నాలుగవ ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా
ప్రభుత్వము వారి ఆధ్వర్యవములో
జిల్లా స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలు
విశాఖపట్నము.
అష్టావధాన కార్యక్రమము
అవధాని
రాంభట్ల పార్వతీశ్వర శర్మ,
ఎం.ఏ తెలుగు, పరిశోధక విద్యార్థి, ఆంధ్రవిశ్వకళాపరిషత్.
సంచాలకులు
పండిత నేమాని రామజోగి సన్యాసిరావు - అష్టావధాని.
వేదిక
గురజాడ కళాక్షేత్రము, సిరిపురము, విశాఖపట్నము.
తేది
24 - 12 - 2012 సోమవారము.
సమయము
సాయంత్రము 4 గంటల నుండి 5 గంటల వరకు
అందరూ ఆహ్వానితులే
అష్టావధానానికి మరీ గంట మాత్రమే కేటాయించటం బాగోలేదు. గంటలో రక్తి కట్టదని భావన.
రిప్లయితొలగించండిఅయ్యా! చంద్రశేఖర్ గారూ!
రిప్లయితొలగించండిశుభాశీస్సులు.
ప్రభుత్వ విధానముల పద్ధతి మీకు తెలియనిది కాదు కదా!
వాళ్ళకి 1 గంట మాత్రమే సమయము ఉందట. సర్దుకు పోవాలి మనమే మరి. స్వస్తి.
అవధాని గారికి శుభాభినందనలు.
రిప్లయితొలగించండిగంటే సమయమ?ఐతే
నేంటీ మన తల్లి వాణి యెదలో నిలువన్
మింటన్ కరతాళ ధ్వని
యంటగ మరి సలుపుడయ్య యవధానంబున్.
అవును అవధానమునకు ఎంత ఎక్కువ టైం ఉంటే అంత బాగుంటుంది..నెను నాగఫణి శర్మ గారి అవధానములకు చాలా సార్లు వెళ్ళాను .ఇక్కడ కుడా " ఆటా సభ లప్పుడు రాళ్ళ బండీవారి అవధానమునకు టైం లేదు అని తొందర పెట్టేసరికి అవధాని గారికి కోపం వచ్చి సగంలోనె ముగించేసారు. అవధానానికి వెళ్ళ గలగడం పూర్వ జన్మ సుకృతం. తదుపరి విశేషములను తెలుప గలరు. ధన్య వాదములు
రిప్లయితొలగించండి