ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కాకలు దీరిన యోధులు కాకతి రాజుల బహుమతి కట్టడములివే లోకమున నిలిచి యుండెను శ్రీకరముగ నోరుగంట జేజేలనరే !
కాకతీయులు గట్టిన కట్టడములు చూడ ముచ్చట గొలుపును చూపరులకు వారు చెక్కిన శిల్పాల వాడి తనము ,నాటి వైభవ మంతయు నాట్య మాడు .
కాకతీయవంశ ఘనచరిత్రము విన్నవారలెల్ల గొప్పవనిత రుద్రమాంబ గాథ తెలిసి యద్భుతమనుచునుపొగడుచుంద్రు మిగుల ముచ్చటగను.
ఘన కీర్తిన్ బ్రకటించు దోరణము సాకల్యమ్ముగా సోదరా!కనువిందయ్యెడు కాకతీయ ప్రథిత క్ష్మాపాల వైశిష్ట్యమున్ దనరం జేయుచు నెల్ల కాలములలో తచ్చిహ్నవర్యంబు ని ల్చును సర్వోత్తమమైన సాక్ష్యమగుచున్ శోభాయమానమ్ముగా
కాకతీయ సామ్రాట్టుల కళల ప్రేమచిహ్నమీ శిల్ప రాజము చెలువ మొప్పురమ్ము నను జూడ సోదరా రమ్మ టంచుతలుపులను దెరచి స్వాగతం బలుకుచుండె.
శ్రీ గురువులకు, పెద్దలందఱికి ప్రణామములు!ఏకశిలా మహాప్రాకార రక్షణ శ్రీకారమంత్రమై చెలఁగు దీక్ష మ్లేచ్ఛవాహినులను మేదింప గణపతిదేవుండు దూసిన తెలుఁగు కత్తిరణముల సురతాణి గణముల గుణమూడ్చు రాణి రుద్రమదేవి పాణిశక్తిజాయప సేనాని సాయించు ధీ మించు భరతవిద్యాప్రౌఢభావగరిమ పాడుకొందును గళమెత్తి పాటవింప “కాఁక” లేని “తీయఁ”దనము గండరించు కాకతీయాంధ్రసామ్రాజ్యకమ్ర కీర్తితోరణముఁ గాంచి పులకించి దోయిలించి.విధేయుఁడు,ఏల్చూరి మురళీధరరావు
ఏకశిలా తోరణ మదిఏకైకంబుగ వెలుంగు నెప్పటికిని వత్సా! కాకతీయ రాజులశ్రీకీర్తిని చాటెడి ఘనచిహ్న౦ బదియే!
మార్కొ పోలొ యాత్ర పేర్కొనె విభవమ్ము కాకతీయ ఘనత కనుల కింపు గుడులు గోపురములు బడులు మెండుగ నున్న శిల్ప కళల సొగసు శ్రీ కరమ్ము
భీషణ రణ ఘోష లుషిత శిలాతోరణమ్ము తీర్థ మయ్యె నల్దిశలకుకాకతీయ కళల కావ్యమై సర్కారుచిహ్న రుచిర మగుచు చేవ తోడ.
కాకతీయుల కీర్తి తోరణాన్ని చూసి స్పందించి మనోహరమైన పద్యాలు రచించిన...గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, సుబ్బారావు గారికి, లక్ష్మీదేవి గారికి, పండిత నేమాని వారికి, గండూరి లక్ష్మినారాయణ గారికి, ఏల్చూరి మురళీధర రావు గారికి, చంద్రశేఖర్ గారికి, రాజేశ్వరి అక్కయ్య గారికి, తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి, అభినందనలు. ధన్యవాదములు.
ఆంధ్ర దేశ మెల్ల అవలీలగానేలకూడు గుడ్డ గూడు కొదువ లేక సాక్షి కంబ ద్వార స్వాగత తోరణం కాకతీయ వంశ ఖ్యాతి మెరయ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికాకలు దీరిన యోధులు
రిప్లయితొలగించండికాకతి రాజుల బహుమతి కట్టడములివే
లోకమున నిలిచి యుండెను
శ్రీకరముగ నోరుగంట జేజేలనరే !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికాకతీయులు గట్టిన కట్టడములు
రిప్లయితొలగించండిచూడ ముచ్చట గొలుపును చూపరులకు
వారు చెక్కిన శిల్పాల వాడి తనము ,
నాటి వైభవ మంతయు నాట్య మాడు .
కాకతీయవంశ ఘనచరిత్రము విన్న
రిప్లయితొలగించండివారలెల్ల గొప్పవనిత రుద్ర
మాంబ గాథ తెలిసి యద్భుతమనుచును
పొగడుచుంద్రు మిగుల ముచ్చటగను.
ఘన కీర్తిన్ బ్రకటించు దోరణము సాకల్యమ్ముగా సోదరా!
రిప్లయితొలగించండికనువిందయ్యెడు కాకతీయ ప్రథిత క్ష్మాపాల వైశిష్ట్యమున్
దనరం జేయుచు నెల్ల కాలములలో తచ్చిహ్నవర్యంబు ని
ల్చును సర్వోత్తమమైన సాక్ష్యమగుచున్ శోభాయమానమ్ముగా
కాకతీయ సామ్రాట్టుల కళల ప్రేమ
రిప్లయితొలగించండిచిహ్నమీ శిల్ప రాజము చెలువ మొప్పు
రమ్ము నను జూడ సోదరా రమ్మ టంచు
తలుపులను దెరచి స్వాగతం బలుకుచుండె.
శ్రీ గురువులకు, పెద్దలందఱికి
రిప్లయితొలగించండిప్రణామములు!
ఏకశిలా మహాప్రాకార రక్షణ
శ్రీకారమంత్రమై చెలఁగు దీక్ష
మ్లేచ్ఛవాహినులను మేదింప గణపతి
దేవుండు దూసిన తెలుఁగు కత్తి
రణముల సురతాణి గణముల గుణమూడ్చు
రాణి రుద్రమదేవి పాణిశక్తి
జాయప సేనాని సాయించు ధీ మించు
భరతవిద్యాప్రౌఢభావగరిమ
పాడుకొందును గళమెత్తి పాటవింప
“కాఁక” లేని “తీయఁ”దనము గండరించు
కాకతీయాంధ్రసామ్రాజ్యకమ్ర కీర్తి
తోరణముఁ గాంచి పులకించి దోయిలించి.
విధేయుఁడు,
ఏల్చూరి మురళీధరరావు
ఏకశిలా తోరణ మది
రిప్లయితొలగించండిఏకైకంబుగ వెలుంగు నెప్పటికిని వ
త్సా! కాకతీయ రాజుల
శ్రీకీర్తిని చాటెడి ఘనచిహ్న౦ బదియే!
మార్కొ పోలొ యాత్ర పేర్కొనె విభవమ్ము
రిప్లయితొలగించండికాకతీయ ఘనత కనుల కింపు
గుడులు గోపురములు బడులు మెండుగ నున్న
శిల్ప కళల సొగసు శ్రీ కరమ్ము
భీషణ రణ ఘోష లుషిత శిలాతోర
రిప్లయితొలగించండిణమ్ము తీర్థ మయ్యె నల్దిశలకు
కాకతీయ కళల కావ్యమై సర్కారు
చిహ్న రుచిర మగుచు చేవ తోడ.
కాకతీయుల కీర్తి తోరణాన్ని చూసి స్పందించి మనోహరమైన పద్యాలు రచించిన...
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
సుబ్బారావు గారికి,
లక్ష్మీదేవి గారికి,
పండిత నేమాని వారికి,
గండూరి లక్ష్మినారాయణ గారికి,
ఏల్చూరి మురళీధర రావు గారికి,
చంద్రశేఖర్ గారికి,
రాజేశ్వరి అక్కయ్య గారికి,
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
అభినందనలు. ధన్యవాదములు.
ఆంధ్ర దేశ మెల్ల అవలీలగానేల
రిప్లయితొలగించండికూడు గుడ్డ గూడు కొదువ లేక
సాక్షి కంబ ద్వార స్వాగత తోరణం
కాకతీయ వంశ ఖ్యాతి మెరయ