బాపురే! తెలుగు
భండారు శ్రీనివాసరావు గారు ఫేస్‌బుక్‌లో ఆసక్తికరమైన క్రింది విషయాన్ని పోస్ట్ చేసారు.
AN AMAZING SENTENCE IN ENGLISH
Remarkable indeed ! The person who made this sentence must be a GENIUS in English vocabulary.
"I do not know where family doctors acquired illegibly perplexing handwriting; nevertheless, extraordinary pharmaceutical intellectuality, counterbalancing indecipherability transcendentalizes intercommunication's incomprehensibleness."
పై వాక్యంలో మొదటి పదం ఒక అక్షరం, రెండవ పదం రెండక్షరాలు, మూడవ పదం మూడక్షరాలు.... ఇలా ఇరవయ్యవ పదం ఇరవై అక్షరాలతో ఉన్నాయి.
దీనికి ప్రతిగా ఏల్చూరి మురళీధరరావు గారు ఫేస్‌బుక్‌లో వ్రాసిన తెలుగు వాక్యం. “మిత్రవినోదంకరణగా మీకు విన్నవిస్తున్నాను; మేధావద్విశిష్టతకు కాదు ...” అని కూడా ప్రకటించారు.
“ఏ మంచి కవైనా విశ్వనాథ గ్రంథావళిని చదవకపోతే కవిత్వరచనలో పద్యనిర్మాణశక్తికి, సద్గుణాలంకారవ్యక్తికి,
రసోచితశబ్దార్థయుక్తికి, సుమకోమలభావభావనకు, నవ్యసంప్రదాయపదగుంఫనకు, భవ్యరసాస్వాదరసాయనవాణికి, పురుషార్థోచితచిత్తవృత్తిచిత్రణకు, భారతీయతామరందాస్వాదలోలుపతకు, అతిలోకచమత్కృతిమత్కృతిమత్ప్రతీతికి, విషయచింతానిరోధనిశ్చలసమాధ్యవస్థకు, విపంచీస్వరసౌభాగ్యబంధురశయ్యావైయాత్యానికి, ఉత్కృష్టలోకసిద్ధార్థమహాపురుషగుణకీర్తనకు, రమణీయార్థనిర్మితశ్రవణమనోహరకావ్యలక్ష్మికి, నానార్థస్ఫోటవాచకత్వసంయోగాదినియమితవ్యంజనకు, అభిధావివక్షితాన్యపరవాచ్యసంలక్ష్యక్రమభావధ్వనికి, శృంగారవీరకరుణహాస్యరౌద్రాద్భుతశాంతాదిరసప్రతీతికి, గిరిశిఖరపతన్నిరర్గళస్రవంతీనిరుపమానధారాశుద్ధికి, ధర్మజ్ఞానభక్తిప్రేమసత్యాద్యుత్తమాదర్శప్రతిపాద్యవస్తుస్వీకృతికి, సహృదయహృదయవాసనాపరీపాకభావనాప్రపంచశోభాదూరవర్తే!
పై వాక్యంలో 26 పదాలున్నాయి. మొదటి పదం ఒక అక్షరం, రెండవ పదం రెండక్షరాలు, మూడవ పదం మూడక్షరాలు.... ఇలా ఇరవై ఆరవ పదం ఇరవైయారు అక్షరాలతో ఉన్నాయి.
1. ఏ
2. మంచి
3. కవైనా
4. విశ్వనాథ
5. గ్రంథావళిని
6. చదవకపోతే
7. కవిత్వరచనలో
8. పద్యనిర్మాణశక్తికి,
9. సద్గుణాలంకారవ్యక్తికి,
10. రసోచితశబ్దార్థయుక్తికి,
11. సుమకోమలభావభావనకు,
12. నవ్యసంప్రదాయపదగుంఫనకు,
13. భవ్యరసాస్వాదరసాయనవాణికి,
14. పురుషార్థోచితచిత్తవృత్తిచిత్రణకు,
15. భారతీయతామరందాస్వాదలోలుపతకు,
16. అతిలోకచమత్కృతిమత్కృతిమత్ప్రతీతికి,
17. విషయచింతానిరోధనిశ్చలసమాధ్యవస్థకు,
18. విపంచీస్వరసౌభాగ్యబంధురశయ్యావైయాత్యానికి,
19. ఉత్కృష్టలోకసిద్ధార్థమహాపురుషగుణకీర్తనకు,
20. రమణీయార్థనిర్మితశ్రవణమనోహరకావ్యలక్ష్మికి,
21. నానార్థస్ఫోటవాచకత్వసంయోగాదినియమితవ్యంజనకు,
22. అభిధావివక్షితాన్యపరవాచ్యసంలక్ష్యక్రమభావధ్వనికి,
23. శృంగారవీరకరుణహాస్యరౌద్రాద్భుతశాంతాదిరసప్రతీతికి,
24. గిరిశిఖరపతన్నిరర్గళస్రవంతీనిరుపమానధారాశుద్ధికి,
25. ధర్మజ్ఞానభక్తిప్రేమసత్యాద్యుత్తమాదర్శప్రతిపాద్యవస్తుస్వీకృతికి,
26. సహృదయహృదయవాసనాపరీపాకభావనాప్రపంచశోభాదూరవర్తే!
ఫేస్‌బుక్‌లో కనిపించిన దీనిని అనుమతి లేకుండా బ్లాగులో ప్రకటించినందుకు మన్నించమని వారికి విన్నపం. భండారు శ్రీనివాస రావు గారికి, ఏల్చూరి మురళీధర రావు గారికి ధన్యవాదములు.