రాయల పాత్రను రమ్య రీతి “తెనాలి రామకృష్ణ” సినిమా రక్తి గట్ట నాడు వచించితి నటనమొప్పారగన్ నేడంధ పాలక నేత లంధ భాషగ నీయాంధ్ర భాషను మార్చగ నడుగుబెట్టెదనుచు నాంధ్ర రాష్ట్ర రాజకీయములందు రాముడు తారక మంత్రమై జపియించె మాతృభాష
అమ్మ, నమ్ము నాదు యత్నముల్ సాగును దేశ రాజ ధాని తెనుగు వినగ రాష్ట్రమందు నీదు రాగ మెగయ జేతు తెనుగు భాష యొక్క తేజ మలర.
ప్రపంచ తెలుగు మహా సభలగురించి రకరకాలుగా వింటున్నాము దూరదేశ మీడియా కథనాలలో. మన కవిమిత్రులలో ప్రత్యక్షంగా చూసినవారు ఎవరైనా ఉంటే సాహితీ విభాగం గురించి రెండు మాటలు వ్రాయమని మనవి. ధన్యవాదాలతో.
దేశ భాషలందు తెలుగు లెస్స యటంచు
రిప్లయితొలగించండినాదరమున గొల్చె నాంధ్ర భోజు
డటులె నేటి నేత లాంధ్ర భాషకు సేవ
చేయ బూనుకొనుట శ్రీకరమ్ము
తెలుగు భోజ రాజు తెలుగమ్మనే జగతి
రిప్లయితొలగించండితేజ మలరజేసె తెలుగు వాడ!
తెలుగు వాడ లోన మలుగు చుండెను నేడు
వాడి వేడి జూపు వాడ నీకు.
నాగరికమ్ము పేరిట వినాశపు సంస్కృతి పెచ్చరిల్లె నీ
రిప్లయితొలగించండివేగపు జీవితమ్మిచట పీడన పెంచుచు నశ్వరమ్మునీ
లాగున తెచ్చె; కావుమిక రక్షణ సేయవె సంస్కరించుచున్
రాగల రోజులందున సలక్షణమైన తెనుంగు పిల్లలన్.
ఆర్యా ! గోలి హనుమచ్ఛాస్త్రి గారూ ! మీ పద్య మొదటి పాదంలో ఐదవ గణం ఏమిటి !?
రిప్లయితొలగించండిఆంధ్రభోజుడాత డలనాడు బహుభాష
రిప్లయితొలగించండిలరసి వాటి రసము లనుభవించి
తెలుగుభాషలోని తియ్యందనాలను
మెచ్చి పల్కె నిట్లు మేలటంచు.
సందియంబు లేదు సర్వాంగసుందరం
బైన భాష గాదె యాంధ్రభాష
నిత్యసత్యమియ్య దత్యంత మధురంబు
దేశభాషలందు తెలుగు లెస్స.
పలికినట్లుగానె భక్తిభావము బూని
కవులనాదరించి ఘనతగూర్చి
సాధుకార్యమంచు సాహిత్యసేవను
చేసి యుండి నట్టి శ్రేష్ఠుడతడు.
కృష్ణరాయవిభుని కృపచేత నలనాడు
తెలుగుతల్లి మిగుల వెలుగులీనె
ఘనతరంబులైన కావ్యంబు లెన్నియో
భాగ్యవశముచేత భవమునందె.
వర్తమానమందు పాలకాగ్రణులందు
మాతృభాషపైన మమత లేదు
సంఘటించ వలెను సాహితీ బంధువుల్
తెలుగు వైభవంబు నిలుపు కొరకు.
Propఉ లేక భాష ప్రాపు కోల్పడియున్న
రిప్లయితొలగించండిమైమయి విడకేమి, My! My! ల వినుచున్న
రాయలు వయినంబు Royal Wine రా?
దేశభాషలందు తెలుగు Lessఅ.
దేశభాషలందున మన తెలుగు లెస్స
రిప్లయితొలగించండియనుచు శ్రీ కృష్ణదేవరా యాధిపుండు
వ్రాసి యాముక్త మాల్యదన్ వాసి కెక్కె
చాటె తెలుగుతల్లికి పెద్ద పీట వేసి
మునులు పండితులను గన్న పుణ్య భూమి
రిప్లయితొలగించండిపాడి పంటల నిలయమ్ము భాగ్య సీమ
దేశ దేశాలు మెచ్చిన తెనుగు తల్లి
ఏల జేసెద వీనేల విడచి సాము ?
అక్షరక్షరంబు నమ్మహా దేవతా
రిప్లయితొలగించండిమూర్తుల మరు రూపమొప్పు భాష!
ప్రణవనాద'మమ్మ' ప్రధమాక్షరమ్ముతో
దిద్దబడగ తెలుగు దివ్య భాష!
అన్య భాష లెరిగి యమృతమయంబని
యాంధ్ర భోజు, బ్రౌను లాదరించ!
పలుకు పలుకు తీపి పానీయమైయుండ
దేశ భాష లందు తెలుగు లెస్స!
తెలుగు తల్లి కనవొ దివినుండి దిగివచ్చి
రిప్లయితొలగించండినీకు వందనమ్ము నియతి తోడ
సలుపు చున్న వాడు సాహితీ సమరాంగ
ణాల దిట్ట యైన నాటి రాజు.
దేశ భాషలందు తెలుగు లెస్సని పల్కె
భువన విజయ విభుడు భువిని తెలుగు
దీప్తి యున్న దనుక దీర్ఘాయువై యుండు
తెలుగు వారి బంధు తిలక మితడు.
నేడు తెలుగు సభల వేడుక జరిగెడు
నాటి రాజు కున్న పాటి ప్రేమ
తెలుగు మీద నేటి తెలుగేలికల కున్న
వెలుగులీను గాదె తెలుగు మరల.
ఆర్యా ! రవీందర్ గారూ ! హడావుడి లో జరిగిన పొరపాటు ! సవరించుచున్నాను. ధన్యవాదములు.
రిప్లయితొలగించండితెలుగు భోజ రాజు తెలుగు తల్లి జగతి
తేజ మలరజేసె తెలుగు వాడ !
తెలుగు వాడ లోన మలుగు చుండెను నేడు
వాడి వేడి జూపు వాడనీకు.
రాయల పాత్రను రమ్య రీతి “తెనాలి
రిప్లయితొలగించండిరామకృష్ణ” సినిమా రక్తి గట్ట
నాడు వచించితి నటనమొప్పారగన్
నేడంధ పాలక నేత లంధ
భాషగ నీయాంధ్ర భాషను మార్చగ
నడుగుబెట్టెదనుచు నాంధ్ర రాష్ట్ర
రాజకీయములందు రాముడు తారక
మంత్రమై జపియించె మాతృభాష
అమ్మ, నమ్ము నాదు యత్నముల్ సాగును
దేశ రాజ ధాని తెనుగు వినగ
రాష్ట్రమందు నీదు రాగ మెగయ జేతు
తెనుగు భాష యొక్క తేజ మలర.
ప్రపంచ తెలుగు మహా సభలగురించి రకరకాలుగా వింటున్నాము దూరదేశ మీడియా కథనాలలో. మన కవిమిత్రులలో ప్రత్యక్షంగా చూసినవారు ఎవరైనా ఉంటే సాహితీ విభాగం గురించి రెండు మాటలు వ్రాయమని మనవి. ధన్యవాదాలతో.
రిప్లయితొలగించండిఈనాటి చిత్రాన్ని చూచి స్పందించి చక్కని పద్యాలు పంపిన కవిమిత్రులు...
రిప్లయితొలగించండిపండిత నేమాని వారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
లక్ష్మీదేవి గారికి,
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
ఏల్చూరి మురళీధరరావు గారికి,
నాగరాజు రవీందర్ గారికి,
రాజేశ్వరి అక్కయ్య గారికి,
సహదేవుడు గారికి
మిస్సన్న గారికి,
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
అభినందనలు, ధన్యవాదములు.