కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
సద్గుణోపేతుఁడఁట తిక్క శంకరయ్య.
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదములు
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
సద్గుణోపేతుఁడఁట తిక్క శంకరయ్య.
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదములు
సూరి - తిక్కల సంభాషణ:
రిప్లయితొలగించండిశంకరాభరణపు కంది శంకరయ్య
గారి ప్రతిభను దెలుపుమా సూరి! యనుచు
నడుగ, నాతండు బదులిచ్చె నౌర! సకల
సద్గుణోపేతుడట తిక్క! శంకరయ్య
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅయ్యా! శ్రీ చంద్రశేఖర్ గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము బాగున్నది. 1వ పాదములో యతి మైత్రి కనబడ లేదు. స్వస్తి.
అయ్యా శ్రీ శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యములో 2వ పాదము చివరన "డు" అదనముగా టైపు పొరపాటుగా కనుపట్టు చున్నది. దానిని తొలగించండి. స్వస్తి.
స్థిరముగ మనతెలుగు చంద్రశేఖరుండు
రిప్లయితొలగించండిసద్గుణోపేతుఁడఁట; తిక్క శంకరయ్య
చేష్టలప్పుడపుడు వేయు చిలిపిగాను
చిన్నతనపు మొండితనము వెన్నుతట్ట!
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిధన్యవాదములు.
హరుఁడు ముక్కంటి, ముక్కోపి యనుచుఁ దిక్క
శంకరయ్యగ వచియించె సత్కవీంద్రుఁ
డెవ్వ రేమన్న నేమి? యే నిటు వచింతు
సద్గుణోపేతుఁడఁట తిక్క శంకరయ్య.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురువుగారిచ్చిన అవకాశమును వినియోగించ దలచుకొన్నాను !
రిప్లయితొలగించండిఒక్క తప్పైన నొప్పడు తిక్క పూన
బ్రోత్సహించును బద్యముల్ యుత్సహింప
జక్కదిద్దును శిష్యులన్ సరసముగను
సద్గుణోపేతుడట ! తిక్క శంకరయ్య !!
తమ్ముడు చి. డా. నరసింహ మూర్తి పద్యములో తప్పుగా వాడిన యడాగమమును సరిజేస్తూ ఆ పాదమును ఇలా సవరించుదాము:
రిప్లయితొలగించండి"ప్రోత్సహించుచు బద్యమ్ము లుత్సహింప"
స్వస్తి
అన్నయ్యగారికి ధన్యవాదములు. అక్కడ తడబాటు కలిగిన మాట నిజమే !
రిప్లయితొలగించండిసద్గుణో పేతు డ ట తిక్క శంకరయ్య
రిప్లయితొలగించండియవును గద సామి ! కామెర్లు యైన వాని
భావ మటులనె యుండును భావ మందు
తిక్క శంకరు మరు రూపు శంక రుండు .
స్థిరముగ మనతెలుగు చంద్రశేఖరుండు సద్గుణోపేతుఁడఁట !
రిప్లయితొలగించండిభద్రం భద్రమితి బ్రూయాత్, భద్రమిత్యేవ వా వదేత్
శుష్క వైరం, వివాదం చ న కుర్యాత్ కేనచిత్ సహ.
ఎల్లప్పుడూ శుభం, శుభం అంటూనే ఉండాలి. శుభమగుగాక అనే పలుకుతూ ఉండాలి. ఎవరి తోనూ కూడా శుష్క విరోధాలూ, తగవులకు దారితీసే వితండ వాదాలు కూడదు.
అందుచే వాదనకు దిగ దలచుకోలేదు.
తల్లి పార్వతిఁ గనుమన తగులఁ బెట్టె!
రిప్లయితొలగించండివెర్రి లోకముఁ గావగ విషము మ్రింగె!
సర్వమంగళ మాత్రము సన్ను తించు
సద్గుణోపేతుఁడఁట! తిక్క శంకరయ్య!
గురువుగారి పరంగా జెప్పే పద్యంలో తప్పులు దిద్దండి, తప్పే అయితే మన్నించండి.(నిందా స్తుతిగా భావించండి)
రిప్లయితొలగించండిశంకరాభరణ మొకటి చంక నెక్కఁ
బద్య విద్యను నేర్పగ పరులకెల్ల
నిల్లునిల్లాలు గాదని యెదుగు సకల
సద్గుణోపేతుఁడఁట తిక్కశంకరయ్య!
సింహానికి మత్తేభము అంటే మక్కువ కదా అని ఈ మత్తేభము తమ్ముడు చి. డా. నరసింహ మూర్తికి:
రిప్లయితొలగించండినరసింహాకృతి లేదు సోదరునిలో నామంబె కన్పట్టు నీ
నరసింహంబన శ్రేష్ఠ వాచకమె యన్వర్థంబు గానయ్యె భా
సుర సఛ్ఛీల గుణాన్వితుండు బుధ సంస్తుత్యుండు వాణీ హృదా
భరణుండున్ కవిలోక మాన్యుడని సంభావించి దీవించెదన్
దక్షునకు దిక్క దీర్చెను దలను మార్చి
రిప్లయితొలగించండికామునకు దిక్క దీర్చెను కాల్చివేసి
రావణుని దిక్క దీర్చె బర్వతము నడచి
సద్గుణోపేతుడట తిక్క శంకరుండు
తిక్క కొంచెము గనుకనే తీక్ష్ణ మైన
రిప్లయితొలగించండిదృక్కుల మసి జేసె మరుని తిక్క రేగ
కాని భక్తుల బ్రోచును కనికరించి
సద్గుణోపేతుడట తిక్క శంకరయ్య
బ్లాగులో పద్యములు వ్రాయు వారి
రిప్లయితొలగించండిరచనలందున్న దోషముల్ వ్రాసి చూపి
చక్క దిద్దును పనిలేక నిక్కముగను
సద్గుణో పేతుడట ! తిక్క శంకరయ్య
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినేటి పరిస్థితులలో స్వార్థహితముతప్ప పరహితముగూర్చి ఆలోచించే వాళ్ళను పిచ్చివాళ్ళుగా పరిగణించే స్థితిలో ఉన్నదికదా జాతి...............
రిప్లయితొలగించండిపాలసంద్రముఁజిలుకనుద్భవముజెందు
గరళమునుమ్రింగిలోకరక్షణముఁజేసె
పరహితార్థంబుప్రాణముల్ ఫణముజేసె
సద్గుణోపేతుఁడఁటతిక్క శంకరయ్య
వరుని కై వెదకుచున్న ఒక ఆడ పిల్ల తండ్రితో..పెళ్ళిళ్ళ పేరయ్య..
రిప్లయితొలగించండితిక్క వారింటి పేరయ్య తిక్క లేదు
లక్షణుండైన పెద్ద పేరయ్య కొడుకు
వారి చుట్టాల నడిగితి వారు చెప్పె
సద్గుణోపేతుఁడఁట తిక్క శంకరయ్య.
అర్ధతనువున గులుకుచు నాలి తోడ
రిప్లయితొలగించండినెత్తె నింకొక్క రమణిని నెత్తి పైన
కందు జూడడు ధరియింప చందురునిని
సద్గుణో పేతుఁడట తిక్క శంకరయ్య !
అన్నయ్యగారి సవరణతో ;
రిప్లయితొలగించండిఒక్క తప్పైన నొప్పడు తిక్క పూన
బ్రోత్సహించుచు బద్యమ్ము లుత్సహింప
చక్కదిద్దును శిష్యులన్ సరసముగను
సద్గుణోపేతుడట ! తిక్క శంకరయ్య !!
అన్నయ్య గారు శ్రీ పండిత నేమాని వారికి నమస్సులు. వారి యాశీస్సులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిఅతడు కర్తవ్య ధర్మ దీక్షాత్మపరుడు
కట్టుబడి పలు యిడుముల కైన వెరవ
డతని ఘనతను గ్రహియింప కందురు ప్రజ
'' సద్గుణోపేతుడట తిక్కశంకరయ్య. ''
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచాలు! శంకరుడా? కంది శంకరుండ?
రిప్లయితొలగించండితిక్క వారన తప్పగు తెలిసికొమ్ము.
పూరణను జేయు టెట్లొకో బోధ పడదు!
సద్గుణోపేతుడట తిక్కశంకరయ్య!
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండినిన్న మా బావమరది నూతన గృహప్రవేశానికి నల్లబెల్లి గ్రామానికి వెళ్ళి తిరిగి ఆలస్యంగా రాత్రికి ఇల్లు చేరాను. అందువల్ల మీ పూరణలపై వ్యాఖ్యానించడానికి సమయం చిక్కలేదు. మన్నించండి.
చక్కని పూరణలను వైవిధ్యంగా చెప్పిన మిత్రులు...
పండిత నేమాని వారికి, (సూరి తిక్కల సంవాదం)
చంద్రశేఖర్ గారికి, (సద్గుణోపేతుడే.. అప్పుడప్పుడు కిళ్ళీ వేసుకుంటాడు, అదైనా మందు కొట్టినప్పుడు, ఆ మందుకూడా పేకాటలో డబ్బు వచ్చినపుడు.... :-) ఆన్నట్టుంది మీ పూరణ!
గన్నవరపు నరసింహమూర్తి గారికి, (వీరికి పద్యరచనపు ‘తిక్క’ బాగానే పట్టినట్టుంది!)
సుబ్బారావు గారికి, (పచ్చ కామెర్ల లాగా తిక్క కామెర్లా?)
సహదేవుడు గారికి,
నాగరాజు రవీందర్ గారికి,
గండూరి లక్ష్మినారాయణ గారికి,
సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, (‘తిక్క’ను ఇంటిపేరును చేసారు)
కమనీయం గారికి,
మిస్సన్న గారికి,
అభినందనలు, ధన్యవాదములు.