7, ఫిబ్రవరి 2012, మంగళవారం

సమస్యాపూరణం - 615 (బలము లేనట్టివాఁడె)

కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది
బలము లేనట్టివాఁడె నిర్భయుఁడు ఘనుఁడు.
ఈ సమస్యను సూచించిన
పోచిరాజు సుబ్బారావు గారికి
ధన్యవాదాలు.


23 కామెంట్‌లు:

 1. బలము కావలె మనిషికి పనుల జేయ
  దొడ్డ పనికిని మరి జూడ చెడ్డ పనికి
  అవని నవినీతి పనిజేయు నట్టి గుండె
  బలము లేనట్టివాఁడె నిర్భయుఁడు ఘనుఁడు.

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  01)
  ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌_____________________________
  బడుగు జీవుల హింసించు - బలము బలమె ?
  బలము , కావలె రక్షింప - బడుగు జనుల !
  బాధ పెట్టగ , పడతుల - ప్రజల, క్రూర
  బలము లేనట్టివాఁడె ని - ర్భయుఁడు ఘనుఁడు !
  ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌_____________________________

  రిప్లయితొలగించండి
 3. కామ క్రోధాది వైరి షట్కమ్ము మిగుల
  బలము గలవార లవ్వారి బలము నడచి
  యోగబలముతో ముందుకు సాగి, వైరి
  బలము లేనట్టి వాడె నిర్భయుడు ఘనుడు

  రిప్లయితొలగించండి
 4. ప్రజల బలమున్న వాడు నిర్భయుఁడు, ఘనుఁడు.
  భక్తి బలమున్న వాడు నిర్భయుఁడు ఘనుడు
  దురితములు చేయు దౌర్భాగ్య దుష్ట శత్రు
  బలము లేనట్టివాఁడె నిర్భయుఁడు ఘనుఁడు.

  రిప్లయితొలగించండి
 5. ఆలు బాలెంత, బస చెఱసాల, రాత్రి,
  భటుల కావలి, యమునోగ్ర వాహి బాలు
  గావ నాతడు చనె నున్న దైవ బలము
  బలము లేనట్టివాఁడె నిర్భయుఁడు ఘనుఁడు.

  రిప్లయితొలగించండి
 6. రాజ్యమంతయు సౌభాగ్య రత్న జేసి,
  పొరుగు రాజ్యాల శాంతిపెంపొందజేసి
  చిత్తమీశ్వరార్పణమును జేసి, శత్రు
  బలము లేనట్టి వాడె నిర్భయుడు ఘనుడు.

  రిప్లయితొలగించండి
 7. బలము లేనట్టి వాడె నిర్భయుడు ఘనుడు
  కలి యుగంబున సాధ్యమై కాన వచ్చు
  బలము కలిగియు పాండవు ల్పరుల పంచ
  వెతల నొందుచు భీతిని బ్రతుక లేదె?

  రిప్లయితొలగించండి
 8. డి. నిరంజన్ కుమార్మంగళవారం, ఫిబ్రవరి 07, 2012 11:06:00 AM

  బలము గలిగెనేని పట్టనలవి కాదు
  మనసు చిన్నదౌను మమత మయమౌను
  పరుల పీడనంబె పరమావధిగ జెయు
  బలము లేనట్టి వాడె నిర్భయుడు ఘనుడు

  రిప్లయితొలగించండి
 9. ఇదేదో వింతగా యున్నది !
  చెత్తబుట్ట
  మాయమైనది మరల కనబడినది!!!!!!!!!!
  కనబడినది మరల మాయమైనది!!!!!!!!!!

  రిప్లయితొలగించండి
 10. దయయు శాంతంబు సత్యంబు దాల్చువాడు
  యోగమార్గావలంబియై యుండువాడు
  క్రోధమోహాదిరిపుషట్క గుంఫిత మల
  బలము లేనట్టివాఁడె నిర్భయుఁడు ఘనుఁడు

  రిప్లయితొలగించండి
 11. నాకెప్పుడూ ఈ మధ్యకాలంలో చెత్తబుట్ట కనబడలేదు
  కొందరికి మాత్రం అది యెందుకు కనిపిస్తోందో తెలియటంలేదు
  కనిపించే ఆ చెత్తబుట్ట కూడా యెందుకు మాయమవుతోందో అంతుబట్టడం లేదు.

  కనబడ్డవీ .... మాయమైనవీ...
  మాయమైనవీ... కనబడ్డవీ....
  ఇదికూడా భ్రాంతి యేనా? లేక ....

  ఇది కూడా పైత్యప్రకోపంలో ఒక రూపమా?

  రిప్లయితొలగించండి
 12. చెత్త బుట్ట కనపడ్డం నాకెప్పుడో మానేసింది.

  రిప్లయితొలగించండి
 13. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  వసంత కిశోర్ గారూ,
  పండిత నేమాని వారూ,
  చింతా రామకృష్ణారావు గారూ,
  మిస్సన్న గారూ,
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  సుబ్బారావు గారూ,
  నిరంజన్ కుమార్ గారూ, (పద్యంలో టైపాట్లున్నాయి),
  శ్యామలీయం గారూ,
  మీ అందరి పూరణలూ దేనికదే బాగున్నాయి. అందరూ చక్కని పూరణలిచ్చారు. అభినందనలు, ధన్యవాదాలు.
  (మా బావగారు మరణించిన కారణంగా మనసేమీ బాగా లేదు. అందువల్ల విడివిడిగా పూరణలను పరామర్శించలేదు. మన్నించాలి)
  *
  చెత్తబుట్ట గురించిన ఆలోచన వద్దు. అవసరంలేని వ్యాఖ్యలను నేను తొలగిస్తాను లెండి!

  రిప్లయితొలగించండి
 14. అర్ధ బలమున్న చాలదు వ్యర్ద్ధ మవగ

  బుద్ధి బలమున్న చాలును ప్రాజ్నుడగును

  స్వప్న మందైన ద్వేషపు స్వార్ద్ధ బుద్ధి

  బలము లేనట్టి వాడె నిర్భయుడు ఘనుడు

  రిప్లయితొలగించండి
 15. ప్చ్ ! అయ్యో ! తమ్ముడూ ! చాలా చెడ్డ వార్త . వారి ఆత్మకు శాంతి చేకూరు గాక

  రిప్లయితొలగించండి
 16. శ్రీ శం కరయ్య గారికి నమస్కారములు.

  మీ బావగారి ఆత్మకు శాంతి కలుగు గాక !

  రిప్లయితొలగించండి
 17. శ్రీగురుభ్యోనమ:

  అర్థబలము చేకూర్చు ననర్థములను
  అంగ బలమును నమ్మిన భంగ మగును
  భుజ బలమ్ములు యెందుకు బుద్ధి కలుగ
  బలము లేనట్టివాఁడె నిర్భయుఁడు ఘనుఁడు

  రిప్లయితొలగించండి
 18. గురువుగారూ మీ బావ గారి మృతి చాలా బాధాకరం.
  వారికి పరమేశ్వరుడు సద్గతులు కల్గించాలని కోరుతున్నాను.

  రిప్లయితొలగించండి
 19. నైతికబలమ్ము,ధీరమానసిక బలము,
  సత్యసంధత, ధార్మికా చరణబుద్ధి,
  దిట్టతనము గల్గగ చాలు ,వట్టి దేహ
  బలము లేనట్టి వాడె నిర్భయుడు ,ఘనుడు.
  ----------------------

  రిప్లయితొలగించండి
 20. నీతి నియమాలు గాంధీకి నిలయ మౌట
  భరత దేశమ్ము నకుగొప్ప భాగ్య మయ్యె
  గుండె బలముకు నిండైన గుఱుతు నసుర
  బలము లేనట్టి వాడె నిర్భయుడు ,ఘనుడు!!!

  రిప్లయితొలగించండి
 21. అభిమన్యుడి గురించి భీష్ముడు ద్రోణుడితో అంటున్నాడు ....
  అదిగొ కనుఁడు పద్మవ్యూహమందు జొచ్చి
  యొంటరిగ పాండవ విపక్ష యోధులెల్ల
  చకితులగునట్లు చెలరేగె, సైన్య బంధు
  బలము లేనట్టివాఁడె నిర్భయుఁడు ఘనుఁడు.

  రిప్లయితొలగించండి
 22. శంకరార్యా ! మీ బావగారి మృతి బాధాకరం !
  వారికి ఆత్మశాంతి
  వారి కుటుంబ సభ్యులకూ ,మీకూ మనఃశాంతి కలుగు గాక !

  రిప్లయితొలగించండి