27, డిసెంబర్ 2012, గురువారం

పద్య రచన - 203

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

12 కామెంట్‌లు:

  1. శోకము దీర్చగ వచ్చెన
    శోకవనమ్మునను తల్లి జూడగ, నేనే
    మీ కష్ట ' హరుడ ' ననె నిజ
    మీకపి ' పంచానన ' మని యెదురుగ నిలచెన్.

    రిప్లయితొలగించండి
  2. అరుదెంచున్ వడి రామచంద్ర విభుడో యమ్మా! మహీజాత! స
    త్వర మీ బాధలు తీరు నీకు నిక చింతన్ వీడుమా చూడు ముం
    గరమంచున్ హనుమంతు డాదరముతో క్ష్మాజాతకున్ మ్రొక్క నా
    తరుణీ రత్నము పొందె మోదమును చేతఃపద్మ మొప్పారగా

    రిప్లయితొలగించండి
  3. చిన్ని కోతిగ సీతను జేర హనుమ
    శింశుపా వృక్ష శాఖకు చేరి మఱియు
    సీత దుఃఖంబు బోగొట్ట , మాత ! వినుము
    నిన్ను గనుగొన నాస్వామి నన్ను పంపె .

    రిప్లయితొలగించండి


  4. మువ్వురు మునులు శాపము ఇచ్చిరట
    సతీ వియోగమున నీవు తపించెదవని
    ఔరా,వారి శాపమ్ము నెరవెర్ప,రామ
    రామ, మనోరథమ్ము భళిరా నెరవేర్చెను కైక రాణియై!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. శ్రీరామాశ్రిత మానసమ్మున సదా చింతించు సీతమ్మతో
    నీరాముండతి శీఘ్రమే కదలి నిన్నేచేరునమ్మా, యనన్,
    భారమ్మెంతొ శమించి నవ్వుచును దాబల్కెన్ మహారాజ్ఞి గా
    ధారాళమ్ముగ దీవనల్;హనుమపై దాక్షిణ్యమున్ జూపుచున్.

    రిప్లయితొలగించండి
  6. మ్రాని కోతిననుచుఁ గానవే? మాయమ్మ
    నీదు రాము భంటు నేను తల్లి!
    కటిక రాతి పైని కన్నీటి వాసమ్ము
    కరుణ జూపు తండ్రి త్వరగ బాపు!

    శోకమ్ము వలదు తల్లీ!
    భీకర పోరైన జేసి బేగి రఘువరుం
    డీ కుటిల రావణాసురుఁ
    బీకలుఁ గోసి నిను బట్టు ప్రియముగ నమ్మా!

    రామయ్య మురిసి పోవును
    క్షేమంబని నేను జెప్ప సీతా మాతా!
    ప్రేమాంగులీయ కమ్మును
    స్వామికి నేనిత్తు నమ్మ సంబర పడగన్!

    సెలవీయ వమ్మ! నాకిక
    కలుములఁ బాపె
    డి ప్రభువుకు కబురును జేర్చన్!
    నిలువక నినుగొని పోవగ
    పులకిత రామయ్య నీదు ముందుకు జేరన్!

    రిప్లయితొలగించండి
  7. శ్రీగురుభ్యోనమః
    చివరి పద్యం రెండవ పాద సవరణతో:

    సెలవీయ వమ్మ! నాకిక
    కలతలఁ బాపెడు ప్రభువుకు కబురును జేర్చన్!
    నిలువక మిముగొని పోవగఁ
    బులకిత రామయ్య తమరి ముందుకు జేరన్!

    రిప్లయితొలగించండి
  8. కోతినె కానీ నిజమిది
    ప్రీతిని సేవకుడను నేను శ్రీ రామునకున్
    ఖ్యాతిని తెత్తును వానర
    జాతికి నిను జూచిపోయి జానకి వినవో!

    నిను బాసిన నీ రాముడు
    వినుమమ్మా తిండి నిద్ర విడచెను నీకై
    యనవరతము దు:ఖ పడుచు
    వనముల తపియించు చుండె వారిజనేత్రీ!

    మాసిన వస్త్రముతో పతి
    బాసిన దు:ఖమ్ము మిగుల బాధింపంగన్
    మూసిన మబ్బుల కళలను
    మాసిన శశి బోలు నిన్ను మాతా కంటిన్.

    నీకు తగు భర్త రాముడు
    శ్రీకరునకు తగిన సతివి సీతా మాతా !
    నీకిక శోకము కూడదు
    నీకై చనుదెంచు నిటకు నీ పతి త్వరలో.

    చింతను వీడుమమ్మ చని చెప్పుదు నీవ్యధ రామ మూర్తితో
    వంతెన గట్టి వార్నిధికి వానర మూకను గూడి వచ్చు నీ
    కాంతుడు వేగమే యిటకు కాలము మూడిన పంక్తికంఠునిన్
    సంతసిలంగ నీవు యమసన్నిధి కంపును నిన్ను చేకొనున్.

    రిప్లయితొలగించండి
  9. తల్లి సీతను గాంచిన తరుణ మందు
    హనుమ సంతస మొందుచు వినతి జేసి
    స్వామి ముద్రిక నంపెను ప్రేమ మీర
    చింత మానుము తల్లిరో క్షేమ మంత !

    రిప్లయితొలగించండి
  10. ఈరోజు సహదేవుడు గారూ, మిస్సన్న గారూ విజృంభించి ఖండకృతులే రచించారు. సంతోషం!
    *
    చిత్రానికి తగిన పద్యాలను రచించిన కవిమిత్రులు...
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    పండిత నేమాని వారికి,
    సుబ్బారావు గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    సహదేవుడు గారికి,
    మిస్సన్న గారికి,
    రాజేశ్వరి అక్కయ్య గారికి
    అభినందనలు, ధన్యవాదములు.
    *
    మిస్సన్న గారూ,
    ‘మూసిన మబ్బుల కళలను మాసిన శశి బోలు నిన్ను’ అద్భుతమైన భావం. చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  11. గురువుగారూ మీ సవరణకు, ప్రశంసకు ధన్యవాదాలండీ.

    రిప్లయితొలగించండి