11, ఫిబ్రవరి 2012, శనివారం
శివానందలహరి
శివానందలహరిలోని ఈ క్రింది శ్లోకం భక్తి యొక్క వైభవాన్ని తెలియజేస్తున్నది.
మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే
గండూషాంబు నిషేచనం పురరిపో ర్దివ్యాభిషేకాయతే |
కించిద్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే
భక్తిః కిం నకరో త్యహో వనచరో భక్తావతంసాయతే ||
శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారి అనువాదం
సీ.
కాలి చెప్పులతోడ మాలిన్యము తుడిచి
వేసి గాత్రము శుద్ధిచేసె నీకు
నీటిని పుక్కిటి నిండుగా గొనితెచ్చి
అభిషేకమొనరించె నాదరమున
మాంసమున్ రుచిచూచి మంచిదనుచు నెంచి
ఘనముగా నైవేద్యము నొనరించె
అడవిలో నివసించు నట్టి బోయ యొకండు
భక్తశేఖరు డట్లు వాసిగాంచె
తే.గీ.
ఎవ్విధంబున నిన్ను సేవింపవలయు
ననుచు దలచుచో భక్తియే యఖిల దోష
హరము సత్ఫలదంబయి యలరు దేవ!
నిర్మలంబగు హృదయమే నీకు వసతి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
చాలా చక్కగా ఉంది
రిప్లయితొలగించండిభక్తియె పూజకు మూలము
రిప్లయితొలగించండిభక్తిని నిల బూజ సేయు భక్తుల నెపుడున్
రక్తిని ననుగ్ర హించుచు
ముక్తేశ్వర నాధు డయ్యి మొక్కులు దీర్చున్.
భక్తియె పూజకు మూలము
రిప్లయితొలగించండిభక్తిని నిల బూజ సేయు భక్తుల నెపుడున్
రక్తిని ననుగ్ర హించుచు
ముక్తేశ్వర నాధు డయ్యి మొక్కులు దీర్చున్.