ఈనాటి సమస్యను అందరూ ‘కేశవ’ శబ్దంతోనే పూరించారు. మరో మార్గం లేదు కూడా. అయితే రామలక్ష్మి గారు, రాజేశ్వరి అక్కయ్య గారు ‘శైశవ’ శబ్దంతో వైవిధ్యంగా పూరించారు. మంచి పూరణలను అందించిన.... పండిత నేమాని వారికి, మిస్సన్న గారికి, గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, గన్నవరపు నరసింహ మూర్తి గారికి, తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి, లక్ష్మీదేవి గారికి, సుబ్బారావు గారికి, డా. మాడుగుల అనిల్ కుమార్ గారికి, డా. తోపెల్ల రామలక్ష్మి గారికి, రాజేశ్వరి అక్కయ్య గారికి, నాగరాజు రవీందర్ గారికి, అభినందనలు, ధన్యవాదములు. * తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ, మీ పూరణలో ‘కార్తీకము’ అన్నారు. దానిని ‘కార్తికము’ అనే అనాలి. ఆ పాదాన్ని ‘శివకార్తికము ప్రియము కే’ అందామా? మూడవ పాదంలో గణదోషం ఉంది. ఆ పాదాన్ని ‘భవనాశనమగు శివకే’ అందాం. * సుబ్బారావు గారూ, ‘అవతారంబె + అరయ’ అన్నప్పుడు ‘అవతారంబె యరయ’ అని యడాగమం వస్తుంది. ‘పిలువం + కేశవుడు = పిలువం గేశవుడు’ అవుతుంది. * డా. తోపెల్ల రామలక్ష్మి గారూ, ‘శంకరాభరణం’ బ్లాగు మీకు సంతోషంతో స్వాగతం పలుకుతున్నది. కవివాక్కులుగా మీ మొదటి పూరణ, అతివల భావనగా రెండవ పూరణ బాగున్నవి. అభినందనలు. రెండవ పూరణలో మీరు పొరపాటున ప్రాసను గమనించనట్టున్నారు. నా సవరణ.... భవసాగరమ్ము నీదుట కవతలి సీమలకు పోవు నతివలు తమలో ధ్రువమును జేసిరిలన్ శై శవ సాన్నిధ్యమ్ము మనకు సౌఖ్యము గూర్చున్. * రాజేశ్వరి అక్కయ్యా, మొదటి పూరణ మూడవ పాదంలో గణదోషం ఉంది. ‘నవలోకము జూపగ శై’ అందాం. రెండవ పూరణ మూడవ పాదంలోను గణదోషం. ‘అవిముక్తము కంటెను కే’ అందాం.
మాస్టారు గారూ ! ధన్యవాదములు నూతన మిత్రులు శ్రీ తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి, డా. తోపెల్ల రామలక్ష్మి గారికి స్వాగతం. శ్రీ మాడుగుల అనిల్ కుమార్ గారి చేరిక ఆనందదాయకము.
సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘హరణ మొసగుచు’ కంటే ‘హరణ మగుచును’ అంటే బాగుంటుందేమో! ‘రాజిల్లెడు + ఆ = రాజిల్లెడు నా’ అవుతుంది. * కమనీయం గారూ, మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు. * గండూరి లక్ష్మినారాయణ గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు * సహదేవుడు గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘అనియెడు + ఆ తిరుమల = అనియెడు నా తిరిమల’ అవుతుంది. అక్కడ ‘అయిన నా తిరుమల’ అందాం.
వివిధైశ్వర్య ప్రదమును
రిప్లయితొలగించండిభవబంధ విమోచకమయి భాసిలును సదా
ప్రవిమలమగు లక్ష్మీ కే
శవ సాన్నిధ్యమ్ము మనకు సౌఖ్యము గూర్చున్
భవ సాగర తరణం బౌ
రిప్లయితొలగించండిభువి జీవుల కెల్ల నెంచ ముక్తి ప్రదమౌ
దివిజుల కింపగు శివకే-
శవ సాన్నిధ్యమ్ము మనకు సౌఖ్యము గూర్చున్.
భవరోగ బాధ దీర్పగ
రిప్లయితొలగించండిభువిలో ఘన వైద్యు లెవరు పుట్టగ లేరా
స్తవనీయులైన శివకే
శవ సాన్నిధ్యమ్ము మనకు సౌఖ్యము గూర్చున్
శ్రీ తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ నిన్నటి పద్యమును ఇలాగ సరిదిద్దుచున్నాను:
తే.గీ.
వందన శతమ్ము గూర్తును కంది శంక
రయ్య గారికి ఋణపడి వ్రాయ నేర్చి
వ్రాసితిని పద్యపూరణ రణము నందు
పెద్దలందు నేనొకడను పిల్లవాడ
స్వస్తి.
అవనీధర సప్తకముల
రిప్లయితొలగించండిశివమూర్తై యవతరించె శ్రీపతి శోభన్
భవహరు సంస్తుతితో కే
శవ సాన్నిధ్యము మనకు సౌఖ్యముఁ గూర్చున్ !
తమ్ముడు చి. డా. నరసింహమూర్తి పద్యమును కొంచెము సవరించేను అన్వయ సౌలభ్యము కొరకు:
రిప్లయితొలగించండిఅవనీధర సప్తకమున
శివమూర్తిగ నవతరించె శ్రీనాథుండా
భవహరు సంస్తుతియును కే
శవ సాన్నిధ్యమ్ము మనకు సౌఖ్యము గూర్చున్
శివకార్తీకము ప్రియ కే
రిప్లయితొలగించండిశవ మార్గశిరమట శైలజాధిపు కెంతన్,
భవనా శనము, శివకే
శవ సాన్నిధ్యమ్ము, మనకు సౌఖ్యము గూర్చున్
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ
శ్రీ పండిత నేమాని వార్కి నమస్సులు. బుడి బుడి అడుగులకు నదక నేర్పుచుననందులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిఅన్నయ్య గారికి నమస్సులు, ధన్యవాదములు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిహవనమ్ముల జేయంగల
రిప్లయితొలగించండిజవసత్త్వములిక మనలకు జాలవు నరుడా!
పవియగు పాపమునెడ, కే
శవ సాన్నిధ్యమ్ము మనకు సౌఖ్యముఁ గూర్చున్.
శివ కేశవు లిరువురు నొక
రిప్లయితొలగించండియవతారంబె నరయ శివ యని బిలువం కే
శవు డూ గొట్టుగ తనకే
శవ సాన్నిధ్యమ్ము మనకు సౌఖ్యము గూర్చున్
శివలింగార్చన కార్తిక
రిప్లయితొలగించండిమవలోకింపంగనిచ్చునమరత్వంబున్ l
అవనిన్ మార్గశిరముఁ గే
శవ సాన్నిధ్యమ్ము మనకు సౌఖ్యము గూర్చున్ ll
( మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీత )
జవసత్త్వమ్ములు తగ్గిన
రిప్లయితొలగించండినవమానమునొంద గూడదను యోచనతో
కవి పల్కెను సతితోశై
శవ సాన్నిధ్యమ్ము మనకు సౌఖ్యము గూర్చున్.
జీవన సాగర మీదుట
కావలి సీమలకు పోవు నతివలు తమలో
భావన చేసిరిలన్ శై
శవ సాన్నిధ్యమ్ము మనకు సౌఖ్యము గూర్చున్.
అవిరళమగు వ్యధ లందున
రిప్లయితొలగించండినవనీతపు సుతుల బోసి నగవుల యందున్ !
నవలోకము కనుపించగ శై
శవ సాన్నిధ్యమ్ము మనకు సౌఖ్యముఁ గూర్చున్ !
నవ విధ భక్తుల యందున
రిప్లయితొలగించండిశివ భక్తియె సులభ మంచు శైవులు పలుకన్ !
అవిముక్తము నందు కంటె కే
శవ సాన్నిధ్యమ్ము మనకు సౌఖ్యముఁ గూర్చున్ ! !
శివుడు శుభకరుడు శుభకరి
రిప్లయితొలగించండిశివాని , యటులే మురారి సిరి దంపతులౌ ;
శివపార్వతి లక్ష్మీ కే
శవ సాన్నిధ్యమ్ము మనకు సౌఖ్యము గూర్పున్
ఈనాటి సమస్యను అందరూ ‘కేశవ’ శబ్దంతోనే పూరించారు. మరో మార్గం లేదు కూడా. అయితే రామలక్ష్మి గారు, రాజేశ్వరి అక్కయ్య గారు ‘శైశవ’ శబ్దంతో వైవిధ్యంగా పూరించారు.
రిప్లయితొలగించండిమంచి పూరణలను అందించిన....
పండిత నేమాని వారికి,
మిస్సన్న గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
లక్ష్మీదేవి గారికి,
సుబ్బారావు గారికి,
డా. మాడుగుల అనిల్ కుమార్ గారికి,
డా. తోపెల్ల రామలక్ష్మి గారికి,
రాజేశ్వరి అక్కయ్య గారికి,
నాగరాజు రవీందర్ గారికి,
అభినందనలు, ధన్యవాదములు.
*
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ,
మీ పూరణలో ‘కార్తీకము’ అన్నారు. దానిని ‘కార్తికము’ అనే అనాలి. ఆ పాదాన్ని ‘శివకార్తికము ప్రియము కే’ అందామా? మూడవ పాదంలో గణదోషం ఉంది. ఆ పాదాన్ని ‘భవనాశనమగు శివకే’ అందాం.
*
సుబ్బారావు గారూ,
‘అవతారంబె + అరయ’ అన్నప్పుడు ‘అవతారంబె యరయ’ అని యడాగమం వస్తుంది. ‘పిలువం + కేశవుడు = పిలువం గేశవుడు’ అవుతుంది.
*
డా. తోపెల్ల రామలక్ష్మి గారూ,
‘శంకరాభరణం’ బ్లాగు మీకు సంతోషంతో స్వాగతం పలుకుతున్నది.
కవివాక్కులుగా మీ మొదటి పూరణ, అతివల భావనగా రెండవ పూరణ బాగున్నవి. అభినందనలు.
రెండవ పూరణలో మీరు పొరపాటున ప్రాసను గమనించనట్టున్నారు. నా సవరణ....
భవసాగరమ్ము నీదుట
కవతలి సీమలకు పోవు నతివలు తమలో
ధ్రువమును జేసిరిలన్ శై
శవ సాన్నిధ్యమ్ము మనకు సౌఖ్యము గూర్చున్.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మొదటి పూరణ మూడవ పాదంలో గణదోషం ఉంది. ‘నవలోకము జూపగ శై’ అందాం.
రెండవ పూరణ మూడవ పాదంలోను గణదోషం. ‘అవిముక్తము కంటెను కే’ అందాం.
మాస్టారు గారూ ! ధన్యవాదములు
రిప్లయితొలగించండినూతన మిత్రులు శ్రీ తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి, డా. తోపెల్ల రామలక్ష్మి గారికి స్వాగతం.
శ్రీ మాడుగుల అనిల్ కుమార్ గారి చేరిక ఆనందదాయకము.
భవబంధహరణమొసగుచు
రిప్లయితొలగించండిరవిచంద్రులె కనులుగాగరాజిల్లెడు యా
నవనీత హృదయుడగుకే
శవ సాన్నిధ్యమ్ము మనకు సౌఖ్యము గూర్చున్.
రిప్లయితొలగించండిఈ సమస్యకు 'కేశవ ', లేక 'శైశవ 'అని విరుపులతో మాత్రమే పూరించడానికి వీలవుతుందనుకొంటాను.
1.
శివపూజను జేసిన బ్రా
భవము కలుంగు మనకటులె భవతారకుడు
న్నవతారపురుషుడగు కే
శవ సాన్నిధ్యమ్ము మనకు సౌఖ్యము గూర్చున్.
2. నవనవ లాడెడు బుగ్గలు,
చెవులకు పోగులు ,జిలిబిలి చెల్వపు బలుకుల్,
పవడపు బెదవుల నగు , శై
శవసాన్నిధ్యమ్ము మనకు సౌఖ్యము గూర్చున్.
భవు డేలును భక్తుల మా
రిప్లయితొలగించండిధవు డార్తుల రక్షకుండు దనుజాంతకు డున్
భువిలో ననిశము శివ కే
శవ సాన్నిధ్యమ్ము మనకు సౌఖ్యము గూర్చున్ .
మాష్టారికి నమస్కారములు. దొసగులు గ్రహించి సరిచేసికున్నాను. మీ సవరణతో భావంబలపడినది. ధన్యవాదములు.
రిప్లయితొలగించండిరాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ రెండవ పూరణ రెండవ పాదంలో యతి తప్పింది. ఒక మిత్రుడు చెప్పేదాకా గమనించలేదు.
‘శివభక్తియే సులభమంచు శివభక్తు లనన్’ అందామా?
భవనాశము గావించగ
రిప్లయితొలగించండినవనిన్ వైకుంఠ మనియెడా తిరుమలలో
శివనామయుతుండగు కే
శవ సాన్నిధ్యమ్ము మనకు సౌఖ్యము గూర్చున్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి] ప్చ్ ! ఏమిటో ! ఇవ్వాళ అన్నీ తప్పులే అంతా కలికాలం .....? ఒకో రోజూ ..... అలాగే జరుగు తుంది .సవరణ చేసి నందులకు ధన్య వాదములు తమ్ముని శ్రమ పెట్టి నందుకు క్ష మాపణలు .[ మొన్ననే శ్రమ పెట్ట నందుకు స్పెషల్ గా ధన్య వాదాలు అందుకున్నాను . ప్చ్ ! ఏం ప్రయోజనం ? ]
రిప్లయితొలగించండిసంపత్ కుమార్ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
‘హరణ మొసగుచు’ కంటే ‘హరణ మగుచును’ అంటే బాగుంటుందేమో! ‘రాజిల్లెడు + ఆ = రాజిల్లెడు నా’ అవుతుంది.
*
కమనీయం గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
*
గండూరి లక్ష్మినారాయణ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు
*
సహదేవుడు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘అనియెడు + ఆ తిరుమల = అనియెడు నా తిరిమల’ అవుతుంది. అక్కడ ‘అయిన నా తిరుమల’ అందాం.
"యావత్పవనో నివసతి దేహే
రిప్లయితొలగించండితావత్పృచ్చతి కుశలం గేహే
గతవతి వాయౌ దేహాపాయే
భార్యా బిభ్యతి తస్మిన్కాయే"
శివభక్తి లేని జీవ
చ్ఛవ సాన్నిధ్యమ్ము మనకు సౌఖ్యముఁ గూర్చు
న్నవలీలగ! ననకుమురా!
పవనము గోల్పోవు వేళ బంధువు లెవరో?
అవకతవకయగు క్రీడను
రిప్లయితొలగించండిభవునికి మందిరము కాగ బాహ్యపు జగతిన్
శవమిది దేహమ్ము మనది
శవ సాన్నిధ్యమ్ము మనకు సౌఖ్యముఁ గూర్చున్