ఈనాటి పద్య రచనలన్నీ చక్కగా రాణించుచున్నవి. అందరికీ అభినందనలు. శ్రీ సహదేవుడు గారు షట్చక్రములు + సహస్రారములను కలిపి 7 కొండలుగా సమన్వయ పరచిరి. మంచి భావము. శ్రీమతి లక్ష్మీదేవి గారు తనకా మహిమలు తెలియనప్పుడు విని తెలుసుకొంటామని వినయమును ప్రదర్శించేరు. శ్రీ సుబ్బారావు గారి పద్యము కూడా బాగున్నది. స్వస్తి.
aaru chakraMulane yanuvgaa sarinilipi
రిప్లయితొలగించండిdhyaana mudra lOna yaanamaMda
vEyi rEkalunna velugoMdu padmammu
daaTa 'nOM' padammu dariki chEru.
నా కృతి ఆనందమయి నుండి:
రిప్లయితొలగించండిఏ నీ విభవము ఢాకిని
యై నాదు విశుద్ధ చక్రమందు జెలగునో
నే నా రూపము నాదృతి
ధ్యానించెద నేక వక్త్ర నానందమయీ!
ఏ నీ విభవము రాకిని
యై నాదు ననాహతాబ్జమందు జెలగునో
నే నా రూపము నాదృతి
ధ్యానించెద ద్విముఖి నాత్మ నానందమయీ!
ఏ నీ విభవము లాకిని
యై నా మణిపుర సరోజమందు జెలగునో
నే నా రూపము నాదృతి
ధ్యానించెద త్రిముఖి నాత్మ నానందమయీ!
ఏ నీ విభవము స్వాధి
ష్ఠానాబ్జాతమ్మునన్ పొసగు కాకినియై
నే నా రూపము నాదృతి
ధ్యానింతు చతుర్ముఖిని చిదానందమయీ!
ఏ నీ విభవము సాకిని
యై నా యాధార చక్రమందు జెలగునో
నే నా రూపము నాదృతి
ధ్యానింతును పంచ వక్త్ర నానందమయీ!
ఏ నీ విభవము హాకిని
యై నా యాజ్ఞా సరోజ మందు జెలగునో
నే నా రూపము నాదృతి
ధ్యానింతును షణ్ముఖిని చిదానందమయీ!
ఏ నీ విభవము యాకిని
యై నా యందలరునో సహస్రారమునం
దా నీ రూపము నాదృతి
ధ్యానింతును విశ్వరూప నానందమయీ!
శ్రీమఛ్ఛంకరాచార్య విరచితమైన సౌందర్య లహరినుండి:
రిప్లయితొలగించండిమహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం
స్థితం స్వాధిష్ఠానే హృది మరుత మాకాశ ముపరి
మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం
సహస్రారే పద్మే సహ రహసి పత్యా విహరసి
తాత్పర్యము:
ఓ జగన్మాతా! భూతత్త్వమగు మూలాధార చక్రమును, జలతత్త్వమగు మణిపూరచక్రమును, అగ్నితత్త్వమగు స్వాధిష్ఠాన చక్రమును, వాయు తత్త్వమగు అనహత చక్రమును, ఆకాశ తత్త్వమగు విశుద్ధ చక్రమును, పిదప ఆజ్ఞా చక్రమును దాటి కులపథము ద్వారా పయనించి సహస్రార పద్మమును జేరుకొని అచ్చట నీ పతి యగు సదాశివునితో రహస్యముగా క్రీడించుచు నుందువు కదా!
రిప్లయితొలగించండిఆరు చక్రములనె యనువుగా సరినిల్పి
ధ్యాన ముద్ర లోన యానమంద
వేయి రేకలున్న వెలుగొందు పద్మమ్ము
దాట 'నోం' పదమ్ము దరికి చేరు.
మర్మ కుండలినీ చక్ర మహిమ లేవొ?
రిప్లయితొలగించండియెఱుగకుండ నేనేమి చెప్పెదనొ! తెలిసి
యున్నవారలు చెప్పగా నొక్క నిముస
మాగి వినుటయె మేలగు నంచు తలతు.
ఆరు కొండల నెక్కియు చేరు కొన్న
రిప్లయితొలగించండిసప్త శిఖరిపై వెలుగొందు చక్రి గనుట
ధ్యానమున మూల చక్రపు తలపు మొదలు
పై సహస్రార చక్రపు ప్రభల గనుట
ఓంకారమె శివు డందురు
రిప్లయితొలగించండిఓంకారము పలుకు నెడల యూపిరి నిలుచు
న్నోం కారాదులు బలుకగ
శ్రీం కారము తోడ ముగిసి సిరులను నొసగున్
ఈనాటి పద్య రచనలన్నీ చక్కగా రాణించుచున్నవి. అందరికీ అభినందనలు.
రిప్లయితొలగించండిశ్రీ సహదేవుడు గారు షట్చక్రములు + సహస్రారములను కలిపి 7 కొండలుగా సమన్వయ పరచిరి. మంచి భావము.
శ్రీమతి లక్ష్మీదేవి గారు తనకా మహిమలు తెలియనప్పుడు విని తెలుసుకొంటామని వినయమును ప్రదర్శించేరు.
శ్రీ సుబ్బారావు గారి పద్యము కూడా బాగున్నది.
స్వస్తి.
యోగ విద్యల నెల్లను భోగ మనగ
రిప్లయితొలగించండిచాక్షు షీ విద్య లెన్నియొ నక్ష విద్య
కుండలీ కరణము లను కొన్ని వినగ
యెన్ని విద్యలు తెలుపగ నెన్న తరమె ?