పుస్తకరాశి యిట్లు బలు ముచ్చట గొల్పుచు నుండుతావిదే, మస్తకమెల్ల నింపునివి, మానవజాతికి పెన్నిధౌ, మరే వస్తువు గొప్ప కాదుకద, వ్రాసిన వారి కలంబు కన్న, నే నాస్తిగ నెంచుకొందునిక హాయిని బెంచెడి గ్రంథరాశినిన్.
కవిమిత్రులకు నమస్కృతులు. నిన్న హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు వెళ్ళివచ్చాను. రోజంతా ప్రయాణంలోనే ఉన్నాను. ఇల్లు చేరేసరికి రాత్రి మూడయింది. అందువల్ల నిన్నటి పూరణలు, పద్యాలపై వ్యాఖ్యానించలేకపోయాను. మన్నించండి. ‘కాకతీయ ఉత్సవాల’ హడావుడిలో ఉన్నాను. వీలైతే సాయంత్రం వరకు నా వ్యాఖ్యలను పెట్టే ప్రయత్నం చేస్తాను. జ్ఞాననిలయాలైన గ్రంథాలయాల గురించి చక్కని పద్యాలను రచించిన.... పండిత నేమాని వారికి, మిస్సన్న గారికి, రాజేశ్వరి అక్కయ్య గారికి, లక్ష్మీదేవి గారికి, సుబ్బారావు గారికి, తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి, గండూరి లక్ష్మినారాయణ గారికి, కమనీయం గారికి, గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, సహదేవుడు గారికి, అభినందనలు, ధన్యవాదములు.
జ్ఞానమే మానవాళికి నయనవరము
రిప్లయితొలగించండిజ్ఞానమే ధనసంపద జ్ఞానదమగు
నట్టి గ్రంథాలయము శారదాలయమ్ము
ప్రణతులర్పింతు నా మహాలయము దలచి
గ్రంథాలయము లొకప్పుడు
రిప్లయితొలగించండిగ్రంథమ్ముల కాకరమ్ము, కడు జ్ఞాన నిధుల్!
గ్రంథమ్ము లెరుగ నేరరు
గ్రంథాలయ మెవరి కొరకు? కద! నేడయ్యో!
గ్రంధా లయమున పిల్లలు
రిప్లయితొలగించండిబంధా లను మరచి మిగుల పఠనము జేయన్ !
సింధువు దాటెడి వార్తలు
గ్రంధము నందుండి పెక్కు గగనపు వింతల్ !
పుస్తకరాశి యిట్లు బలు ముచ్చట గొల్పుచు నుండుతావిదే,
రిప్లయితొలగించండిమస్తకమెల్ల నింపునివి, మానవజాతికి పెన్నిధౌ, మరే
వస్తువు గొప్ప కాదుకద, వ్రాసిన వారి కలంబు కన్న, నే
నాస్తిగ నెంచుకొందునిక హాయిని బెంచెడి గ్రంథరాశినిన్.
గ్రంధము లన్నియు నుండును
రిప్లయితొలగించండిగ్రంధాలయ భవన మందు గడు భద్రము గాన్
గ్రంధము చదువుట వలనన
గ్రంధంబుల సార మ0త గ్రాహ్యం బగు నున్
పేద వారి కిచట పెన్నిధి యగుచును
రిప్లయితొలగించండివిద్య లరయు జనుల విశ్వ కోశ
మై వరలును వివిధ మాథ్యమ గ్రంథాల
పుస్తక నిలయంబు ముదము లిడుచు..
గ్రంధాలయములు జన సం
రిప్లయితొలగించండిబంధాలను పెంచు జ్ఞాన భాగ్య, మరుదౌ
గ్రంధాల, వివేక కుసుమ
గంధమ్మును పంచు భవ్య కాంతుల గృహముల్.
పుస్తక పఠనము జేయుచు
రిప్లయితొలగించండిమస్తకమును నింపు చుంద్రు మహిమాన్విత మౌ !
ప్రస్తుత వింతల జగతి స
మస్తము దెలుసు కొనెడి మైకము నందున్ !
రిప్లయితొలగించండిశారదాలయము పవిత్ర సదనమిద్ది,
సద్దుసేయకుడి ,పఠనాసక్తినున్న
వారు పలువురిచ్చోట , నపారమైన
గ్రంథనిక్షిప్తమగు జ్ఞానకాంతి కలదు.
అరయ పూదోట గ్రంథాలయమ్ము జూడ
రిప్లయితొలగించండివివిధ పొత్తంబులే యొప్పు విరులు గాను
చదువు వారలు గ్రోలుగా సార మందు
తేటి వోలెను, జ్ఞానులౌ మేటి గాను.
సింధువంటి ఙ్ఞాన సిరులను నిండగ
రిప్లయితొలగించండిబిందువులను ఙ్ఞాన సింధువులుగ
ఘనత నంద జేయు గ్రంథాలయంబుల
నుద్ధరించు వారె పెద్దలనగ
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండినిన్న హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు వెళ్ళివచ్చాను. రోజంతా ప్రయాణంలోనే ఉన్నాను. ఇల్లు చేరేసరికి రాత్రి మూడయింది. అందువల్ల నిన్నటి పూరణలు, పద్యాలపై వ్యాఖ్యానించలేకపోయాను. మన్నించండి. ‘కాకతీయ ఉత్సవాల’ హడావుడిలో ఉన్నాను. వీలైతే సాయంత్రం వరకు నా వ్యాఖ్యలను పెట్టే ప్రయత్నం చేస్తాను.
జ్ఞాననిలయాలైన గ్రంథాలయాల గురించి చక్కని పద్యాలను రచించిన....
పండిత నేమాని వారికి,
మిస్సన్న గారికి,
రాజేశ్వరి అక్కయ్య గారికి,
లక్ష్మీదేవి గారికి,
సుబ్బారావు గారికి,
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
గండూరి లక్ష్మినారాయణ గారికి,
కమనీయం గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
సహదేవుడు గారికి,
అభినందనలు, ధన్యవాదములు.
సవ్వ డిసుమంత తాకక చదివి నట్టి
రిప్లయితొలగించండిచదువు చక్కగ మదిలోకి జారు ననుచు
కట్టు బడనట్టి ఠీ(టీ)వి కి కట్టు బడక
గడుపు చుండెను పొత్తపు గదికి చేరి.