9, డిసెంబర్ 2012, ఆదివారం

పద్య రచన - 185

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

11 కామెంట్‌లు:

 1. కలికి దమయంతి నప్పుడు
  కలసియె నేనుందుననిన కాఠిన్యముతో
  నలుడే వదలెను నిశిలో
  నలువ లిఖితమును చెరుపగ నలవియె యగునా?

  రిప్లయితొలగించండి
 2. ఈ మహారణ్య వాసమ్ము నెటుల నోపు
  నీలతాంగి? నే వీడి పోయెదను గాక
  అంత నియ్యింతి పుట్టింటి కరుగు ననుచు
  దలచి నలుడేగె వీడుచు దార నకట!

  రిప్లయితొలగించండి
 3. గాఢ ని ద్ర యం దుండగ గని కరంబు
  కొంచె మైనను జూడక కుమతి తోడ
  నాలి విడిచెను నలుడు నా యడవి లోన
  దార దమ యంతి నక్కట దౌష్ట్యు డతడు

  రిప్లయితొలగించండి
 4. వలచి మనువాడి దమయంతి నలుని జేరె
  కష్ట మెంతటి వార్నైన కఠిను జేయ
  వనమున వనజాక్షివదల పాడియౌనె
  నలువ వ్రాతను మార్చుట నలుని తరమె?

  రిప్లయితొలగించండి
 5. తనరి నలదమయంతు లిద్దరును దీర్ఘ
  వాసర నిశల్ సలిపిరి పుష్పశర బాధ్య
  మానలై నందన వనమ్ములోన దలిరు
  తల్పముల మృణాల నలిన దళము లందు

  రిప్లయితొలగించండి
 6. నలదమయంతు లిద్దరు మన: ప్రభవానల బాధ్యమానలై .... అనే ప్రశస్తమైన పద్యాన్నే కొద్దిగా మార్చి :

  రిప్లయితొలగించండి
 7. ఎండ కన్నొల్ల నట్టిదీ యింతి యకట
  వెంట వచ్చెను వనముల కంటి నన్ను
  వలదు వలదన్న వదలక, యలసి పోయె
  నడవి పొదలను రాళ్ళను నడచి నడచి.

  హంస తూలికా తల్పమ్ము నందు పండు
  నట్టి సుకుమారి యీరాత్రి యటవి నిచట
  కటిక నేలపై శయనించె కరుగ గుండె
  గొప్ప దౌర్భాగ్యుడౌ పతి గూడు కతన.

  యెంత చెప్పిన వినదాయె నేమి సేతు
  నిట్టి దురదృష్ట జాతకు నీమె పొందె
  నెట్లు పంపింతు వెన్కకు నింతి ననుచు
  మిగుల వగచెను యోచించె పొగిలి నలుడు.

  విడచి పెట్టెద నిప్పుడే వెలది నిచట
  నేక వస్త్రమ్ము రెండుగా నింత చించి
  కరుణ గలవార లెవరైన నరసి యామె
  నప్ప జెప్పగ పుట్టింట నగును మేలు.

  గుండె బరువెక్క నారాజు బండ బారి
  లేచె మెల్లగ ప్రేమతో చూచె సతిని
  రెండుగా చీల్చె వస్త్రమ్ము లేమ నొంటి
  జేసి కలసివోయెను నిశి జింత తోడ.


  రిప్లయితొలగించండి
 8. దారబంధమ్మువిడచుచు దారివెతకి
  దారుణంబునకొడిగట్టె ధరణివిభుడు
  దారతనుజూపనొల్లడాధారమేది
  దారకంబులు కామవాత్సల్యములును.

  దార = భార్య
  ధరణివిభుడు + ఉదారతన్ = రాజు వాత్సల్యమును
  దారకము = చీల్చునది, భేదించునది,

  రిప్లయితొలగించండి


 9. ఆమె యిడుమల భరియింప నలవిగాక
  పత్ని దమయంతి నడవిలో వదలి వెడలె
  నలమహారాజు ,చింతామనస్కుడగుచు
  కర్మవశమును దప్పింప గలరె యెవరు?

  రిప్లయితొలగించండి
 10. నల దమయంతులపై చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు....
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  పండిత నేమాని వారికి,
  సుబ్బారావు గారికి,
  సహదేవుడు గారికి,
  నాగరాజు రవీందర్ గారికి, (ప్రసిద్ధ పద్యానికి అనుకృతి బాగుంది)
  మిస్సన్న గారికి, (అద్భుతమైన ఖండిక!)
  సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
  కమనీయం గారికి,
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి