23, డిసెంబర్ 2012, ఆదివారం

పద్య రచన - 199

వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు!
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

13 కామెంట్‌లు:

 1. వందే విష్ణుం రమానాథం
  వందే పన్నగశాయినం
  వందే ముక్తిప్రదం దేవం
  వందే వైకుంఠనాయకం

  వందే విష్ణుం దయాసాంద్రం
  వందే గీతా ప్రబోధకం
  వందే ఫుల్ల సరోజాక్షం
  వందేహం పార్థసారథిం

  వందే విష్ణుం జగన్నాథం
  వందే భక్త వరప్రదం
  వందే దైత్యగణారాతిం
  వందే దేవం సనాతనం

  రిప్లయితొలగించండి
 2. పడగల నీడన సుఖముగ
  యిడుములు లేకుండ నీవు యేకాంతమునన్ !
  నడి సంద్రము నందు మునిగి
  పడి గాపులు పడెడి జనుల పరి రక్షిం చన్ !

  రిప్లయితొలగించండి
 3. క్షీరాబ్ధిన్ శయనించు విష్ణువును పూజింపంగ నాపుణ్యమా
  వారాశిన్ దగ బోలునంచు దలతున్, భాగ్యమ్ము పెంపొందెనే
  శ్రీరంగంబును జేర నన్ను పిలుమా, జెల్వార నే గొల్తు; నీ
  భారమ్మౌ బ్రతుకింక జాలు వరదా!పాపంబు పోకార్చుమా!

  అక్కయ్య గారు,
  మీ పద్యము బాగున్నది.
  అదే స్ఫూర్తితో

  నడిసంద్రమ్మున నిలిచిన
  పడగపు గొడుగుల హరిగొలువంగ సులభమౌ
  నడిసంద్రపు బ్రతుకులలో
  కడగండ్లను దాటుటనిక, కరుణాసింధూ!

  రిప్లయితొలగించండి
 4. కులశేఖర ఆళ్వార్ రచించిన ముకుందమాలకు నేను చేసిన అనువాదము నుండి:

  క్షీరసాగర వీచికా శీకరతతి
  తారకలవోలె శోభిల్లు చారు మూర్తి
  భోగివర భోగశాయికి మురహరునకు
  మాధవున కాదరమున నమస్కరింతు

  శ్రీనారాయణ పాదపంకజ యుగశ్రీ సన్నిధిన్ మ్రొక్కెదన్
  శ్రీనారాయణ పూజలన్ సతతమున్ జిత్తంబులో జేయుదున్
  శ్రీనారాయణ దివ్యనామములు వల్లింతున్ సముత్సాహినై
  శ్రీనారాయణ తత్త్వ వైభవమునే చింతింతు సద్భక్తితో

  శ్రీనాథా! పురుషోత్తమా! మురహరా! శ్రీవాసుదేవా! హరీ!
  శ్రీనారాయణ! చక్రపాణి! వరదా! శ్రీకృష్ణ! భక్తప్రియా!
  శ్రీనందాత్మజ! రామ! రామ! భువన శ్రేయోనుసంధాయకా!
  దీనత్రాణ పరాయణా! యదువరా! దేవా! జగన్నాయకా!

  శ్రీవైకుంఠ! ముకుంద! మాధవ! కృపాసింధూ! యశోదాసుతా!
  గోవిందా! మధుసూదనా! సురనుతా! గోపాలకృష్ణా! విభూ!
  దేవా! యంచును బల్కగల్గియును పృథ్విన్ బల్కరారీతిగా
  నేవేళన్ వ్యసనార్తులై జనులు స్వామీ! బాపుమీ దుస్థితిన్

  రిప్లయితొలగించండి
 5. భుజంగ ప్రయాతము :

  హరీ ! చక్రధారీ ! మురారీ ! త్రిధామా !
  వరాంగా ! యుపేంద్రా ! సుబావో ! స్వయంభూ !
  పరేశా ! హృషీకేశ ! వైకుంఠవాసా !
  వరాహా ! సహస్రాక్ష ! ప్రాగ్వంశ ! దేవా !

  రిప్లయితొలగించండి
 6. ఉత్తర ద్వార దర్శన ముత్తమమని
  శేష శయనుని జూచి నశేష జనులు
  కొల్వ గుడుల వరుస గట్టి నిల్వ నేల?
  దిక్కులేవైన విశ్వాత్మ తేజ మొకటె!

  రిప్లయితొలగించండి
 7. అయ్యా! శ్రీ నాగరాజు రవీందర్ గారూ! శుభాశీస్సులు.
  మీ భుజంగప్రయాతం ఒక మంచి ప్రయత్నము. బాగున్నది. 4వ పాదములో "వరాహా" అని సంబోధించుటను ఒక్కమారు సమీక్షించండి. స్వామి మత్స్య, కూర్మ, వరాహాది రూపములను ఎత్తెను కదా అని వరాహా! అని పిలుచుట కొంచెము ఇబ్బందిగానే తోచుచున్నది. యజ్ఞవరాహా అనుట బాగుగనే యుంటుంది కానీ కేవలము వరాహా అనుట బాగుండదు. భక్తిలో తప్పులేదు అనవచ్చు. అలాగ మీరు తప్పించుకొంటారు అని నేను అనుకొనను. ప్రాస కొరకు సరోజేక్షణా! మొదలైన పదములను ఎంచుకొనవచ్చును. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 8. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మఆదివారం, డిసెంబర్ 23, 2012 9:03:00 PM

  పాల సంద్ర మందు శేష పాన్పు పైన నుండుచున్
  ఫాల లోచనాది వంద్య పద్మనాభు డిత్తరిన్
  కాల చక్ర మంత ద్రిప్పు కాల ధర్మ మంతటన్
  కేలు మోడ్పు లిత్తు మయ్య కేశవుండు బ్రోవగన్

  రిప్లయితొలగించండి
 9. గురువర్యులకు వందనములు. వరాహుడు అంటే విష్ణువు అని అర్థం వుంది కదా. నిజమే! వరాహా అంటే కాస్త బాగులేదు. సరే అలా ఐతే వరిష్ఠా ! అని మార్చుతున్నాను. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 10. పండిత నేమాని వారూ,
  మీ విష్ణుస్తోత్రం, ముకుందమాల అనువాద పద్యాలు మనోహరంగా ఉన్నాయి. అభినందనలు, ధన్యవాదములు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  బాగుంది మీ పద్యం. అభినందనలు.
  ‘సుఖముగ నిడుములు’ అవుతుంది. అక్కడ యడాగమం రాదు.
  ‘పరిరక్షించన్’ అంటే అసంపూర్ణ వాక్యమౌతున్నది. ‘పాలింతువయా’ అనండి.
  *
  లక్ష్మీదేవి గారూ,
  మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ భుజంగప్రయాతం బాగుంది. అభినందనలు.
  ‘సుబావో’ టైపాటనుకుంటా... అది ‘సుభావో’ లేదా ‘సుబాహో’ అని ఉండాలనుకుంటాను.
  *
  సహదేవుడు గారూ,
  ‘దిక్కులేవైన విశ్వాత్మ తేజ మొకటె!’ అనడం బాగుంది. మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
  *
  తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ,
  మీ పంద్యం ‘సుగంధాలను’ వెదజల్లుతున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. అయ్యా! శ్రీ నాగరాజు రవీందర్ గారూ!
  శుభాశీస్సులు.
  వరాహుడు అంటే విష్ణువు అనే అర్థము నాకు గుర్తులేదు. నాదే పొరపాటు. వరిష్ఠ అనే శబ్దము కూడా బాగున్నది. స్వస్తి.

  రిప్లయితొలగించండి