అయ్యా! శాస్త్రి గారూ! ఇచ్చిన సమస్యను మార్చలేము. చేగోడి అనే దానిని 2 పదములు కల సమాసముగా విడదీసి ద్రుతకార్యమువలన వచ్చింది ఆ శబ్దము అని చూప గలిగితే మీరు చేసిన పూరణ సరిపోతుంది. పరిశీలించండి. స్వస్తి.
నేడే పండుగదినమీ నాడెంతో కోర్కె తీర నారీమణిచే వేడిగ వండించి రుచిగ కోడిన్ దినె కోమటయ్య కోరిక తీరన్ .
అందరిలాగా పకోడీఅని విరిచి రాయడం ఇష్టం లేక ఇలాగ రాసాను.ఈ ప్రాంతంలో ఆర్యవైశ్యులు శాకాహారులు.కాని కళింగ కోమట్లు మాంసాహారులు. వారికది తప్పు కాదు.వారి గురించే పై విధంగా రాసాను.3నెలల నుంచి కారణాంతరాలవలన కంప్యూటర్కి దూరంగా వున్నాను.
మిత్రులారా! శుభాశీస్సులు. డా కమనీయము గారి చెప్పిన విషయమునకు కొస మెరుపు గా చెప్పుచున్నాను. (ఒడిషా రాష్ట్రము) కళింగ ప్రాంతములో నివసించే వారంతా (అన్ని జాతుల వారు) చేపలను తింటారు. బ్రాహ్మణులలోని ఒక కొన్ని కుటుంబముల వారు మాత్రము (మందిరములలో పూజాది క్రియలను నిర్వహించే వారు మాత్రమే తినరు). ఆ విధముగా కళింగ కోమటులు చేపలను తింటారు గాని, ఇతర ప్రాణుల మాంసమును తినరు. అంటే మాంసాహారులలో కూడా చేపలు మాత్రమే తినే వారు, అన్ని రకముల మాంసము తినే వారు అని 2 రకముల వారు కూడ ఉన్నారు. కళింగ కోమటులు వారి నియమము ప్రకారము కోడి మాంసమును తినరు. ఇది ఒకనాటి నియమము. ఇప్పుడు కొన్ని కొన్ని నియమోల్లంఘనలు అంతటా ఉన్నవి కదా. స్వస్తి.
"మూడొచ్చె" చల్ల గాలికి
రిప్లయితొలగించండివేడుచు తన కోర్కె జెప్ప వేగముగానే
వేడిగ చేయగ భార్య ప
కోడిం దినె కోమటయ్య కోరిక తీరన్. "
చూడుము పలు వన్నెలు గల
రిప్లయితొలగించండికోడి నిచట పంచదార గుడములతో నీ
నా డచ్చు బోసిరని యా
కోడిం దినె కోమటయ్య కోరిక తీరన్
వేడుక మీరగ గత నెల
రిప్లయితొలగించండికోడలు తన యింటి కేమొ క్రొత్తగ వచ్చెన్
వేడిగ నామెయె నిడ చే
గోడిం దినె కోమటయ్య కోరిక తీరన్
అయ్యా! శాస్త్రి గారూ!
రిప్లయితొలగించండిఇచ్చిన సమస్యను మార్చలేము. చేగోడి అనే దానిని 2 పదములు కల సమాసముగా విడదీసి ద్రుతకార్యమువలన వచ్చింది ఆ శబ్దము అని చూప గలిగితే మీరు చేసిన పూరణ సరిపోతుంది. పరిశీలించండి. స్వస్తి.
చూడగ వర్షపు టందము
రిప్లయితొలగించండివేడిగ నేదైన తినగ వేడుక పుట్టెన్ !
చేడియ వండెను చికెనుప
కోడిం దినె కోమటయ్య కోరిక తీరెన్ !
నాకూ పకోడీ యిష్టమే ,
రిప్లయితొలగించండిపాడిని దప్పక నాడును
వాడుకగా వీడి పల్లెఁ బట్టణముననున్
వేడిగ ఘుమఘుమలాడు ప
కోడిం దినె కోమటయ్య కోరిక తీరన్ .
కోడిందినమని విందున
రిప్లయితొలగించండివేడగ పెద్దలు, సహించి విజ్ఞత జూపన్
వేడిగఁ కరకర లాడు ప
కోడిందినె కోమటయ్యఁగోరిక దీరన్!
వేడి పకోడీలను చే
రిప్లయితొలగించండిగోడీలను జంతికలను కొబ్బరి లౌజున్
లాడులను గారెలను బడి
కోడిం దినె కోమటయ్య కోరిక తీరన్
వేడిన భార్యయె వండగ
కోడిం దినెను కొమురయ్య కొట్టుచు మందున్
వేడిగ గారెలు వడలు ప
కోడిం దినె కోమటయ్య కోరిక తీరన్
రిప్లయితొలగించండినేడే పండుగదినమీ
నాడెంతో కోర్కె తీర నారీమణిచే
వేడిగ వండించి రుచిగ
కోడిన్ దినె కోమటయ్య కోరిక తీరన్ .
అందరిలాగా పకోడీఅని విరిచి రాయడం ఇష్టం లేక ఇలాగ రాసాను.ఈ ప్రాంతంలో ఆర్యవైశ్యులు శాకాహారులు.కాని కళింగ కోమట్లు మాంసాహారులు. వారికది తప్పు కాదు.వారి గురించే పై విధంగా రాసాను.3నెలల నుంచి కారణాంతరాలవలన కంప్యూటర్కి దూరంగా వున్నాను.
మిత్రులారా! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిడా కమనీయము గారి చెప్పిన విషయమునకు కొస మెరుపు గా చెప్పుచున్నాను. (ఒడిషా రాష్ట్రము) కళింగ ప్రాంతములో నివసించే వారంతా (అన్ని జాతుల వారు) చేపలను తింటారు. బ్రాహ్మణులలోని ఒక కొన్ని కుటుంబముల వారు మాత్రము (మందిరములలో పూజాది క్రియలను నిర్వహించే వారు మాత్రమే తినరు). ఆ విధముగా కళింగ కోమటులు చేపలను తింటారు గాని, ఇతర ప్రాణుల మాంసమును తినరు. అంటే మాంసాహారులలో కూడా చేపలు మాత్రమే తినే వారు, అన్ని రకముల మాంసము తినే వారు అని 2 రకముల వారు కూడ ఉన్నారు. కళింగ కోమటులు వారి నియమము ప్రకారము కోడి మాంసమును తినరు. ఇది ఒకనాటి నియమము. ఇప్పుడు కొన్ని కొన్ని నియమోల్లంఘనలు అంతటా ఉన్నవి కదా. స్వస్తి.
kaadini pattina kaapulu
రిప్లయితొలగించండిkoodinindine, koomatayya koorika theeran
veadi pakoodine, baapadu
veaduka juuchye upavaasaveala vanamunan
వేడుక రోజని ప్రియమున
రిప్లయితొలగించండికోడలు వడ్డించె మామకున్ గారెలు,చే
గోడీలు, మిరప బజ్జి ప
కోడిన దినె కొమటయ్య కోరిక తీరన్.
వేడుక రోజని ప్రియమున
రిప్లయితొలగించండికోడలు వడ్డించె మామకున్ గారెలు,చే
గోడీలు, మిరప బజ్జి ప
కోడిన్, దినె కొమటయ్య కోరిక తీరన్.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
కొత్తగా కాపరానికి వస్తూ, కోడలు తెచ్చిన తీయని కోడిని :
01)
_______________________________
కోడూరి వారి యింటికి
కోడరికము జేయ , సారె - కోడలు తెచ్చెన్ !
కోడలు తెచ్చిన తీయని
కోడిం దినె కోమటయ్య - కోరిక తీరన్ !
_______________________________
రిప్లయితొలగించండికాడిని పట్టిన కాపులు
కోడిం దినె, కోమటయ్య కోరిక తీరన్
వేడె పకోడినె, బాపడు
వేడుక జూచె నుపవాసవేళ వనమునన్
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండి‘కోడిఁ దిని పండుకున్నాఁడు కోమటయ్య’ ఎప్పుడో చిన్నప్పుడు విన్న సమస్య. చాలా ప్రసిద్ధమైనదే. దానినే కందంలో ఇచ్చాను.
చక్కని పూరణలు పంపిన....
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
పండిత నేమాని వారికి,
రాజేశ్వరి అక్కయ్య గారికి, (కోమటయ్యకు చికెన్ పకోడీ తినిపించారు!)
గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
సహదేవుడు గారికి,
నాగరాజు రవీందర్ గారికి,
కమనీయం గారికి, (బహుకాలానికి దర్శనం!)
అజ్ఞాత గారికి,
గండూరి లక్ష్మినారాయణ గారికి,
వసంత కిశోర్ గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.
వాడుక వీడుచు సుఖముగ
రిప్లయితొలగించండితోడుగ రెడ్డులను గూడి తొందర పడుచున్
పాడిగ న్యూయార్కు చనగ
కోడిం దినె కోమటయ్య కోరిక తీరన్