16, డిసెంబర్ 2012, ఆదివారం

సమస్యా పూరణం - 908 (పోరు సేయలేఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
పోరు సేయలేఁడు పోటుకాఁడు.

26 కామెంట్‌లు:

  1. ఆయుధముల బూని యాహవరంగాన
    బీచ మడచు వైరి వీర తతికి
    నింటిలోన బిల్లియేయగు సతితోడ
    పోరు సేయలేడు పోటు కాడు

    రిప్లయితొలగించండి
  2. భీరు లైన వారు పోరు సేయగ పోరు
    కోరి దెచ్చు కొనరు పోరు చూడ
    ధర్మ యుద్ధ మందు తప్పు విధానపు
    పోరు సేయలేఁడు పోటుకాఁడు.

    రిప్లయితొలగించండి
  3. భీష్ముడు :

    మత్సరించు కుంతి మధ్యమ కొమరుని
    గలహమునకు గడగి కర్ణు డెపుడు
    పొల్లు మాటలాడి భూపతి మెప్పించి
    పోరు సేయ లేడు పోటుకాడు !

    రిప్లయితొలగించండి
  4. సంహ రింతు ననుచు శాత్రవు లెల్లను
    నుత్తి మాట లొదవె నుత్త రుండు
    యుద్ధ రంగ మందు యోధుల గనుగొని
    పోరు సేయ లేడు పోటు గాడు .

    రిప్లయితొలగించండి
  5. సంగరంబు కాదు చనరనే భావము
    చక్కబెట్ట లేడు శక్తి కొలది
    'వాడిమగడు ' వంటి పర్యాయ పదమిది
    పోరు, సేయలేడు, పోటుగాడు

    రిప్లయితొలగించండి
  6. బళిర ! బళిర ! యన్న ! బల్లెంబు చేబూని
    పొడుతు నేననుచును పోజులిచ్చు
    పొడవలేడు గదర పుల్లాకు తూటుగా !
    పోరు సేయలేడు పోటుగాడు

    రిప్లయితొలగించండి
  7. యుద్ధమున బంధములు గుర్తొచ్చి వైరాగ్యపు మాటలాడి,ధనుర్భాణములను క్రిందవిడుచు అర్ఞునుని పరంగా:

    యుద్ధ భూమిఁ జేరి యుక్తము లెంచుచు
    బంధు జనులఁ జంప వచ్చు జయము
    వలదు వలద టంచు వైరాగ్యములఁబల్క
    పోరు సేయ లేఁడు పోటు గాఁడు!

    రిప్లయితొలగించండి
  8. 'గోవులను మరల్తు కొంచెము జూడు 'మ
    నుచును పేడి తోడ నుత్తరుండు
    బలికి, సేనను గని పాఱిపోయె నడలి !
    పోరు సేయలేడు పోటుకాడు

    రిప్లయితొలగించండి
  9. సవరణ :
    నాయొక్క తొలి పద్యంలోని మొదటి పాదమునకు -

    “ సంగరంబు కాదు ' చనర ' ని యర్థము "

    రిప్లయితొలగించండి




  10. అతివలు విని మిగుల యభినందనలు సేయ
    ఉత్తరుండు పలికె నుత్తమాట
    లనికి నేగి భీతి నరిసేనలను గాంచి
    పోరు సేయలేడు పోటుగాడు.

    రిప్లయితొలగించండి
  11. కృష్ణావతారానంతరము జరిగిన యుద్ధములందు అర్జునుడంతవాడె పరాజయముపాలాయెగదా. దైవబలములేక జయములభింపదని........

    కృష్ణుడోడినాడె కృష్ణనిర్యాణంబు
    జరిగినంతపిదప సమరమందు
    దైవబలములేకధరణిలోనెవడైన
    పోరుసేయలేఁడు, పోటుకాఁడు.

    కృష్ణుడు = అర్జునుడు, శ్రీకృష్ణుడు,

    రిప్లయితొలగించండి
  12. కన్న తల్లి పెంచె కడుఁబ్రేమఁ జూపించి
    నూతన వధువేమొ నోరుఁ దెరచి
    చెప్పుచుండె పతికి చేదైన చాడీలు
    పోరు సేయలేడు పోటుకాఁడు

    రిప్లయితొలగించండి
  13. కన్న తల్లి పెంచె కడుఁబ్రేమఁ జూపించి
    నూతన వధువేమొ నోరుఁ దెరచి
    చెప్పుచుండె పతికి చేదైన చాడీలు
    పోరు సేయలేడు పోటుకాఁడు

    రిప్లయితొలగించండి
  14. దివికి చేరు చున్న నవినీతి నదుపులో
    బెట్టువాడెవడిక బుట్ట లేదు
    ఆత్మ బలము లేక నవినీతి కెదురుగా
    పోరు చేయ లేడు పోటుగాడు .

    రిప్లయితొలగించండి
  15. yudda vidya lanni nOrimi nErciyo
    yOdhuDeMta raNa vijEta yaguTa
    Sakyamarayaga nariShaDwargalapaina
    pOru sEya lEDu pOTugADu

    Thopella Bala Subrahmanya Sarma

    రిప్లయితొలగించండి
  16. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారి పూరణ:

    యుద్ధ విద్య లన్ని నోరిమి నేర్చియొ
    యోధు డెంత రణ విజేత యగుత
    శక్యమరయగ నరిషడ్వర్గాల పైన
    పోరు సేయ లేడు పోటు గాడు

    రిప్లయితొలగించండి
  17. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మఆదివారం, డిసెంబర్ 16, 2012 6:55:00 PM

    ఆ.వె. యుద్ధ విద్య లన్ని నోరిమి నేర్చియు
    యోధుడెంత రణ విజేత యగుట
    శక్యమరయగ నరిషడ్వర్గములపై
    పోరు సేయ లేడు పోటు గాడు.

    రిప్లయితొలగించండి
  18. కృష్ణదేవరాయ! కీర్తింతు నీ ఖ్యాతి!
    విజయ యాత్ర జేయ వెడల నీవు
    కప్పు మిచ్చి నీకు కాల్మ్రొక్కు వారలే!
    పోరు సేయ లేడు పోటు గాడు.

    రిప్లయితొలగించండి
  19. మిత్రులందరి పూరణలు నలరించుచున్నవి. అందరికీ అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. అమ్మ ప్రేమ మరచి యాలి కొంగున దాగి
    ఆశ్రమ మున దింపు నమ్మ నపుడు
    కబురు లెన్నొ చెబుతు కనకాంగి చెంతన
    పోరు సేయ లేఁడు పోటు కాఁడు !

    రిప్లయితొలగించండి
  21. నాపై మా ఆవిడ అభిప్రాయము :

    పద్య రచన తక్క పఠనంబు మరి తప్ప
    నింటి పనుల లోన నించు కైన
    శ్రధ్ధ జూప రాఁడు సతి నైన నాతోడ
    పోరు సేయ లేఁడు పోటు గాఁడు !

    రిప్లయితొలగించండి
  22. సద్దాము హుస్సేను :

    పదవి యున్న నాడు బంటుతనముఁ బల్కి
    గుళ్ళు గాలిఁ బేల్చి, క్రుంగి పిదప
    బిలము నుంచి వెడలె కొలది జలమ్ముకై
    పోరు సేయ లేఁడు పోటు గాఁడు !

    రిప్లయితొలగించండి
  23. పండిత నేమాని వారూ,
    మీ ‘ఇంటిలోన పిల్లి’ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ‘పోటుకాడు అధర్మయుద్ధం చేయ’డన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణలో ‘కుంతి మధ్యమ కొమరుని’ అన్నది ‘కుంతీ మధ్యమ కుమారుడు’ కదా. ఆ పాదాన్ని ‘మత్సరించునట్టి మఘవ కుమారుని’ అందామా?
    సెల్ఫ్ సెటైర్‌గా మీ రెండవ పూరణ మనోరంజకంగా ఉంది.
    సద్దామ్ హుస్సేన్ మీద మీ మూడవ పూరణ కూడా చాలా బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    ఉత్తరుడు విషయంగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘ఉత్త’మాటలున్నాయి కాని ‘ఉత్తి’మాటలు లేవు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    క్రమాలంకార విధానంగా మీ మొదటి పూరణ బాగుంది.
    ‘పుల్లాకు పొడవలే’డన్న మీ రెండవ పూరణ చాలా బాగుంది.
    ఉత్తరునిపై మూడవ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    *
    కమనీయం గారూ,
    మీరూ ఉత్తరుని బాట పట్టారు. బాగుంది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    కృష్ణనిర్యాణానంతరం ఓడిన అర్జునుడి గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
    అత్తాకోడళ్ళ మద్య నలిగిన ‘పోటుగాడి’ గురించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    అవినీతితో పోరాడే పోటుగాడు లేడన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ,
    ‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
    ఎంతటి యోధుడైనా అరషడ్వర్గంతో పోరుసేయలేడన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    రెండవ పాదంలో యతి తప్పింది. ‘నేర్చి వి/ఖ్యాత యోద్ధ రణ విజేత యగుత’ అంటే ఎలా ఉంటుందంటారు?
    *
    మిస్సన్న గారూ,
    రాయల నెదిరించే పోటుకాడు లేడన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీరు పేర్కొన్న పోటుగాళ్ళు మనమధ్యే ఉన్నారు. ఆత్మవిమర్శ చేయించే పూరణ మీది. మంచి పూరణ. అభినందనలు మరియు ప్రత్యేకంగా ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  24. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మసోమవారం, డిసెంబర్ 17, 2012 12:33:00 AM

    వందన శతమంద జేతుమా కంది శంక
    రయ్యకు ఋణము పడుచు వ్రాయ నేర్చి
    వ్రాసితి నొక పద్యపూరణ రణము నందు
    పెద్ద లందు నేను పిల్ల కాకి.

    శంకరయ్య మాష్టారికివే నా ప్రణామములు. మీ అనుమతి లేకుండగ మీ బ్లాగులోకి ప్రవేశించాను . క్షంతవ్యుడను. అనుకోకుండగ దొరకిన ఆణిముత్యమును జారవిడువకుండగ ప్రతిరోజూ ఎక్కువ సమయం చూచుచున్నాను. “సరస్వతీ కటక్షవీక్షణములచే” దేదీప్యమానముగా వెలుగొందు ప్రాచీన భాషా సంస్కృతీ సంప్రదాయ పద్య సుగంధ పుష్పాలను వెలయించుచున్న “పండిత నేమాని, గోలి, వర గన్నవర, మిస్సన్న,సహదేవ, సుబ్బరావు,మోహనిత్యాది మహానుభావులకు రాజేశ్వరాది సోదరీమణుల అప్రత్యక్ష ప్రేరణకు శిరసువంచి నమస్కరించుచున్నాను,

    శంకరయ్య మాష్టారూ మీ సవరణను స్వీకరిస్తూ తప్పు సవరించుకుంటున్నాను. ప్రాస యతి కుదిరినదని పొరబడితిని.

    రిప్లయితొలగించండి
  25. దేవుడు వరమిచ్చినా పూజారి వరమీయడనేమొ పెద్దలు చెప్తే విన్నాను. గురువుగారి మౌస్ ను ఎలా ప్రసన్నం చేసుకోవాలో గురువుగారే చెప్పాలి.

    ఏకలవ్యుడొకడె లోకైక వీరుడు
    బోధ సేయ కున్న బొటన వ్రేలు
    గురుని దక్షిణనుచు గురుబొమ్మ గైకొన
    పోరు సేయ లేఁడు పోటు గాఁడు

    రిప్లయితొలగించండి
  26. కలము బట్టువాడు కవితలు వ్రాయును
    (పోరు సేయలేడు, పోటుగాడు)
    ఇతని పద్యములును నింపైన గీతాలు
    విప్లవాల రేపు వీరుడున్ను!!

    రిప్లయితొలగించండి