శేషుండహో
నీవే తప్ప నితః పరమ్మెరుగ లేనే జ్యోతి! ఓ బ్లాగ్గురూ!
రావే మానిని! కావవే తరుణి! సంరక్షించు చంద్రాననా!
రావే! నాటెను పూల బాణములనే రాచిల్క రౌతే మదిన్
రిప్లయితొలగించండినీవా గాయము మాపరావె సుదతీ నీ ముద్దు మంత్రమ్ముతో!
నీవే ప్రకృతి వైద్యు రాలవు గదా నాకేదొ మందీయవే!
రావే మానిని! కావవే తరుణి! సంరక్షించు చంద్రాననా!
ఒక చిత్ర దర్శకుడు తమ చిత్ర హీరోయిన్ ను వేడుకొంటున్న సందర్భము.
రిప్లయితొలగించండివేవేలైన విచిత్ర చిత్రముల నీ వేషంబు లేకున్నచో
రావేడబ్బులు, దక్కునే విజయముల్? రాజిల్లునే చిత్రముల్?
నీవైరంబిక చేటుదెచ్చును కదా! లెమ్మో కథానాయకీ!
రావే మానిని, కావవే తరుణి, సంరక్షించు చంద్రాననా.
గోలి హనుమచ్చాస్త్రిగారు,
రిప్లయితొలగించండిమీరు మూడవ పాదము సరిచేయవలెననిపిస్తుంది. మగణము రాలేదు, యతి సరిపోవడము లేదు.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
చీర దొరికిన వెంటనే యింద్రలోకం వెళ్ళిపోయిన తన నలుగురు భార్యల
గుఱించి తల్చుకొని తల్చుకొని వాపోతూ అన్నగారు " జగదేకవీరుని కథ "
సినిమాలో " శివశంకరీ " పాటకు కొద్దిగా ముందన్న మాట :
01)
______________________________________________
నీవే మేమని బాస జేసితిరి ! కా - నీ , నేడు యేమైతిరో ?
భావోద్వేగము నోప జాలనిక ! నో - భామామణీ ! నాకిలన్
చావే తప్పదు , మీరు లేనియెడ ! యీ - జాప్యంబు లింకేలనే ?
రావే మానిని! కావవే తరుణి! సం - రక్షించు చంద్రాననా!
______________________________________________
భామామణి = జయంతి (ఇంద్రకుమారి)
మానిని = మరీచి ( అగ్నికుమారి)
తరుణి = వారుణి (వరుణ కుమారి)
చంద్రానన = నాగిని ( నాగ కుమారి )
శంకరార్యా ! Time దగ్గర PM అని వస్తోంది !
రిప్లయితొలగించండిదాన్ని AM గా సరి చెయ్యాలి !
నిన్నకూడా చాలా గందరగోళంగా ఉంది Time
మీ ప్రకటనలో "ఉ" బాగుగనే యున్నది !
శంకరార్యా ! నేను సరిగ్గా గమనించలేదు గాని
రిప్లయితొలగించండితారీఖు టైము అన్నీ తప్పుగానే యున్నవి !
ఈప్రకటనను నేను
Feb2,2012 11:40 AM కి చేస్తున్నాను !
అక్కడ యేం కనబడుతుందో చూడండి
format కూడా మార్చితే బావుంటుంది తెలుగు లోకి !
శంకరార్యా !
రిప్లయితొలగించండిఇప్పుడు
template , font, gadjets, adjustment
అన్నీ చక్కగా నున్నవి !
నిఘంటువుల జోడింపుతో కొత్తకళ వచ్చింది !
time - time format కూడా సరిచేస్తే యింకా బావుంటుంది !
సవరించిన జ్యోతి గారికి ధన్యవాదములు !
వసంత కిశోర్ గారు, ఈ బ్లాగును నిత్యనూతన శోభలతో తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నాను. ఈ వారాంతంలోగా పూర్తి చేస్తాను. మీకు ఇందులో ఏయే సదుపాయాలు కావాలో చెప్పేయండి. చేర్చేద్దాం..
రిప్లయితొలగించండిశా. రావే యూర్వసి రావె రావె యను నా రాజ్యంబు గీజ్యంబు
రిప్లయితొలగించండినీ వయ్యారము పాటి సేయదను నే పోనీయనే నిన్ననున్
భావావేశమునం బురూరవుడు కావన్ వేడ నిట్లార్చెడున్
రావే మానిని! కావవే తరుణి! సంరక్షించు చంద్రాననా!
రెండవపాదంలో యతిమైత్రి తప్పింది సరిజేసిన పాదం:
రిప్లయితొలగించండినీ వయ్యారము పాటి సేయదను పోనీయంగదే నిన్ననున్
జ్యోతిగారూ,
వ్యాఖ్య డిలీట్ చేయటానికి సదుపాయం మిస్సింగ్ గమనించండి.
అయ్యా శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ! మీ పూరణ పద్యము బాగున్నది. కానీ 3వ పాదములో మొదట్లో గణభంగము, యతి లేకపోవుట కనుపడు చున్నవి. సరిజేయగలరు.
రిప్లయితొలగించండిశ్యామలీయంగారు చెత్తబుట్ట వచ్చేసింది చూడండి..
రిప్లయితొలగించండిశ్యామలీయం గారూ మొదటి పాదం కూడా చూడాలనుకుంటానండీ
రిప్లయితొలగించండికావిన్ గట్టుకు పుత్రుడేగదొడగెన్ కైకా, వసింపన్ వనిన్
రిప్లయితొలగించండిజీవమ్మించుక నిల్వబోవదకటా శ్రీరాము నే బాయగన్
నీవై చెప్పిన నిల్చునేమొ సుదతీ నీమాట మన్నించునో
రావే మానిని కావవే తరుణి సంరక్షించు చంద్రాననా
కావిన్ గట్టుకు పుత్రుడేగదొడగెన్, కైకా, వసింపన్ వనిన్
రిప్లయితొలగించండినీవై చెప్పిన నిల్చునేమొ సుదతీ నీ మాట మన్నించునో
జీవమ్మించుక నిల్వబోవదకటా శ్రీరాము నే బాయగన్
రావే మానిని కావవే తరుణి సంరక్షించు చంద్రాననా
తొలి వేసిన పద్యములో రెండూ మూడు పాదాలను అటునిటుగా చేస్తే అర్ధవంతంగా ఉంటుందనిపించింది.
సరిజేసిన పూరణ:
రిప్లయితొలగించండిశా. రావే యూర్వసి రావె రావె యను నా రాజ్యంబు గీజ్యంబ హో
నీ వయ్యారము పాటి సేయదను పోనీయంగదే నిన్ననున్
భావావేశమునం బురూరవుడు కావన్ వేడ నిట్లార్చెడున్
రావే మానిని! కావవే తరుణి! సంరక్షించు చంద్రాననా!
జ్యోతిగారూ,
వ్యాఖ్య పోష్టింగ్ మెధడ్ మళ్ళీ మొదటికి వచ్చిందండి!
జ్యోతిగారూ - చెత్తబుట్ట కనిపించటం లేదు.
రిప్లయితొలగించండిఅజ్ఞాతగారూ - కృతజ్ఞతలు
ఇప్పుడు కనిపిస్తుందా?? ఇంకేమైనా సమస్యలుంటే చెప్పండి..
రిప్లయితొలగించండిtesting for waste box
రిప్లయితొలగించండిజ్యోతిగారూ - చెత్తబుట్ట కనిపించటం లేదు. Still
రిప్లయితొలగించండిbrowser మార్చి చూడండి మిగతావాళ్లు కూడా కాస్త టెస్టింగ్ చేయండి..
రిప్లయితొలగించండిశ్రీవిశ్వేశుడు సంభ్రమమ్మెసగ గాంచెన్ లోక సమ్మోహన
రిప్లయితొలగించండిశ్రీవైశిష్ట్య నిధాన శోభితను, రాశీభూత శృంగార హే
లావిద్యోదితయైన మోహినిని, సల్లాపాలతో నిట్లనెన్
రావే మానిని! కావవే తరుణి! సంరక్షించు చంద్రాననా!
పండితుల వారి పూరణ అద్భుతంగా నున్నది.
రిప్లయితొలగించండిదేవీ పార్వతి! నేడు నీవికను నాదేశమ్ము నేగాంచవే!
నీవే తల్లిగ మమ్ములన్ కరుణ తో, నివ్వేళ కాపాడవే,
యేవో భేదము లంచు ముక్కలుగ మేమేవేళ కాకుండగా!
రావే మానిని! కావవే తరుణి! సంరక్షించు చంద్రాననా!
రోజంతా ఇంట్లో బంధువుల హడావుడితో బ్లాగును చూడలేక పోయను. ఇప్పుడు చూసి నా కళ్ళను నేనే నమ్మలేక పోతున్నాను. ఏదో కొత్త వెబ్ సైట్ ను చూసినట్లనిపిస్తోంది. సర్వాంగసుందరంగా తీర్చిదిద్దిన జ్యోతి గారికి అందరం ధన్యవాదాలు తెలుపుకుందాం.
రిప్లయితొలగించండినీవే నేనని సంతసించి తిని నే నీపైన మోహంబునన్
రిప్లయితొలగించండియేవే ళందున నీదుభావమె మదిన్ యేతెంచి చింతించ గన్
నీవే లేనిచొ నింక నాదు జపముల్ నేరీతి జేయం దగున్
రావే మానిని ! కావవే తరుణి ! సంరక్షింప చంద్రాననా !
అవును జ్యోతి గారు బ్లాగు గురువే . నా బ్లాగు కుడా ఆవిడే చేసారు . ఆమెకి ధన్య వాదములు
రిప్లయితొలగించండిజ్యోతిగారూ
రిప్లయితొలగించండినేను ie8.0.6 మరియు firefox 10.0 లు రెండింటిలోనూ ప్రయత్నించాను. చెత్తబుట్ట కనబడటం లేదు. దీని వలన కామెంటు డిలీట్ చేయాలంటె ఇబ్బంది.
నేను ప్రయత్నిస్తే కనపడింది. ఈ బ్లాగు చూసే వారందరూ మీ కామెంట్ల క్రింద ఈ చెత్తబుట్ట కనిపిస్తుంధో లేదో చెప్పండి..
రిప్లయితొలగించండిశ్రీ నేమాని వారికీ, సంపత్ శాస్త్రి గారికి ధన్యవాదములు. కార్యాలయమునకు వెళ్ళు హడావిడి లో దోషమును గమనించ లేదు.సవరణ తో...
రిప్లయితొలగించండిరావే! నాటెను పూల బాణములనే రాచిల్క రౌతే మదిన్
నీవా గాయము మాపరావె సుదతీ నీ ముద్దు మంత్రమ్ముతో
నీ వాల్చూపుల శస్త్ర వైద్యమునకై నే మత్తులో మున్గితిన్
రావే మానిని! కావవే తరుణి! సంరక్షించు చంద్రాననా!
సోదరి శ్రీమతి రాజేశ్వరి గారి పద్యమును ఇలా సవరించుచున్నాను:
రిప్లయితొలగించండినీవే నేనని సంతసించితిని, నే నీపైని మోహంబుతో
నేవేళన్ మది నీదు భావతతియే యేతెంచగా పొంగుదున్
నీవే నాకిక లేనిచో జపము నే నేరీతి గావింతునే
రావే మానిని! కావవే తరుణి! సంరంక్షించు చంద్రాననా!
ఆవేశంబున నిద్రలో మగఁడు మోహావేశి కూయన్నిటుల్ -
రిప్లయితొలగించండి"రావే మానిని! కావవే తరుణి! సంరక్షించు చంద్రాననా!"
నావుండాలి గయాళి హింసనిడ దైన్యంబున్ మగండార్చెఁ బో
"రావే మానిని! కావవే తరుణి! సంరక్షించు చంద్రాననా!"
సవరణ జేసిన శ్రీ పండితుల వారికి ప్రణామములు + కృతజ్ఞతలు .
రిప్లయితొలగించండిజ్యోతిగారూ చెత్తబుట్ట కనపట్లేదండీ .
రిప్లయితొలగించండిఅవునా!! ఇంకా ఎవరెవరికి కనపట్టంలేదు చేతులెత్తండి.. దాని సంగతి రేపు చూస్తా. తెగ సతాయిస్తుంది..
రిప్లయితొలగించండిజిలేబీ గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
*
మందాకిని గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘ఏడ్చేను’ అనడం వ్యావహారికం. అక్కడ ‘ఏడ్చెన్ లతాంగీ! సతీ!’ అందామా?
దేవతాపరమైన మీ రెండవ పూరణ మధురంగా ఉంది. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
మీ పేరడీ పూరణ ప్రశస్తంగా, చమత్కార జనితంగా ఉంది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
సవరించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
చక్కని పూరణ. అభినందనలు.
ముందు మూడవపాదంలో యతి తప్పిందనుకున్నా. మిత్రులెవరైనా ప్రస్తావించారా అని క్రిందా మీదా చూసను. చివరికి కనిపించింది రెండవపాదం చివర ‘ల’కారం.
*
వసంత కిశోర్ గారూ,
అబ్బో! బి.సరోజ, ఎల్. విజయలక్ష్మి, జయంతి (నాలుగో నటి పేరు తెలియదు) నలుగురినీ కళ్ళముందు నిలబెట్టారు. ‘రారా కనరారా, ప్రియతమలారా’ పాటను గుర్తుకు తెచ్చారు. ధన్యవాదాలు. అద్భుతమైన పూరణ. అభినందనలు.
*
‘శ్యామలీయం’ గారూ,
పురూరవుని ఆర్తిని చక్కగా చిత్రీకరించారు పూరణలో. బాగుంది. అభినందనలు.
*
శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
రామాయణార్థంలో మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
భావవ్యక్తీకరణలో, శబ్దప్రయోగంలో సాటిలేని రచనా సంవిధానంతో పూరణ చెప్పారు. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
చక్కని పూరణ. అభినందనలు.
పండిత నేమాని వారి సవరణ మీ పద్యానికి వన్నె తెచ్చింది.
*
రవి గారూ,
మీ పూరణలోని చమత్కారం అలరిస్తున్నది. బాగుంది. అభినందనలు.
జ్యోతిగారూ,
రిప్లయితొలగించండిప్రత్యేక ధన్యవాదములండీ. బ్లాగుయొక్క స్వరూపాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. నాకైతే చెత్త బుట్ట కనిపిస్తూందండీ. నేను google chrome ను వాడుతాను.
ఎందుకైనా మంచిది...... ఈ వ్యాఖ్యను ఒకసారి delete చేసి చూస్తాను.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురువుగారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలండీ.......... ఈరకమైన ప్రయోగాన్ని ఇదివరకు ఎప్పుడూ చేయలేదు. మొన్న ఎక్కడో చదివాను. శ్రీ శ్రీ రచనలోని ఇటువంటి పాదాన్ని ఎవరో యతిమైత్రి కుదరలేదనడము, దాన్ని శ్రీశ్రీ గారు వివరించడము. ఈ రకమైన ప్రయోగము చేయాలనిపించి............
ధన్యోస్మి.
గురువు గారు,
రిప్లయితొలగించండిచాలా బాగుంది. అలాగే మారుద్దాం. ధన్యవాదాలు.
జ్యోతిగారూ ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిచెత్తబుట్ట chrome , IE లలో కనబడుటలేదు !
background white మరీ కళ్ళు మిరిమిట్లు గొల్పుతోంది !
ఏదైనా light colour ఉంటేనే బావుండేలా ఉంది
తాజా వ్యాఖ్యలు, Blog Archieve- right side బాగా అలవాటైపోయాయి !
so, వాటిని right కూ
network,popular posts క్రొత్తవి గనుక
వాటిని left కూ మారిస్తే బావుంటుంది !
జ్యోతిగారూ ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిpublish your comment పేజీలో చెత్తబుట్ట ఇప్పుడు కనబడింది !
శంకరార్యా ధన్యవాదములు !
రిప్లయితొలగించండిమిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !
జ్యోతిగారూ ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండివ్యాఖ్యల్ని వ్యాఖ్యల box లోనే తెలుగులో type చెయ్యగలిగితే
చాలా సౌలభ్యంగా ఉంటుంది !
తీవన్బోలినమేను,రేయిబవళుల్దీపించునీమోమునున్
రిప్లయితొలగించండిఠావుల్దప్పినహృద్విచారమునిరాటంకంబుగాకన్గొనున్,
పూవింటన్ననుకొట్టినావెతొలిచూపున్,కటా!దీనునిన్
రావే మానిని! కావవే తరుణి! సంరక్షించు చంద్రాననా.
@రవి గారూ..,
రిప్లయితొలగించండినయం నాలుగో పాదం,
రావే సోదరి కావవే జనని, సంరక్షించు పెద్దన్నయా!
అన్నారు గారు
రేడియో వారూ ప్రసిద్ధం చేసిన "మీ అత్తారింటినుంచి ఉత్తరం వచ్చింది".. అన్న జానపదాన్ని గుర్తు చేశారు. ధన్యవాదములు.
భవదీయుడు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి"శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం " సినిమాలో
రిప్లయితొలగించండిఅలిగి , వైకుంఠం వదలి భూలోకం వెళ్ళిన లక్ష్మీ దేవిని వెతుక్కుంటూ
బయలుదేరిన అన్నగారి( అదే శ్రీనివాసుని)స్వగతం :
02)
______________________________________________
దేవేరిన్ విడి , యొంటరై , యిచట , నే - దీనుండ నై యుండుటా ?
దేవీ ! నిన్నిట గాంచ లేక మది , స్వా - ధీనంబు దప్పెన్సఖీ !
శ్రీ వైకుంఠము వీడి వెళ్ళుటకు , నీ - చిత్తంబు యెట్లొప్పెనే ?
దేవీ , నీ వెట కేగి యుంటివొ ? గనన్ - దేరీజు నీదెక్కడో ?
యే వేళ న్నిను జేర గల్గుదునొ ? యె - ట్లీ బాధ , నేనోర్తునో ?
రావే మానిని ! కావవే తరుణి ! సం - రక్షించు చంద్రాననా !
______________________________________________
దేరీజు= శిబిరము , గుడారము , గుడి
ఊకదంపుడు గారూ,
రిప్లయితొలగించండి‘పూవింటన్ గొట్టిన’ ప్రేయసిని పిలిచిన మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
*
వసంత కిశోర్ గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
‘చిత్తంబు + ఎట్లొప్పెనో’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘చిత్తంబె యెట్లొప్పెనో’ అంటే సరి!
శ్రీకృష్ణసత్య సినిమాలో
రిప్లయితొలగించండిఅలిగిన సత్యభామను " అలుక మానవే చిలుకల కొలికిరో "
అని అన్నగారు (శ్రీకృష్ణుడు) పాడిన తరువాతన్నమాట :
03)
______________________________________________
ఈవిం జెందుట పాడియా సుదతి ! నీ - కీతూరి తెచ్చిత్తు , నే
నా, వృక్షంబగు , పారిజాత సుమ మా - హ్లాదంబు జేకూర్చగాన్
దేవేంద్రాదులె యడ్డ మొచ్చినను , సం - దేహంబు లేలా మదిన్ !
నీ వాడన్సఖి ! నన్ను నమ్ము మది ! నా - నేస్తంబు యెగ్గాయెనా ?
ఆవేశంబును మానుమో సఖియ ! నా - యాక్రోశముం గాంచుమా !
రావే మానిని ! కావవే తరుణి ! సం - రక్షించు చంద్రాననా !
______________________________________________
ఈవి = అసూయ
ఎగ్గు = అనిష్టము
ఆవేశము = ఆగ్రహము
ఆక్రోశము = అటమట , దుఃఖము
శంకరార్యా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండి‘చిత్తంబు + ఎట్లొప్పెనో’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘చిత్తంబె యెట్లొప్పెనో’ అంటే సరి!
యడాగమం రాదంటూనే ...................
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమీ ‘లేటెస్ట్’ కృష్ణసత్యల పూరణ చాలా బాగుంది. అభినందనలు.
మళ్ళీ అడ్డం ‘ఒచ్చింది’. దానిని ‘అడ్డ మొడ్డినను’ అందాం. ‘నేస్తంబు + ఎగ్గాయె’అన్నప్పుడు యడాగమం రాదు. ‘నేస్తంబె యెగ్గాయెనా’ అని సవరిస్తే సరి!
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండి‘చిత్తంబు + ఎట్లు’ అన్నప్పుడు ‘ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధి యగు’ సూత్రం వల్ల ‘చిత్తం బెట్లు’ అవుతుంది. ‘చిత్తంబె’లో చివరి అచ్చు ‘ఎ’ కనుక సంధి జరుగక యడాగమం వచ్చి ‘చెత్తంబె యెట్లు’అవుతుంది.
శంకరార్యా ! అర్థమైనది !ధన్యవాదములు !
రిప్లయితొలగించండిశ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిఈవేళైనను రాకపోతివట నీకేకష్టముల్ కల్గెనో
నీవీరీతిగ కోపగించ తగునా నీశ్రేయమే కోరగా
నీవారందరు వేచియుండిరిచటన్నీరాకకై సోదరీ
రావే మానిని! కావవే తరుణి! సంరక్షించు చంద్రాననా!
శ్రీపతి శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమనోహరమైన పూరణ. బాగుంది. అభినందనలు.
శంకరార్యులకు ధన్యవాదములతో :
రిప్లయితొలగించండి"శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం " సినిమాలో
అలిగి , వైకుంఠం వదలి భూలోకం వెళ్ళిన లక్ష్మీ దేవిని వెతుక్కుంటూ
బయలుదేరిన అన్నగారి( అదే శ్రీనివాసుని)స్వగతం :
02అ)
______________________________________________
దేవేరిన్ విడి , యొంటరై , యిచట , నే - దీనుండ నై యుండుటా ?
దేవీ ! నిన్నిట గాంచ లేక మది , స్వా - ధీనంబు దప్పెన్సఖీ !
శ్రీ వైకుంఠము వీడి వెళ్ళుటకు , నీ - చిత్తంబ దెట్లొప్పెనే ?
దేవీ , నీ వెట కేగి యుంటివొ ? గనన్ - దేరీజు నీదెక్కడో ?
యే వేళ న్నిను జేర గల్గుదునొ ? యె - ట్లీ బాధ , నేనోర్తునో ?
రావే మానిని ! కావవే తరుణి ! సం - రక్షించు చంద్రాననా !
______________________________________________
దేరీజు= శిబిరము , గుడారము , గుడి
*****
శంకరార్యులకు ధన్యవాదములతో :
శ్రీకృష్ణసత్య సినిమాలో
అలిగిన సత్యభామను " అలుక మానవే చిలుకల కొలికిరో "
అని అన్నగారు (శ్రీకృష్ణుడు) పాడిన తరువాతన్నమాట :
03అ )
______________________________________________
ఈవిం జెందుట పాడియా సుదతి ! నీ - కీతూరి తెచ్చిత్తు , నే
నా, వృక్షంబగు , పారిజాత సుమ మా - హ్లాదంబు జేకూర్చగాన్
దేవేంద్రాదులె యడ్డ మొడ్డినను , సం - దేహంబు లేలా మదిన్ !
నీ వాడన్సఖి ! నన్ను నమ్ము మది ! నా - నేస్తంబ దెగ్గాయెనా ?
ఆవేశంబును మానుమో సఖియ ! నా - యాక్రోశముం గాంచుమా !
రావే మానిని ! కావవే తరుణి ! సం - రక్షించు చంద్రాననా !
______________________________________________
ఈవి = అసూయ
ఎగ్గు = అనిష్టము
ఆవేశము = ఆగ్రహము
ఆక్రోశము = అటమట , దుఃఖము
శ్రీపతి శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిసోదరి పరంగా వైవిధ్యంగా ఉన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
వసంత కిశోర్ గారూ,
నా సూచనలను పాటించి సవరించి పూరణలను సర్వాంగ సౌందర్య భరితం చేసారు. ధన్యవాదాలు.
"చావే తప్పగ కన్ను లొట్ట పడెనే జంద్యమ్ము నూనంగ ఛీ!"
రిప్లయితొలగించండిబావుర్ మంచును నేడ్చుచుండగను తా ప్రారబ్ధమున్ తిట్టుచున్
లావొక్కింతయు లేక సోనియనెనే: "రంభా! ప్రియంకా! సుతా!
రావే మానిని! కావవే తరుణి! సంరక్షించు చంద్రాననా!"