8, డిసెంబర్ 2012, శనివారం

సమస్యా పూరణం - 900 (ప్రశ్నకు ప్రశ్నయె జవాబు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
ప్రశ్నకు ప్రశ్నయె జవాబు భామిని పలికెన్.
(ఆశావాది ప్రకాశరావు గారు అవధానంలో ఎదుర్కొన్న సమస్య)
ఈ సమస్యను సూచించిన చింతా రామకృష్ణారావు గారికి ధన్యవాదములు.

18 కామెంట్‌లు:

  1. ప్రశ్నలు లభింప వయ్యెను
    ప్రశ్నింపగ బూనినట్టి ప్రష్టకు నకటా!
    ప్రశ్న నిడె నిటుల నంతట
    ప్రశ్నకు ప్రశ్నయె జవాబు భామిని పలికెన్

    రిప్లయితొలగించండి
  2. అయ్యా! శ్రీ శంకరయ్య గారూ! శుభాశీస్సులు.

    ఈ నాటి సమస్య ఏ విధముగా సమస్య యగును? దుష్కర ప్రాస మాత్రమే ప్రాతిపదిక కావలయునా? భావ వైవిధ్యముతో 10 మంది నింపుటకు అవకాశము గలిగిన సమస్యలే సమంజసమగునని నా అభిప్రాయము. ప్రశ్నకు ప్రశ్నయె జవాబు భామిని పలికెన్ అను వాక్యము కూడా సంపూర్ణము కాదు. స్వస్తి

    రిప్లయితొలగించండి
  3. రస్నా రుచులను తెలుపుచు
    ప్రశ్నించెను చెలియ నిటుల పరమ ప్రీతిన్ !
    రస్నా త్రాగక పోతివ ?
    ప్రశ్నకు ప్రశ్నయె జవాబు భామిని పలికెన్ !

    రిప్లయితొలగించండి
  4. ప్రశ్నించెద నిను భామా !
    ప్రశ్నా నన్నడుగు మామ ! పనికొస్తావా?
    ప్రశ్నకు పనికొస్తావా?
    ప్రశ్నకు ప్రశ్నయె జవాబు భామిని పలికెన్.

    రిప్లయితొలగించండి
  5. హశ్నా ! వత్తువ యింటికి ?
    బ్రశ్నను నే వేయ బలికె వత్తున యిపుడే ?
    ప్రశ్నను వేసియు మరలన
    ప్రశ్నకు ప్రశ్నయె జవాబు భామిని పలికెన్ .

    రిప్లయితొలగించండి
  6. కళారత్న బిరుదాంకితులు డా.ఆశావాది ప్రకాశరావు గారి పూరణ.

    ప్రశ్నలపై వడి ప్రశ్నలు,
    ప్రశ్నించెడి తనదు భర్త భావం బేమో
    ప్రశ్నించును, తన యెదలో
    ప్రశ్నకు ప్రశ్నయె జవాబు భామిని పలికెన్‌.

    రిప్లయితొలగించండి
  7. ప్రశ్నయె "కం బల వంతః"?
    ప్రశ్నకు ప్రతి ప్రశ్న పలుకి పరికింపుడయా!
    ప్రశ్నగు "కంబల వంతః"
    ప్రశ్నకు ప్రశ్నయె జవాబు భామిని పలికెన్‌.

    భావము:- కం బలవంతః:?(శీతాకాలంలో ఒకడు ప్రశ్నించాడు ఎవడు బలవంతుడు అని) ఇది ఒక ప్రశ్నయే.
    దానికి సమాధానంగా ఆ ప్రశ్ననే పలికి చూడండి. అలా చూచినట్లైతే "కంబల వంతః" (కంబలి కలవాడే అంటే రగ్గు కలవాడే అని సమాధానం) ఆ సమాధానంగా ఈ ప్రశ్నయే అగును. కావున ప్రశ్నకు ప్రశ్నయె జవాబు అని భామిని ఎంత అద్భుతంగా పలికింది!
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. "జవరాలా ముద్దిడవా?"
    వివాహితులవక,ప్రియుడన "పెళ్ళెపుడ?"నుచున్
    వివాద 'ప్రశ్నకు ప్రశ్నయె
    జవాబు భామిని పలికెను' సంస్కారముగన్!

    రిప్లయితొలగించండి
  9. అయ్యా! శ్రీ సహదేవుడు గారూ! శుభాశీస్సులు.
    మీరు పాదములని వ్యత్యస్తము చేసేరు - బాగుగనె యున్నది. కానీ 3వ పాదములో గణభంగము మీరు గమనించలేదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  10. అయ్యా! శ్రీ రామకృష్ణా రావు గారూ! శుభాశీస్సులు.
    ఈ సమస్య మీరు సూచించినదే కాబట్టి ఒక మారు చూడండి. ఈ పాదములో పూర్తిగా అన్వయము ఉన్నదా? దీనిని సమస్యగా ఈయ వచ్చునా? అర్థము పూర్తి కాని వాక్యములను సమస్యగా ఇచ్చుటను సమర్థించగలమా? స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. అయ్యా! శ్రీ రామకృష్ణారావు గారూ! శుభాశీస్సులు.
    మీరు ఏదో మాదిరిగా కిట్టించి సమస్యను నింపేను అనుకొన్నారేమో. 2వ పాదములో "పలుకి"? -- అలాగుననే 3వ పాదములో "ప్రశ్నగు" అనునది వ్యాకరణ బద్ధమా? పరిశీలించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. మిత్రులారా! శుభాశీస్సులు.
    ఈనాటి సమస్య పాదమును ఇలాగ సవరించితే అర్థవంతముగా నుంటుంది:

    "ప్రశ్నయె ప్రత్యుత్తరమని భామిని పలికెన్"
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  13. గురువుగారికి ధన్యవాదములు. తమరి సూచన ప్రకారం సవరణను పరిశీలించ ప్రార్థన:

    "జవరాలా ముద్దిడవా?"
    వివాహితులవక,ప్రియుడన "పెళ్ళెపుడ?"నుచునా
    యవగుణ 'ప్రశ్నకు ప్రశ్నయె
    జవాబు భామిని పలికెను' సంస్కారముగన్!

    రిప్లయితొలగించండి
  14. ఆర్యా! పండిత నేమాని కవి వరా! సరుకు లేని డొల్లను నేను. రంధ్రాన్వేషణ చేత కాని వాడిని. ఒక సుప్రసిద్ధ అవధాని గారు చేపట్టి పూరించిన సమస్య కదా అని శంకరయ్య గారికి ఈ సమస్యను సూచించాను.నా అజ్ఞానాన్ని మన్నించండి. ఇక నా పూరణలో మీరు దోషములుగా గుర్తించినవి నేను సరి చేసి మళ్ళీ ఉంచుతున్నాను. ఈ పద్యము కూడా దోష రహితమని నేననుకోలేను. ఏమంటారా ముందేచెప్పానుగా నేను వట్టి డొల్లనని. మీవంటి వారి మధ్య వ్రాయ సాహసించడమే నా డొల్లతనాన్నే రుజువు చేస్తోంది. మన్నించండి. ఈ విషయంలో ఎవ్వరి నుండీ ఎటువంటి ప్రతిస్పందనా నేను కోరుకోవటం లేదు. నమస్తే.

    ప్రశ్నయె "కంబలవంతః"?
    ప్రశ్నకు ప్రతి ప్రశ్న పలకి పరికింపుడయా!
    ప్రశ్నయె శీతాతపునకు.
    "ప్రశ్నకు ప్రశ్నయె జవాబు" "భామిని పలికెన్‌".

    రిప్లయితొలగించండి
  15. “ప్రశ్నకు జవాబు లేకయె
    ప్రశ్న నడుగువాడు లోకువ గదా ?! " యనుచున్
    ప్రశ్నను ప్రశ్నింప కినిసి
    "ప్రశ్నయె ప్రత్యుత్తరమని భామిని పలికెన్"

    రిప్లయితొలగించండి
  16. ప్రశ్నకు ప్రశ్నయె ప్రశ్నగు
    ప్రశ్నను ప్రశ్నీంపగలదు ప్రశ్నయె, ప్రశ్నల్
    ప్రశ్నిఒంచు ఘనులెరుగుదురు
    ప్రశ్నకు ప్రశ్నయె జవాబు " భామిని పలికెన్

    రిప్లయితొలగించండి
  17. ప్రశ్నించెద నిను భామా !
    ప్రశ్నా ? నన్నడుగు మామ ! *వాట్టన నేమీ ?
    ప్రశ్నను వెదకుము కనబడు
    ప్రశ్నకు ప్రశ్నయె జవాబు భామిని పలికెన్.

    * what = ఏమి

    రిప్లయితొలగించండి
  18. హనుమచ్ఛాస్త్రి గారూ,
    అప్పటి సమస్య ఇప్పుడు మీ దృష్టికెలా వచ్చింది అని నా ప్రశ్న!
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి