3, డిసెంబర్ 2012, సోమవారం

పద్య రచన - 179

అయ్యప్ప పడిపూజ 
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

19 కామెంట్‌లు:

 1. హరి హరనందనా! ప్రణతి ఆశ్రితచందన! మన్మనోబ్జ మం
  దిర! మణికంధరా! వరమతిన్ నిను గొల్తును స్వామి! అయ్యపా!
  శరణము స్వామి స్వామి యని సన్నిధి జేరుచు గొల్చు భక్తులం
  దరకును సత్ఫలమ్ములిడి తద్దయు బ్రోచెడు దీనబాంధవా!

  రిప్లయితొలగించండి
 2. అయ్యప్పను బూజించిన
  నయ్యప్పే గాచు మనల నాపద నుండి
  న్న య్యప్ప మించు దేవుడు
  నియ్యిలలో గాన రాడు నెందును వెతకన్ .

  రిప్లయితొలగించండి
 3. అయ్యా సుబ్బారావు గారూ!
  మీరు వ్రాసిన పద్యమును బాగుగ సవరించ వలసి వచ్చినది. ఈ క్రింది విధముగా మార్చుచున్నాను:

  అయ్యప్పను బూజించెద
  నయ్యప్పే కాచు మనల నాపద లందా
  యయ్యప్ప మించు దేవుం
  డియ్యిలలో గాననగునె యెందు వెదకినన్

  స్వస్తి

  రిప్లయితొలగించండి
 4. శరణము అయ్యపా బ్రతుకు సంగర మందున తోడునీడగా
  మరణము దాక నుండుమని మాటికి మ్రొక్కుచు మాననీయులై
  యిరుముడి దాల్చి శీర్షముల నింపుగ మండల దీక్ష పిమ్మటన్
  గురుతర భక్తి నీ శబరి కొండకు వత్తురు జ్యోతి జూడగన్.

  రిప్లయితొలగించండి
 5. శ్రీ పండిత నేమాని గారి సవరణలు బాగుగనే యున్నవి కానీ ఆ సవరణలో కూడ మరొక సవరణ అవసరమని తోచుచున్నది.
  "నయ్యప్ప మించు దేవుండు" అని చేయవలయును . ఆలాగుననే ఇయ్యిలలో అని త్రిక సంధి చేయకూడదనియే నా అభిప్రాయము .త్రికము మీది అసంయుక్త హల్లు ఎక్కడున్నది ? స్వస్తి .

  రిప్లయితొలగించండి
 6. ఒక్కో మెట్టెక్కుచు నా
  చక్కని మణికంఠ స్వామిఁ శరణము వేడన్
  చిక్కుల బాపుచు నిలగ
  ట్టెక్కించ నభయములనిడు నేలిక తానై!

  రిప్లయితొలగించండి
 7. మిత్రులారా! శుభాశీస్సులు.
  ఒక అజ్ఞాత గారు ఎంతో చక్కటి వ్యాఖ్యలను చేసేరు. చూచేరు కదా. నేను చేసిన సవరణలలో ఏ ఒక్క దోషమును లేదు అని మీరు అందరునూ చూచుచున్నారు కదా. ఎందుకో అర్థరహితముగా వేలు పెట్టుట. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 8. అజ్ఞాత గారూ,
  మీరు రెండు విషయాలు ప్రస్తావించారు.
  1. “నయ్యప్ప మించు దేవుండు" అని చేయవలయును - అన్నారు. నేమాని వారి సవరణ అలాగే ఉంది.
  2. ‘ఇయ్యిలలో’ అని త్రికసంధి చేయరాదన్నారు. దానికి నా వివరణ...
  బాలవ్యాకరణం సమాస పరిచ్ఛేదం లోని 14 సూత్రం ఇలా చెప్తున్నది. “త్రికంబుమీఁది యసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగా నగు”.
  ‘అసంయుక్త హల్లు’ అని ఉన్నమాట వాస్తవమే. అయితే ఆ సూత్రం క్రింద చిన్నయసూరి ఇచ్చిన ఉదాహరణల్లో ‘అయ్యశ్వము’ ఉంది.
  ‘ఆ + అశ్వము’ సంధిపరిచ్ఛేదంలోని 3వ సూత్రంతో యడాగమం వచ్చి ‘ఆ + యశ్వము’ అయింది. ఇక్కడ ‘య’ అసంయుక్త హల్లు కదా. ఇప్పుడు దానికి ద్విత్వం వచ్చి ‘అయ్యశ్వము’ అయింది.
  అలాగే ‘ఈ + ఇలలో’ యడాగమం వచ్చి ‘ఈ + యిలలో’ కాగా అసంయుక హల్లు అయిన ‘యి’కి ద్విత్వం వచ్చి ‘ఇయ్యిలలో’ అయింది.
  ఇప్పుడు మీకు త్రికము మీద అసంయుక్త హల్లు కనపడుతున్నదా? పెద్దవారిని విమర్శించేముందు తొందరపడరాదు. విషయం పూర్తిగా తెలిసినప్పుడే వ్యాఖ్యానించాలి.

  రిప్లయితొలగించండి
 9. శ్రీ కంది శంకరయ్య గారిచ్చిన వివరణ బాగుగనున్నది. వాస్తవమును బోధించుచున్నది.నేనే పొరపడితిని.కానీ వారి మొదటి వివరణ బాగుగ లేదు. శ్రీ పండిత నేమాని గారు ''యయ్యప్ప '' యని కదా సవరించినారు . అక్కడ ద్రుతము వచ్చి తాన్ అయ్యప్ప అని దానయ్యప్ప అని సవరించవలెనని కదా నేను చెప్పునది. మరొకమారు పరిశీలించి వ్యాఖ్యానించవలయు .స్వస్తి.

  రిప్లయితొలగించండి
 10. అజ్ఞాత గారూ,
  ధన్యవాదాలు.
  ‘ఆపద లందా/యయ్యప్ప’
  1. ‘ఆపదలందు + ఆ/అయ్యప్ప’ ఇదీ నేమాని వారి పదవిభజన..
  2. ‘ఆపదలన్ + తాన్ + అయ్యప్ప’ మీ పద విభజన.
  రెండింటి భేదాన్ని మీరే గమనించండి.

  రిప్లయితొలగించండి
 11. శ్రీ సహదేవుడు గారూ! శుభాశీస్సులు.
  మీ పద్యము చూచేను. 2 చిన్న సూచనలు.
  1. ఒక్కో అనుట వ్యావహారికము - ఒక్కొక అని మార్చితే బాగుంటుంది.
  2. మణికంఠ స్వామి అనేటప్పుడు ఠ గురువు అగును. చక్కని మణికంఠ స్వామి కి బదులుగ - "చక్కని నా స్వామి యనుచు" అని మార్చుదాము.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి

 12. పదునెనిమి దగు మెట్లపై పట్టబంధ
  మందు నెలకొన్న స్వామి యయ్యప్ప! నీకు
  షోడశోపచారములతో సొంపు మీర
  మేము చేసెద మయ్య యీ మెట్లపూజ.

  రిప్లయితొలగించండి
 13. పండిత నేమాని వారూ,
  మీ అయ్యప్ప స్తుతి బాగుంది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  నేమాని వారి సవరణలను గమనించారు కదా!
  *
  మిస్సన్న గారూ,
  ఇరుముడి దాల్చిన భక్తుల ప్రస్తావనతో మీ పద్యం సుందరంగా ఉంది. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  పదునెట్టాంబడి ప్రస్తావనతో మీ పద్యం బాగుంది. అభినందనలు.
  మీ పద్యానికి నేమాని వారి సవరణలను చూసారు కదా!

  రిప్లయితొలగించండి
 14. శరణు వేడుచు స్వామిని శరణ మనుచు
  దీక్ష బూనిన వారికి మోక్ష మిడగ
  శబరి మలకును రప్పించి శాంత పరచి
  మెట్టు మెట్టుకు దీవించు మిక్కుటముగ

  రిప్లయితొలగించండి
 15. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
  శబరిగిరీశుడు మీకు శుభములను కూర్చుగాక!

  రిప్లయితొలగించండి
 16. గురువుగారికి నమస్సులు,ధన్యవాదములు రెండు చోట్ల నా (ఆ), నా రావటంతో నడక బాగుగలేదనిపిస్తుంది. క్రిందిసవరణ పరిశీలించ ప్రార్థన:

  ఒక్కొక మెట్టెక్కుచు నా
  చక్కని హరిహర కొమరుని శరణము వేడన్
  చిక్కుల బాపుచు నిల గ
  ట్టెక్కించ నభయములనిడు నేలిక తానై!
  స్వస్తి .

  రిప్లయితొలగించండి
 17. అయ్యా శ్రీ సహదేవుడు గారూ! శుభాశీస్సులు.
  నా సవరణ చూడండి:

  ఒక్కొక్క మెట్టు నెక్కుచు
  చక్కని హరిహర కుమారు శరణము వేడన్
  జిక్కుల బాపుచు నిల గ
  ట్టెక్కించును భయముబాపి యేలిక తానై

  స్వస్తి

  రిప్లయితొలగించండి
 18. అయ్యయ్య లిద్దరొకటై
  అయ్యప్పే బుట్టినాడు హరిహర సుతుడై
  చయ్యన వరముల నిచ్చును
  చెయ్యగ పడి పూజ స్వామి జేరుచు వేడన్.

  రిప్లయితొలగించండి