గురువుగారూ అవి కాకినాడ కాజాల వలె లేవండీ. వీటిని బనారస్ కాజాలంటారు కదా . తూర్పుగోదావరి జిల్లాలోని తాపేశ్వరం వీటికి ప్రసిద్ధి . తాపేశ్వరం కాజా రుచి మరి తింటేనే తెలుస్తుంది. కాకినాడ కాజాలు గొట్టాల వలె ఉండి వాటి లోపల పంచదార పాకం నింపి ఉంటుంది. అవీ చాలా రుచిగా ఉంటాయి. వాటిని గొట్టం కాజాలని కూడా అంటారు .
కవిమిత్రులకు నమస్కృతులు. గూగుల్‌లో ‘కాకినాడ’ అని టైపు చేస్తే ఆ చిత్రం కనిపించింది. కాకినాడ కాజాలకు, మిగిలిన వాటికి భేదం నాకు తెలియదు. జీవితంలో ఒకే ఒక్కసారి కాజాలను తిన్నాను. అదీ తెనాలి నుండి వచ్చిన మా పక్కింటావిడ ఇస్తే. ఏదో అప్పుడప్పుడు మిత్రుల నోళ్ళను (క్షమించాలి - మనస్సులను) తీపి చేద్దామని లడ్డూలో, జిలేబీలో, కాజాలో చూపిస్తున్నాను. మిత్రులు కూడా తీయ తీయని పద్యాలను చెప్తూ మనోరంజనాన్ని కలిగిస్తున్నారు. అందరికీ ధన్యవాదములు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, బహుత్ అచ్ఛా! క్యా శాయరీ హై? ముబారక్! * గన్నవరపు నరసింహ మూర్తి గారూ, ‘కోటయ్య’ గారిని గుర్తు చేసుకొని మీ సౌజన్యాన్ని చాటుకున్నారు. చాలా బాగుంది మీ పద్యం. అభినందనలు. * పండిత నేమాని వారూ, జేజేలకే కాజాల రుచి చూపించారు. మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు. * సుబ్బారావు గారూ, కాజాల పుట్టినింటిని ప్రస్తావించిన మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘స్వర్గం’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘కలుగును సుఖమే/ కాజాల’ అందామా? * సహదేవుడు గారూ, బాగుంది మీ పద్యం. అభినందనలు. ‘పూలను దీసుకు’ అన్నదాన్ని ‘పూలను గైకొని’ అందాం. అన్నట్టు ‘తరహా’ తెలుగు కాదు. * లక్ష్మీదేవి గారూ, పైన చెప్పాను కదా! అప్పుడప్పుడు ‘తీయని’ పద్యాలను ఆశిస్తున్నానన్న మాట! మీ పద్యం బాగుంది. అభినందనలు. * రాజేశ్వరి అక్కయ్యా, అలిగిన భార్యను ప్రసన్నం చేసుకొనడానికి మీ చిట్కా బాగుంది. మంచి పద్యం. అభినందనలు.
నాగరాజు రవీందర్ గారూ, అన్య భాషా పదాలను వాడినా మీ పద్యం భేషుగ్గా ఉంది. అభినందనలు. * కమనీయం గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. చివరి పాదం ప్రారంభంలో యడాగమం రాకూడదు. ‘తేనెలు’తో పై వాక్యం పూర్తయింది కనుక ‘ఏ జాగును’ అని అచ్చుతోనే ప్రారంభించవచ్చు. లేదా ‘తేనెలె/ యే జాగును’ అందాం.
పుష్యం గారూ, ధన్యవాదాలు. గోలి వారిపై మీ హిందీ పద్యం బాగుంది. చివరి పాదంలో ‘లిఖాత’ అన్నచోట గణదోషం. అక్కడ జగణం రాకూడదు కదా! ‘లిఖ్‌తా’ అంటే సరి! ‘మడత కాజా’లపై మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
ఖా, జా, భయ్యా పేరది
రిప్లయితొలగించండికాజాలకు నాడు నేడు కాకీనాడే
ఆజా లేజా మస్తు క
లేజా పెరుగును నిజమ్ము లేకర్ సోజా.
హనుమచ్చాస్త్రి గారూ అబ్దుల్ శాస్త్రిగారి వలె పద్యం వ్రాసినట్లుంది:-)
రిప్లయితొలగించండిలేదండీ! మిత్రులు చాంద్ బాషా గారి కోసం అలా వ్రాశాను. ధన్యవాదములు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురువుగారూ అవి కాకినాడ కాజాల వలె లేవండీ. వీటిని బనారస్ కాజాలంటారు కదా . తూర్పుగోదావరి జిల్లాలోని తాపేశ్వరం వీటికి ప్రసిద్ధి . తాపేశ్వరం కాజా రుచి మరి తింటేనే తెలుస్తుంది.
రిప్లయితొలగించండికాకినాడ కాజాలు గొట్టాల వలె ఉండి వాటి లోపల పంచదార పాకం నింపి ఉంటుంది. అవీ చాలా రుచిగా ఉంటాయి. వాటిని గొట్టం కాజాలని కూడా అంటారు .
ఇక హనుమచ్చాస్త్రి గారి పద్యం బలే మజాగా ఉంది.
ఖర్జురమ్ము వోలె కనకాంబ రంబయ్యు
రిప్లయితొలగించండిబలుకు గాక నడుమ బాక మలరె !
నోట నూట బెంచ గోటయ్య చేయంగ
కాకినాడ కాజ ప్రాకె జగతి!!
కాకినాడ కోటయ్య కాజాలతో చాలా దినాలు బ్రతికాను, ( నా మొదటి ఉద్యోగ మక్కడే !)
మిస్సన్న గారి వంటి కూత కరణాల వలన ( వారు చేత కరణాలు గాదుట !) మా మేత కరణాలకు యిక్క ట్లెక్కువయ్యాయి !
రిప్లయితొలగించండికాజా కమ్మగనుండు కామిని వలెన్ కార్తీక మాసంబులో
రిప్లయితొలగించండితాజాగా మధువొల్క బోయుచు నమందానందమున్ గూర్చుచున్
జేజేలున్ పరితృప్తి జెందెదరు జేజేయంచు నైవేద్యమున్
మీ జన్మంబును ధన్యమొందు గద స్వామీ! చూడ కాజా రుచిన్
హాయ్ మేత కరణాలు కూడా ఉన్నారా మూర్తి మిత్రమా!
రిప్లయితొలగించండికాజాలు జూడ రమ్యము
రిప్లయితొలగించండికాజాలను దినిన జాలు కలుగును స్వర్గం
గాజాల దీ పి యట్టిది
కాజాలకు పుట్టి నిల్లు కరపయె సుమ్మా !
(కాకినాడ దగ్గర కరప)
కాజాలు కాకినాడకు
రిప్లయితొలగించండిభాజాలౌచును మరింత వన్నెను దెచ్చెన్
రోజా పూలను దీసుకు
తాజా తేనియల ముంచు తరహా నుండన్!
అతిమధురంబై చెలగెడు
రిప్లయితొలగించండికతిపయ సుపదార్థములను ఖాద్యంబులుగా
సతతము చిత్రంబులలో
వితరణ చేయుచు నొసగగ, విందిది కాదా?
రోజా ! ప్రేమగ దెచ్చితి
రిప్లయితొలగించండికాజాలను తినుమటంచు కాంతుడు బిలిచెన్ !
మోజుగ కాజాలను దిని
రాజీపడి ముదము చెందె రంజిల్ల మదిన్ !
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిగూగుల్లో ‘కాకినాడ’ అని టైపు చేస్తే ఆ చిత్రం కనిపించింది. కాకినాడ కాజాలకు, మిగిలిన వాటికి భేదం నాకు తెలియదు. జీవితంలో ఒకే ఒక్కసారి కాజాలను తిన్నాను. అదీ తెనాలి నుండి వచ్చిన మా పక్కింటావిడ ఇస్తే.
ఏదో అప్పుడప్పుడు మిత్రుల నోళ్ళను (క్షమించాలి - మనస్సులను) తీపి చేద్దామని లడ్డూలో, జిలేబీలో, కాజాలో చూపిస్తున్నాను. మిత్రులు కూడా తీయ తీయని పద్యాలను చెప్తూ మనోరంజనాన్ని కలిగిస్తున్నారు. అందరికీ ధన్యవాదములు.
రోజా! నోరూరించే
రిప్లయితొలగించండిఖాజాలివి కాకినాడ కనుగొనినావా?
తాజాగా నున్నవి ఈ
రోజే తినవలెను మిగుల రుచిగా నుండున్.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిబహుత్ అచ్ఛా! క్యా శాయరీ హై? ముబారక్!
*
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
‘కోటయ్య’ గారిని గుర్తు చేసుకొని మీ సౌజన్యాన్ని చాటుకున్నారు. చాలా బాగుంది మీ పద్యం. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
జేజేలకే కాజాల రుచి చూపించారు. మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
కాజాల పుట్టినింటిని ప్రస్తావించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘స్వర్గం’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘కలుగును సుఖమే/ కాజాల’ అందామా?
*
సహదేవుడు గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
‘పూలను దీసుకు’ అన్నదాన్ని ‘పూలను గైకొని’ అందాం. అన్నట్టు ‘తరహా’ తెలుగు కాదు.
*
లక్ష్మీదేవి గారూ,
పైన చెప్పాను కదా! అప్పుడప్పుడు ‘తీయని’ పద్యాలను ఆశిస్తున్నానన్న మాట! మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
అలిగిన భార్యను ప్రసన్నం చేసుకొనడానికి మీ చిట్కా బాగుంది. మంచి పద్యం. అభినందనలు.
గండూరి లక్ష్మినారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం తాజా కాజా వలె మధురంగా ఉంది. అభినందనలు.
కేజీల కొలది తియ్యని
రిప్లయితొలగించండికాజాలను కాకినాడ క్రాస్ రోడ్స్ యందున్
ఖాజా యను మిత్రుడొకడు
మేజాపై కూరుచుండి మ్రింగుచు నుండెన్
రిప్లయితొలగించండితాజాగా వండిన యీ
కాజాలు బహుమధురములు ,కదళీఫలముల్ ,
రోజాలద్దిన తేనెలు ,
యే జాగునుజేయక తిన నింపౌ నోరుల్!
నాగరాజు రవీందర్ గారూ,
రిప్లయితొలగించండిఅన్య భాషా పదాలను వాడినా మీ పద్యం భేషుగ్గా ఉంది. అభినందనలు.
*
కమనీయం గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
చివరి పాదం ప్రారంభంలో యడాగమం రాకూడదు.
‘తేనెలు’తో పై వాక్యం పూర్తయింది కనుక ‘ఏ జాగును’ అని అచ్చుతోనే ప్రారంభించవచ్చు. లేదా ‘తేనెలె/ యే జాగును’ అందాం.
శ్రీ శంకరార్యులకు, చంద్ర శేఖర్ గారికి, మిస్సన్న గారికి నా కాజాల పద్యం రుచి నచ్చినందులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండివా!జీ! హనుమచ్చాస్త్రీ
రిప్లయితొలగించండిఈజీసె కవిత లిఖాథ హిందీ మే ఆప్
మాజా ఆగయ పడ్కే
లేజాయియె ఔరు ఏకు లిఖాత మైనే
హనుమచ్ఛాస్త్రి గారు, మీతో పరిచయము లేకపోయినా ఏకవచన ప్రయోగానికి క్షంతవ్యుడను.
గణములు కోసము అలా వదిలివేయాల్సి వచ్చినది.
రిప్లయితొలగించండిదోరగ వేగిన కాజా!
నోరగునే నిన్ను తినని నోరది, భోజ్యా
హారములందున వెలిగెడి
మారాజువె తరచి చూడ మడతల కాజా !
ఈలాంటి కాజాలను 'మడత కాజా'లని అంటారని జ్ఞాపకము.
రిప్లయితొలగించండిపుష్యం గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
గోలి వారిపై మీ హిందీ పద్యం బాగుంది. చివరి పాదంలో ‘లిఖాత’ అన్నచోట గణదోషం. అక్కడ జగణం రాకూడదు కదా! ‘లిఖ్‌తా’ అంటే సరి!
‘మడత కాజా’లపై మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
పుష్యం గారూ ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండికాజా పద్యం ఆప్కో
మాజా హై బొల్కె బోల మాషా అల్లా
ఈజీసే ఆప్ భీ లిఖ
లే జీ మేరా సలాము లేలో వాహ్ జీ.