5, డిసెంబర్ 2012, బుధవారం

పద్య రచన - 181

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

14 కామెంట్‌లు:

 1. ఆర్యా ! క్రింద పళ్ళెము లోని నీటిలో చూచికదా అర్జునుడు మత్స్య యంత్రమును కొట్టినది.చిత్రములో లోపమా లేక మరొక "చిత్రమా" .

  రిప్లయితొలగించండి
 2. వేయిని దాటిన 'పూరణ'
  వేయించగ వలయు పొత్త విత్తంబున కై
  వేయగ వలయును మిత్రులు
  చేయిని మరి గురువు గారి చిత్తంబేదో ?

  రిప్లయితొలగించండి
 3. చేపను కొట్టుట కై తా
  చేపట్టెను విల్లు కృష్ణ చేపట్టుటకై
  చూపెట్టె విజయుడా సభ
  బాపని వేషంబు లోన పాండిత్యమునే.

  రిప్లయితొలగించండి
 4. మన మేకాగ్ర మొనర్చి యర్జునుడు సంరంభముతో జాపమున్
  గొని లక్ష్యంబును జూచి యంత్రముపయిన్ గోలన్ బ్రయోగింప గ్ర
  న్నన నా మత్స్యము ద్రెళ్ళి క్రిందపడె సన్మానమ్ముతో బాండునం
  దను నైపుణ్యము బ్రస్తుతించిరి మహానందమ్ముతో జూపరుల్

  రిప్లయితొలగించండి
 5. చేపను కొట్టె నర్జునుడు చేవను జూపి స్వయం వరమ్మునన్
  చేపల బోలు కండ్లు గల చిన్నది ద్రౌపది సంతసించగన్
  బాపనిగా దలంచి పటు భంగము నొందిరి రాకుమారులున్
  పాపము చిన్నవోయిరట పల్వురు పెద్దలు మెచ్చి రయ్యెడన్.

  రిప్లయితొలగించండి
 6. మత్స్య యంత్రంబు ఛే దించి మగతనంబు
  తోడ పార్ధుడు కృ ష్ణ ను బెండ్లి యాడ
  వేల గొలదిని రాజుల వీ క్ష ణ ముల
  నడుమ , జేజేలు బలికిరి నరుని కపుడు .

  రిప్లయితొలగించండి
 7. శ్రీకృష్ణుడు మత్స్య యంత్రమును చేదించి లక్షణ యను కన్యను వివాహమాడెను. ఆ రీతిగ చేసిన పూరణ ఇది:

  కరమున బూని చాపమును కంజదళాక్షుడు కృష్ణు డొప్పుగా
  శరమును వేసినంత నది చయ్యన ద్రుంచెను మత్స్యయంత్రమున్
  సరస సరోరుహేక్షణ ప్రసన్నగుణాకర లక్షణాఖ్య శ్రీ
  హరిని వరించె నంతట స్వయంవరమందు సముజ్జ్వలాత్మయై

  రిప్లయితొలగించండి
 8. వీరులు శౌర్యతన్ సభను పేర్మిని జూపి పరీక్ష నెగ్గ నా
  ధీరుని కిచ్చి చేయుటకు దీక్షను బూనెడు రాజులెందరో,
  భారత గాథలందుకల వారి ప్రసక్తుల నే పఠించితిన్,
  పోరుకు దీటుగా మిగుల పొంగదె యుల్లసముల్లమందునన్.

  రిప్లయితొలగించండి
 9. దృష్టి గమ్యముపై నిల్పి తెగువఁజేసి
  ద్రుపద సభలోన విజయుండు దొడ్డ గాను
  మత్స్య యంత్రమ్ము ఛేధించి మగువనందె
  కృపను గురిపించి కన్నయ్య యుపకరించ!

  రిప్లయితొలగించండి
 10. మత్స్య యంత్రము చేధించ మనసు పడుచు
  ద్రోవదిని పొంద గోరుచు దొరలు ప్రేమ
  నిండు సభ లోన హర్షము మిన్ను ముట్టె
  స్వయం వరమందు పెండ్లాడె సవ్య సాచి !

  రిప్లయితొలగించండి
 11. గౌ॥ నేదునూరి రాజేశ్వరి గారి పద్య మూడు నాల్గు పాదాల్లో వరుసగా యతి గణ దోషాలున్నట్లని పిస్తున్నవి. అన్యదా భావించరని తెలియజేస్తున్నాను. స్వస్తి .

  రిప్లయితొలగించండి
 12. నేమాని పండితుల బాటలో..

  చేపను కొట్టె నత్తరిని చేవను జూపి స్వయం వరమ్మునన్
  చేపల బోలు కండ్లు గల చిన్నది లక్షణ కన్య మెచ్చగన్
  గోప కులైక భూషణుడు కూరిమి పత్నిగ చేకొనంగ నౌ-
  నా పరమాత్మ కీ భువిని యష్ట సఖుల్ గద లీల జూపగన్.

  రిప్లయితొలగించండి
 13. మత్స్య యంత్రాన్ని కొట్టుతున్నవాడు అర్జునుడే.ఎందుకంటే ఎదురుగా కూర్చుని చూస్తున్న శ్రీకృష్ణుని చిత్రంలో చూడవచ్చును.కాని పళ్ళెంలో నీటిలో చూస్తూ కొడుతున్నట్లు మాత్రం చిత్రించలేదు.

  రిప్లయితొలగించండి