గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, సూచనను గమనించి సవరించిన పూరణ బాగుంది. అభినందనలు. * హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ, సురనదిని గురించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. * పండిత నేమాని వారూ, దయా సముద్రుని గొలువుమన్న మీ పూరణ బాగుంది. అభినందనలు. * ఏల్చూరి మురళీధరరావు గారూ, సాయినాథుని ధుని ప్రసక్తితో మీ పూరణ బాగుంది. అభినందనలు. * లక్ష్మీదేవి గారూ, గోపాలుని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు. * సహదేవుడు గారూ, దైవ స్వరూపుడైన సాయిని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు. * నాగరాజు రవీందర్ గారూ, గ్రహపూజలు దుఃఖనాశకాలన్న మీ పూరణ బాగుంది. అభినందనలు. * కమనీయం గారూ, సాధుజనబంధుని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు. * రాజేశ్వరి అక్కయ్యా, మీరు సూచనను గమనించినట్టు లేదు. అయినా గోవిందుని గుడికి వెళ్ళి కమలనాథుని (సూర్యుని) కొలువడం ఏమిటి? బహుశా ఆ గుడిలో నవగ్రహాలూ ఉన్నాయామో!
శ్రీ గోలి హనుమచ్ఛాస్త్రి గారూ! ఆచార్య జి.ఎన్. రెడ్డి పర్యాయపద నిఘంటువులో స్కందుడు అంటే శివుడని స్కంధుడు అంటే కుమార స్వామి అని అర్థాలు ఇవ్వబడ్డాయి. అదే శబ్దరత్నాకరంలో స్కంధుడనే పదమే లేదు. స్కందుడు అని మాత్రమే ఉంది.
పండిత నేమాని వారూ, ధన్యవాదములు. కమలానాథుడు = విష్ణువు; కమలనాథుడు = సూర్యుడు అనే భావనతో వ్యాఖ్య చేసాను. * నాగరాజు రవీందర్ గారూ, మీ తాజా పూరణ బాగుంది. అభినందనలు. * ఏల్చూరి మురళీధరరావు గారూ, ఇవి ఏదో వినోదార్థం పూరించిన పద్యాల్లా కాకుండా ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు, ధన్యవాదములు.
నేమాని పండితార్యా! ధన్యవాదములు. ఇంత చెప్పినా నాకు మిగిలిపోయిన సందేహం: నిఘంటువులలో నాధుడు అన్నా నాథుడు అన్నా పెనిమిటి అనీ, భర్త అనీ అర్థాలు కనుపిస్తున్నాయి. నాధుడు అన్న పదాన్ని భర్త అనే అర్థంలో ఈ పూరణలో వాడ కూడదా అని.
మాన్యులు శ్రీ శంకరయ్య గారి సహృదయానికి, సౌజన్యానికి, ప్రోత్సాహానికి ధన్యవాదాలు.
శ్రీ మిస్సన్న గారికి -
ధాతుపాఠంలో "నాథృ" - "నాధృ" ధాతువులు రెండూ "స్వామి", "పతి" ఇత్యాద్యర్థాలలో పర్యాయపదాలుగా ఉన్నాయి. కనుక "నాథ" - "నాధ" రెండూ ప్రయోక్తవ్యాలే.
శ్రీ హనుమచ్ఛాస్త్రి గారికి, శ్రీ నాగరాజు గారికి -
"స్కంద" శబ్దం కుమారస్వామికి పర్యాయపదంగా కోశాలలో ఉన్నది. శివుడన్న అర్థంలో ప్రసిద్ధంగా ఎక్కడా కనబడలేదు. ధాతుపాఠంలో "స్కదిర్" అన్న ధాతువుకు "గతి-శోషణయోః" అని చెప్పిన అర్థాల వల్ల "స్కంధము = ఊర్ధ్వగతి కలిగినది" అని; "స్కంధుడు = శోషింపజేసేవాడు" అని అర్థాలు చెప్పవచ్చును కాని - శివునికి లయకారకుడు, హరుడు, సంహారకర్త అనే కాని "శుష్కింపజేసేవాడు, శోషింపజేసేవాడు" అన్న పరిమితార్థం వర్తింపదు కనుక "స్కంధుడు = శివుడు" అర్థం సాధ్యం కాకపోవచ్చును.
కవిమిత్రులారా,
రిప్లయితొలగించండినమస్కృతులు.
ఈనాటి సమస్యలో ఉన్నది ‘ధుని’ - ‘థుని’ కాదు. ఈ భేదాన్ని గమనించి పూరణలు చెప్పవలసిందిగా మనవి.
ధన కనక వస్తు వాహన
రిప్లయితొలగించండిఘన వైభవ మెంతొ గలుగు కైమోడ్పులతో
మనమందు నిలిపి శ్రీనా
ధునిఁ గొలిచినఁ దొలఁగు సకల దుఃఖచయంబుల్.
మాస్టరు గారూ ! నమస్కారములు. క్షమించండి
రిప్లయితొలగించండిపోస్టు చేసిన తరువాత మీ సూచన చూసాను.
'ధుని' తో మరొక పూరణకు ప్రయత్నిస్తాను.
ధన కనక వస్తు వాహన
రిప్లయితొలగించండిఘన వైభవ మెంతొ గలుగు కైమోడ్పులతో
మనమునకు దొరకని యగా
ధునిఁ గొలిచినఁ దొలఁగు సకల దుఃఖచయంబుల్.
జనగణసకలాఘంబుల
రిప్లయితొలగించండిననయము హరియించుచుండి యచ్ఛజలాలన్
మనకందించెడి యాస్వ
ర్ధుని గొలిచిన దొలగు సకలదు:ఖచయంబుల్.
వనజాక్షుని సజ్జన బం
రిప్లయితొలగించండిధుని లక్ష్మీవిభుని విష్ణు తోయజనాభున్
మునివంద్యుని కరుణాసిం
ధుని గొలిచిన దొలగు సకల దుఃఖచయమ్ముల్
గోలి హనుమచ్చాస్త్రి గారు శ్రీనాధుని అనడంలో దోషం ఉన్నదా ? దయచేసి పెద్దలు చెప్పండి.
రిప్లయితొలగించండిఅయ్యా! మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండినాథ శబ్దముతో శ్రీనాథుడు అగును. శ్రీనాధుడు అనరాదు. స్వస్తి.
రిప్లయితొలగించండిమునిని గొలిచిన దొలగు సకల మూఢచయమ్ముల్
మౌనిని గొలిచిన దొలగు సకల మానసచయమ్ముల్
శనిని గొలిచిన దొలగు సకల సంకటచయమ్ముల్
ధునిని గొలిచిన దొలగు సకల దుఃఖచయమ్ముల్
జిలేబి.
అనఘాత్ము లగుచుఁ దమ ప్రా
రిప్లయితొలగించండిక్తనదుష్కర్మచయముఁ దొలఁగం ద్రోచెడి సా
ధునిచయము సాయినాథుని
ధునిఁ గొలిచినఁ దొలఁగు సకలదుఃఖచయంబుల్.
ఘనచారిత్రుడయిన కృ
రిప్లయితొలగించండిష్ణుని, వసుదేవుని తనయుని, సుమధుర మురళీ
ధ్వని బలికించు గో బం
ధునిఁ గొలిచినఁ దొలఁగు సకల దుఃఖచయంబుల్.
వినలేదా? షర్డీపురిఁ
రిప్లయితొలగించండిదన వాసముఁజేసి సాయి ధన్యత గూర్చన్,
ప్రనుతించు, దైవ సంబం
ధునిఁ గొలచినఁ దొలఁగు సకల దుఃఖచయంబుల్!
సవరణతో...
రిప్లయితొలగించండిఘనచారిత్రుడయిన కృ
ష్ణుని, వసుదేవుని తనయుని, సుమధుర మురళీ
ధ్వని బలికించెడు గో బం
ధునిఁ గొలిచినఁ దొలఁగు సకల దుఃఖచయంబుల్.
మనుజులకు గల్గు శుభములు
రిప్లయితొలగించండివినయముగను శివుని గొలువ ; వీడును దోషం
బనయము శుక్రుని మరియు బు
ధుని గొలిచిన, దొలగు సకల దుఃఖచయమ్ముల్!
వనమాలిన్,నారాయణు,
ధనలక్ష్మీపతి,శుభప్రదాయకు,సురస
న్ముని సాధూత్తమజనబం
ధుని గొలిచిన దొలగు సకలదుఃఖచయంబుల్.
వనిలో పూసిన పూలను
రిప్లయితొలగించండిగొని పోయితి గుడికి మెండు గోవిందునికై !
కను విందు గొలుపు కమలనా
ధునిఁ గొలిచినఁ దొలఁ గు సకల దు:ఖ చయంబుల్ !
ఇనకులుని సత్యసంధుని
రిప్లయితొలగించండిసునయనునిన్ దాశరథిని సుందర రూపు
న్ననఘుని సుగ్రీవ సగం
ధునిఁ గొలిచినఁ దొలఁగు సకల దుఃఖచయంబుల్
శ్రీగురుభ్యోనమః
రిప్లయితొలగించండిమూడవ పాద సవరణతో...
వినలేదా? షిర్డీపురిఁ
దన వాసముఁ జేసి సాయి ధన్యత గూర్చన్!
ప్రణతులిడి దైవ సంబం
ధునిఁ గొలువఁ దొలఁగుఁ సకల దుఃఖచయంబుల్!
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిసూచనను గమనించి సవరించిన పూరణ బాగుంది. అభినందనలు.
*
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
సురనదిని గురించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
దయా సముద్రుని గొలువుమన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
ఏల్చూరి మురళీధరరావు గారూ,
సాయినాథుని ధుని ప్రసక్తితో మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
గోపాలుని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
దైవ స్వరూపుడైన సాయిని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
నాగరాజు రవీందర్ గారూ,
గ్రహపూజలు దుఃఖనాశకాలన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
కమనీయం గారూ,
సాధుజనబంధుని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మీరు సూచనను గమనించినట్టు లేదు.
అయినా గోవిందుని గుడికి వెళ్ళి కమలనాథుని (సూర్యుని) కొలువడం ఏమిటి? బహుశా ఆ గుడిలో నవగ్రహాలూ ఉన్నాయామో!
అయ్యా శ్రీ శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిశ్రీమతి రాజేశ్వరి గారు చెప్పిన కమల నాథుడు అంటే విష్ణువే కదా. కమలా శ్రీ హరిప్రియా అని అమరకోశము కదా. స్వస్తి.
మునిగణ సంస్తుత కొమరుని
రిప్లయితొలగించండిఘనుడగు శివునికి తనయుని కందుని సామిన్
వినయము తోడన్ మది స్కం
ధుని గొలిచిన దొలగు సకల దు:ఖ చయంబుల్
శ్రీ నాగరాజు రవీందర్ గారు:
రిప్లయితొలగించండిశుభాశీస్సులు,
మీ పద్యము మొదటి పాదములో: మునిగణ సంస్తుతు అనండి. స్వస్తి.
రిప్లయితొలగించండిఅలాగే గురువర్యా !
మునిగణ సంస్తుతు కొమరుని
ఘనుడగు శివునికి తనయుని కందుని సామిన్
వినయము తోడన్ మది స్కం
ధుని గొలిచిన దొలగు సకల దు:ఖ చయంబుల్
పూజ్యశ్రీ గురువులకు, శ్రీ కంది శంకరయ్యగారికి
రిప్లయితొలగించండినమస్సులు!
వినోదార్థం, మఱి మూడు పూరణలు:
“అనిశం తవ పదయుగచిం
తన మేవ కరోమి; నిభృతదయయా౽వ శ్రితా
వన! మా” మని కరుణాసిం
ధునిఁ గొలిచినఁ దొలఁగు సకలదుఃఖచయంబుల్.
తనువున నాధివ్యాధుల
మనమున నే శాంతిలేని మనుజులు మీనం
బున దోషావస్థితుఁ డగు బు
ధునిఁ గొలిచినఁ దొలఁగు సకలదుఃఖచయంబుల్.
అనిభృతులు ధనుర్మాసం
బున హస్తాసోమవారపూర్వకతిథి యం
దున గలశం బిడి భక్తి వి
ధునిఁ గొలిచినఁ దొలఁగు సకలదుఃఖచయంబుల్.
విధేయుఁడు,
ఏల్చూరి మురళీధరరావు
గురువులు శ్రీ పండితుల వారికీ శ్రీ శంకరయ గారికీ ధన్య వాదములు.
రిప్లయితొలగించండిఆర్యా రవీందర్ గారూ !క్షమించాలి..స్కందుడు ....స్కంధుడు కాదనుకుంటాను...
రిప్లయితొలగించండిశ్రీ గోలి హనుమచ్ఛాస్త్రి గారూ! ఆచార్య జి.ఎన్. రెడ్డి పర్యాయపద నిఘంటువులో స్కందుడు అంటే శివుడని స్కంధుడు అంటే కుమార స్వామి అని అర్థాలు ఇవ్వబడ్డాయి. అదే శబ్దరత్నాకరంలో స్కంధుడనే పదమే లేదు. స్కందుడు అని మాత్రమే ఉంది.
రిప్లయితొలగించండి.... స్కందుడు లేక స్కంధుడు .. ఎలాగైనా వ్రాయవచ్చు అని నేననుకుంటున్నాను.
రిప్లయితొలగించండిపండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిధన్యవాదములు. కమలానాథుడు = విష్ణువు; కమలనాథుడు = సూర్యుడు అనే భావనతో వ్యాఖ్య చేసాను.
*
నాగరాజు రవీందర్ గారూ,
మీ తాజా పూరణ బాగుంది. అభినందనలు.
*
ఏల్చూరి మురళీధరరావు గారూ,
ఇవి ఏదో వినోదార్థం పూరించిన పద్యాల్లా కాకుండా ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు, ధన్యవాదములు.
రిప్లయితొలగించండినేమాని పండితార్యా! ధన్యవాదములు.
ఇంత చెప్పినా నాకు మిగిలిపోయిన సందేహం:
నిఘంటువులలో నాధుడు అన్నా నాథుడు అన్నా
పెనిమిటి అనీ, భర్త అనీ అర్థాలు కనుపిస్తున్నాయి.
నాధుడు అన్న పదాన్ని భర్త అనే అర్థంలో
ఈ పూరణలో వాడ కూడదా అని.
ఎందఱో సత్కవులు, మిత్రులు భర్త అనే అర్థం వచ్చేలా వాడకుండానే అద్భుతమైన పూరణలు చేశారు. అందరికీ అభినందనలు.
రిప్లయితొలగించండిఅయ్యా మిస్స్న్న గారూ!
రిప్లయితొలగించండినాథ! అనే శబ్దమునే భర్త అనే అర్థములో వాడుట సముచితము. నాధ అనే శబ్దము గురించి నేను జెప్పలేను.
స్వస్తి
మాన్యులు శ్రీ శంకరయ్య గారి సహృదయానికి, సౌజన్యానికి, ప్రోత్సాహానికి ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిశ్రీ మిస్సన్న గారికి -
ధాతుపాఠంలో "నాథృ" - "నాధృ" ధాతువులు రెండూ "స్వామి", "పతి" ఇత్యాద్యర్థాలలో పర్యాయపదాలుగా ఉన్నాయి. కనుక "నాథ" - "నాధ" రెండూ ప్రయోక్తవ్యాలే.
శ్రీ హనుమచ్ఛాస్త్రి గారికి, శ్రీ నాగరాజు గారికి -
"స్కంద" శబ్దం కుమారస్వామికి పర్యాయపదంగా కోశాలలో ఉన్నది. శివుడన్న అర్థంలో ప్రసిద్ధంగా ఎక్కడా కనబడలేదు. ధాతుపాఠంలో "స్కదిర్" అన్న ధాతువుకు "గతి-శోషణయోః" అని చెప్పిన అర్థాల వల్ల "స్కంధము = ఊర్ధ్వగతి కలిగినది" అని; "స్కంధుడు = శోషింపజేసేవాడు" అని అర్థాలు చెప్పవచ్చును కాని - శివునికి లయకారకుడు, హరుడు, సంహారకర్త అనే కాని "శుష్కింపజేసేవాడు, శోషింపజేసేవాడు" అన్న పరిమితార్థం వర్తింపదు కనుక "స్కంధుడు = శివుడు" అర్థం సాధ్యం కాకపోవచ్చును.
వేఱేదైనా వ్యుత్పత్తి ఉన్నదేమో చూడాలి.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
నేమాని పండితార్యా ధన్య వాదములు.
రిప్లయితొలగించండిగౌరవనీయులు డా. ఏల్చూరి మురళీధర రావు గార్కి
వందన శతము సందేహ నివృత్తి చేసినందులకు.
ధనమును కొల్లలు కొనుచున్
రిప్లయితొలగించండిచనుచును భాగ్యపు నగరము జంకును విడుచున్
కనుగొని మంత్రివరుని బం
ధునిఁ గొలిచినఁ దొలఁగు సకల దుఃఖచయంబుల్