23, డిసెంబర్ 2012, ఆదివారం

సమస్యా పూరణం - 915 (ఏకాదశి శివుని పూజ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
ఏకాదశి శివుని పూజకే తగు నెపుడున్.

10 కామెంట్‌లు:

 1. ఏకాదశి పర్వదినం
  బేకాదశి శివుని పూజకే తగు నెపుడున్
  మాకనక కొలుచు టొప్పగు
  నేకాదశి నాడు వేల్పు లెల్లర భక్తిన్

  రిప్లయితొలగించండి
 2. లోకైకనాథుడనుచును
  శ్రీకంఠుఁడు పూజసలుపు చిత్తము నందా
  శ్రీకరునిన్, శుభదినమౌ
  యేకాదశి శివుని పూజకే తగు నెపుడున్.

  రిప్లయితొలగించండి
 3. శివుఁడు హరిని పూజ చేయుటకు కూడా శుభదినమని భావము.

  రిప్లయితొలగించండి
 4. ఏకాహపు టుప వాసము
  నేకాదశి శివుని పూజకే తగునెపుడున్ !
  ఏకతమున దీక్షిం చిన
  నాకమునకు మోక్ష మనెడి నమ్మిక తోడన్ !

  రిప్లయితొలగించండి
 5. వైకుంఠ వాసు గొల్చగ
  నేకాదశి,శివుని పూజకే తగునెపుడున్
  శ్రీకర శివరాత్రందురు!
  లోకేశ్వరుడొక్క డైన రోజులు వలెనా?

  రిప్లయితొలగించండి
 6. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మఆదివారం, డిసెంబర్ 23, 2012 5:33:00 PM

  శ్రీ కేశవ పూజాదుల
  కేకా దశి, శివుని పూజకే తగునెపుడున్
  లోకేశ్వర పావనమగు
  నా కార్తిక నక్త మనుచు నరయుడు జగతిన్.

  రిప్లయితొలగించండి
 7. ఏకాదశి పేరబరగు
  నీ కుర్రడు పూజలందు నిపుణుడు జనసు
  శ్లోకుడు భక్తాగ్రణి, యీ
  యేకాదశి శివుని పూజకే తగు నెపుడున్

  రిప్లయితొలగించండి
 8. చీకాకులు తొలగుటకై
  ఏకాదశ రుద్రములనె ఇందుదినంబున్
  ఏకార్తీకంబైనను
  ఏకాదశి శివుని పూజకే తగు నెపుడున్.

  రిప్లయితొలగించండి
 9. చక్కని పూరణల నందించిన కవిమిత్రులు...
  పండిత నేమాని వారికి,
  లక్ష్మీదేవి గారికి,
  రాజేశ్వరి అక్కయ్య గారికి,
  సహదేవుడు గారికి,
  తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  అభినందనలు, ధన్యవాదములు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  ‘నాకమునకు’ బదులు ‘నా కొసఁగును’ అంటే బాగుంటుందేమో!
  *
  సహదేవుడు గారూ,
  ‘కొల్చగ’... ‘కొల్వగ’ అంటే బాగుంటుంది. ‘శివరాత్రి + అందురు’ - శివరాత్రి యందురు అని యడాగమం వస్తుంది. ‘శివరాత్రి యగును’ అందామా

  రిప్లయితొలగించండి
 10. వైకుంఠ వాసు గొల్వగ
  నేకాదశి, శివుని పూజకే తగునెపుడున్
  శ్రీకర శివరాత్రి యనగ
  లోకేశ్వరుడొక్క డైన రోజులు వలెనా?

  రిప్లయితొలగించండి