10, డిసెంబర్ 2012, సోమవారం

పద్య రచన - 186

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

11 కామెంట్‌లు:

 1. ఎలుకల పిల్లలు ముచ్చట
  గొలుపును గద యట గులాబి కొమ్మ చివరలో
  నలరుచు నున్నవి యవిగో
  కలితగుణా! శంకరయ్య! కన్నుల విందై

  రిప్లయితొలగించండి
 2. అందించెద నీ పుష్పము
  స్పందించుమ నాదు చేయి చాపితి నీకై
  అందని దందుటకై తల
  క్రిందుగ నే తపము జేతు, కిమ్మన వేమే !

  రిప్లయితొలగించండి
 3. అన్నదమ్ము లేమొ ! యధిక ప్రయాసకు
  నోర్చి దెచ్చి ప్రేమ నొక్క విరిని
  చెల్లి కిచ్చు నట్టి చిత్రమ్ము చెలువమ్ము
  ముద్దు లొలుక బాల మూషికములు !

  రిప్లయితొలగించండి
 4. శాస్త్రి గారూ, ధన్యవాదములు . చిత్రకవిత్వము నాకంతగా పట్టువడదు. సమస్య లయితే మూడు పాదాలతో సరిపుచ్చవచ్చు కదా !

  రిప్లయితొలగించండి
 5. ఉడుత జంట ఊసులు:

  తడబాటేలనె? చెలి! నే
  నిడు చామంతిఁ గరమంది యెరిగింప గదే దడజెందక నీ ప్రేమను
  వడిగా, తల క్రిందులుగ తపంబాపగ నే!

  రిప్లయితొలగించండి
 6. మూడు మూషిక కూనలు ముచ్చట గను
  నాడు కొను చుండె నచ్చట యార్యులార !
  చూడు డా గులాబి తొడిమ చుట్టు తిరుగు
  చుండి కడువింత గొలుపుచు నుండె నహహ .

  రిప్లయితొలగించండి
 7. తలక్రిందులగానిలచియు
  తలచినకార్యంబుజేతుతథ్యముగా నా
  తలపులనెఱిగింతును నా
  వలపులజవరాణి నీవె పరికించుననున్.

  రిప్లయితొలగించండి
 8. చులకన జేయుట కాదిది
  తల క్రిందుగ తపము జేసి తమిగొని నీకై !
  ఫలములు పూలను దెచ్చెద
  కలహించకు చెలియ నాతొ కలలో నైనన్ !
  -------------------------
  అందని దని వెను కాడకు
  అందించెద నెపుడు నీకు యాతన పడినన్ !
  పొందుము కానుక నీకిది
  పొందుగ నుండెదము మనము పోరును వీడిన్ !

  రిప్లయితొలగించండి
 9. సుబ్బారావు గారూ, మా లోకము మాది కదా !
  డా. గులాబి చాలా బాగున్నది.

  రిప్లయితొలగించండి