"ఆదౌ గృహీత పాణిః
పశ్చా దారూఢ కటి జఘన భాగా |
నఖముఖ లాలన సుఖదా"
"సా కిం రామాసి?" "నైవ భోః సామా" ||
అర్థాలు
(ఒక యువకుడు తన మిత్రునితో అంటున్నాడు)
ఆదౌ = మొదట
గృహీత పాణిః = పాణిగ్రహణం చేసి
పశ్చాత్ = తరువాత
ఆరూఢ కటి జఘన భాగా = కటి జఘన భాగాలపై ఎక్కినదై
నఖముఖ లాలన = కొనగోళ్ళ గీరతో
సుఖదా = సుఖాన్ని కల్గించేది.
(విన్న మిత్రుని ప్రశ్న)
సా రామా కిం = అలా చేసింది నీ ప్రియురాలా?
(యువకుని సమాధానం)
నైవ భో = కాదు మహానుభావా!
సామా = గజ్జి సుమా!
నా అనువాదం .....
"కరమును గ్రహించెను మొదట
తరువాత కటిజఘనముల దక్కించుకొనెన్
మురిపించు నఖక్షతముల"
"హరిణాక్షియ యామె?" "కాదయా, గజ్జి సుమా!"
(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారి ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)
అనువాదం చాలా సొగసుగా ఉంది !!!
రిప్లయితొలగించండిడా. విష్ణు నందన్ గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
namaste sir!
రిప్లయితొలగించండిtranslation is very nice
శంకరయ్య గారూ , ఇంతకు ముందు గమనించలేదు - అది సామా అని పొరపాటున వ్రాయబడిందనుకుంటాను . పామా అని ఉండాలి , పామా అంటే గజ్జి , ఆకారాంత స్త్రీలింగం !!!
రిప్లయితొలగించండిడా. విష్ణు నందన్ గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు. మీరు చెప్పిందే సరి.
నా వద్ద ఉన్న ప్రహేళికలు జిరాక్స్ ప్రతి. పాత ప్రింటునుండి కాపీ చేసింది. జిరాక్స్ ప్రతిలో అక్షరాలు సరిగా కనిపించడం లేదు. కొన్ని అక్షరాలు సగం సగం కాపీ అయ్యాయి. అందువల్ల ఆ పొరపాట్లు. చెప్పాను కదా! నాకున్న సంస్కృత పరిజ్ఞానం అతి స్వల్పమని.